Sri sailam Temple
-
విజయవాడ నుంచి శ్రీశైలానికి గంటన్నరలో వెళ్లిపోవచ్చు!
ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం కలగలసి వెలసిన మహా పుణ్యక్షేత్రం.. ఇల కైలాసం శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి అనేకమంది భక్తులు వస్తుంటారు. ఇప్పటి వరకు అటవీ ప్రాంతంలో ఘాట్ రోడ్డు మీద ప్రయాణం ప్రతి ఒక్కరికీ గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఇక నుంచి భక్తులకు సరికొత్త మధురానుభూతిని కలిగించేందుకు ‘సీ ప్లేన్’ను పర్యాటక శాఖ అందుబాటులోకి తీసుకురానుంది. నీటిలో విమానం ఎక్కి.. నీటిలోనే దిగడం ఈ సీ ప్లేన్ ప్రత్యేక. అయితే, అవసరమైనప్పుడు నేలపై కూడా సీ ప్లేన్ ల్యాండ్ అవుతుంది. విజయవాడ–శ్రీశైలం మధ్య సీ ప్లేన్ నడిపేందుకు ఈ నెల 9వ తేదీన ట్రయల్ రన్ నిర్వహించనుంది.తగ్గనున్న ప్రయాణ సమయంవిజయవాడ–శ్రీశైలం మధ్య రోడ్డు మార్గంలో సుమారు 270 కిలో మీటర్లు దూరం ఉంటుందని, సీ ప్లేన్‌లో సుమారు గంటన్నర సమయంలో చేరుకునే అవకాశం ఉంటుందని పర్యాటక శాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం 14 సీటింగ్, 19 సీటింగ్ కెపాసిటీ కలిగిన రెండు సీప్లేన్లు అందుబాటులో ఉన్నాయని, ట్రయల్ రన్ తర్వాత ఖర్చు, నిర్వహణ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎప్పటి నుంచి ప్రారంభించాలి, ఎన్ని సర్వీసులు నడపాలి, టికెట్ ఎంత వసూలు చేయాలనేది నిర్ణయిస్తామని అధికారులు తెలిపారు. తొలి దశలో విజయవాడ–శ్రీశైలం సీ ప్లేన్ విజయవంతమైతే హైదరాబాద్, బెంగళూరు తదితర నగరాల నుంచి కూడా నడిపేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.ఇదీ సీ ప్లేన్ ప్రణాళిక...సీప్లేన్ టేకాఫ్, టేకాన్‌కు నీటిలో సుమారు 1.16 కిలో మీటర్ల పొడవు, 120 మీటర్ల వెడల్పు ఉండాలి. పర్యాటకులు సీ ప్లేన్ ఎక్కేందుకు, దిగేందుకు నీటిపై ప్రత్యేక జెట్టీలు అవసరం.శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్ వద్ద గల ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో సీ ప్లేన్ ల్యాండ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ పున్నమి ఘాట్ నుంచి బయలుదేరి శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో సీ ప్లేన్ దిగుతుంది. అక్కడి నుంచి బోటులో ప్రయాణించి పాతాళగంగకు చేరుకుంటారు. పాతాళగంగ వద్ద ప్లాస్టిక్ జెట్టిపై ప్రయాణికులు దిగి రోప్‌వే ద్వారా పైకి వచ్చి శ్రీశైలం ఆలయానికి చేరుకుంటారు.తిరుగు ప్రయాణంలో మళ్లీ సీ ప్లేన్ శ్రీశైలం డ్యామ్ వెనుక భాగంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ సమీపంలో బయలుదేరి విజయవాడ పున్నమి ఘాట్‌కు చేరుతుంది. చదవండి: నా శివయ్యను దర్శనం చేసుకోనివ్వరా.. శ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం -
నా శివయ్యను దర్శనం చేసుకోనివ్వరా.. శ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం
సాక్షి, తిరుపతి : తిరుపతి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద అఘోరీ హల్చల్ చేశారు. ఆలయ అధికారులు శ్రీకాళహస్తీశ్వరాలయ దర్శనానికి అఘోరీకి అనుమతి ఇవ్వలేదు. దీంతో కోపోద్రికురాలైన అఘోరీ తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌తో ఆత్మార్పణం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నిస్తుండగా..అప్రమత్తమైన పోలీసులు ప్రమాదం నుంచి తప్పించారు. నీళ్ళు పోసి అదుపులోకి తీసుకున్న పోలీసులు బీఎన్ కండ్రిగ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
త్వరలో కార్తీక మాసం..శ్రీశైలం మల్లన్న భక్తులకు అలర్ట్
సాక్షి,నంద్యాల: శ్రీశైలం మల్లన్న భక్తులకు ముఖ్యగమనిక. త్వరలో శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రంలో కార్తీక మహోత్సవాలు జరగనున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా కార్తీక మహోత్సవాల్ని పురస్కరించుకొని ఆలయంలో జరిగే గర్భాలయ అభిషేకాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ ఆలయ ఈవో చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. నవంబర్ 2 నుండి డిసెంబర్ 1 వరకు మల్లికార్జునస్వామి పుణ్యక్షేత్రంలో కార్తీక మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కార్తీక మాసం సందర్భంగా దేవాలయానికి భక్తుల తాకిడి ఎక్కువ ఉంటుంది. రద్దీ దృష్ట్యా కార్తీక మాసంలో జరిగే మాసోత్సవాల్లో భాగంగా ఆలయంలో జరిగే పలు కార్యక్రమాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు.రద్దీ రోజులలో స్వామివార్ల స్పర్శ దర్శనం నిలిపివేసి.. అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయ అధికారులు ప్రకటించారు. రద్దీ రోజులలో మినహా మిగిలిన రోజులలో విడతల వారిగా సామూహిక అభిషేకాలు చేసుకోవచ్చని ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి అంతరాలయంలో కుంకుమార్చన, పూజలు తాత్కాలికంగా నిలుపుదల చేసినట్లు తెలిపారు. -
శ్రీశైలం దేవస్థానం పేరుతో ఫేక్ వెబ్సైట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలానికి వచ్చే భక్తులపై సైబర్ నేరగాళ్లు వల వేశారు. ఆన్లైన్లో గదుల బుకింగ్ కోసం వెతికేవారే టార్గెట్‌గా డూప్లికేట్ వెబ్సైట్లు సృష్టించి పెద్ద మొత్తంలో డబ్బులు కొట్టేస్తున్నారు. అచ్చం శ్రీశైలం దేవస్థానం అధికారక వెబ్‌సైట్‌ను పోలి ఉండే ఫేక్ వెబ్సైట్ సృష్టించారు. అందులో వివరాలు నింపగానే సంబంధిత భక్తులకు ఫోన్ చేసి.. “వసతి గది కోసం మీరు చేసుకున్న బుకింగ్ కన్ఫర్మ్ అయింది. మీరు వెంటనే మా ఫోన్ నంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ఇతర యూపీఐ పేమెంట్ ఆప్షన్లతో డబ్బు చెల్లించండి. ఆ తర్వాత మీ గది బుకింగ్ డిటెయిల్స్ పంపిస్తాం’ అంటూ సైబర్ నేరగాళ్లు రంగంలోకి దిగుతారు. పేమెంట్ చేశాక ఫేక్ బుకింగ్ నంబర్లు పంపి మోసం చేస్తున్నారు. వాస్తవానికి వసతి గది కోసం దేవస్థానం కానీ, ఇక్కడి ప్రైవేట్ సత్రాలు, ఏపీ టూరిజం వారు కానీ పేమెంట్ కోసం ఫోన్ చేయరు. పేమెంట్ అంతా ఆన్లైన్ గేట్‌వే ద్వారానే జరుగుతుంది. శ్రీశైల క్షేత్రంలో ఆర్జితసేవ టికెట్లు, వసతి గదుల విషయంలో దళారులు అధికమయ్యారు. వారికి అడ్డుకట్ట వేసేందుకు దేవస్థానం ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ (మల్లన్న స్పర్శ దర్శనం) టికెట్లను వందశాతం ఆన్లైన్ చేసింది. అలాగే వసతి గదులను సైతం ఎక్కువ శాతం ఆన్లైన్ ద్వారానే కేటాయిస్తున్నారు. ఇదే ఆసరాగా సైబర్ నేరగాళ్లు భక్తులను మోసగిస్తున్నారు. ఏపీ టూరిజంకూ తప్పని బెడద భక్తుల సౌకర్యార్థం వీఐపీ కాటేజీలు, గణేశ సదన్, మల్లికార్జున సదన్, గంగా–గౌరీ సదన్, కుమార సదన్, పాతాళేశ్వరసదన్ తదితర పేర్లతో వసతి గదులను శ్రీశైల దేవస్థానం ఏర్పాటు చేసింది. వీటి బుకింగ్ విషయంలో భక్తులకు సౌకర్యంగా ఉండేందుకు ఆన్లైన్ సదుపాయాన్ని కల్పించింది. సైబర్ నేరగాళ్లు ముఠాగా ఏర్పడి దేవస్థానం వసతి గదుల పేర్లతో సమానంగా నకిలీ వెబ్సైట్లు తయారుచేసి వాటి ద్వారా భక్తులను మోసం చేస్తున్నారు. కేవలం దేవస్థానానికి మాత్రమే కాకుండా శ్రీశైలంలో ఉన్న ఏపీ టూరిజం, శ్రీశైలంలోని ప్రైవేట్ సత్రాలకు సైతం ఫేక్ వెబ్సైట్ల బెడద తప్పడం లేదు. ఆయా సంస్థల పేరుతో నకిలీ వెబ్సైట్లు తయారు చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఫేక్ వెబ్సైట్లను ఆశ్రయించి డబ్బు చెల్లించిన భక్తులు శ్రీశైలం వచ్చి సదరు సంస్థ రిసెప్షన్లో వారికి వచి్చన మెసేజ్‌ను చూపించగా అది ఫేక్ అని తేలిపోతుండటంతో లబోదిబో మంటున్నారు. ఆ తర్వాత గదులు దొరకక ఇబ్బందులు పడుతున్నారు. సైబర్‌క్రైం పోలీసులు నకిలీ ఐడీలపై విచారణ చేయగా రాజస్థాన్, జైపూర్ వాటిని ఆపరేట్ చేస్తున్నట్లుగా గుర్తించారు. అసలైన వెబ్సైట్లను గుర్తించండిలా.. శ్రీశైల దేవస్థానం అధికారికంగా www.srisailadevasthanam.org (డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.శ్రీశైలదేవస్థానం.ఓఆర్జీ) వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. ఈ వెబ్సైట్ ద్వారా ఆర్జితసేవలు, దర్శనం టికెట్లు, వసతి గదులు పొందవచ్చు. అలాగే aptemples.ap.gov.in (ఏపీటెంపుల్స్.ఏపీ.జీవోవీ.ఇన్) ద్వారా కూడా లాగిన్ అయి శ్రీశైల దేవస్థానం వెబ్సైట్లోకి వెళ్లి తమకు కావాల్సిన సేవలను, వసతి గదులను పొందవచ్చు.అలాగే srisailadevasthanam (శ్రీశైలదేవస్థానం) మొబైల్ యాప్‌ను ప్లే స్టోర్ ద్వారా ఇన్స్టాల్ చేసుకుని తద్వారా ఆయా సేవలను పొందవచ్చు. భక్తులు అప్రమత్తంగా ఉండాలి శ్రీశైల దేవస్థాన వెబ్సైట్లను పోలిన నకిలీ వెబ్సైట్ల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలి. కంప్యూటర్‌పై పరిజ్ఞానం ఉన్నవారు మాత్రమే స్వయంగా వసతి, ఆర్జిత సేవా టికెట్లను పొందాలి. కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు కంప్యూటర్ సెంటర్లను ఆశ్రయించి ఆయా సేవలను పొందితే ఫేక్ ఐడీల బారిన పడకుండా ఉండవచ్చు. – డి.పెద్దిరాజు, శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి -
