సాక్షి, కర్నూలు: రాజకీయ నిరుద్యోగిగా ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అప్పుడప్పుడు తన ఉనికి కోసమే మీడియా ముందుకు వచ్చి అసత్య ఆరోపణలు చేస్తుంటాడని వైఎస్సార్‌సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అక్రమాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు కోట్ల రూపాయలు అవినీతి, అక్రమాలపై పోలీసులు విచారణ చేస్తుంటే దానిని బూతద్దంలో చూస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చిన్న మెదడు చిట్లిపోయి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. చదవండి: శ్రీశైలం నిధుల స్వాహా కేసులో మరికొందరి హస్తం
అవినీతి, అక్రమాస్తుల కబ్జాలు చేసిన వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం. బైరెడ్డి ఎప్పడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదు. బహుశా ఆయనకు కూడా తెలియదు. చంద్రబాబు ధోరణిలోనే అడ్డగోలు విమర్శలు చేయడం ఈయనకి వంటపట్టిందన్నారు. చదవండి: వ్యర్థాల నిర్వహణకు 'ఆన్‌లైన్' వేదిక ప్రారంభం
బైరెడ్డిని కర్నూలు జిల్లా ప్రజలు రాజకీయ క్వారంటైన్‌కు తరలించారన్న సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి. తిరుపతి దేవస్థానం భూములపై ఆనాడు మాట్లాడని బైరెడ్డి ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకొని లేని ఆరోపణలు చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు, రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై పోరాటం వంటి ఆలోచనలు చేయాలి తప్ప మరో విధంగా మాట్లడితే రాజకీయంగా బుద్ధి చెబుతాం అంటూ పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment