Temple EO
-
రామ.. రామ! భద్రాద్రి ఈవో అత్యుత్సాహం.. ఆలయానికి ఒకరోజు తాళం
సాక్షి, భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఈవో శివాజీ చేసిన తప్పిదంతో బుధవారం ఉపాలయానికి తాళం వేయాల్సి వచ్చింది. వివరాలివి. రామాలయ ఈవో శివాజీ అంతరాలయంలో మూలమూర్తుల దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ అభయాంజనేయస్వామి ఆలయంలో స్వామి దర్శనానికి వెళ్లారు. అక్కడి అర్చకులు గోత్ర నామాలను నివేదిస్తున్న సమయాన ఈవో శివాజీ అక్కడే ఉన్న శఠగోపంతో స్వయంగా ఆశీర్వచనం తీసుకున్నారు. దీన్ని గమనించిన అర్చకులు వైదిక కమిటీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఆలయానికి తాళం వేసి దర్శనాలను నిలిపివేశారు. అనంతరం యాగశాలలో శఠగోపానికి సంప్రోక్షణ, ఇతర పూజలు చేసి దర్శనాలు ప్రారంభించారు. ఈ అంశంపై ఈవో శివాజీని వివరణ కోరగా ఈ నిబంధన తనకు తెలియక ఏమరుపాటుగా శఠగోపాన్ని తాకానని చెప్పారు. వైదిక కమిటీ సూచన మేరకు సంప్రోక్షణ నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. చదవండి: ఖమ్మంలో నన్ను ఎదురించే మొనగాడు లేడు : రేణుకా చౌదరి -
యాదాద్రీశుడి సేవలో గవర్నర్
యాదగిరిగుట్ట: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దంపతులు శనివారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ప్రధానాల యం తూర్పు రాజగోపురం వద్ద గవర్నర్ దంపతు లకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం పంచ నారసింహులు కొలు వైన స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజ లు చేశారు. ముఖ మండపంలో వారికి అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి లడ్డూ ప్రసాదం అంద జేశారు. దైవదర్శనం తరువాత గవర్నర్ దంపతులు ప్రధానాలయ కట్టడాలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా ఉత్తర రాజగోపురం వద్ద తమిళిసై మాట్లా డుతూ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తెలంగాణతో పాటు దేశ ప్రజలంతా సంతోషంగా ఉండాలని దేవుడిని కోరుకున్నట్లు వెల్లడించారు. ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. క్షేత్రానికి వచ్చిన చిన్నారులతో గవర్నర్ ఫొటోలు దిగుతూ సందడి చేశారు. మధ్యాహ్నం 1:30 గంటలకు ఆలయానికి వచ్చిన గవర్నర్... 2:10 గంటలకు తిరిగి వెళ్లారు. గవర్నర్ వెంట అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, డీసీపీ నారాయణరెడ్డి, ఆర్డీవో భూపాల్‌రెడ్డి తదితరులున్నారు. గవర్నర్ పర్యటనకు దూరంగా ఈఓ.. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రధానా లయం పునఃప్రారంభమైన తరువాత తొలిసారి స్వయంభూలను దర్శించుకునేందుకు వచ్చిన గవర్నర్ తమిళిసై పర్యటనకు ఆలయ ఈవో గీతారెడ్డి గైర్హాజరు కావడం చర్చనీయాంశ మైం ది. యాదాద్రీశుడి దర్శనానికి శనివారం మధ్యా హ్నం గవర్నర్ వస్తున్న విషయాన్ని రాజ్ భవన్ అధికారులు ఆలయ అధికారులకు ముందుగా నే సమాచారం అందించారు. ఆలయ మర్యాద లు, ప్రొటోకాల్ ప్రకారం గవర్నర్‌కు ఈవో స్వా గతం పలకాలి. అలాగే దగ్గరుండి పూజలు చే యించాల్సి ఉంది. కానీ ఈవో గీతారెడ్డి గవర్న ర్ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆల య అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి గవర్నర్ దంపతులను దగ్గరుండి ఆలయంలోకి తీసుకెళ్లి పూజలు చేయించారు. తరువాత స్వ యంగా లడ్డూ ప్రసాదం అందజేశారు. అయితే గవర్నర్ పర్యటనకు డుమ్మాకొట్టిన ఈవో... సా యంత్రం ఆలయంలో జరిగిన సేవలో, ఉగాది పంచాంగ శ్రవణంలో పాల్గొనడం గమనార్హం. చదవండి: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్ -
వచ్చేనెలలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు
సాక్షి, విజయనగరం : పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవ తేదీలను ఆలయ ఈవో ప్రకటించారు వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఉత్సవాలు నెల రోజుల పాటు నిర్వహిస్తారు. అక్టోబర్ 2న మండల దీక్ష ప్రారంభం కాగా, అదేరోజు పందిరిరాట ఉంటుంది. 22న అర్థమండల దీక్ష, 26న తోలేళ్ల ఉత్సవం, 27న సిరిమానోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. నవంబరు 3న తెప్పోత్సవంతో ఈ వేడుకలు ముగుస్తాయని ఈవో వెల్లడించారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవాల నిర్వాహణ ఉంటుందని పేర్కొన్నారు. ఆలయ ప్రాంగణంలో మాస్క్, వ్యక్తిగత దూరం లాంటి నిబంధనలను భక్తులు పాటించాలని విఙ్ఞప్తి చేశారు. అమ్మవారి సిరిమాను చెట్టు గుర్తింపు వంటి ప్రక్రియ సైతం నిబంధనల మేరకే కొనసాగుతుందని స్పష్టం చేశారు. వృద్దులు, చిన్నారులు, గర్బిణీలకు ప్రత్యేక దర్శనాలకు అనుమతి లేదని తెలిపారు. అయితే ఎంతమంది భక్తులకు దర్శనం కల్పించాలన్నది ఇంకా తెలియాల్సి ఉంది. దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆదేశాల మేరకు జిల్లాలో గల మూడు రథాలను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. -
తెరుచుకోనున్న వైష్ణోదేవి ఆలయం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉన్న వైష్ణోదేవి ఆలయం ఆదివారం నుంచి తెరుచుకోనున్నట్లు అధికారులు తెలిపారు. కరోనా కారణంగా మార్చి 18న ఆలయం మూతబడగా, దాదాపు 5 నెలల తర్వాత తెరుచుకోనుంది. మొదటి వారంలో రోజుకు 2,000 మందిని మాత్రమే అనుమతించనున్నామని ఆలయాధికారి రమేశ్‌కుమార్ తెలిపారు. వారిలో 1,900 మందిని జమ్మూకశ్మీర్ నుంచి మరో 100 మందిని బయట రాష్ట్రాల నుంచి అనుమతిస్తామని చెప్పారు. సందర్శకులు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని స్పష్టంచేశారు. ఫేస్ మాస్క్, ఫేస్ కవర్ తప్పనిసరి అని చెప్పారు. వచ్చేవారంతా ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకొని రావాలన్నారు. -
‘అన్ని దేవాలయాలకు ఒకే వెబ్సైట్’
సాక్షి, విజయవాడ : ఈ ఏడాది భవానీ దీక్షా విరమణలకు అరు లక్షల మంది భవానీలు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. 13 లక్షల 39 వేల లడ్డూలను భవానీలకు విక్రయించామని అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. చీరలు, లడ్డూ ప్రసాదాల ద్వారా అమ్మవారికి 2 కోట్ల 53 లక్షల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఇంకా హుండీలను లెక్కించాల్సి ఉందని, ఇరుముడుల ద్వారా వచ్చిన సామాగ్రికి 26 న ఆక్షన్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఆక్షన్‌లో ఎవరైనా పాల్గొనవచ్చని, ప్రతీ మంగళవారం వృద్ధాశ్రమాలకు భోజన అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వృద్ధాశ్రమంలో ఉన్నవృద్ధులకు అమ్మవారి దర్శనం చేయించి వారికి చీరలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నెల 26 న సూర్యగ్రహణం సందర్భంగా దుర్గమ్మ ఆలయం మూసివేస్తున్నామన్నారు. రేపు(డిసెంబర్ 25) రాత్రి 9 గంటల 30 నిముషాలకు అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలు మూసివేస్తున్నామని అన్నారు. తిరిగి 26 సాయంత్రం అమ్మవారి స్నపనాభిషేకం అనంతరం దుర్గమ్మ ఆలయ తలుపులు తెరిచి అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా నకిలీ వెబ్ సైట్లపై ఫిర్యాదు చేశామని, విచారణ జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని దేవాయాలకు ఒకటే వెబ్ సైట్ ఉండాలని ప్లాన్ చేస్తున్నామని, జనవరి 8 న అన్ని దేవాలయాల ఈవోలతో దేవాదాయ శాఖ సమావేశం నిర్వహించి తుది నిర్ణయం ప్రకటిస్తుందని పేర్కొన్నారు. ఇకపై దుర్గమ్మ దర్శనం కోసం ముందుగానే అన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకొనే వెసులుబాటు భక్తులకు కల్పిస్తున్నామని ఈ ప్రక్రియ ఉగాది నాటికి అమల్లోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. -
దొంగెవరు రాజన్నా..?
సాక్షి, కరీంనగర్ : ఫలానా చోట దొంగతనం చేసినట్లు దొంగ ఒప్పుకుంటున్నా... అబ్బే మా దగ్గర దొంగతనమే జరగలేదని వాదించడం వెనుక బలమైన కారణమే ఉంటుంది. వేములవాడ రాజన్న దేవాలయంలోని హుండీ నుంచి ఫిరోజ్ అనే వ్యక్తి దొంగిలించిన ఆభరణాల సంచి విషయంలో అధికారులు చెబుతున్న కథలకు... వాస్తవ అంచనాలకు పొంతన కుదరడం లేదు. వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవాలయం నుంచి బంగారు, వెండి, రాగి, అల్యూమినియం ఆభరణాలతో కూడిన సంచిని చోరీ చేసినట్లు స్థానికంగా దేవుడికి ఇచ్చిన బియ్యం అమ్ముకొని బతికే ఫిరోజ్ అనే వ్యక్తి చెబుతుండగా... మా దేవాలయం నుంచి ఎలాంటి సంచి చోరీకి గురి కాలేదని సాక్షాత్తూ దేవాలయ అధికారులే స్పష్టం చేయడం అనుమానాలకు తావిస్తోంది. దేవాలయంలోని హుండీని లెక్కించేటప్పుడే ఆభరణాలతో కూడిన సంచిని పక్కనపెట్టిన ‘ఇంటిదొంగ’ల గుట్టు వెలుగులోకి రాకుండా ‘మా దగ్గర దొంగతనమే జరగలేదు’ అని కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సీసీటీవీల పర్యవేక్షణలో కూడా హుండీ లెక్కింపుల్లో అక్రమాలు జరుగుతాయనే విషయం వెలుగులోకి రావచ్చనే ఆందోళన అధికారుల్లో ఉందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్టోబర్ 23న వేములవాడ హుండీ లెక్కింపు గత అక్టోబర్ 23న దేవాదాయ శాఖ అధికారులు కృష్ణవేణి, హరికృష్ణల పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఆలయ ఓపెన్ స్లాబ్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల మధ్య లెక్కింపు జరిగింది. 600 మంది సభ్యులు గల శివరామకృష్ణ భజన మండలి సభ్యులు లెక్కింపులో పాల్గొన్నారు. రూ.1.78 కోట్ల ఆదాయం వేములవాడ దేవస్థానానికి సమకూరింది. ఇందులో 456 గ్రాముల బంగారం, 17.3 కిలోల వెండి ఆభరణాలు కూడా ఉన్నాయి. కాగా సరిగ్గా నెలరోజులకు ఈ నెల 21న హుండీలోని ఆభరణాలు చోరీకి గురైనట్లు వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ సీసీఎస్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా... తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఓ గోల్డ్‌స్మిత్ వద్ద వేములవాడ నుంచి వచ్చిన ఫిరోజ్ అనే వ్యక్తి ఒకసారి 120 గ్రాములు, మరో రెండు సార్లు 30 గ్రాముల చొప్పున ఆభరణాలు విక్రయించినట్లు తేలింది. అరతుల బంగారాన్ని కూడా కరిగించి తన భార్యకు ఆభరణం చేయించాడు. ఈ వెండి, బంగారం, ఇతర ఆభరణాలు గల సంచిని వేములవాడ దేవాలయం నుంచి అక్టోబర్ 24 లేదా 25 తేదీల్లో దొంగిలించినట్లు సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాంచందర్‌రావు వద్ద ఫిరోజ్ ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో కేసును వేములవాడ పోలీసులకు బదిలీ చేశారు. రాజన్న హుండీ సొమ్ము కాదన్న ఈవో కాగా, రాజన్న హుండీలో లెక్కించిన ఆభరణాలకు సంబంధించి కరీంనగర్ సీసీఎస్ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకొని అతని ఇంట్లో తనిఖీ చేస్తే 20 కిలోల బరువైన సంచి లభించింది. ఆ సంచిని బియ్యం సేకరించే క్రమంలో ఓపెన్‌స్లాబ్‌లో ఓ మూలన పడి ఉంటే తీసుకొచ్చినట్లు ఒప్పుకున్నాడు. అందులోని వస్తువులను మూడుసార్లు తిమ్మాపూర్‌లో విక్రయించిన విషయం వెలుగు చూసింది. ఈ విషయాన్ని వేములవాడ సీఐ దేవాలయం అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, తమ గుడిలో ఎలాంటి దొంగతనం జరగలేదని స్పష్టం చేశారు. 22వ తేదీన మీడియాలో ఈ వార్త ప్రముఖంగా రాగా, అదేరోజు ఈవో పేరిట రిజాండర్ వచ్చింది. తెల్లకాగితం మీద కార్యనిర్వాహణాధికారి పేరుతో ఎవరి సంతకం లేకుండా వచ్చిన ఈ రిజాయిండర్లో దేవాలయంలో కానుకల చోరీ వార్తకు దేవాలయంలో జరిగిన హుండీ లెక్కింపునకు ఎలాంటి సంబంధం లేదని ఏకవాఖ్య ‘ఖండన’ పంపించారు. వివరాలేవీ అందులో పొందు పరచలేదు. కాగా హుండీ లెక్కింపు సమయంలో నగదు, బంగారం, వెండితోపాటు వెండి పూత రాగి, అల్యూమినియం ఇతర స్క్రాప్‌కు సంబంధించిన లెక్కలు చూసి, అవన్నీ సక్రమంగానే ఉన్నందున దేవాలయం ఆవరణలో చోరీ కాలేదని చెప్పినట్లు తెలిసింది. అయితే హుండీ లెక్కింపు సమయంలోనే ఇంటి దొంగలే ఓ ఆభరణాల సంచిని బియ్యంతోపాటు పడేశారనే లాజిక్కును అధికారులు ఉద్దేశ్య పూర్వకంగానే మరిచిపోతున్నారు. అందుబాటులో లేని సీసీటీవీ ఫుటేజ్ సీసీ టీవీ కెమెరాల నిఘాలోనే హుండీ లెక్కింపు జరిగినా... ఇప్పుడు ఆ టీవీల ఫుటేజీ అందుబాటులో లేదు. కేవలం 16 రోజుల బ్యాకప్ మాత్రమే అందుబాటులో ఉండే విధంగా సీసీ కెమెరాలను కంప్యూటర్లకు అనుసంధానం చేయడంతో ఉన్న ఒక్క ఆధారమూ లేకుండా పోయింది. దొరికిన ఆభరణాల సంచి విలువ తక్కువే అయినా... దేవాలయం హుండీ సొమ్ము చోరీకి గురయిన సంఘటన తేలిగ్గా తీసుకునే అంశం కాదు. ఇది తెలిసే ‘ఆ చోరీకి హుండీకి ఏం సంబంధం లేదు’ అని ఆలయ అధికారులు తేల్చిచెప్పినట్లు స్పష్టమవుతోంది. విచారణ జరుపుతున్నాం: సీఐ శ్రీధర్ వేములవాడ హుండీ లెక్కించిన ఓపెన్ స్లాబ్ ప్రాంతం నుంచే ఆభరణాల సంచిని ఎత్తుకెళ్లినట్లు ఫిరోజ్ అనే వ్యక్తి ఒప్పుకున్నాడు. ఈ విషయంలో దేవాలయం నుంచి మాకెలాంటి ఫిర్యాదు రాలేదు. కరీంనగర్ సీసీఎస్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో మేమే సుమోటోగా కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నాం. ఫిరోజ్‌ను రిమాండ్‌కు తరలించడం జరిగింది.చోరీ వార్తలకు హుండీ ఆభరణాలకు -
యాదాద్రిలో ప్రొటోకాల్ పంచాయితీ
యాదగిరిగుట్ట (ఆలేరు) : ఒకరు మహిళ అధికారి.. మరొకరు మహిళ ప్రజాప్రతినిధి.. వారిద్దరి మధ్య నువ్వానేనా అన్న తరహాలో వార్ నడుస్తోంది. అధికారిక కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదంటూ.. స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం ఆహ్వానాలు ఇవ్వడం లేదంటూ అధికారిపై గతంలో మంత్రులకు, ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. నిన్నటివరకు ఈ ప్రొటోకాల్ విషయం లోలోపలనే ఉన్నా.. శనివారం జరగాల్సిన ఓ కార్యక్రమానికి ఆ ప్రజాప్రతినిధితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వడం లేదని ఆమె అనుచరులంతా ఆ అధికారిపై ఉన్నతస్థాయి అధికారులకు మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన యాదగిరిగుట్టలో శనివారం చోటు చేసుకుంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఈఓ గీతారెడ్డి.. ఆలయానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాలు ఏవీ చేసినా ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్‌రెడ్డికి, ఎంపీ, ఎమ్మెల్సీలతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం ఇవ్వడం లేదని, కనీసం ప్రొటోకాల్ పాటించడం లేదంటూ యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సందర్శనకు వచ్చిన సీఎస్ జోషి దృష్టికి తీసుకెళ్లారు. అసలేమీ జరిగిందంటే... యాదాద్రి దేవస్థానం ఆధీనంలో ఉన్న నల్లపోచమ్మవాడలోని గోశాలను మల్లాపురం మార్గంలో ఉన్న దేవస్థానం బావి వద్ద నూతనంగా నిర్మించిన తులసీ వనానికి తరలించారు. కొంతకాలంగా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. శనివారం తులసీ వనంలో నిర్మించిన నూతన గోశాలను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడంతోపాటు వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన భోజనాలకు వచ్చిన సీఎస్ జోషితో ప్రారంభించాలని అధికారులు అంతా సిద్ధం చేశారు. కానీ చివరి నిమిషంలో ప్రొటోకాల్ పాటించడం లేదని ప్రారంభోత్సవాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అనుచరులు అడ్డుకుంటారని చేయలేదు. పూలతో అలంకరణతోపాటు టెంకాయలు, ప్రారంభో త్సవ రిబ్బన్ కూడా సిద్ధం చేసి చివరికి ప్రారంభం చేయకుండా వాటిని తొలగించడంతో అక్కడున్న ఆచార్యులు, స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రజాప్రతినిధులు రావడంతోనే.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతతోపాటు ఎంపీ, ఎమ్మెల్సీ, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే, కనీసం ప్రొటోకాల్ పాటించకుండానే గోశాలను ఎలా ప్రారంభిస్తారో చూడాలని ఈఓ గీతారెడ్డి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య, టీఆర్ఎస్ నాయకులు పెద్దఎత్తున గోశాలకు చేరుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆలయ అధికారులు ప్రారంభోత్స వానికి సిద్ధం చేసిన రిబ్బన్‌ను తొలగించి, అలంకరణ మాత్రమే ఉంచారు. ప్రజాప్రతినిధులు గొడవకు దిగుతారనే ముందుగా గ్రహించిన ఈఓ గీతారెడ్డి ప్రారంభోత్సవం రద్దు చేశారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎలాంటి ప్రారంభోత్సవం లేనప్పుడు హంగులు, ఆర్భాటాలు ఎందుకని ప్రశ్నించారు. గతంలో కూడా ఈఓ గీతారెడ్డి స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా ఉన్న గొంగిడి సునితామహేందర్‌రెడ్డికి ప్రొటోకాల్ పాటించడం లేదని, రెండేళ్ల క్రితం బ్రహ్మోత్సవాల సమయంలో కరపత్రాలపై విప్ సునీత పేరు ముద్రించడంలో తప్పులు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఆలయానికి వచ్చిన సందర్భంలో ఆమెను సరిగా ఆహ్వానించరని ఆవేదన వ్యక్తం చేశారు. ఈఓపై చర్యలు తీసుకోవాలి.. ప్రొటోకాల్ పాటించకుండా స్థానిక ప్రజాప్రతినిధులను అవమాన పరుస్తున్న ఆలయ ఈఓ గీతారెడ్డిపై చర్యలు తీసుకోవాలని జెడ్పీటీసీ తోటకూరి అనురాధ, మల్లాపురం సర్పంచ్ కర్రె వెంకటయ్య, టీఆర్ఎస్ జిల్లా కార్యదర్శి ఆరె యాదగిరిగౌడ్, మిట్ట వెంకటయ్యగౌడ్, యువజన విభాగం కన్వీనర్ గడ్డమీది రవీందర్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో సీఎస్ జోషికి వినతిపత్రం అందజేశారు. సీఎం కేసీఆర్ రూ.వేల కోట్లతో అభివృద్ధి చేస్తున్నారని, కానీ శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యేను, ఎంపీని, ఎమ్మెల్సీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌లను ఆహ్వానించకుండా అగౌరవపరుస్తున్నారని తెలిపారు. ఈఓ వచ్చిన నాటినుంచి ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. రోజుకో రాయికి పూజలు చేస్తాం.. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా కొండపైన ప్రతి రోజూ ఒక రాయికి పూజలు చేస్తాం. వాటన్నింటికి పిలవాలని లేదు. ప్రధాన ఆలయం ప్రారంభోత్సవంతోనే మిగతా ప్రారంభోత్సవాలు జరుగుతాయి. ఇప్పటి వరకు ఎక్కడ ప్రారంభోత్సవాలు జరగలేదు. పాత గోశాలను మల్లాపురం రోడ్డులో నూతనంగా నిర్మితం గోశాలకు తరలించాలని వైటీడీఏ అధికారులు ఆదేశించారు. కానీ దీనికి ఎవరిని మేము పిలవలేదు. –గీతారెడ్డి, ఈఓ, యాదాద్రి దేవస్థానం ఆహ్వానం అందలేదు.. వాస్తవమే యాదాద్రి దేవస్థానానికి సంబంధించిన గోశాల ప్రారంభోత్సవానికి సంబంధించిన ఆహ్వానం అందలేదు. ఇది వాస్తవమే. గతంలో ఒకటి, రెండు సార్లు ఇలాంటి సంఘటనలకు మమ్మల్ని ఆహ్వానించలేదు. అయినా మేము ఎక్కడ కూడా ఈఓను ఇబ్బంది పెట్టలేదు. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని, ప్రొటోకాల్ విషయాన్ని ఎప్పుడూ అంతగా పట్టించుకోలేదు. – గొంగిడి సునితామహేందర్‌రెడ్డి, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే -
కిరణ స్పర్శ కాసింతే..
అరసవల్లి: ప్రసిద్ధ సూర్యక్షేత్రం అరసవల్లి శ్రీసూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో శనివారం పాక్షికంగా కిరణ దర్శనమైంది. ఉత్తరాయణ, దక్షిణాయన కాలమార్పుల్లో భాగంగా గర్భాలయంలోని ఆదిత్యుని మూలవిరాట్టును తొలిసూర్యకిరణాలు స్పృశించే అరుదైన దృశ్యం కోసం ఎదురుచూసిన భక్తులకు కొంతమేరకు నిరాశే మిగిలింది. ఆకాశం మేఘావృతం కావడంతోపాటు మంచు కమ్మేయడంతో సూర్యోదయం కాస్తా ఆలస్యమైంది. దీంతో శనివారం ఉదయం 6.28 నిమిషాలకు సూర్యోదయ తొలికిరణాలు ఆలయ ధ్వజస్తంభాన్ని తాకి అంతరాలయంలోకి చేరుకున్నాయి. అయితే కిరణాల దిశ మారిపోవడంతో కిరణాలు పూర్తి స్థాయిలో మూలవిరాట్టును తాకలేదు. దీంతో పాక్షికంగా తాకిన కిరణాల దర్శనాలతో భక్తులు వెనుదిరిగారు. పలువురు ఉన్నతాధికారుల కుటుంబసభ్యులు ఆదిత్యుని కిరణ దర్శనాన్ని తిలకించేందుకు వచ్చి, స్వామిని దర్శించుకున్నారు. పెద్ద సం ఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ఈవో ఆర్.పుష్పనాథం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ధ్వజస్తంభం నుంచి అంతరాలయం వరకు ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ఆదిత్యునికి ప్రత్యేక పూజలు చేశా రు. కలెక్టర్ సతీమణి పబితా నివాస్, ఎస్పీ సతీమణి రామలక్ష్మి, డీఎస్పీ ఎ.చక్రవర్తి తదితరులు కిరణ స్పర్శను చూసేందుకు వచ్చారు. నేడు కూడా కిరణ దర్శనానికి అవకాశం తొలి సూర్యకిరణాలు తాకే అద్భుత దృశ్యం ఆదివారం కూడా కన్పించేందుకు అవకాశముంద ని ఆలయ ఈవో తెలియజేసారు. ఈమేరకు భక్తు ల దర్శనాలకు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కిరణాల దర్శనం తర్వాత సాధారణ దర్శనాలకు అవకాశమిస్తామని తెలియజేసారు. ఆనందంగా ఉంది.. తొలిసారి ఆదిత్యుని కిరణాలను తాకే దృశ్యం చూసేందుకు వచ్చాను. కొద్దిపాటి సమయం అంతరాలయంలో స్వామి వారి విగ్రహంపై కిరణాలు పడటం కన్పించింది. చాలా ఆనందంగా ఉంది. మళ్లీ ఆదివారం కూడా అవకాశముందని ఆలయ అధికారులు చెబుతున్నారు. మరోసారి చూసేందుకు ప్రయత్నిస్తా. –పబితా నివాస్, జిల్లా కలెక్టర్ సతీమణి -
శ్రీశైలంలో అర్ధరాత్రి పూజలు.. కలకలం
సాక్షి, శ్రీశైలం/కర్నూలు : శ్రీశైల మల్లన్న సన్నిధిలో కలకలం రేగింది. వేదపండితుడు గంటి రాధాకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు ఆలయ ఈవో రామచంద్రమూర్తి ప్రకటించారు. రాధాకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా వ్యవరించాడంటూ పేర్కొన్నారు. క్షుద్రపూజలు చేశాడని ఆరోపించారు. దీంతో అధికారులు, వేదపండితుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనూ క్షుద్రపూజలు నిర్వహించారనే ఆరోపణలొచ్చాయి. -
‘దీక్ష’తో పనులు
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జరిగే అతి పెద్ద ఉత్సవాల్లో భవానీదీక్షల విరమణ రెండవది. భవానీమాల ధరించి 40 రోజులు పాటు నిష్టతో ఆచరించే భక్తులు.. అనంతరం అమ్మవారి సన్నిధికి వచ్చి ఆ దీక్షను విరమిస్తారు. ఏటా ఆంధ్రా, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ సారి సుమారు 8 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనావేస్తున్నారు. పక్కా ఏర్పాట్లు.. ఈ నెల 29 నుంచి ప్రారంభమయ్యే భవానీదీక్షల విరమణకు దేవస్థానం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఏవిధమైన ఇబ్బందులుకలుగకుండా చర్యలు చేపడుతున్నారు. ఇంజినీరింగ్ పనులతో పాటు లడ్డూ ప్రసాదాలు తయారీ, భక్తులకు కేశఖండన, నదిలో పుణ్యస్నానాలు తదితర ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.1.24 కోట్లతో పనులు సుమారు రూ.1.24 కోట్లతో ఇంజినీరింగ్ పనులు చేస్తున్నారు. ముఖ్యంగా వినాయకుడు గుడి వద్ద నుంచి కొండపైకి అక్కడ నుంచి మెట్ల మార్గంలో కిందకు వచ్చే విధంగా రూ.20 లక్షలతో తాత్కాలిక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు సమాచారం తెలియజేసేందుకు మైక్‌లు ఏర్పాట్లు చేస్తున్నారు. రూ.6 లక్షల వ్యయంతో 33 సీసీ టీవీల కోసం అద్దె పద్ధతిలో తీసుకున్నారు. రూ.11 లక్షలతో పద్మావతి ఘాట్, కేశఖండనశాలలో మొబైల్ టాయిలెట్స్‌ను ఉత్సవాల కోసం సమకూర్చుతున్నారు. గురు భవానీలతో గిరిప్రదక్షిణ.. ఇటీవల దేవస్థానం పరిధిలోని గురు భవానీలతో ఈవో కోటేశ్వరమ్మ సమావేశం నిర్వహించారు. 29వ తేదీ నుంచి భవానీదీక్షలు ప్రారంభం అవుతున్నందున 28వ తేదీన గురు భవానీలతో ప్రత్యేకంగా గిరి ప్రదక్షిణ చేస్తే బాగుంటుందనే ప్రతిపాదన వచ్చింది. 29వ తేదీ నాటికి ఇతర జిల్లాల నుంచి వచ్చే గురు భవానీలతో పాటు స్థానికంగా ఉండే గురు భవానీలంతా కలిసి సుమారు 500 మందితో ఈ ప్రదక్షిణ చేయాలని నిర్ణయించారు. అలాగే దూరప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఫ్లైఓవర్ పనులకు బ్రేక్.. భవానీ దీక్షల విరమణ నేపథ్యంలో కనకదుర్గ ఫ్లై ఓవర్ పనులు ఆపాలని దేవస్థానం అధికారులు కోరారు. అయితే ఇప్పటికే తీవ్ర జాప్యం జరుగుతున్నందున ఫ్లైఓవర్ పనులు ఆపడం కష్టమని ఆర్అండ్బీ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో శుక్రవారం దేవస్థానం, ఆర్అండ్బీ అధికారులు, ఫ్లై ఓవర్ కాంట్రాక్టర్ ప్రతినిధులు దుర్గగుడిలో సమావేశమయ్యారు. చివరకు ప్రస్తుతం పనులు ఆపాల్సిన అవసరం లేదని ఈనెల 29 నుంచి 2వ తేదీ వరకు దుర్గగుడి క్యూలైన్లు ఉన్న చోట మాత్రం పనులు చేయకూడదని నిర్ణయించారు. పనులకు శ్రీకారం ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) : ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో డిసెంబర్ 29వ తేదీ నుంచి జనవరి 2వ తేదీ వరకు జరిగే భవానీ దీక్ష విరమణ మహోత్సవాలకు అవసరమైన పనులు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీక్ష విరమణకు తరలివచ్చే లక్షలాది మంది భవానీలు అమ్మవారిని దర్శించుకునేందుకు అవసరమైన క్యూలైన్ల ఏర్పాటు పనులను శుక్రవారం ఆలయ ఈవో వీ. కోటేశ్వరమ్మ, చైర్మన్ గౌరంగబాబు పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. కెనాల్ రోడ్డు వినాయకుడి వద్ద నుంచి ప్రారంభమయ్యే క్యూలైన్ పనులకు పూజా కార్యక్రమాలను నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ, ఈఈ భాస్కర్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. -
‘గుడి చైర్మన్ అయినా.. క్యూలైన్లో రావాల్సిందే’
సాక్షి, విజయవాడ: దుర్గగుడి చైర్మన్ యలమంచలి గౌరంగబాబుకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా మంగళవారం ఉదయం అమ్మవారి దర్శనానికై గౌరంగబాబు కుటుంబసమేతంగా ఆలయానికి వచ్చారు. అయితే ప్రత్యేకదర్శనార్థం ఆలయంలోకి నేరుగా వెళ్లేందుకు ప్రయత్నించగా ఈవో కోటేశ్వరమ్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. శరన్నవరాత్రుల్లో చైర్మన్ అయినా క్యూలైన్లో రావాల్సిందేనని సూచించారు. దీంతో ఆగ్రహించిన గౌరంగబాబు ఆలయం వద్దే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పాలకమండలి సభ్యులు నచ్చచెప్పినా వినకుండా అక్కడే బైఠాయించారు. చివరకు ఈవో కోటేశ్వరమ్మ వచ్చి నేరుగా ఆలయంలోకి అనుమతిస్తామని చెప్పడంతో గౌరంగబాబు నిరసన విరమించారు. ఈ దసరా ఉత్సవాల్లో చైర్మన్‌కు ఇలాంటి ఘటన ఎదురుకావడం ఇదే తొలిసారి కాదు. ఆదివారం అమ్మవారి జన్మనక్షత్రం రోజు జరిగే విశేష పూజలో ఈవో, కమిషనర్, దేవాదాయశాఖ కమిషనర్, దుర్గగుడి చైర్మన్లకు తొలి పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే పోలీసుల అత్యుత్సాహంతో చైర్మన్‌ను తొలి పూజకు వెళ్లకుండా చేశారు. తాను గుడి చైర్మన్ అని చెప్పుకున్నప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాలంటూ ఆపేశారు. తీవ్ర మనస్థాపంతో ఇంటికి వెళ్లిన చైర్మన్‌కు తిరిగి ఉదయం కూడా అదే సంఘటన ఎదురైంది. ఉదయం 11 గంటల సమయంలో కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన గౌరంగబాబును దర్శనానికి వెళ్లకుండా డ్యూటీలో ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. తాను ఆలయ చైర్మన్‌ను అంటూ పదేపదే చెప్పినా ఫలితం లేకుండా పోయింది. -
అమ్మవారి సన్నిధిలో లంచావతారం
దేవుడి దగ్గరకో.. దేవత దగ్గరకో వెళ్లి కోరికలు కోరుతాం.. దక్షిణలు సమర్పిస్తాం.. కోరికలు తీరిన తర్వాత మొక్కులు తీర్చుకుంటాం..తానూ దేవుడినని ఫీలయ్యాడేమో గానీ.. సాక్షాత్తు అమ్మవారి సన్నిధిలోనే ఓ అధికార దేవుడు తన కోసమే ఓ హుండీ పెట్టేశాడు.. లంచాల దక్షిణలు అందులో వేయాలని తన కింది ఉద్యోగులనే ఆదేశించాడు..అసలు దేవుడు దక్షిణలు సమర్పించకపోయినా.. మనసారా ప్రార్థిస్తే భక్తులను కాపాడతాడు, కోరికలు తీరుస్తాడు..కానీ ఈ అధికార దేవుడు మాత్రం తన కింద పనిచేసే వారే అయినా.. తన సహోద్యోగులన్న స్పృహ కూడా లేకుండా పీఆర్సీ బకాయిలు కావాలంటే లంచాల దక్షిణలు సమర్పించాల్సిందేనని పీక మీద కత్తి పెట్టాడు.. మీటింగ్ పెట్టి మరీ రేట్లు ఫిక్స్ చేశాడు. కొంతమంది గత్యంతరం లేక అతని హుండీలో దక్షిణలు వేసేశారు. అయితే కొద్దిమంది మాత్రం సహనం నశించి.. ఏసీబీకి ఉప్పందించారు. వారు వల పన్నారు. రూ.60 వేల లంచం తీసుకుంటుండగా సదరు లంచావతారాన్ని.. అతని తాబేదారు రికార్డు అసిస్టెంట్‌ను పట్టుకున్నారు. ఆ లంచావతారమే పెదవాల్తేరులోని కరకచెట్టు పోలమాంబ దేవస్థానం ఈవో సత్యనారాయణ. కాగా గతంలోనూ పోలమాంబ దేవస్థానంలో ఏసీబీ అధికారులు దాడి చేసి అప్పటి ఈవో మూర్తిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. విశాఖ క్రైం: దేవుడి సన్నిధిలో చిన్న తప్పు చెయ్యడానికి కూడా భయపడుతున్న రోజుల్లో... కరకచెట్టు పోలమాంబ ఆలయ ఈవో పెదిరెడ్ల సత్యనారాయణ దేవాలయంలోనే లంచాల హుండీ తెరిచేశాడు. ఆ అమ్మవారి హుండీలో భక్తులు దక్షిణ వేయకపోయినా.... ఈయన హుండీలో ఆలయ ఉద్యోగులు మాత్రం లంచాల సొమ్ము జమ చేయాల్సిందే. లేకుంటే మాత్రం ఉద్యోగుల పరిస్థితి ఊహించుకోలేం. ఎక్కడెక్కడ ఆమ్యామ్యాలు దొరికే ఛాన్స్ ఉంటే అక్కడ పట్టుబట్టి మరీ పైసలు పిండుకోవడమే పనిగా పెట్టుకున్నాడు. ఈయనకు రైట్ హ్యాండ్‌గా రికార్డు అసిస్టెంట్ గాలి వెంకటశివ వ్యవహరిస్తూ గుడిలోనే చక్రం తిప్పేవారు. ఈ క్రమంలో ఉద్యోగులు, సిబ్బందికి న్యాయంగా దక్కాల్సిన పీఆర్సీ బకాయిల చెల్లింపుల కోసం భారీగా లంచం డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులకూ వాటాలివ్వాలని చెబుతూ ఒక్కొక్కరికీ ఒక్కో రేటు నిర్ణయించేశారు. సొమ్ము వసూలు చేసే బాధ్యతను రికార్డ్ అసిస్టెంట్‌కు అప్పగించేశారు. వీరిద్దరూ కలిసి ఎవరెవరు ఎంత డబ్బు ఇచ్చారు... ఇంకా ఎవరు బాకీ ఉన్నారనే జాబితానే తయారు చేసేసుకుని సిబ్బందిని వేధించుకు తింటున్నారు. వీరి వేధింపులు భరించలేని ఓ అర్చకుడు, వాచ్మెన్ అవినీతి నిరోధక శాఖ అధికారులు సంప్రదించడంతో... లంచావతారులను ఏసీబీ అధికారులు గుడిలోనే రెడ్ హ్యాండెడ్‌గా గురువారం పట్టుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించేశారు. ఒక్కొక్కరికీ ఒక్కో ధర నిర్ణయించేసి... ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ తెలియజేసిన వివరాల ప్రకారం... దేవస్థాన ఉద్యోగులకు 2015 పీఆర్సీ అమలు చేసిన నేపథ్యంలో సెప్టెంబర్ 27న ఉద్యోగులు, సిబ్బందితో ఈవో సమావేశం ఏర్పాటు చేశారు. పీఆర్సీ బకాయిలు రావాలంటే అర్చకులు రూ.30 వేలు, సన్నాయిమేళం, వాచ్మెన్, ఇతర సిబ్బంది ఒక్కొక్కరు రూ.15 వేలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇవ్వలేమని సిబ్బంది మొరపెట్టుకోగా.. రూ.5వేలు తగ్గించి ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కొందరు కొద్దిరోజుల కిందట రూ.1.45లక్షలు సమర్పించేసుకున్నారు. డబ్బులు ఇవ్వడం ఇష్టంలేని ఆలయ అర్చకుడు శ్రీనివాస్ చక్రవర్తి, వాచ్మెన్ ఉమామహేశ్వరరావు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈవో సత్యనారాయణ, రికార్డు అసిస్టెంట్ శివపై నిఘా ఉంచారు. ఈ నేపథ్యంలో గురువారం ఉద్యోగుల నుంచి తీసుకున్న లంచం సొమ్ము రూ.60వేలు ఈవో చాంబర్లో రికార్డ్ అసిస్టెంట్ శివ లెక్కిస్తుండగా ఏసీబీ డీఎస్పీ కె.రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐలు గణేష్, మూర్తి, ఉమామహేశ్వరరావు తన సిబ్బందితో దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈవో సత్యనారాయణతో పాటు రికార్డు అసిస్టెంట్ శివని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ అవినీతి వసూళ్లకు సంబంధించి లంచావతారులు ఇద్దరూ నిర్వహిస్తున్న ఓ రికార్డును స్వాధీనం చేసుకున్నారు. 11 మంది నుంచి లంచాలు వసూలు ఈ సందర్భంగా డీఎస్పీ రామకృష్ణప్రసాద్ మాట్లాడుతూ అర్చకులు, ఇతర సిబ్బంది ఈవోకు డబ్బులు అందించే ముందు తమను సంప్రదించారని, ఇద్దరు అర్చకులు రూ.50 వేలు, ఓ వాచ్మెన్ రూ.10వేలు లంచం గురువారం ఇచ్చారని తెలిపారు. వారు ఇచ్చిన లంచాన్ని ఈవో చాంబర్లో రికార్డు అసిస్టెంట్ లెక్కపెడుతుండగా పట్టుకున్నామని డీఎస్పీ వెల్లడించారు. ఈవో ఇప్పటికే చాలా మంది నుంచి సొమ్ము సేకరించారని, ఇంకా ఇవ్వాల్సిన వారి వివరాలు పుస్తకంలో రాసుకున్నారని తెలిపారు. సుమారు రూ.1.45లక్షలను ఉద్యోగులు కొద్దిరోజుల కిందట ఈవోకి ఇచ్చారని... అందులో నుంచి రూ.1.20లక్షలను రాజమండ్రిలో ఉంటున్న రీజినల్ జాయింట్ కమిషనర్‌కు చెల్లించినట్లు ఈవో అంగీకరించారని, మొత్తం 11 మంది ఉద్యోగుల నుంచి లంచాలు తీసుకున్నారని తెలిపారు. కొత్త చట్టం ప్రకారం 7 – ఏ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మద్ది అప్పలరెడ్డి ఇంట్లో రూ.38వేలు స్వాధీనం కరకచెట్టు పోలమాంబ ఆలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న పెదవాల్తేరుకు చెందిన మద్ది అప్పలరెడ్డి ఇంట్లో అవినీతి సోమ్ము రూ.38 వేలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పోలమాంబ ఆలయంలో రెండోసారి ఏసీబీ దాడి పెదవాల్తేరు(విశాఖ తూర్పు): పెదవాల్తేరులో గల శ్రీ కరకచెట్టు పోలమాంబఅమ్మవారి దేవస్థానంలో విధులు నిర్వర్తించే కార్యనిర్వహణాధికారులు వారి తీరు మార్చుకోవడం లేదు. లంచాలు రుచి మరిగి సిబ్బంధిని వేధిస్తూ ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో ఆలయానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఈ దేవస్థానంలో 2016వ సంవత్సరంలో ఈఓ మూర్తి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కి సస్పెండ్ అయ్యారు. ఆయన స్థానంలో విజయనగరం నుంచి బదిలీపై వచ్చి విధుల్లో చేరిన సత్యనారాయణ తాజాగా ఏసీబీకి చిక్కారు. ఈయ న నర్సీపట్నం తదితర ప్రాంతాలకు చెందిన మరో ఐదు దేవస్థానాలకు ఇన్‌ఛార్జి ఈఓగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ 2016లో 2015 నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాలని సర్కులర్ జారీ చేశారు. ఇదే ఆ శాఖలోని ఈవోలు, ఇతర ఉన్నతాధికారులకు కాసుల వర్షం కురిపిస్తోం దనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలో గడిచిన రెండు సంవత్సరాల కాలంలో ఐదుగురు ఈవోలు ఏసీబీకి చిక్కి సస్పెండ్ కావడం భక్తులను విస్మయపరుస్తోంది. -
భక్తులకు బఫే భోజనాలా?
సింహాచలం(పెందుర్తి): ‘భక్తులకు బఫే పద్ధతిలో అన్నప్రసాదమా? కూర్చోపెట్టి వడ్డించాలని పదేపదే ఎందుకు చెప్పించుకుంటారు? పద్ధతి మార్చరా?’ అంటూ సింహాచలం దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ నిత్యాన్నదాన పథకం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహగిరి నిత్యాన్నదాన భవనాన్ని ఆదివారం మధ్యాహ్నం ఆయన సందర్శించారు. బఫే పద్ధతిలో అన్నప్రసాదం వడ్డించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పలు కారణాలను ఆయనకు తెలిపారు. ఏ లోపాలున్నా వెంటనే సరిదిద్దుకోవాలని, భక్తులకు కూర్చోపెట్టే వడ్డన చేయాలని ఆదేశించారు. అప్పటి వరకు జరుగుతున్న బఫే పద్ధతిని ఆపి భక్తులందరినీ కూర్చోపెట్టి అన్నవడ్డన చేయించారు. అన్నప్రసాదాలు తీసుకెళ్లే తోపుడు బళ్లు పనిచేయడం లేదని, సరిపడా మెన్ రాలేదని అధికారులు చెప్పడంతో వెంటనే వాటిని సరిదిద్దాలని ఆదేశించారు. -
చంద్రగిరిలో టీడీపీ నేతల దాదాగిరి
-
చంద్రగిరిలో టీడీపీ నేతల దాదాగిరి
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. అధికార మదంతో దాదాగిరి చెలాయిస్తున్నారు. చంద్రగిరి మూలస్థానమ్మ ఆలయ ఈవోపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేశారు. ఈవోపై టీడీపీ నాయకులు గౌస్ భాషా, భాస్కర్ చేయి చేసుకున్నారు. దాడి ఘటనను చిత్రీకరిస్తున్న భక్తులపై వీరంగమాడారు. టీడీపీ నేతల తీరుపై ఆలయ ఉద్యోగులు, భక్తులు మండిపడుతున్నారు. -
పెళ్లిళ్లలో మేళతాళాలొద్దంటున్న అధికారులు!
-
సిబ్బందితో చెప్పులు మోయించిన ఆలయ ఈవో