
సాక్షి,నంద్యాల: శ్రీశైలం మల్లన్న భక్తులకు ముఖ్యగమనిక. త్వరలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రంలో కార్తీక మహోత్సవాలు జరగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా కార్తీక మహోత్సవాల్ని పురస్కరించుకొని ఆలయంలో జరిగే గర్భాలయ అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రంలో కార్తీక మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కార్తీక మాసం సందర్భంగా దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. రద్దీ దృష్ట్యా కార్తీక మాసంలో జరిగే మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగే పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
రద్దీ రోజులలో స్వామివార్ల స్పర్శ దర్శనం నిలిపివేసి.. అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు ప్రకటించారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన, పూజలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment