యాదగిరిగుట్ట: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దంపతులు శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రధానాల యం తూర్పు రాజగోపురం వద్ద గవర్నర్ దంపతు లకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పంచ నారసింహులు కొలు వైన స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజ లు చేశారు.
ముఖ మండపంలో వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి లడ్డూ ప్రసాదం అంద జేశారు. దైవదర్శనం తరువాత గవర్నర్ దంపతులు ప్రధానాలయ కట్టడాలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఉత్తర రాజగోపురం వద్ద తమిళిసై మాట్లా డుతూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.
తెలంగాణతో పాటు దేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు వెల్లడించారు. ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్షేత్రానికి వచ్చిన చిన్నారులతో గవర్నర్ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆలయానికి వచ్చిన గవర్నర్... 2:10 గంటలకు తిరిగి వెళ్లారు. గవర్నర్ వెంట అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీసీపీ నారాయణరెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి తదితరులున్నారు.
గవర్నర్ పర్యటనకు దూరంగా ఈఓ..
యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధానా లయం పునఃప్రారంభమైన తరువాత తొలిసారి స్వయంభూలను దర్శించుకునేందుకు వచ్చిన గవర్నర్ తమిళిసై పర్యటనకు ఆలయ ఈవో గీతారెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశ మైం ది. యాదాద్రీశుడి దర్శనానికి శనివారం మధ్యా హ్నం గవర్నర్ వస్తున్న విషయాన్ని రాజ్ భవన్ అధికారులు ఆలయ అధికారులకు ముందుగా నే సమాచారం అందించారు.
ఆలయ మర్యాద లు, ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్‌కు ఈవో స్వా గతం పలకాలి. అలాగే దగ్గరుండి పూజలు చే యించాల్సి ఉంది. కానీ ఈవో గీతారెడ్డి గవర్న ర్ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆల య అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి గవర్నర్ దంపతులను దగ్గరుండి ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు చేయించారు. తరువాత స్వ యంగా లడ్డూ ప్రసాదం అందజేశారు. అయితే గవర్నర్ పర్యటనకు డుమ్మాకొట్టిన ఈవో... సా యంత్రం ఆలయంలో జరిగిన సేవలో, ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొనడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment