నంద్యాల జిల్లా: శ్రీశైలంలో మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. నేడు కనుమ పండుగ కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శనం కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది.
భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు,కుంకుమార్చన నిలుపుదల . మరోపక్క భక్తులు రద్దీ దేశ భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment