రైతు.. దేవుడితో సమానం | farmers like a god | Sakshi
Sakshi News home page

రైతు.. దేవుడితో సమానం

Published Sun, Apr 23 2017 2:39 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

రైతు.. దేవుడితో సమానం - Sakshi

రైతు.. దేవుడితో సమానం

► త్రిదండి చినజీయర్‌స్వామి

సాక్షి, హైదరాబాద్‌: రైతు.. దేవుడితో సమానమని, రైతు సంతోషంగా ఉంటేనే దేశం సంతృప్తిగా ఉంటుందని త్రిదండి చినజీయర్‌స్వామి అన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శనివారం ప్రారంభమైన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని ప్రశంసించారు.

తక్కువ రసాయనాలతో పంటలు పండించే విధానాలపై రైతుల్లో అవగాహన పెంచాల్సిన అవసరముందని పేర్కొన్నారు. రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, హైబ్రిడైజేషన్‌ వల్ల భూమి సమతుల్యత దెబ్బతింటుందని చెప్పారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేయడంపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement