
శిల్ప ప్రాకారం, ప్రాచీన కట్టడాలు తదితర అంశాల ఆధారంగా ఎంపిక
శ్రీశైలం టెంపుల్: శ్రీశైలం దేవస్థానానికి లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం కల్పించినట్లు ఆ సంస్థ దక్షిణ భారత ప్రాంతీయ విభాగపు సంయుక్త కార్యదర్శి డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ తెలిపారు. శుక్రవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
దీనికి శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో డాక్టర్ ఉల్లాజి ఇలియాజర్ సంబంధిత ధ్రువీకరణ పత్రాన్ని దేవస్థానం ఈవోకి అందజేశారు. ఆలయ ఈవో డి.పెద్దిరాజు మాట్లాడుతూ శ్రీశైల క్షేత్ర ప్రత్యేకతలను వివరించారు.
శ్రీశైలక్షేత్ర ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలగలసిన క్షేత్రం కావడం, ప్రధానాలయ విస్తీర్ణం, ప్రధాన ఆలయాల ఎత్తు, వెడల్పు, ప్రధానాలయం చుట్టూగల అరుదైన శిల్పప్రాకారం, క్షేత్రంలోని ప్రాచీన కట్టడాలు, నందీశ్వరుడు సైజు, ఆలయ నిర్మాణం మొదలైన అంశాల ఆధారంగా శ్రీశైల ఆలయాన్ని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ జాబితాలో చేర్చినట్లు ఉల్లాజి ఇలియాజర్ చెప్పారు. దక్షిణ భారత్‌లో ఈ తరహా క్షేత్రాలు ఉంటే 9000798123 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment