ఎన్టీఆర్‌ కలలు కన్న సమాజం కోసం.. ప్రధాని మోదీ ట్వీట్‌ | Pm Modi Pays Homage To Ntr On 101th Birth Anniversary | Sakshi
Sakshi News home page

ఎన్టీఆర్‌ కలలు కన్న సమాజం కోసం మేం పని చేస్తాం.. ప్రధాని మోదీ ట్వీట్‌

Published Tue, May 28 2024 1:55 PM | Last Updated on Tue, May 28 2024 1:55 PM

Pm Modi Pays Homage To Ntr On 101th Birth Anniversary

న్యూఢిల్లీ, సాక్షి: తెలుగు చలన చిత్ర నట దిగ్గజం, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ ఎంతో దార్శనికత గల నాయకుడని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ 101వ జయంతి సందర్భంగా ఆయన ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్మరించుకున్నారు. 

‘‘ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన.. ఎంతో దార్శనికత గల నాయకుడు. సినీ, రాజకీయ రంగాలకు ఎన్టీఆర్‌ చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ధరించిన పాత్రలను, ఆయన నాయకత్వ పటిమను ప్రజలు ఇప్పటికీ తలచుకుంటారు. ఎన్టీఆర్‌ కలలుగన్న సమాజం కోసం మేము నిరంతరం పని చేస్తాం’’ అని మోదీ పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement