BY ramaiah
-
వరుస దాడులు..భయాందోళనలో ప్రజలు..
-
కర్నూలు లోక్‌సభ సమన్వయకర్తగా బీవై రామయ్య
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెండు పార్లమెంట్ స్థానాలకు, ఒక అసెంబ్లీ స్థానానికి వైఎస్సార్సీపీ సమన్వకర్తలను నియమించింది. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి బీవై రామయ్య, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి రాపాక వరప్రసాదరావు, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గానికి గొల్లపల్లి సూర్యారావులను సమన్వయకర్తలుగా నియమించారు. -
గుమ్మనూరు జయరాం రాజీనామాపై కర్నూలు మేయర్ స్ట్రాంగ్ రియాక్షన్
-
న్యాయ రాజధాని కోసం ‘సీమ’లో మళ్లీ ఉద్యమం
కర్నూలు ప్రాంతం దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటు చేయతలపెట్టింది. 2019లోనే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టినా కొన్ని విపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి, మరోమారు ‘సీమ’ను దగా చేసే యత్నానికి ఒడిగట్టాయి. ఈ క్రమంలో ‘సీమ’ వాసులు మళ్లీ గళమెత్తుతున్నారు. ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు ఈ నెల 15న కర్నూలు వేదికగా సమావేశం కానున్నారు. సాక్షి, కర్నూలు: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత కర్నూలే రాష్ట్ర రాజధాని.. ఆపై హైదరాబాద్‌కు తరలించారు. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ప్రతి రాజకీయపార్టీ ‘సీమ’లో ప్రాబల్యం కోసం దీన్ని రాజకీయ అస్త్రంగా వాడుకోవడం మినహా చిత్తశుద్ధి చూపలేదు. ఈ క్రమంలో 2014లో తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్ దూరమైంది. దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి జరిగింది. ఫార్మా, ఐటీలతో పాటు అన్ని రకాల పరిశ్రమలు హైదరాబాద్ సమీపంలోనే స్థాపించారు. విద్యా, వైద్యంతో పాటు ఏ అవసరమున్నా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితిని పాలకులు కల్పించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరబాద్ దూరం కావడంతో రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు లేకుండా పోయింది. ఈ అనుభవంతో 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. దీన్ని చంద్రబాబు విస్మరించారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ, విశాఖను పాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతిని శాసన రాజధానిగా చేస్తూ బిల్లు ప్రవేశపెట్టింది. హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త తీసుకుంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. అన్ని ప్రాంతాలను ప్రభుత్వం సమానంగా భావిస్తోందనే చర్చ మొదలైంది. ‘సీమ’కు ద్రోహం చేసేలా రాజకీయపార్టీల వైఖరి ప్రభుత్వ ప్రకటన తర్వాత ఒక్కసారిగా విపక్ష పార్టీలు స్వరం మార్చాయి. అమరావతి రాజధానిగా ఉండాలని ఆ పారీ్టలు ప్రకటన చేశాయి. చివరకు జిల్లా వాసి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇదే స్వరం విని్పంచారు. జిల్లా టీడీపీ నేతలు జయనాగేశ్వరరెడ్డి, అఖిలప్రియ, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు రాజధానిగా అమరావతి వైపే మొగ్గు చూపారు. 2019లో జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరిగి పరిస్థితులు అధ్యయనం చేసి ప్రజాభిప్రాయాలు తీసుకుని నివేదికలు ఇచ్చాయి. ఈ కమిటీలు కూడా వికేంద్రీకరణే శ్రేయస్కరమని సూచించాయి. కానీ టీడీపీ నేతలు అమరావతిలో ఆస్తులు కొనుగోలు చేసి వాటిని కాపాడుకునే క్రమంలో వికేంద్రీకరణకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయించారు. దీంతో హైకోర్టు తరలింపు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. హెచ్ఆర్సీ, లోకాయుక్త ఏర్పాటు న్యాయరాజధానిలో భాగంగా ఇప్పటికే మానవహక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. త్వరలోనే మరిన్ని ట్రిబ్యునల్స్ రానున్నాయి. హైకోర్టుతో పాటు మొత్తం 43కుపైగా అనుబంద ట్రిబ్యునల్స్ జిల్లాకు రానున్నాయి. వీటి ఏర్పాటుతో కర్నూలు అభివృద్ధి మరోస్థాయికి చేరనుంది. కానీ కోర్టు కేసులతో జాప్యం జరగనుండటంతో ప్రజల ఆకాంక్షలు మరోసారి తెలియజేసేలా రాయలసీమలోని ఉద్యోగ, వ్యాపార, విద్యార్థి, న్యాయవాద వర్గాలు, సంఘాలు కలిసి వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఏర్పాటు చేశాయి. దీని కన్వీనర్‌గా క్రిష్టఫర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డిలు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. న్యాయరాజధాని సాధన దిశగా కార్యాచరణ రూపొందించనున్నారు. సాక్షి, కర్నూలు (రాజ్‌విహార్): రాష్ట్రంలో మూడు రాజధాలను ఏర్పాటు చేయడంతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తన, తన అనుచరుల రియల్ దందా కోసమే పాదయాత్ర చేయిస్తున్నారని అన్నారు. గతంలో 14 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉన్నా రాష్ట్రాభివృద్ధి కంటే స్వలాభం కోసమే ఎక్కువ శ్రమించారన్నారు. ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ప్రజలను మోసం చేస్తూ వచ్చారు తప్ప ఏం సాధించారో చెప్పాలన్నారు. శ్రీబాగ్ ఒప్పందంకు అనుగుణంగా శివరామకృష్ణ, శ్రీరామకృష్ణ కమిటీలు నివేదికలు ఇచ్చినా ఆయన ఎందుకు సాధించలేకపోయారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలు వెనకబడిపోయినా, వీటి గురించి ఆలోచించని ఆయన కేవలం ఒక సామాజిక వర్గం భూమి కొనుగోలు చేసిన ప్రాంతం అభివృద్ధి కోసం తపిస్తున్నారన్నారు. 1953లో వచ్చిన రాజధాని కోల్పోయిన తాము ఇప్పుడు వచ్చిన హైకోర్టును పోగొట్టుకోలేమని, ఇందు కోసం ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో చెన్నై, తాజాగా హైదరాబాదు అభివృద్ధి చెందిన తరువాత వదిలి వచ్చామని, ఇప్పుడు విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందిన తరువాత వదిలేసి వెళ్లమంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతుగా నిలవాలని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు గోపాల్‌రెడ్డి, షరీఫ్, పార్టీ రాష్ట్ర నాయకులు సీహెచ్ మద్దయ్య పాల్గొన్నారు. ఎంత వరకైనా వెనకాడం ‘సీమ’కు ప్రతిసారీ దగా జరుగుతోంది. అంతా వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. హైకోర్టు ఏర్పాటును కూడా అడ్డుకుంటుంటే రేపు ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో న్యాయం చేస్తారనే నమ్మకం ఏముంది. హైకోర్టు అనేది ‘సీమ’ హక్కు. కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే. దీని కోసం ధర్నాలు, పాదయాత్రలు, రిలేదీక్షలు అవసరమైతే ఆమరణదీక్షలు చేస్తాం. ఇప్పుడు న్యాయం జరగకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది జరగకుండా న్యాయరాజధాని ఏర్పాటు చేయాలి. – బి.క్రిష్టఫర్, వికేంద్రీకరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు విడతల వారీగా ఉద్యమం అన్ని పార్టీలు, సంఘాలను సదస్సుకు పిలిచాం. ఈ దఫా ఉద్యమం తీవ్రంగా చేయనున్నాం. హైకోర్టు ఏర్పాటయ్యేదాకా ఉద్యమం ఆగదు. అందరి అభిప్రాయాలు తీసుకుని కార్యాచరణ రేపు ప్రకటిస్తాం. టీడీపీ, బీజేపీతో సహా అన్ని పారీ్టలను ఆహ్వానించాం. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పొచ్చు. న్యాయరాజధాని ఏర్పాటైతే జరిగే అభివృద్ధి మేం వివరిస్తాం. దీనికి ‘సీమ’ వాసులంతా సహకరించాలి. – విజయ్ కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ -
టీడీపీ శవ రాజకీయాలు.. అందుకే హైడ్రామా
సాక్షి, కర్నూలు: టీడీపీ నేత నారా లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజకీయం కోసం ఏడాది తర్వాత నారా లోకేష్ గొనెగండ్ల మండలం ఎర్రబాడు యువతి మృతిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనుమానాస్పద మృతి కేసుపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే నంద్యాల ముస్లింలపై అక్రమ కేసులు నమోదు చేశారని హఫీజ్‌ఖాన్ గుర్తుచేశారు. టీడీపీ కేబినెట్లో మైనారిటీలకు చోటే లేదన్నారు. టీడీపీ నేతలు ప్రస్తుతం శవ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాలను పక్కదోవ పట్టించడానికే టీడీపీ హైడ్రామా ఆడుతుందని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ నిప్పులు చెరిగారు. చదవండి: రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు ఏడాది క్రితం ఘటనపై లోకేష్ స్పందించడం హాస్యాస్పదం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలను మభ్య పెట్టేందుకు నారా లోకేష్ మరోసారి కర్నూలు జిల్లా లో పర్యటించారన్నారు. ఏడాది క్రితం ఘటనపై లోకేష్ స్పందించడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ మాటలు పట్టించుకోరని కాటసాని అన్నారు. లోకేష్ దొడ్డి దారిన కర్నూలు జిల్లా వచ్చాడు.. లోకేష్ దొడ్డి దారిన కర్నూలు జిల్లా వచ్చాడని కర్నూలు మేయర్ బీవై రామయ్య ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన నారా లోకేష్, ఓ యువతి కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని బీవై రామయ్య దుయ్యబట్టారు. నారా లోకేష్, చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు, అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇవీ చదవండి: ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా.. ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. ముగ్ధుడైన భర్త -
‘చంద్రబాబు శిఖండి.. రాజకీయ సమాధి తప్పదు’
సాక్షి, కర్నూలు: ప్రతిపక్ష నేత చంద్రబాబు దుష్ట రాజకీయాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షులు బి.వై. రామయ్య ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు శిఖండిలా మారాడని.. తర్వలోనే ఆయన రాజకీయ సమాధి తప్పదని హెచ్చరించారు. సోమవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో బి.వై. రామయ్య మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ వ్యవస్థలను అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజకీయ కుట్రలకు పాల్పడుతున్నారు. ప్రజా సంక్షేమానికి చంద్రబాబు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. చంద్రబాబుకు రాజకీయ సమాధి తప్పదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన మొదటిరోజు నుంచే చంద్రబాబు ప్రజలపై విషం కక్కుతున్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అడ్డుకోవడమే చంద్రబాబు, ఆయన కొడుకు పనిగా పెట్టుకున్నారు. ప్రజలకు ఎంతో అవసరమైన అమ్మ ఒడి పథకాన్ని అమలు చేస్తుంటే దాన్ని కూడా అడ్డుకునే కుటిల రాజకీయాలు చంద్రబాబు చేస్తున్నారని’ రామయ్య మండి పడ్డారు. (చదవండి: కొనసాగుతున్న కోలాహలం) ‘మహిళలకు మేలు జరిగే సంక్షేమ పథకాలను అడ్డుకునే చంద్రబాబు మహిళా ద్రోహిగా చరిత్రలో మిగిలిపోనున్నాడు. చంద్రబాబు, ఆయన పార్టీ కార్యకర్తల వ్యవహరించే నిమ్మగడ్డను అస్త్రంగా వాడుకుంటూ అత్యున్నత రాజ్యాంగ పదవికి కళంకం తెచ్చారు. విలువలు మరిచిన నిమ్మగడ్డ దేశంలో ఎక్కడా లేని విధంగా తన హోదాను, పదవిని దుర్వినియోగం చేశారు. కుట్ర పూరిత రాజకీయాలను ప్రజలే తిప్పికొట్టాలి.. రాజ్యాంగ వ్యవస్థలను కాపాడుకోవాలి. తెలుగుదేశం పార్టీని కేవలం 23 సీట్లకు పరిమితం చేసినా చంద్రబాబుకు సిగ్గు రాలేదు. కరోనాకు భయపడి హైదరాబాద్‌లో దాక్కున్న చంద్రబాబుకు, ఆయన కుమారుడికి ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సాహిస్తున్న చంద్రబాబును ప్రజలు శాశ్వతంగా రాజకీయ సమాధి చేయాలి’ అని బి.వై రామయ్య పిలుపునిచ్చారు. -
సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేశారు
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య ఆరోపించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టాక బీసీలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. 45వేల కోట్ల రూపాయలను బీసీలకు కేటాయించి బీసీ కార్పోరేషన్, చైర్మన్లను ఏర్పాటు చేశారన్నారు. ఇది తెలిసి టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్‌పై 23 ఆరోపణలు ఉన్నాయని, ఆరోపణలపై చట్టపరమైన విచారణ కొనసాగుతోందని చెప్పారు. బీసీలతో ఓటు వేయించుకోని వారిని మోసం చేశారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముసుగులో జిల్లాలో కొందరు నేతలు అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. వారిపై కూడా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అలాగే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించే దిశగా సీఎం వైఎస్ జగన్ పని చేస్తున్నారన్నారు. బీసీ అభివృద్ధికి 45 వేల కోట్ల రూపాయలను సీఎం జగన్ ఖర్చు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది మానుకోవాలన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ ఆరోపణలపై విచారణలో నిజాలు తెలియాల్సి ఉందని, ఈ వ్యవహారంలో టీడీపీ అనుబంధం.. బీసీ సంఘాల తీరును ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను కులమతాలకు అతీతంగా అందిస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులపై సైతం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవినీతి పరులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిని టీడీపీ రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే ఆరోపించారు. -
చంద్రబాబు తీరు సిగ్గుచేటు
కర్నూలు(సెంట్రల్): చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం వ్యవస్థలను ధ్వంసం చేస్తున్నారని, ఆయన తీరు సిగ్గుచేటని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. ఆయన స్వలాభం కోసం దేన్నైనా నాశనం చేస్తారని దుయ్యబట్టారు. మూడు రాజధానులను అడ్డుకుంటే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. బుధవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పాలనా వికేంద్రీకరణకు మద్దతుగా కర్నూలు కలెక్టరేట్ వద్దనున్న గాంధీజీ విగ్రహం ఎదుట కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీవై రామయ్యతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో మూడు రాజధానులను ప్రకటించారన్నారు. భవిష్యత్‌లో ప్రాంతీయ అసమానతలు తలెత్తకుండా ఉండాలంటే మూడు రాజధానులే పరిష్కారమన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని గౌరవించి కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసిన సీఎంకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానులను అడ్డుకోవడానికి చంద్రబాబు కుట్రలు పన్నడం శోచనీయమన్నారు. స్వలాభం కోసం అమరావతి రాజధానిగా ఉండాలని పట్టుబట్టడం దారుణమన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ పాలనా వికేంద్రీకరణను అడ్డుకోవడానికి చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండి కుట్రలు పన్నుతున్నారని దుయ్యబట్టారు. ఆయన ఎన్ని కుట్రలు పన్నినా త్వరలోనే మూడు రాజధానుల ప్రక్రియ ముందుకు సాగుతుందన్నారు. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయితే ఇక్కడి ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, నాయకులు సీహెచ్ మద్దయ్య, రైల్వే ప్రసాద్, ఆదిమోహన్‌రెడ్డి, జమీల, రియల్ టైం నాగరాజు యాదవ్, సాంబశివారెడ్డి,దేవపూజ ధనుంజయాచారి, డీకే రాజశేఖర్, మంగమ్మ, రాజు,కృష్ణకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'ఆయనను రాజకీయ క్వారంటైన్‌కు తరలించారు'
సాక్షి, కర్నూలు: రాజకీయ నిరుద్యోగిగా ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అప్పుడప్పుడు తన ఉనికి కోసమే మీడియా ముందుకు వచ్చి అసత్య ఆరోపణలు చేస్తుంటాడని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అక్రమాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు కోట్ల రూపాయలు అవినీతి, అక్రమాలపై పోలీసులు విచారణ చేస్తుంటే దానిని బూతద్దంలో చూస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చిన్న మెదడు చిట్లిపోయి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. చదవండి: శ్రీశైలం నిధుల స్వాహా కేసులో మరికొందరి హస్తం అవినీతి, అక్రమాస్తుల కబ్జాలు చేసిన వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం. బైరెడ్డి ఎప్పడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదు. బహుశా ఆయనకు కూడా తెలియదు. చంద్రబాబు ధోరణిలోనే అడ్డగోలు విమర్శలు చేయడం ఈయనకి వంటపట్టిందన్నారు. చదవండి: వ్యర్థాల నిర్వహణకు 'ఆన్లైన్' వేదిక ప్రారంభం బైరెడ్డిని కర్నూలు జిల్లా ప్రజలు రాజకీయ క్వారంటైన్‌కు తరలించారన్న సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి. తిరుపతి దేవస్థానం భూములపై ఆనాడు మాట్లాడని బైరెడ్డి ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకొని లేని ఆరోపణలు చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు, రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై పోరాటం వంటి ఆలోచనలు చేయాలి తప్ప మరో విధంగా మాట్లడితే రాజకీయంగా బుద్ధి చెబుతాం అంటూ పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని హెచ్చరించారు. చదవండి: 'కెలికి తిట్టించుకోవడం బాబుకు అలవాటే' -
కరోనాతో యుద్ధం : ప్రభుత్వానికి సహకరించండి
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్డౌన్ కోనసాగుతున్నప్పటికీ సంక్షేమ పథకాలు ఎక్కడా అటంకం లేకుండా సమర్థవంతంగా కొనసాగుతున్నాయని వైఎస్సార్సీపీ నేత బీవై రామయ్య అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. అంతేగాక వార్డు వాలంటీర్ల వ్యవస్థ కూడా దేశవ్యాప్తంగా ఆదర్శవంతంగా అమలవుతున్నాయన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ముందుందని ఆయన అన్నారు. (లాక్డౌన్ ఎఫెక్ట్.. వీడియో కాల్లో పెళ్లి) ఎంపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని, మహమ్మారికి అడ్డుకట్ట వేయాలంటే సామాజిక దూరం ఒక్కటే మార్గం అన్నారు. కరోనాపై యుద్దంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ మాట్లాడుతూ.. కరోనాపై పోరాటంలో పేదలకు ఎలాంటి కష్టం రాకుండా సీఎం జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. రేషన్, వృద్దాప్య పింఛన్లు కూడా ఇంటి వద్దనే అందించడం జరుగుతుందని తెలిపారు. ఎమ్మెల్యే హఫీజ్ మాట్లాడుతూ.. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కరోనా అన్నది కులమతాలకు అతీతమైనదని సోషల్ మీడియోలో వస్తున్న అసత్య ప్రచారాలు నమ్మోద్దని సూచించారు. (మోదీ పిలుపు; నిద్రొస్తే నిద్రపోతా : మమతా) -
బాబు అవినీతి మరోసారి రుజువైంది
-
‘చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’
సాక్షి, కర్నూలు: అమరావతి విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరు అర్థరహితమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్లలో అభివృద్ధిని మరిచిన చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుతో పాటు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కర్నూలు అభివృద్ధికి సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. బి.వై.రామయ్య మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆయన పేర్కొన్నారు. సీఎం జగనన్న మాట ఇస్తే తప్పే ప్రస్తే లేదని కొనియాడారు. అమరావతిలో జరుగుతున్నది రైతు ఉద్యమం కాదని, చంద్రబాబు బినామీల ఆందోళన మాత్రమేనన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును సమర్థించే టీడీపీ నేతలు కర్నూల్లో హైకోర్టు వద్దని చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. రాయలసీమ టీడీపీ నేతలు చంద్రబాబు మాయలో ఉన్నారన్నారు. ఇకనైనా ప్రాంతాల అభివృద్ధి కోసం టీడీపీ నేతలు ఆలోచించాలని కోరారు. -
బాబుకు బంపరాఫర్.. లక్ష బహుమతి!
సాక్షి, కర్నూలు : ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైఎస్సార్సీపీ నేత బి.వై. రామయ్య ఆదివారం బంపర్ ఆఫర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల పేర్లను చెబితే చాలు.. లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తానన్నారు. కర్నూలు జిల్లా అభివృద్ధిని విస్మరించిన చంద్రబాబుకు జిల్లాలో అడుగుపెట్టే ఆర్హత లేదని, విమర్శించారు. జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగా ఫెయిలైన చంద్రబాబు ప్రతిపక్షనేతగా కూడా అట్టర్ ప్లాప్ అయ్యారని ఎద్దేవా చేశారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేసి, ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం చాతకాక కేవలం విమర్శలకు పరిమితమయ్యాడని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా బుద్ధి రాలేదని, ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని సూచించారు. -
‘ఇది మంచి పద్ధతి కాదు’
సాక్షి, కర్నూలు : పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా తమ పాలన ఉంటుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. మంగళవారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు దుర్మార్గులకు సమాధి కట్టి... తమ పార్టీ అభ్యర్థులకు పట్టంగట్టారని హర్షం వ్యక్తం చేశారు. ఓటమిని తట్టుకోలేక కొంతమంది టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది మంచి పద్ధతి కాదని.. రెచ్చగొట్టేవిధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా పోలీసు అధికారులు ఒకరికి తొత్తులుగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. ఇక తమ పార్టీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో సైనికులలాగా పనిచేస్తామని కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ అన్నారు. వైఎస్సార్ సీపీ మీద నమ్మకంతో ప్రజలు భారీ మెజారిటి కట్టబెట్టారన్నారు. ప్రతీ కుటుంబానికి నవరత్నాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. -
‘2 రోజుల్లో అధికారంలోకి వైఎస్సార్సీపీ’
సాక్షి, కర్నూలు: రాష్ట్రంలో రెండు రోజుల్లో తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. తమ పార్టీ 130 సీట్లు గెలుస్తుందని ఆయన చెప్పారు. కర్నూలు జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ఓడిపోతామన్న భయంతో చంద్రబాబు నాయుడు ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగు దేశం పార్టీ కార్యాలయానికి టులెట్ బోర్డు తగిలించాల్సిందేనని ఎద్దేవా చేశారు. కౌంటింగ్ రోజున వైఎస్సార్సీపీ ఏజెంట్లు జాగ్రత్తగా ఉండాలని, ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు కౌంటింగ్ హాల్లోనే ఉండాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియకు అడ్డంకులు కల్పించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. లగడపాటి రాజగోపాల్ తెలుగు దేశం పార్టీకి బ్రోకర్‌గా వ్యవహరిస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మాట మార్చిన చంద్రబాబు: కాటసాని చంద్రబాబు ఓటమి భయంతో దేశంలో వివిధ నాయకులను కలిసేందుకు వెళ్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు నరేంద్ర మోదీని పొడిగిన చంద్రబాబు ఇప్పుడు మాట మార్చి ఆయనను విమర్శిస్తున్నారని గుర్తు చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు ప్రజలను ఆకర్షించాయని తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయిన తర్వాత చంద్రబాబుని లోకేష్ బాబు జాగ్రత్తగా చూసుకోవాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి సూచించారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని దొంగ సర్వేలను ప్రకటిస్తూ ఏపీ ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో పార్టీకి సేవలందించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు కర్నూలు లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. -
రాష్ట్రాన్ని వీడనున్న చంద్రగ్రహణం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): మే 23న వెలువడనున్న ఎన్నికల ఫలితాలతో రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడనుందని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటింగ్ అనంతరం ప్రజలు వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపే ఉన్నారని తెలిసి చంద్రబాబు మానసిక స్థితిని కోల్పోతున్నారన్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయన హుందాగా వ్యవహరించాల్సిందిపోయి ఈవీఎంలు సరిగా పనిచేయడం లేదని, ఎన్నికల కమిషన్‌పై పోరాటం, నరేంద్రమోదీ ఓటమి కోసం దేశవ్యాప్త పర్యటనలు చేస్తూ ప్రజల్లో చులకన అవుతున్నారని ధ్వజమెత్తారు. ఈవీఎంల పనితీరుపై నిజంగా ఆయనకు చిత్తశుద్ధి ఉంటే 2014 ఎన్నికల్లో గెలిచినప్పుడు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదని ప్రశ్నించారు. కోడెల శివప్రసాద్ రావు స్పీకర్ వ్యవస్థనే దిగజార్చారన్నారు. ఎమ్మెల్యే పుష్పశ్రీపై దాడి జరిగినా పట్టించుకునే నాథుడే లేకపోవడం.. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలకు నిదర్శమన్నారు. జనసేన పార్టీ ఆఫీస్‌కు టూలెట్ బోర్డు.. ఎన్నికలు ముగిసిన వెంటనే విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయానికి టూ లెట్ బోర్డు పెట్టారన్నారు. మే 23 తరువాత రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి కూడా అదేనన్నారు. ఎన్నికల నిబంధనలను పక్కనబెట్టి కమీషన్ల కోసం చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను బలిపశువులను చేస్తున్నారని ఆరోపించారు. పోలవరం, రాజధాని నిర్మాణ పనులపై సమీక్ష చేయడంపై ఆయనకు కమీషన్లపై ఎంత మమకారం ఉందో అర్థమవుతోందన్నారు. ఐదేళ్లలో వాటి గురించి ఏనాడు పట్టించుకోకుండా ఈ నెల రోజుల్లో హడావుడి చేయడం తగదన్నారు. నీరు–చెట్టు నిధుల దుర్వినియోగంపై తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే విచారణ చేపడతామన్నారు. సైలెంట్ ఓటింగ్.. టీడీపీ కిల్లింగ్.. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని బీవై రామయ్య జోస్యం చెప్పారు. ఓటింగ్‌లో పెద్ద ఎత్తున యువత, మహిళలు, వృద్ధులు, నిరుద్యోగులు, ఉద్యోగులు వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఓటు వేశారన్నారు. సైలెంట్ ఓట్లన్నీ వైఎస్సార్‌సీపీకేనని, అవన్నీ టీడీపీ కిల్లింగ్ కోసం పడినవేనని అభిప్రాయపడ్డారు. సీఎం మాటలు హాస్యాస్పదం.. జిల్లాలోని అన్ని స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని సీఎం చంద్రబాబునాయుడు చెప్పడం హాస్యాస్పదమని కర్నూలు ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింగరి సంజీవ్‌కుమార్ అన్నారు. ఇంటిలిజెన్స్‌తో పాటు సొంత సర్వేలు కూడా టీడీపీ ఓడిపోతుందని చెబుతున్నా చంద్రబాబు మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే మానసిక వ్యాధికి గురయ్యారనే విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. ప్రజా తీర్పును అంగీకరించకుండా దేశం పట్టుకొని తిరగడం ఎందుకని ప్రశ్నించారు. మే 23 తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని రాష్ట్ర అదనపు కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి అన్నారు. కౌంటింగ్ కంటే ముందే ఈవీఎంలపై ఆరోణలు చేయడాన్ని బట్టి చూస్తే పరోక్షంగా చంద్రబాబు ఓటమిని అంగీకరించారన్నారు. వయసు పైబడడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలసి విశ్రాంతి తీసుకుంటే మంచిదని సురేంద్రరెడ్డి హితవు పలికారు. కార్యక్రమంలో కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ జె.సుధాకర్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అక్కిమి అనుమంతరెడ్డి, నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, ధనుంజయాచారి, షరీఫ్, మహేశ్వరరెడ్డి, విజయ్, బాలరాజు, శ్రీనివాసరెడ్డి, డాక్టర్ తులసిరావు చౌదరి, డాక్టర్ స్వర్ణలత పాల్గొన్నారు. -
వైఎస్సార్‌సీపీతోనే బీసీల అభ్యున్నతి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తోనే బీసీల అభ్యున్నతి సాధ్యమవుతుందని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించిన సందర్భంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో మంగళవారం వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, ఘన నివాళులు అర్పించారు. అనంతరం టీజే షాపింగ్ మాల్లోని పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. పేరుకే టీడీపీ బీసీల పార్టీ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..బడుగుల అభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. వారిని కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూస్తున్నారన్నారు. తమ పార్టీ అధ్యక్షులు వైస్ జగన్ మోహన్ రెడ్డి.. ఏలూరులో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చరిత్రాత్మకమన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు చేయని సాహసాన్ని జననేత చేశారని కొనియాడారు. బీసీ అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తే రాష్ట్రవ్యాప్తంగా బడుగు వర్గాల నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తాయన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే బీసీలు రాజకీయంగా బలపడేందుకు నామినేటెడ్ పదవుల నియామకాలు జరుగుతాయని తెలిపారు. నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఇది తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయమన్నారు. జనంలో చంద్రబాబుపై నమ్మకం పోయిందని, రాష్ట్ర ప్రజలంతా జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. బీసీల పునాది మీద ఏర్పడిన పార్టీగా చెప్పుకోవడమే తప్ప టీడీపీ..బడుగుల అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. బీసీల అభవృద్ధికి వైఎస్సార్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పి.రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు నాగరాజు యాదవ్, సత్యం యాదవ్, బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవపూజ ధనుంజయాచారి, రాష్ట్ర కార్యదర్శి రియల్‌టైం నాగరాజు, ఆదిమోహన్‌రెడ్డి, రఘునాథ్, రాజశేఖర్, కటారి సురేశ్, కరుణాకర్‌రెడ్డి, రైల్వేప్రసాద్, సాంబశివారెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డి, హనుమంతురెడ్డి, రంగ, కిశోర్, విఠల్, మున్నా, సయ్యద్ ఆసిఫ్, మదారపు రేణుకమ్మ, ఏసన్న, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ చేయూత
కల్లూరు(రూరల్): ఓర్వకల్లు సమీపంలో ఈ నెల ఏడున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్న రాముడు, బెస్త రాముడుతో పాటు పంచలింగాలకు చెందిన డ్రైవర్ రాఘవేంద్ర కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. వీరు కోడుమూరు నేత కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన విషయం విదితమే. వీరి కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ పార్టీ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ప్రకారం మొత్తం రూ.9 లక్షల నగదు అందించారు. ముందుగా ఆయన పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ నేత కోట్ల హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి నగరంలోని 33వ వార్డు శివరామకృష్ణనగర్లో నివాసం ఉంటున్న చిన్నరాముడు, బెస్త రాముడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీటి పర్యంతమైన వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. చిన్నరాముడు భార్య భార్గవికి రూ.3 లక్షలు, బెస్త రాముడు అక్క కాంతమ్మకు రూ.3 లక్షలు, డ్రైవర్ రాఘవేంద్ర కుమార్తెలు ఆదిలక్ష్మీ, నాగమణి, కుమారుడు ఛత్రపతికి రూ.3 లక్షలు, గాయపడిన పరుశురాముడుకు రూ.20 వేలు, లక్ష్మన్నకు రూ.20 వేల నగదు అందజేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న చిన్నరాముడు ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రాగానే చిన్నరాముడు ఇంటిని కూడా పూర్తి చేయిస్తామన్నారు. పిల్లల చదువుకు చేయూతనిస్తామన్నారు. బీవై రామయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడొద్దని, ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కల్లూరు మండల కన్వీనర్ రెడ్డిగారి చంద్రకళాధర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆదిమోహన్‌రెడ్డి, అక్కిమి హనుమంతరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రఘు, పర్ల శ్రీధర్‌రెడ్డి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శులు కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి తోఫిక్, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఫిరోజ్, 33, 36 వార్డు ఇన్‌చార్జ్‌లు షరీఫ్, నాగరాజు, పార్టీ నాయకులు పాణ్యం మహేశ్వర్‌రెడ్డి, కాటసాని శివనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
కర్నూలు, పత్తికొండ: పత్తికొండ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. బుధవారం కాంగ్రెస్‌కు చెందిన దాదాపు 500 మంది పార్టీలో చేరారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి శ్రీరంగడు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పత్తికొండ నియోజకవర్గ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి, రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్‌రెడ్డి సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామచంద్రయ్యతో పాటు తుగ్గలి, మద్దికెర, పత్తికొండ మండలాల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు వందలాది మంది పత్తికొండకు చేరుకున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీ నుంచి ర్యాలీగా బయలుదేరి తేరుబజారు, నాలుగు స్తంభాలు, అంబేడ్కర్ సర్కిల్ మీదుగావైఎస్సార్‌సీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వీరికిబీవై రామయ్య,కంగాటి శ్రీదేవి, ప్రదీప్‌రెడ్డి పార్టీ కండువాలు కప్పి..సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు కాపీరాయుడు వైఎస్సార్సీపీ నవరత్నాలను చంద్రబాబు కాపీ కొట్టడం సిగ్గు చేటని బీవై రామయ్య విమర్శించారు. పరీక్షల్లో కొపీ కొట్టే విద్యార్థులను డీబార్ చేసినట్టుగానే ఈసారి ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు డీబార్ చేస్తారని హెచ్చరించారు. బ్యాంకర్లతో మీటింగులు పెట్టి రైతులకు రుణాలు ఇవ్వొద్దంటూ చెప్పిన ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే చంద్రబాబు తప్ప మరెవరూ లేరన్నారు. జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. 106 చెరువులకు నీళ్లిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చెప్పి మోసం చేశారన్నారు. జొన్నగిరిలో చంద్రబాబు గంగ పూజ చేసిన తరువాత చెరువులోని నీరు ఇంకిపోయి పూర్తిగా ఎండిపోయిందన్నారు. నీరు– చెట్టు పేరుతో రూ.కోట్లు దోచుకున్నారని విమర్శించారు. చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ చెరుకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయించిన నరహంతకులను స్వాగతించే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. కరువులకు నిలయమైన పత్తికొండ నియోజకవర్గంలో ఇంతవరకు ఇచ్చిన హామీలను ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. పత్తికొండలో పాలిటెక్నిక్ కళాశాల, జ్యూస్ ఫ్యాక్టరీ, పూర్తిస్థాయిలో ఆర్టీసీ డిపో, బాలికలకు వసతిగృహం ఏర్పాటు చేస్తామన్న డిప్యూటీ సీఎం మాట నిలబెట్టుకోలేదన్నారు. బతుకుదెరువు కోసం దూర ప్రాంతాలకు వలస వెళుతున్న కూలీలను డబ్బు సంపాదించుకోవడానికి పోతున్నారని చంద్రబాబు అనడం నీచమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తమ్మారెడ్డి కుమారుడు ప్రతాప్‌రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి జగన్నాథ్‌రెడ్డి, మండల కన్వీనర్లు జూటూరు బజారప్ప, నాగేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి రహిమాన్, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ నాయక్, సింగిల్‌విండో అధ్యక్షుడు ప్రహ్లాదరెడ్డి, జిల్లా నాయకులు రామచంద్రారెడ్డి, జయ భరత్‌రెడ్డి , హనుమంతు, బనిగాని శ్రీను, మోహన్‌కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
బాబుకు జగన్ ఫోబియా పట్టుకుంది
సాక్షి, కర్నూలు : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాను చేసిన అభివృద్దిపై ఓట్లు అడిగే దమ్ముందా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ విసిరారు. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా మాత్రమే చంద్రబాబు పనికొస్తారని.. సీఎంగా పనికిరారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫోబియా పట్టుకుందని విమర్శించారు. రాజమండ్రిలో టీడీపీ తలపెట్టిన జయహో బీసీ సభలో బీసీలకు ఆశాభంగం కలిగిందని ఆరోపించారు. సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇతర పార్టీలతో కలిసి చంద్రబాబు జయహో బీసీ అంటే.. వైఎస్ జగన్ ఏర్పాటు చేసే బీసీ గర్జన అదరహో అనేలా ఉంటుందన్నారు. చంద్రబాబు కొత్తగా ఇస్తున్న హామీలన్నీ నవరత్నాల కాపీలేనని దుయ్యబట్టారు. టీడీపీ మోసపూరిత రుణమాఫీతో రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీని అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. దీంతో ప్రతీ వ్యక్తిపైన సగటున రూ.75 వేల అప్పు ఉందని ఆరోపించారు. డ్వాక్రా రుణాల మాఫీ చేయని చంద్రబాబు మహిళలకు బాకీపడ్డారన్నారు. ఆడపడుచులకు చెల్లని చెక్కులు ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్వాక్రా మహిళలను సభల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. జయహో బీసీ సభలో ఖాళీ కుర్చీలు చంద్రబాబు ఇస్తున్న హామీలన్నీ ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలేనని నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బి వై రామయ్య పేర్కొన్నారు. ప్రభుత్వంలో ఉంటూ మళ్లీ హామీలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఇచ్చిన హామీల గురించి అడిగితే తోకలు కత్తిరిస్తాననడం బాబు నైజమన్నారు. బీసీలు సుప్రీం కోర్టు జడ్జిగా పనికిరారని లెటర్ ఇచ్చిన ఘనుడు చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు. బీసీల హామీలపై బహిరంగ చర్చకు సిద్దమా అని సవాల్ విసిరారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో 11 బీసీ కులాలకు ఫెడరేషన్లు ఏర్పాటు నిజం కాదా అని ప్రశ్నించారు. తండ్రి బాటలో బీసీల సంక్షేమం కోసం ఫెడరేషన్లను కార్పొరేషన్లుగా మారుస్తామని వైఎస్ జగన్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. జయహో బీసీ సభలో ఖాళీ కుర్చీలు తప్ప జనాలు లేకపోవడం చంద్రబాబు ప్రజావ్యతిరేకతకు నిదర్శనమన్నారు. బీసీల ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ డిక్లరేషన్ విడుదల చేయబోతున్నారని తెలిపారు. -
తుప్పు పట్టిన పరికరాలు ఇచ్చి ఇంకెన్నాళ్లు...
సాక్షి, కర్నూలు : రానున్న ఎన్నికల్లో బీసీల ద్రోహి చంద్రబాబుకు బీసీలంతా ఓటుతో బుద్ధి చెప్పబోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబును వాల్మీకుల దేవుడు అంటూ మంత్రి కాలువ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వాల్మీకి జాతి మొత్తాన్నిఅవమానపరిచేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. సొంత ప్రాపకం కోసం జాతి ఆత్మాభిమానాన్ని చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టిన ఘనుడు శ్రీనివాసులు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాల్మీకులు నమ్మకానికి మారుపేరని.. వారి మనోభావాలతో ఆడుకోవద్దని హితవు పలికారు. చంద్రబాబు మోసాలను వాల్మీకులు గుర్తించారని.. ఇకపై ఆయన వారిని వంచించలేరని అన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తమకు అండగా ఉంటారన్న నమ్మకం బీసీల్లోని అన్ని వర్గాల్లో ఏర్పడిందని పేర్కొన్నారు. వాల్మీకి ఫెడరేషన్ ఘనత వైఎస్సార్‌ది కాదా.. గత నాలుగున్నరేళ్ల కాలంలో టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో ఏనాడైనా వాల్మీకి రిజర్వేషన్‌పై నోరు విప్పారా అని రామయ్య ప్రశ్నించారు. ఒకరికి మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన జాతి మొత్తాన్ని ఉద్ధరించినట్టుకాదన్నారు. వాల్మీకి ఫెడరేషన్ ఏర్పాటు చేసిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. వాల్మీకి జయంతిని అధికారికంగా జరుపుకునేందుకు చర్యలు తీసుకుంది కూడా ఆయనేనన్న విషయాన్ని గుర్తుచేశారు. వాల్మీకుల అభ్యున్నతికి పాటుపడేందుకు వైఎస్ జగన్ వారికి చట్టసభల్లో స్థానం కల్పించనున్నారని పేర్కొన్నారు. తుప్పు పట్టిన పరికరాలు ఇచ్చి.. బీసీల కొరకు ఏర్పాటు చేసిన బీసీ సబ్‌ప్లాన్ నిధులు ఏమయ్యాయో మంత్రి కాల్వ సమాధానం చెప్పాలని రామయ్య డిమాండ్ చేశారు. సంవత్సరానికి రూ. 10 వేల కోట్లు ఇస్తామన్న చంద్రబాబు గత ఐదు సంవత్సరాలుగా బీసీలకు ద్రోహం చేశారని విమర్శించారు. ఆదరణ పథకం కింద తుప్పు పట్టిన పరికరాలు ఇచ్చి బీసీలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. బీసీల అభ్యున్నతికి వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వబోతున్నారని తెలిపారు. -
‘చంద్రబాబులా చీకటి ఒప్పందాలు చేసుకోలేదు’
సాక్షి, కర్నూలు : ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఫెడరల్ ఫ్రంట్‌తో కలిసారే తప్ప సీఎం చంద్రబాబు నాయుడులాగా చీకటి ఒప్పందాలు చేసుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు దేశమంతటా తిరిగి ఇప్పటివరకు ఎన్ని రాష్ట్రాలను ప్రత్యేక హోదా కోసం ఒప్పించారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు అంటూ చంద్రబాబు తన మంత్రులతో అబద్ధపు ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీతో నాలుగు సంవత్సరాలు కాపురం ఉండి సాధించిందేమిటో.. ప్రస్తుతం కాంగ్రెస్‌తో జత కట్టి సాధించేదేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి నీచపు రాజకీయాలు తమకు చేతకావంటూ రామయ్య చంద్రబాబును విమర్శించారు. -
తెలంగాణ తరహాలో ఏపీలోనూ టీడీపీకి బుద్ధిచెప్పాలి
సాక్షి, కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిననాటినుంచి రాష్ట్రంలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. బాబు అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. రైతు సమస్యలపై చంద్రబాబు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, రైతు రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసి వ్యక్తి ఆయన అని మండిపడ్డారు. చంద్రబాబు తన ఆదాయం కోసమే పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టారని విమర్శించారు. రైతులు బాగుడాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీని ఎలా తన్ని తరిమేశారో అదే రీతిలో.. రానున్న ఎన్నికల్లో ఏపీలోనూ టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. -
బీసీల ద్రోహి చంద్రబాబు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): హామీలు అమలు చేయకుండా, రిజర్వేషన్ల పేరుతో వైషమ్యాలను రెచ్చగొట్టి సీఎం చంద్రబాబు నాయుడు బీసీల ద్రోహిగా మారారని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ధ్వజమెత్తారు. దేశంలో బీసీలకు ఏ రాజకీయ పార్టీ చేయనంత అన్యాయం టీడీపీ చేసిందని విమర్శించారు. పార్టీ జిల్లా జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏడాదికి రూ.10 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్‌ను అమలు చేస్తానని చెప్పి.. నాలుగున్నరేళ్ల తరువాత కూడా అంత మొత్తం ఖర్చు చేయలేకపోయారన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడిచి బీసీ విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేశారన్నారు. హాస్టళ్లు, కాలేజీలను మూసివేయడంతోపాటు మహిళలకు రుణాలు కూడా మంజూరు చేయలేదన్నారు. ఆదరణ పథకంలో నాసిరకం పరికరాలు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. వాల్మీకి ఫెడరేషన్‌కు రూ.50 కోట్లు ఇచ్చామని చెబుతున్నారని, ఒక్కరైనా లబ్ధిదారుడిని చూపించాలని సవాల్ విసిరారు. ఫెడరేషన్‌కు వచ్చిన డబ్బునంతా మాయం చేశారని ఆరోపించారు. వాల్మీకుల ఎస్టీ రిజర్వేషన్ అంశంపై సమావేశమవుదామని మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నాలుగున్నరేళ్లు ఏం చేస్తున్నారని బీవై రామయ్య ప్రశ్నించారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో జయహో బీసీ పేరిట చంద్రబాబు సదస్సులు నిర్వహించడం వంచించడమేనన్నారు. కదలిరండి... టీడీపీ ప్రభుత్వం బీసీలకు చేసే మోసాన్ని వివరించేందుకు 20వ తేదీ కర్నూలులో నిర్వహించే బీసీ ర్యాలీకి కర్నూలు పార్లమెంటరీ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వేలాది తరలి రావాలని బీవై రామయ్య పిలుపునిచ్చారు. ఉదయం పది గంటలకు పార్టీ జిల్లా కార్యాలయం నుంచి ర్యాలీ ప్రారంభమవుతుందన్నారు. కలెక్టరేట్ చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తున్నట్లు ఆయన వివరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందని బీవై రామయ్య పేర్కొన్నారు. బీసీల సమస్యలను తెలుసుకునేందుకు తమ పార్టీ ఆధ్వర్యంలో అధ్యయన కమిటీ వేశామని చెప్పారు. కార్యక్రమంలో బీసీ సెల్ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బుట్టా రంగయ్య, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు రియల్‌టైం నాగరాజుయాదవ్, సత్యం యాదవ్, డీకే రాజశేఖర్, ధనుంజయాచారి, నాయకులు బ్రదర్ రమణ, లక్కీటూ గోపినాథ్, రాధాకృష్ణ, శ్రీనివాసులు(సర్పంచ్), వెంకటేశ్వర్లు(అరికెర), సురేష్, లింగమల్లయ్య, కురవళ్లి శివ(ఆలూరు నియోజకవర్గం), కాశీ విశ్వనాథ్రెడ్డియాదవ్, మద్దిలేటి, రామకృష్ణ, విజయ యాదవ్, మల్లికార్జున యాదవ్, సహదేవుడు, కాల్వముని, కురువమద్దిలేటి(మంత్రాయలం) తదితరులు పాల్గొన్నారు. -
‘నవరత్నలు చూసి ఓర్వలేకపోతున్నారు’
సాక్షి, కర్నూలు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాలుగున్నరేళ్లుగా బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ కర్నూల్ పార్లమెంట్ అధ్యక్షుడు బీ.వై రామయ్య విమర్శించారు. బీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. సోమవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. మరోసారి బీసీలకు మోసం చేసేందుకే జయహో బీసీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్ బీసీలకు చట్టసభల్లో తగిన స్థానం కల్పిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు చూసి చంద్రబాబు ఓర్వలేక పోతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలో బీసీలపై జరుగుతున్న అన్యాయానికి నిరసనగా ఈ నెల 20న జిల్లాలో పెద్ద ర్యాలీని నిర్వహించి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తున్నట్లు ప్రకటించారు. -
