Mallikarjuna Swamy Temple
-
మల్లన్న సన్నిధిలో.. సీతారాముల కల్యాణం
ఓదెల (పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఈనెల 6న నిర్వహించనున్న శ్రీసీతారాముల కల్యాణోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీసంఖ్యలో తరలివస్తారు. ఉదయం సుప్రభాత సేవతో పూజలు, వేడుకలు ప్రారంభమవుతాయి. ఆదివారం ఉదయం 11.30 గంటలకు శ్రీసీతారాముల కల్యాణ ప్రక్రియ ప్రారంభిస్తారు. దేవతామూర్తులను మంగళవాయిద్యాలతో వేదికపైకి తీసుకొచ్చి ఆశీనులు చేస్తారు. చకచకా ఏర్పాట్లు.. ఓదెల శ్రీమల్లికార్జునస్వామి సన్నిధిలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణం కోసం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. భక్తులకు నీడ సౌకర్యం కల్పించేందుకు చలువ పందిళ్లు నిర్మిస్తున్నారు. మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లపై పోలీసులు ఇప్పటికే సమీక్షించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు స్వామివారికి పట్టువ్రస్తాలను సమరి్పస్తారు. అర్చకుడు ఆరుట్ల శ్రీనివాసచార్యుల ఆధ్వర్యంలో కల్యాణం జరిపిస్తారు.వైభవంగా కల్యాణం ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో సీతారాముల కల్యాణం అంగరంగవైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రజాప్రతినిధులు, అ«ధికారుల ఆధ్వర్యంలో స్వామివార్ల కల్యాణం సుమారు మూడుగంటల పాటు నిర్వహిస్తాం. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తులు తీర్థప్రసాదాలు అందిస్తాం. – ఆరుట్ల శ్రీనివాసచార్యులు, అర్చకుడుఏర్పాట్లు చేస్తున్నాం ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానంలో ఆదివారం జరిగే సీతారాముల కల్యాణ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నాం. నీడ, మంచినీరు, వసతి గదులు అందుబాటులో ఉంచుతాం. ఆలయాన్ని విద్యుద్ దీపాలతో అలంకరిస్తాం. – బొడ్క సదయ్య, ఆలయ ఈవో, ఓదెలకనుల పండువగా ఉంటుంది ఓదెల మల్లన్న సన్నిధిలో ఏటా శ్రీసీతారాముల కల్యాణం వైభవంగా జరిపిస్తారు. మూడుగంటల పాటు మంగళవాయిద్యాలతో కల్యాణం జరుగుతుంది. అధికసంఖ్యలో భక్తులు తరలిరావాలి. – రంగు బ్రహ్మచారి, భక్తుడు కొలనూర్ -
శ్రీశైలం క్షేత్రం..భక్తజనసంద్రం (ఫొటోలు)
-
మల్లన్నగుట్టే.. చిన్న శ్రీశైలం
రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిధానపల్లి (Nidhanapalle) గ్రామ శివారులోని మల్లన్నగుట్ట (mallanna gutta) చిన్న శ్రీశైలంగా పేరొందింది. గుట్టపై ఉన్న ప్రధాన దేవాలయంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కొలువై ఉన్నాడు. క్షేత్రం ఎగువభాగంలోని గుహాంతరాళమున మహామునుల తపో స్థలములు, స్వామివారి పుట్టులింగములు ఉండటం మల్లన్నగుట్ట ప్రత్యేకత. మునుల తపస్సు చేత ప్రసిద్ధి చెందిన గుట్టపై కొలువై ఉన్న మల్లికార్జునస్వామి భక్తుల కొంగుబంగారమై కోరిన కోర్కెలు తీరుస్తాడని ప్రజల నమ్మకం. ప్రతీ సంవత్సరం మాఘమాసం బహుళ త్రయోదశి నుంచి పాల్గుణమాసం విదియ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలను కనుల పండువగా నిర్వహిస్తారు. గుట్టపై నిద్రిస్తే రోగాలు మాయం మల్లన్నగుట్టపై సువిశాలమైన మైదానం ఉంది. హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. పరిసర గ్రామాల ప్రజలు వివిధ పర్వదినములలో స్వామివారి దర్శనం కోసం పరితపిస్తుంటారు. నూతన కార్యక్రమాలను గుట్టపై గల దేవాలయంలో పూజలు నిర్వహించి ప్రారంభిస్తారు. ఎంతటి క్లిష్టమైన ఆపదల నుంచైనా భగవంతుడు తమను రక్షిస్తాడని భక్తుల ప్రగాఢమైన నమ్మకం. గుట్టపై నిద్రచేస్తే ఆయురారోగ్యములు, భోగ భాగ్యాలు పొందుతామని ప్రజలు విశ్వసిస్తారు. కోనేరు నీటితో సకల శుభాలు గుట్టపైకి వెళ్లేమార్గంలో సహజ సిద్ధమైన కోనేరు ఉంది. కోనేటిలో ఏడాది పొడవునా నీరు ఉంటుంది. కోనేటి నీటిని ప్రజలు పరమ పవిత్రంగా భావిస్తారు. కోనేటిలోని నీటిని తీసుకెళ్లి పంటలపై చల్లితే చీడపీడలు తొలగి పంటలు సమృద్ధిగా పండుతాయని, పశువులపై చల్లితే పుష్కలంగా పాలు ఇస్తాయని, రోగాలు మాయమవుతాయని ప్రజల విశ్వాసం. మెరుగైన రోడ్డు సౌకర్యం నిధానపల్లి మల్లన్నగుట్ట(చిన్న శ్రీశైలం) చిట్యాల– భువనగిరి రోడ్డుకు సమీపంలో ఉంటుంది. గుట్టపైకి వాహనాలు వెళ్లడానికి ఘాట్‌రోడ్డు ఉంది. వాహనాల పార్కింగ్‌కు విశాలమైన మైదానం ఉంది. గత ఏడాది మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన సొంత డబ్బులతో ప్రధాన దేవాలయం చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేయడానికి బండరాళ్లను తొలగింపజేశారు. (Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?) ఈ ఏడాది జరిగే బ్రహ్మోత్సవాల వివరాలు ఈనెల 26న గణపతి పూజ, స్వస్తివాచనము, అంకురార్పణ, బ్రహ్మకలశ స్థాపనలు, ధ్వజారోహణం, ఉత్సవాల విగ్రహాలు గుట్టపైకి వేం చేయుట 27న స్వామివారి ఆర్జిత సేవలు, ప్రభోత్సవం, షావలు, రాత్రి కల్యాణ మహోత్సవం 28న రుద్ర చండీహవనం, అన్న ప్రసాద వితరణ, వీరభద్రేశ్వరస్వామి పూజ, ఖడ్గాలు, ప్రభల ఊరేగింపు, భద్రకాళి అమ్మవారి పూజ తెల్లవారుజామున అగ్నిగుండాల మహోత్సవం 29న గెలుపు, మహదాశీర్వచనములు ఉంటాయి.చదవండి: కనువిందు.. ఇందూరు చిందు అత్యంత మహిమాన్వితుడు మల్లన్నగుట్టపై కొలువై ఉన్న శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి పట్ల పరిసర ప్రాంత ప్రజలకు అపారమైన నమ్మకం. ఇక్కడ కొలువై ఉన్న స్వామివారు అత్యంత మహిమాన్వితుడు. బాధల నుంచి విముక్తి కలిగించే దైవమని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. –బేతోజు సత్యనారాయణశాస్త్రి, ప్రధానార్చకుడు చదవండి: Mahashivratri 2025: శివరాత్రికి ఉపవాసం, ఇంట్రస్టింగ్ టిప్స్ -
శ్రీశైలం : నల్లమల అడవుల్లో పాదయాత్రగా తరలివస్తున్న భక్తులు (ఫొటోలు)
-
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ
నంద్యాల జిల్లా: శ్రీశైలంలో మల్లన్న ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. నేడు కనుమ పండుగ కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనార్థమై క్యూలైన్స్ లో దర్శనం కంపార్టుమెంట్లలో బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత అభిషేకాలు,కుంకుమార్చన నిలుపుదల . మరోపక్క భక్తులు రద్దీ దేశ భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే అనుమతిస్తున్నారు అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు దర్శనార్థమై క్యూలైన్లు,కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం,పాలు,బిస్కెట్స్ మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. -
శ్రీశైలం ఆలయ పరిసరాలలో డ్రోన్ కలకలం
-
త్వరలో కార్తీక మాసం..శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్
సాక్షి,నంద్యాల: శ్రీశైలం మల్లన్న భక్తులకు ముఖ్యగమనిక. త్వరలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రంలో కార్తీక మహోత్సవాలు జరగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా కార్తీక మహోత్సవాల్ని పురస్కరించుకొని ఆలయంలో జరిగే గర్భాలయ అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రంలో కార్తీక మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కార్తీక మాసం సందర్భంగా దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. రద్దీ దృష్ట్యా కార్తీక మాసంలో జరిగే మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగే పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు.రద్దీ రోజులలో స్వామివార్ల స్పర్శ దర్శనం నిలిపివేసి.. అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు ప్రకటించారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన, పూజలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు. -
Tourist Spot: కొత్తదంపతులు ఈ దేవాలయాన్ని తప్పక దర్శించుకుంటారు..
స్వయంబువుగా వెలిసిన కొమురెల్లి మల్లన్న స్వామి భక్తుల కొంగు బంగారం. చందమామలాంటి బిడ్డనిచ్చి ఒడినింపుతాడని నమ్మకం. మల్లన్నకు ఉయ్యాల కడితే ఇంట్లో ఉయ్యాల ఊగుతుందని విశ్వాసం. అందుకే... ఉయ్యాల కట్టి మరీ మల్లన్నకు మొక్కుతారు. నూతన దంపతులు కొమురెల్లి మల్లన్నను దర్శించుకుంటే పండండి బిడ్డ నట్టింట నడయాడుతుందని నమ్ముతారు భక్తులు. మంచిర్యాల జిల్లా, జైపూర్ మండలం కుందారం గ్రామంలో కొలువైన స్వయంభువు కొమురెల్లి మల్లన్న. కడుపు పండాలని మల్లన్నకు మొక్కి, కొత్త గుడ్డలో కొబ్బరికాయను కట్టి చెట్టుకు వేళ్లాడదీస్తారు. ఈ ఆలయంలోని చెట్ల కొమ్మలు నిండుగా ఈ ఉయ్యాలలే కనిపిస్తాయి. కుందారం గ్రామంలో పదేళ్ల కిందట కాకతీయుల కాలం నాటి కొమురెల్లి మల్లన్న విగ్రహాలు బయటపడ్డాయి. అప్పటి నుంచి ఈప్రదేశం పెద్ద యాత్రాస్థలంగా మారింది. కార్తీకమాసం మొదలైంది. ఇక శివుని కోవెలలన్నీ దీపాలతో కళకళలాడుతుంటాయి. ఈ టూర్లో శివ్వారంలోని మొసళ్ల మడుగును కూడా కవర్ చేయవచ్చు. – వేముల శ్రవణ్‌కుమార్, సాక్షి, మంచిర్యాల చదవండి: ఈ సరస్సుకు వెళ్లినవారు ఇప్పటివరకు తిరిగి రాలేదు!.. మిస్టీరియస్.. -
మహా శివరాత్రి : భక్త జనసంద్రమైన శ్రీశైలం
-
ధ్వజస్తంభం...ఆలయ మూలస్తంభం
ఆలయంలోకి అడుగుపెట్టగానే ముందుగా దర్శనమిచ్చేది ధ్వజస్తంభం. ఆలయంలో నెలకొని ఉన్న స్వామివారి కీర్తి పతాకను రెపరెపలాడిస్తూ, చిరుగంటల సవ్వడితో, తల ఎత్తి చూసేంత ఎత్తులో కనిపిస్తుంది ధ్వజస్తంభం. ధ్వజం అంటే పతాకం (జెండా). ధ్వజాన్ని కట్టి ఎగురవేసే స్తంభం కనుక దీనికి ఆ పేరు వచ్చింది. ఆలయపురుషునిలో ఉన్న షట్చక్రాలలో మొదటిదైన మూలాధారచక్రంపై ఇది ప్రతిష్ఠించబడుతుంది కనుకనే ఇది ఆలయానికి మూలస్తంభంగా పేర్కొనబడుతోంది. ప్రాచీన యాగశాలలే కాలాంతరంలో ఆలయాలుగా రూపాంతరం చెందిన నేపథ్యంలో యూపస్తంభం ధ్వజస్తంభంగా రూపుదిద్దుకుంది. ఒక్కసారి ధ్వజస్తంభం ఆకారాన్ని జాగ్రత్తగా గమనిస్తే మనకు త్రిమూర్తుల (ఆత్మ, విద్యా, శివ తత్త్వాల)సమిష్టితత్త్వం దర్శనమిస్తుంది. అలాగే ధ్వజస్తంభం పై భాగాన మూడు పలకలు, మూడు శిఖరాలు ఉంటాయి. మూడు పలకలను పట్టి ఉంచే నిలువు కొయ్యలు 3 ఉంటాయి. ఇలా ఈ స్తంభ నిర్మాణమంతా మూడుతో ముడిపడి ఉంది. దక్షిణ భారతమంతటా గోపురం దాటి లోపలికి రాగానే కనిపించే ధ్వజస్తంభం ఉత్తరాదిన మాత్రం ఆలయ విమానంపైనే స్థాపించబడుతుంది. ధ్వజస్తంభంపై అడుగడుగునా పట్టికలు(పర్వాలు) కనబడతాయి. అవేంటంటే పూర్వం తాత్కాలికంగా వెదురు కర్రతోనే ధ్వజస్తంభం నిలబెట్టి ధ్వజారోహణ చేసేవారు. రానురానూ స్థిరంగా ప్రతిష్ఠిస్తున్నందువలన అదే ఆకారంలో వెదురు కొయ్యకు గణుపులున్నట్లు పట్టీలను పెట్టడం జరుగుతోంది. ఈ గణుపులు బేసిసంఖ్యలో ఉంటాయి. ఈ ధ్వజస్తంభం ఎత్తు ఎంత ఉండాలనేది నాలుగు రకాలుగా చెప్పబడింది. గోపురమంత ఎత్తు, ఆలయవిమానమంత ఎత్తు, శిఖరమంత ఎత్తు, ఆలయ పైకప్పు సమానంగా ధ్వజస్తంభం ఎత్తు ఉండవచ్చు. సాధారణంగా ఈ ధ్వజస్తంభాన్ని చందనం, దేవదారు, ఎర్రచందనం, టేకు కొయ్యతో నిర్మిస్తారు. శివాలయాలలో బలిపీఠం తర్వాత, విష్ణ్వాలయాలలో బలిపీఠానికి ముందు ధ్వజస్తంభం ఉంటుంది. శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జున స్వామి ఆలయానికి ముందు భాగంలో, వెనుకవైపు రెండు ధ్వజస్తంభాలున్నాయి. పూర్వం నాలుగుదిక్కులా నాలుగు ధ్వజస్తంభాలుండేవని శాసనాలు చెబుతున్నాయి. అమరావతి అమరేశ్వర స్వామి ఆలయంలో నలుదిక్కులా ధ్వజస్తంభాలు కనిపిస్తాయి. శ్రీరంగానికి దగ్గరలోని జంబుకేశ్వరంలో ఎనిమిది ధ్వజస్తంభాలు ఉన్నాయి. వీటిని దిక్ ధ్వజస్తంభాలంటారు. ధ్వజస్తంభ దర్శనం వలన ధర్మకార్యాచరణపై మనసు లగ్నమవుతుంది. కీర్తి, యశస్సు కలుగుతాయి. కందుకూరి వేంకట సత్యబ్రహ్మాచార్య, ఆగమ, శిల్పశాస్త్ర పండితులు -
కొమురవెల్లిలో ఘనంగా ‘పెద్దపట్నం’
కొమురవెల్లి: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లికార్జునస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా పెద్దపట్నం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో ఆలయ గర్భగుడిలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. కల్యాణ మండపం ఎదుట లింగోద్భవ కాలం అర్ధరాత్రి 1.27 నిమిషాలకు పెద్దపట్నాన్ని మైలపోలుతో ఒగ్గు పూజారులు ప్రారంభించారు. సుమారు ఐదు గంటల పాటు మల్లన్న నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం ముగిసిన వెంటనే స్వామివారి ఉత్సవ విగ్రహాలను పల్లకి సేవలో ఊరేగించారు. పెద్దపట్నం వద్ద విగ్రహాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు, శివసత్తులు పెద్దపట్నం దాటుతూ మల్లన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపట్నం దాటే సమయంలో భక్తులు ఒక్కసారిగా భారీ గేట్లపై నుంచి పెద్దపట్నం వరకు రావడంతో తోపులాట జరిగింది. దీంతో పలువురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. -
కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో దోపిడి
-
శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
-
శ్రీశైలంలో భక్తుల రద్దీ
కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ భ్రమరాంభికా సమేత మల్లికార్జున స్వామి వారి దర్శనానికి భారీగా భక్తులు తరలిరావడంతో శ్రీశైలం పుణ్యక్షేత్రం బుధవారం భక్త జనసంద్రంగా మారింది. ఉదయం నుంచే భారీగా తరలివచచిన భక్తులు పాతాళగంగలో పుణ్య స్నానం ఆచరించి తమ ఇష్ట దైవాన్ని కొలవడానికి బారులు తీరారు. రద్దీ దృష్ట్యా అప్రమత్తమైన ఆలయ అధికారులు స్వామివారి అర్జిత సేవలను రద్దు చేసి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. -
మల్లన్న హుండీ ఆదాయం 22.90లక్షలు
చేర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. ముఖ మం డపంలో ఉదయం 10 గంటల నుంచి మొత్తం 15 హుండీలను లెక్కించగా 22,90,043 ఆదాయం వచ్చింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన శ్రీసాయి సేవా సమితి సభ్యులు, పోలీసుల బందోబస్తు మధ్య హుండీలను లెక్కించారు. ఆలయ ఈఓ కాటం రాజు, ప్రత్యేక అధికారి మల్లయ్య ఆధ్వర్యంలో హుండీలను లెక్కించగా నగదు *22,90,043 వచ్చింది. మిశ్రమ బంగారం 45 గ్రాములు, మిశ్రమ వెండి రెండు కిలోల 50 గ్రాములు, 650 కిలోల బియ్యంతోపాటు 81 విదేశీ కరెన్సీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ 73 రోజు లుగా స్వామివారికి భక్తులు హుండీలలో సమర్పించిన ఆదాయమని వివరించారు. కార్యక్రమంలో ఏఈఓ అంజయ్య, సూపరింటెండెంట్లు నీల చంద్రశేఖర్, సుదర్శన్, ఆలయ సిబ్బంది, అర్చ కులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. కోడెల వేలం ఆదాయం *46,400 చేర్యాల : కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో ఆరు కోడెలకు గురువారం బహిరంగ వేలం పాట నిర్వహించినట్లు ఆలయ ఈఓ కాటం రాజు తెలిపారు. వేలం పాట ద్వారా *46,400 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు.