
సాక్షి, శ్రీశైలం/కర్నూలు : శ్రీశైల మల్లన్న సన్నిధిలో కలకలం రేగింది. వేదపండితుడు గంటి రాధాకృష్ణను సస్పెండ్ చేస్తున్నట్టు ఆలయ ఈవో రామచంద్రమూర్తి ప్రకటించారు. రాధాకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా వ్యవరించాడంటూ పేర్కొన్నారు. క్షుద్రపూజలు చేశాడని ఆరోపించారు. దీంతో అధికారులు, వేదపండితుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గతంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలోనూ క్షుద్రపూజలు నిర్వహించారనే ఆరోపణలొచ్చాయి.