
శ్రీశైలం: శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని తెలంగాణ టీడీపీ కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా మంగళవారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఆయనకు దేవస్థానం అధికారులు ప్రధాన రాజగోపురం వద్ద ఆలయ మర్యాదలతో ఆహ్వానం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానం అధికారులు స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.