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో శ్రీశైలం దేవస్థానం
-
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం దేవస్థానం
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థానానికి లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించినట్లు ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ తెలిపారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. దీనికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని దేవస్థానం ఈవోకి అందజేశారు. ఆలయ ఈవో డి.పెద్దిరాజు మాట్లాడుతూ శ్రీశైల క్షేత్ర ప్రత్యేకతలను వివరించారు. శ్రీశైలక్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలసిన క్షేత్రం కావడం, ప్రధానాలయ విస్తీర్ణం, ప్రధాన ఆలయాల ఎత్తు, వెడల్పు, ప్రధానాలయం చుట్టూగల అరుదైన శిల్పప్రాకారం, క్షేత్రంలోని ప్రాచీన కట్టడాలు, నందీశ్వరుడు సైజు, ఆలయ నిర్మాణం మొదలైన అంశాల ఆధారంగా శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో చేర్చినట్లు ఉల్లాజి ఇలియాజర్ చెప్పారు. దక్షిణ భారత్‌లో ఈ తరహా క్షేత్రాలు ఉంటే 9000798123 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. -
శ్రీశైలం మల్లన్న సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (ఫొటోలు)
-
'ఆయనను రాజకీయ క్వారంటైన్‌కు తరలించారు'
సాక్షి, కర్నూలు: రాజకీయ నిరుద్యోగిగా ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అప్పుడప్పుడు తన ఉనికి కోసమే మీడియా ముందుకు వచ్చి అసత్య ఆరోపణలు చేస్తుంటాడని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అక్రమాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు కోట్ల రూపాయలు అవినీతి, అక్రమాలపై పోలీసులు విచారణ చేస్తుంటే దానిని బూతద్దంలో చూస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చిన్న మెదడు చిట్లిపోయి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. చదవండి: శ్రీశైలం నిధుల స్వాహా కేసులో మరికొందరి హస్తం అవినీతి, అక్రమాస్తుల కబ్జాలు చేసిన వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం. బైరెడ్డి ఎప్పడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదు. బహుశా ఆయనకు కూడా తెలియదు. చంద్రబాబు ధోరణిలోనే అడ్డగోలు విమర్శలు చేయడం ఈయనకి వంటపట్టిందన్నారు. చదవండి: వ్యర్థాల నిర్వహణకు 'ఆన్లైన్' వేదిక ప్రారంభం బైరెడ్డిని కర్నూలు జిల్లా ప్రజలు రాజకీయ క్వారంటైన్‌కు తరలించారన్న సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి. తిరుపతి దేవస్థానం భూములపై ఆనాడు మాట్లాడని బైరెడ్డి ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకొని లేని ఆరోపణలు చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు, రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై పోరాటం వంటి ఆలోచనలు చేయాలి తప్ప మరో విధంగా మాట్లడితే రాజకీయంగా బుద్ధి చెబుతాం అంటూ పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని హెచ్చరించారు. చదవండి: 'కెలికి తిట్టించుకోవడం బాబుకు అలవాటే' -
మహా శివరాత్రి బ్రహ్మోత్సవం
-
ముగ్ధ మనోహరం
శ్రీశైలం: శ్రీగిరి కొండల్లో వెలసిన భ్రమరాంబా సమేత శ్రీమల్లికార్జున స్వామిఅమ్మవార్లు గురువారం రాత్రి మయూర వాహనంపై ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు ఓం హర శంభోశంకరా... శ్రీశైల మల్లన్నా పాహిమాం.. పాహిమాం అంటూ పురవీధుల్లో సాగిలపడ్డారు. ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో ఉత్సవ మూర్తులను మయూర వాహనంపై ఉంచి వేదమంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా వాహన పూజలను నిర్వహించారు. అనంతరం వాహన సమేతులైన శ్రీ స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రాంగణం నుంచి ఊరేగిస్తూ కృష్ణదేవరాయుల గోపురం మీదుగా రథశాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, బయలువీరభద్రస్వామి మండపం చేరుకొని తిరిగి రాత్రి 9.30 గంటలకు ఆలయ ప్రాంగణం చేరింది. ఈ గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించి పునీతులయ్యారు . ఈ కార్యక్రమంలో ఈఓ శ్రీరామచంద్రమూర్తి, ట్రస్ట్‌బోర్డ్ చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, సభ్యులు చిట్టిబొట్ల భరధ్వాజశర్మ, చాటకుండ శ్రీనివాసులు,మాజి ఈఓ శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేటి రాత్రి వరకే మల్లన్న స్పర్శదర్శనం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం రాత్రి వరకు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. శనివారం తెల్లవారుజాము నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు మల్లికార్జునస్వామివార్ల అలంకార (దూర) దర్శనాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. శివస్వాములు, సాధారణ భక్తజనంతో పాటు వీఐపీలు, వీవీఐపీలకు కూడా మల్లన్న స్పర్శదర్శనం శివరాత్రి ముగిసే వరకు ఉండదని పేర్కొన్నారు. పట్టు వస్త్రాలు సమర్పించిన కాణిపాక దేవస్థానం: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శివరాత్రి పర్వదినాన జరిగే స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవానికి కాణిపాకవరసిద్ది వినాయక దేవస్థానం తరపున గురువారం ఉదయం పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకం దేవస్థానం ఈఓ పూర్ణచంద్రారావు, అర్చక వేదపండిత బృందం స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు, ఫలపుష్పాదులకు శాస్త్రోక్త పూజలు చేసి స్వామిఅమ్మవార్లకు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకటరావు శుక్రవారం సాయంత్రం సంప్రదాయానుసారం పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. ఆకట్టుకున్నసాంస్కృతిక ప్రదర్శనలు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల కోసం దేవస్థానం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు ఉషాబృందం వారి భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు, గాయకులు కొండూరు నిహాల్, పాడుతా తీయగా విజేతలు శ్రీప్రణతి, సాయి రమ్య, లక్ష్మీమేఘన, ప్రణవ్, చేతన్, లాస్య ప్రియ, జి.సరిగమ విజేత దివ్య మాలిక, బోల్‌బేబీ బోల్ విజేత అఖిల్, శర్మిషలు ఆలపించిన భక్తి గేయాలు భక్తులకు వీనులవిందయ్యాయి. అలాగే శివదీక్షా శిబిరాల వద్ద వినాయక నాట్య మండలి వారి సతీఅనసూయ నాటక ప్రదర్శన శ్రీశైలం ప్రాజెక్ట్ కె. ప్రసాద్‌రావు బృందం వారి మోహిని భస్మాసుర, శ్రీశైలం రాములు నాయక్ బృందం వారి నాటక ప్రదర్శనలు అర్ధరాత్రి వరకు భక్తులను అలరించాయి. మాఘమాసంలో శివుడిని బిల్వదళాలతో పూజించిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో ఉంది. దీంతో మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినం రోజున ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలసిన శ్రీశైలమల్లికార్జునస్వామివార్లను అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీభ్రమరాంబాదేవిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి పాదయాత్రతో భక్తులు చేరుకుంటుంటారు. శ్రీశైల మల్లికార్జునస్వామిని శక్తికొలది బిల్వపత్రాలతో, అడవిలో కోసుకొచ్చిన పూలు, పత్రిని సమర్పించి తమ కోర్కెలను చెప్పుకుంటారు. మహాశివరాత్రి పర్వదినం నాడు స్వామివార్ల పాగాలంకరణ దర్శనం చేసుకుని బ్రహ్మోత్సవ కల్యాణాన్ని వీక్షించి, ఆ తరువాత రోజు జరిగే మల్లన్న రథోత్సవ వేడుకను కనులారా తిలకించి తిరుగు ప్రయాణమవుతారు. నేడు శ్రీశైలంలో... మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను రావణవాహనంపై ఆవహింపజేసి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. వాహన సమేతులైన స్వామిఅమ్మవార్లను రథశాల నుంచి నందిమండపం, అంకాలమ్మగుడి, బయలువీరభద్రస్వామిఆలయం వరకు ఊరేగిస్తారు. ప్రత్యేక పూజలలో భాగంగా శుక్రవారం ఉదయం 7.30గంటలకు నిత్యహోమ బలిహరణలు, జపానుష్ఠానములు, నిర్వహిస్తారు ఆ తర్వాత శ్రీ స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు చేస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి నిత్యపూజలు, అనుష్ఠానములు, నిత్యహవనములు, బలిహరణలను సమర్పిస్తారు. శివ పూజా ఫలితం ఇలా.. ♦ చైత్రమాసంలో శివుని నృత్యగీతాలతో సేవిస్తూ దర్భపూలతో పూజిస్తే బంగారం లభిస్తుంది. ♦ వైశాఖమాసంలో శివున్ని నేతితో అభిషేకించి,తెల్లమందారాలతో పూజిస్తే అశ్వ మేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది. ♦ జ్యేష్ట మాసంలో పెరుగుతో అభిషేకించి, తామర పూలతో పూజించిన వారు ఉత్తమ గుణాలను పొందుతారు. ♦ ఆషాఢమాసంలో స్వామికి గుగ్గిలంతో ధూపం వేసి, పొడవాటి తొడిమలు గల పూలతో పూజిస్తే బ్రహ్మాలోకప్రాప్తి కలుగుతుంది. ♦ శ్రావణమాసంలో ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రివేళలో ఉపవాసం ఉంటూ, గన్నేరు పూలతో శివున్ని పూజించిన వారికి వేయి గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది. ♦ భాద్రాపదమాసంలో ఉత్తరేణి పూలతో శివున్ని పూజించినవారు మరణాంతరం రుద్రలోకానికి చేరుకుంటారు. ♦ ఆశ్వీయుజమాసంలో జిల్లేడు పూలతో శివున్ని అర్చించిన వారు శివలోకాన్ని పొందుతారు. ♦ కార్తీకమాసంలో శివున్ని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించినవారు శివసాన్నిధ్యానికి చేరుకుంటారు. ♦ మార్గశిరమాసంలో పొగడపూలతో పూజించిన వారు కైలాసాన్ని చేరుకుంటారు. ♦ పుష్యమాసంలో శివున్ని ఉమ్మెత్త పూలతో పూజించిన వారు పరమపదాన్ని పొందుతారు. పూలు – ఫలం ♦ పొగడ శివానుగ్రహం ♦ గన్నేరు ధనం ♦ జిల్లేడు సిరిసంపదలు ♦ ఉమ్మెత్త మోక్షం ♦ నల్లకలువ సుఖ సంతోషాలు ♦ ఎర్రతామర రాజ్యాధికారం ♦ తెల్లతామర ఉన్నతమైనపదవులు ♦ సంపెంగ కోరిన కోరికలు ♦ తెల్లజిల్లేడు అనుకున్న పనులు ♦ బ్రహ్మచారులు సన్నజాజి పూలతో శివున్ని పూజిస్తే గుణవంతురాలైన కన్యతో వివాహం ♦ ముత్తైదువులు గరికపూలతో పూజిస్తే ఐదోతనం వృద్ధి ♦ మల్లెపూలతో శివలింగాన్ని పూజిస్తే లౌకిక విద్యలు,ఆధ్యాత్మిక విద్యలు ♦ కడిమి పూలతో శివున్ని పూజించిన విజయం ♦ దర్భపూలతో పూజలు చేస్తే ఆరోగ్యం ♦ బిల్వదళాలతో పూజిస్తే దారిద్య్రం తొలగి,సకల కోరికలు సిద్ధిస్తాయి. ♦ ఏ పూలతో పూజించినా శివపూజలో చిత్తశుద్ధి ముఖ్యం 3 నుంచి శ్రీశైలానికి బైక్‌లు, ఆటోలు నిషేధం ఆత్మకూరురూరల్: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం ఘాట్ రోడ్లో వాహనాల రాకపోకలపై పోలీస్, రవాణా శాఖ అధికారులు నియంత్రణ విధించారు. ఈమేరకు గురువారం ఆత్మకూరు సీఐ బత్తల కృష్ణయ్య తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీశైలం యాత్రికులకు పలు సూచనలు చేశారు. మార్చి 3వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలోని దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్లో బైక్‌లు, ఆటోలను నిషేధించినట్లు తెలిపారు. సరుకు రవాణా చేసే వాహనాలలో ప్రయాణం చట్ట విరుద్ధమని, ఈ వాహనాలను కూడా శ్రీశైలానికి అనుమతించడం లేదని ఆయన స్పష్టం చేశారు. మహాశివరాత్రి రోజున మార్చి 4న సాయంత్రం 6 గంటల నుంచి దోర్నాల నుంచి శ్రీశైలానికి పూర్తిగా వాహనాల నిషేధం అమలులో ఉంటుందన్నారు. పాగాలంకరణ తరువాత శ్రీశైలం నుంచి దిగువకు వచ్చే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎగువకు వాహనాలను నిషేధించామన్నారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బైర్లూటీ లో వాహనాలను నిలిపివేస్తామన్నారు. సమావేశంలో ఆత్మకూరు ఎస్ఐ రమేష్ కూడా ఉన్నారు. -
బ్రహ్మోత్సవం.. కనిపించని భక్తజనం
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 25 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కాగా గడిచిన నాలుగైదు రోజుల నుంచి శివరాత్రి భక్తుల హడావిడే కనిపించడంలేదు. సా«ధారణంగా ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగానే భక్తుల తాకిడి మొదలవుతోంది. ఉత్సవాలు ఆరంభమైన 4వ రోజుకే శ్రీశైలం అంతా భక్త జనసంద్రంగా మారుతోంది. ఇదంతా ఊహించుకుని దేవస్థానం అధికారులు మహాశివరాత్రి పర్వదినానికి మూడు రోజుల ముందుగానే స్పర్శదర్శనాన్ని నిలిపివేస్తామని ప్రకటించారు. అయితే ఈ ఏడాది భక్తుల రద్దీ ఊహించినంత మేర లేకపోవడంతో శుక్రవారం రాత్రి 7.30 వరకు గర్భాలయ దర్శనాలను అనుమతించాలనే నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో ట్రస్ట్‌బోర్డు సమావేశంలో ఫిబ్రవరి 28 వరకు ఇరుముడు స్వాములకు స్పర్శదర్శనాన్ని అనుమతించాలని రద్దీకి అనుగుణంగా భక్తుల మనోభావాలనుసరించి మార్చి 1 వరకు ఏర్పాటు చేయాలని చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, సభ్యులు తీర్మానించారు. కాని ఊహించినంతగా భక్తుల రద్దీ కనపడకపోవడం చంద్రావతి కల్యాణ మండపం నుంచి ప్రారంభమైన శివదీక్షా స్వాముల క్యూ ఇప్పటి వరకు పూర్తిగా నిండిన రోజే లేకపోవడం గమనార్హం. ఫిబ్రవరి 28 వరకే ఇరుముడి స్వాములకు గర్భాలయ దర్శనం ఉంటుందని ప్రచారం జరగడం ఒక కారణం కాగా, స్పర్శదర్శనానంతరం తమ తమ గ్రామాలకు చేరుకుని మహాశివరాత్రిన తమ స్వగ్రామంలోని శివాలయల్లో దీక్షా విరమణ చేయవచ్చునని కుటుంబ సభ్యులతో కలిసి ఉండవచ్చుననే ఆలోచనతో చాలా మంది స్వాములు ఇళ్లకు వెళ్తున్నట్లు తెలుస్తుంది. బోసిపోయిన నల్లమల దారులు.. గత ఏడాది ఉత్సవాల ఆరంభమైనన రెండవ రోజు నుంచే రద్దీ ప్రారంభం అయ్యేది. కనీసం 50 నుంచి 80 వేల వరకు దర్శించుకునే వారు. అయితే ఈ ఏడాది స్వామిఅమ్మవార్లను ఉత్సవాలు ఆరంభమైన నాటి నుంచి కూడా ప్రతి రోజూ 25 వేల నుంచి 30 వేలకు మించి దర్శనాలు జరగలేదనే అభిప్రాయాన్ని ఆలయ అధికారులు, సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. అలాగే నాగలూటి, పెచ్చెర్వు, భీమునికొలను, కైలాసద్వారం ద్వారా శ్రీశైలం చేరుకుని పాదయాత్ర భక్తుల సంఖ్యకూడా గణనీయంగా తగ్గినట్టు కన్పిస్తుంది. ఈ ఏడాది సోమవారం మహాశివరాత్రి పర్వదినం రావడంతో శుక్రవారం నుంచి రద్దీ పెరిగే అవకాశం ఉంది. రఅన్నదాన కేంద్రాలు ఖాళీ సాధారణంగా ఉదయం 10.30 వరకు దేవస్థానం అన్నపూర్ణభవన్‌లో స్వాములకు, శివస్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తారు. అనంతరం 11.30 గంటల నుంచి సాంబార్ అన్నం, పెరుగన్నం,సాధారణభక్తులకు భోజన సౌకర్యం కల్పిస్తుంటారు. అయితే వండుతున్న పదార్ధాలు కూడా మిగిలే పరిస్థితి నెలకొని ఉండడంతో అన్నపూర్ణభవన్ అధికారులు వృధాను నియంత్రించడం కోసం రద్దీకి అనుగుణంగా అప్పటికప్పుడు వంటలు తయారు చేస్తున్నారు. 3 తర్వాతనే బందోబస్తు.. రాష్ట్ర ముఖ్యమంత్రి కర్నూలు పర్యటన మార్చి 2కు వాయిదా పడడంతో శ్రీశైలానికి చేరాల్సిన బందోబస్తు సిబ్బంది సీఎం పర్యటనకు కేటాయించినట్లు తెలుస్తోంది. మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పూర్తి స్థాయి బందోబస్తు ఉండే అవకాశం ఉంది. పరీక్షలతోనే రద్దీ తగ్గుదల బ్రహ్మోత్సవాల్లో రద్దీ తగ్గడానికి ఇప్పటికే ఇంటర్ మీడియట్, పరీ క్షలు ప్రారంభం కావడంతో మరో 2 వారాల తరువాత 10వ తరగతి పరీక్షలు కూడా ఉండడంతో రద్దీ తగ్గడానికి ఈ పరీక్షలు కూడా ఓ కారణమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. సాధారణంగా శివరాత్రి వరకు ఇక్కడే శివ స్వాములు.. ఈ ఏడాది తమ పిల్లలకు పరీక్షలు ఉండటంతో ఇరుముడులను సమర్పించుకుని స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. -
హరహర మహదేవ
శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో స్వయంభుగా వెలసిన అఖిలాండ నాయకుడైన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి వార్ల బ్రహ్మోత్సవాలు సోమవారం యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్నాయి. ఉదయం 7.47 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహ వాచనము,శివసంకల్పం, చండీశ్వర పూజ, రుత్విగ్వరణము కార్యక్రమాలుంటాయి. ఆ తరువాత అఖండ స్థాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, పంచావరణార్చన, మండపారాధన, రుద్ర కలశ స్థాపన పూజలను నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నుంచి అంకురార్పణ, అగ్ని ప్రతిష్ఠాపన, రాత్రి ఏడు గంటలకు త్రిశూలపూజ, భేరీపూజ, సకల దేవతాహ్వాన పూర్వక ధ్వజారోహణ, ధ్వజ పటావిష్కరణ, బలిహరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు మార్చి 7 వరకు కొనసాగుతాయి. 4న బ్రహ్మోత్సవ కల్యాణం బ్రహ్మోత్సవాలలో భాగంగా మార్చి 4న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లకు రాత్రి 7గంటల నుంచి నందివాహనసేవ, ఎదుర్కోలు ఉత్సవం ఉంటాయి. రాత్రి 10గంటల నుంచి లింగోద్భవకాల మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, 10.30 నుంచి పాగాలంకరణ, రాత్రి 12 గంటల తరువాత శాస్త్రోక్తంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల బ్రహ్మోత్సవ కల్యాణాన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే సంప్రదాయానుసారం ఈ నెల 28న తిరుమల తిరుపతి దేవస్థానం, మార్చి 1న రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణానికి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. విద్యుత్ దీపాల అలంకరణలో గంగాధర మండప కూడలి బ్రహ్మోత్సవాలలో వాహనసేవలు 26న స్వామిఅమ్మవారు భృంగివాహనంపై దర్శనమిస్తారు. 27న హంసçవాహనం, 28న మయూర వాహనం, మార్చి 1న రావణవాహనం, 2న పుష్పపల్లకీ మహోత్సవం, 3న గజవాహనం, 4న ప్రభోత్సవం, నందివాహనసేవ, 5న రథోత్సవం, 6న పూర్ణాహుతి, ధ్వజావరోహణ, 7న అశ్వవాహన సేవలు ఉంటాయి. 5న రథోత్సవం మహాశివరాత్రి పర్వదినాన వధూవరులయ్యే శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి వార్లను మార్చి 5న రథంపై ఆవహింపజేసి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అలాగే రాత్రి 8 గంటలకు తెప్పోత్సవం ఏర్పాటు చేశారు. దీనికి ముందు రోజు చండీశ్వరుడి ప్రభోత్సవం ఉంటుంది. మార్చి 6న ఉదయం 9.30 గంటలకు రుద్ర, చండీహోమాలకు పూర్ణాహుతి నిర్వహించి.. వసంతోత్సవం, కలశోద్వాసన, త్రిశూల స్నానం తదితర విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి 7.30 గంటలకు ధ్వజపటాన్ని అవరోహణ చేస్తారు. 7వ తేదీన శ్రీభ్రమరాంబామల్లికార్జున స్వామివార్లకు పుష్పోత్సవ, శయనోత్సవ, ఏకాంత సేవలు నిర్వహిస్తారు. -
మల్లన్న సన్నిధిలో అపచారం
కర్నూలు, శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత పెంపొందించేందుకు నిత్య పూజలు జరిగేలా ఈఓ చర్యలు తీసుకుంటుండగా కొందరు ఆలయ అర్చకుల ప్రవర్తన ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా మారింది. ఇటీవల చోటు చేసుకున్న ఘటన ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. మల్లన్న ఆలయ ఆవరణలోనే కొందరు అర్చకులు ఓ పరిచారకుడిని పీఠాధిపతిగా వేషధారణ చేయించి పూల కిరీటం, చేతిలో కమండలం, త్రిశూలం మొదలైన వాటిని అలంకరింప జేశారు. అంతటితో ఊరుకోకుండా వామనావతారం తరహాలో గొడుగు పట్టి, ప్రసాదం సమర్పించారు. అనంతరం అమ్మవారి అలంకార మండపం వద్ద కూర్చొబెట్టి పీఠాధిపతి తరహాలో సేవలు చేశారు. ఈ తతంగమంతా శ్రీభ్రమరాంబాదేవి ప్రధానార్చకులు సన్నిధిలో జరిగినట్లు తెలుస్తోంది. అలాగే అమ్మవారి సేవకు ఉపయోగించే పూజా సామగ్రి వినియోగించినట్లు సమాచారం. ఆ సంఘటనను వీడియో తీసి సన్నిహితులకు పంపడంతో వైరల్‌గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై భక్తులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. పవిత్ర క్షేత్రంలో ఇలాంటి పిచ్చి చేష్టలకు పాల్పడం అర్చకులకు తగదని విమర్శిస్తున్నారు. ఈ తతంగమంతా ఈఓ శ్రీరామచంద్రమూర్తి దృష్టికి వెళ్లడంతో ఆ సదరు పరిచారకున్ని తొలగించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అతనితో పాటు అర్చక పరిచారకులపై కూడా వేటు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విచిత్ర వేషధారణ యువకుడు ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కుమారడని సమాచారం. -
మల్లన్న సేవలో రేవంత్‌రెడ్డి
శ్రీశైలం: శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని తెలంగాణ టీడీపీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా మంగళవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం అధికారులు ప్రధాన రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం అధికారులు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
పర్యాటకం వెలవెల
కర్నూలు(అగ్రికల్చర్): శ్రీకృష్ణదేవరాయల కాలంలో రతనాలను రాశులుగా పోసి అమ్మిన నేల ఇది. ఇక్కడే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చేతిలో కాలజ్ఞానం పురుడు పోసుకుంది. తాళ్లపాక అన్నమాచార్యుల నోటి వెంట పదకవితలు జాలువారాయి. బ్రిటీష్ దురహంకారానికి వ్యతిరేకంగా గర్జించిన రేనాటి సింహం ఇక్కడి వాడే.. ఇలా చెప్పుకుంటూ పోతే కర్నూలు జిల్లాకు చెందిన విశేషాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని భావితరాలకు అందించి వారిలో స్ఫూర్తి కలిగించేందుకు ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. జిల్లాలో ప్రసిద్ధ ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంలో పాలకులు విఫలమవుతున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పురావస్తు కట్టడాల పరిరక్షణకు రూ. 100 కోట్లు కేటాయించింది. అయితే ఈ నిధులు ఏమూలకు సరిపోవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పర్యాటక అభివృద్ధికి కృషి చేయాల్సి ఉంది. ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలు ఇవే.. * జిల్లాలో శ్రీశైలం దేవాలయం, మహానంది, ఆహోబిలం, కొండారెడ్డి బురుజు.. తదితర కట్టడాలు చాలా పురాతనమైనవి. వీటి సందర్శనకు ప్రతి రోజు వందల మంది వస్తుంటారు. * డోన్ మండలం ఎస్.గుండాల చెన్నకేశవ స్వామి ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. అక్కడ ‘లేపాక్షి’ తరహా కట్టడాలు ఉన్నాయి. * జిల్లాలో మూడు ప్రాచీన సూర్య దేవాలయాలు ఉన్నాయి. నందికొట్కూరులోని రాజావీధి, అవుకు మండలంలోని శివవరం, గడివేముల మండలంలోని గని గ్రామంలో ఉన్నాయి. వీటి అభివృద్ధి నామమాత్రంగానే ఉంది. * కొలనుభారతిలో సరస్వతి అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్ర అభివృద్ధికి అధికారులు ఎన్నోసార్లు ప్రతిపాదనలు పంపినా ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. * ప్యాపిలి మండలం బోయవాండ్లపల్లిలో బెలుం గుహలకు మించిన వాల్మీకి గుహలు ఉన్నాయి. అద్భుతమైన జలపాతాలతోపాటు ఎన్నో ప్రకృతి సౌందర్యాలు ఉన్నాయి. దీన్ని పర్యాటక పరంగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. * మద్దిలేటి స్వామి దేవస్థానం, మహనంది క్షేత్రం, పెద్దతుంబలం రామాలయం, కొలను భారతి అభివృద్ధికి 13వ ఆర్థిక సంఘం నిధుల కోసం ప్రతిపాదనలు పంపినా అవి మరుగున పడిపోయాయి. * జిల్లాను ఏకో టూరిజంగా అభివృద్ధి చేసేందుకు నల్లమల, సుద్దమల అడవులు విస్తారంగా ఉన్నాయి. విజయవాడకు వెళ్లిన శిల్పారామం... జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి 2009 నుంచి 2014 వరకు ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు ప్రభుత్వ నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. పర్యాటక శాఖ అధికారులు ఏటా ప్రతిపాదనలు పంపుతున్నా.. అవన్నీ బుట్టదాఖలవుతున్నాయి. కర్నూలు శివారులోని జగన్నాథగట్టులో 40 ఎకరాల్లో మినీ శిల్పారామం నెలకొల్పాలనే ప్రతిపాదనలు ఉన్నా మరుగున పడిపోయాయి. అయితే కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధుల చొరవతో విజయవాడలో శిల్పారామం ఏర్పాటవుతోంది. కొండారెడ్డి బురుజుపై ఎగరని జాతీయ పతాకం..! కర్నూలు నగరం నడిబొడ్డున ఉన్న కొండారెడ్డి బురుజుకు విద్యుత్ అలంకరణ చేయడానికి, శాశ్వత జాతీయ పతాకం ఏర్పాటుకు సంబంధించి కొన్నేళ్లుగా ప్రతిపాదనలు ఉన్నాయి. 168 అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇది ఏర్పాటు అయితే శాశ్వత జాతీయ పతాకాల్లో ఐదోది అవుతుంది. అయితే ఇందుకు కేంద్ర పురావస్తు శాఖ అనుమతి ఇవ్వాల్సి ఉంది. ప్రతిపాదనలు పంపి ఏళ్లు గడుస్తున్నా.. ఫలితం లేకుం డా పోయింది. కొండారెడ్డి బురుజును విజయనగరం రాజులు నిర్మించారు. ఇది అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రగతి ప్రతిపాదనలకే పరిమితం.. పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపితే వెంటనే నిధులు మంజూరు చేస్తామని గతంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా చిరంజీవి ప్రకటించారు. జిల్లా అధికారులు రూ.35.72 కోట్లతో ప్రతిపాదనలు పంపగా ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదు. అలాగే సాధారణ ఎన్నికలకు ముందు కర్నూలు శివారులోని విజయవనం, కొండారెడ్డి బురుజు, గోల్గుంబజ్, జగన్నాథ గట్టు అభివృద్ధికి రూ.4.17 కోట్లు మంజూరయినట్లు ప్రకటించారు. ఆలోపే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో నిధుల విడుదల ఆగిపోయింది. రాష్ర్టంలో పర్యాటక శాఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ దగ్గరే ఉంచుకున్నారు. సీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి ఆయన కృషి చేయాల్సి ఉంది. ప్రతిపాదనలకే పరిమితం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి 2008లో రూ.70 లక్షలు విడుదల అయ్యాయి. ఆ తరువాత ఇప్పటి వరకు నిధులు రాలేదు. 2009 నుంచి 2012 వరకు పలుసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రయోజనం లేకుండా పోయింది. పర్యాటక రంగం అభివృద్ధి కోసం కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇటీవల ప్రతిపాదనలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంతవరకు ప్రతిపాదనలు పంపాలని ఎవరూ కోరలేదు. - వెంకటేశ్వర్లు, జిల్లా పర్యాటక శాఖ అధికారి