ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుంటున్న భక్తజనం, యాదాద్రిలో వైకుంఠ ఏకాదశి వేడుకలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర ప్రముఖులు
భద్రాచలం/యాదగిరిగుట్ట/ధర్మపురి: రాష్ట్రవ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ప్రధానాల యాల్లో ఉత్తర ద్వార దర్శనాలకు భక్తులు పోటెత్తారు. దక్షిణ అయోధ్యగా ఖ్యాతిగాంచిన భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంతోపాటు యాదాద్రి, ధర్మపురి ల్లోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాలకు వేకువ జామునే భక్తులు చేరుకున్నారు.
భద్రాచలంలో జగదభి రాముడు గరుడవాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై ఆసీనులై ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వగా యాదాద్రిలో లక్ష్మీనృసింహస్వామి గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకారంలో వేంచేసి ఆలయ ఉత్తర ద్వారం గుండా వైకుంఠనాథుడిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే జగిత్యాల జిల్లా ధర్మపురి ఆలయంలోనూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఉత్తర ద్వారం ద్వారా భక్తులను అనుగ్రహించారు.
భద్రాద్రిలో...: భద్రాచలంలో సోమ వారం తెల్లవారుజామున వైకుంఠ ద్వా ర దర్శనానికి ముందు రుగ్వేద, యజు ర్వేద, సామవేద, అదర్వణ వేదాలను పఠించిన అనంతరం ద్వారదర్శన ప్రాశస్త్యాన్ని వేదపండితులు భక్తులకు వివరించారు. సరిగ్గా 5 గంటలకు ఉత్తర ద్వారాలు తెరుచుకోగా గరుడవాహన రూరుడై విచ్చేసిన శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ని భక్తులు కన్నులారా వీక్షించి తరించారు. ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడి లోని మూలవరులను దర్శించుకున్నారు.
యాదాద్రిలో...
యాదాద్రిలో వేకువజామునే ప్రధానాలయంలో స్వామి అమ్మవార్లకు అర్చ కులు సుప్రభాతం, ఆరాధన, బాలభోగం, తిరుప్పావై చేపట్టి అలంకార సేవలు చేశారు. సరిగ్గా ఉదయం 6:48 గంటలకు స్వామి వారు గరుడ వాహనంపై ఉత్తర ద్వారం నుంచి భక్తు లను అనుగ్రహించారు. ఉదయం 6:48 గంట ల నుంచి 7:30 గంటల వరకు స్వామిని దర్శించుకొనేందుకు భక్తులకు అవకాశం కల్పించారు. అనంతరం ఆలయ తిరువీధుల్లో స్వామిని ఊరేగించారు.
ఆ తర్వాత ఆలయంలో అధ్య యనోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాయంత్రం స్వామిని విష్ణుమూర్తిగా అలంకరించి మత్స్య అవతారంలో ఊరేగించారు. యాదాద్రి ప్రధానా లయ ఉద్ఘాటన తర్వాత తొలిసారి జరిగిన ఉత్తర ద్వార దర్శనానికి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పలువులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారు లు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
కాగా, యాదా ద్రి కొండకు దిగువనున్న తులసీ కాటేజీలో దాతల సహకారంతో రూ. 21 కోట్ల వ్యయంతో నిర్మించిన 240 గదుల సముదాయాన్ని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఇక పాతగుట్ట (çపూర్వగిరి) ఆలయంలో సైతం ఉదయం 6:48 గంటలకు నృసింహుని వైకుంఠద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించారు. మరోవైపు ధర్మపురిలో ఉదయం 5:55 గంటలకు ఉత్తర ద్వార దర్శనాలను ఆలయ అధికారులు అనుమతించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ సహా పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment