
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు ఆశీర్వచనం చేస్తున్న అర్చకులు
సాక్షి, యాదాద్రి: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆమెకు ఆలయ తూర్పు త్రితల రాజగోపురం వద్ద ఆచార్యులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూప్రసాదాన్ని దేవస్థానం ఇన్‌చార్జి ఈవో రామకృష్ణారావు గవర్నర్‌కు అందజేశారు. కలెక్టర్ పమేలా సత్పతి పట్టువస్త్రాలు అందజేశారు.
గవర్నర్ రోడ్డు మార్గం గుండా యాదాద్రికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నర్ ఉన్న సమయంలో భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. అంతకుముందు కొండపైన వీఐపీ గెస్ట్‌హౌస్ వద్ద గవర్నర్ పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. విలేకరులు మాట్లాడించేందుకు ప్రయత్నించగా అందరూ సంతోషంగా ఉండాలని అన్నారు.