జగన్‌ను విమర్శించే అర్హత కోట్లకు లేదు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి లేదని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో కోట్ల కుటుంబానికి విలువలు ఉన్నాయని, టీడీపీ ఇచ్చే ఒకటి, రెండు సీట్ల కోసం వాటిని దిగజార్చుకోవద్దని సూచించారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తులో ఎంపీ అవుతానని సూర్యప్రకాష్‌రెడ్డి కలలు కంటున్నారని, పొత్తులో పోటీ చేస్తే ఆయన చిత్తవడం ఖాయమన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడంతో కొన్ని ఓట్లయినా పడ్డాయని, విలువలు లేకుండా రాజకీయాలు చేస్తే 2019లో ఆ ఓట్లు కూడా పడబోవని గుర్తించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డంగా విభజించిన కాంగ్రెస్ పార్టీని 2014లోనే ప్రజలు తిరస్కరించారని, మళ్లీ ఆ పార్టీని ఆదరించే ప్రసక్తే లేదన్నారు. ఆనాడు రామారావుకు.. ఈనాడు టీడీపీకి వెన్నుపోటు... సీఎం చంద్రబాబునాయుడు రామారావుకు వెన్నుపోటు పొడిచి ఆయన దివంగతులయ్యేలా చేశారని బీవై రామయ్య గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఆత్మగౌరవ నినాదంతో స్థాపించిన టీడీపీని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కాళ్ల దగ్గర పెట్టి తెలుగువారి ఆత్మభిమానాన్ని చంపేశారన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లకు ఏమాత్రం విలువలు లేవని, కేవలం అధికారమే పరమాధిగా సాగుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో 13 సీట్లకే టీడీపీని పరిమితం చేసి రాహుల్‌గాంధీతో సీఎం చంద్రబాబునాయుడు వేదికను పంచుకోవడంపై సొంత పార్టీలోనే తీవ్ర నిరసన వ్యక్తమవుతోందన్నారు. ఆ రెండు పార్టీల పొత్తును ప్రజలు అంగీకరించడంలేదని, ఓటమి తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పర్ల శ్రీధర్‌రెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లాల ప్రధాన కార్యదర్శులు కరుణాకర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, మనోహర ఆచారి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీతో పొత్తు ఉండబోదని ప్రకటించగలవా? టీడీపీ–కాంగ్రెస్ పొత్తు ఉండే ప్రసక్తే లేదని కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, కేఈ కృష్ణమూర్తి చెబుతూ వచ్చారని రామయ్య గుర్తు చేశారు. కేఈ కృష్ణమూర్తి.. ఏకంగా కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఉరి వేసుకుంటానని ప్రకటించారన్నారు. కాంగ్రెస్, టీడీపీ అధ్యక్షులు చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారని, ఒకే వేదికను పంచుకుంటున్నా.. తెలంగాణలో పొత్తు పెట్టుకున్నా.. వీరికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్, టీడీపీలు పొత్తు పెట్టుకుంటాయని టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు, మంత్రి యనమల రామకృష్ణుడు, రాహుల్‌గాంధీ దూతగా అమరావతికి వచ్చిన అశోక్‌గెహ్లాట్ ప్రకటించినా..వీరికి వినిపించలేదా అన్ని ప్రశ్నించారు. కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డికి దమ్ము ఉంటే టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఉండబోదని ప్రకటించాలని సవాల్ విసిరారు. అవినీతి సామ్రాట్‌ను సీఎం చేయాలనుకుంటున్నావా? టీడీపీ అధినేత అంత అవినీతి పరుడు దేశంలోనే లేరని గతంలో విమర్శించిన కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డికి.. టీడీపీతో పొత్తు అనగానే చంద్రబాబు నీతిమంతుడు అయ్యారా అని బీవై రామయ్య ప్రశ్నించారు. ఎక్కడైనా ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార పక్షాన్ని విమర్శిస్తారని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఉందన్నారు. ప్రతిపక్షంలో ఉండి ప్రజా సమస్యలపై పోరాడుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే ఆరోపణలు చేయడం కాంగ్రెస్, జనసేనతోపాటు కొన్ని పార్టీలకు అలవాటైందన్నారు. వీరందరికీ ప్రజా సమస్యలపై ఏమాత్రం ధ్యాస లేదన్నారు. తమ పార్టీ అధినేత ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వంపై దండయాత్ర చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఏడాదిగా ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారన్నారు. ప్రతి రోజూ వేలాది మంది ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం కాకుండా అడ్డుకునే శక్తి ఎవరికీ లేదన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించి జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ పొత్తులో ఎంపీ కావాలనుకుంటున్న కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి కలలు కల్లలుగానే మిగిలిపోతాయని, ఆ రెండు పార్టీలను ప్రజలు ఛీ కొడతారన్నారు. -
సాగు, తాగునీటి సమస్యలపై గళమెత్తిన వైఎస్సార్సీపీ..
-
పోలీసుల జులుం.. సొమ్మసిల్లిన వైస్సార్సీపీ నేత
సాక్షి, కర్నూలు : ప్రజా సమస్యలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ నిరసన తెలుపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దీంతో కర్నూలు జిల్లా పరిషత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివరాలు.. జడ్పీ సర్వసభ్య సమావేశంలో సాగు, తాగునీటి సమస్యలపై గళమెత్తిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. తమను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల దాడిలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బి.వై.రామయ్య సొమ్మసిల్లి పడిపోయారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. -
చంద్రబాబు ఊసరవెల్లి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): చంద్రబాబు ఊసరవెళ్లి అని, పూటకో రంగు మార్చడం ఆయనకే చెల్లు అని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ఆనాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే..నేడు చంద్రబాబు దాని మౌలిక సూత్రాలను సైతం కాంగ్రెస్‌కు తాకట్టు పెట్టి తెలుగు వారి పరువు తీశారని విమర్శించారు. ఆయన శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నాడు ఓటుకు నోటు కేసుతో భయపడిపోయి హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతికి వచ్చారన్నారు. నేడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో ఎక్కడ ముద్దాయిగా చేర్చుతారోనని అమరావతి నుంచి ఢిల్లీకి వెళ్లి తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లలో తను, తన కొడుకు లోకేష్ చేసిన అవినీతి అక్రమాలను కప్పి పుచ్చుకోవడానికి రాహుల్ గాంధీ కాళ్లు పట్టుకున్నారని, బయటకు మాత్రం దేశ రక్షణ అంటూ మరోసారి ఊసరవెల్లిలా రంగులు మార్చుతున్నారని దుయ్యబట్టారు. ఆయన చెప్పే మాటలను వినే వారెవరూ ఏపీ, తెలంగాణల్లో లేరన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టిస్తుందని, టీడీపీకి డిపాజిట్లు కూడా గల్లంతవుతాయని అన్నారు. ఉరి వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం విజ్ఞతకే... కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే తాను ఉరి వేసుకుంటానని, ఆ పార్టీతో కలసి పనిచేసే ప్రసక్తే లేదని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి గతంలో వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఇప్పుడీ విషయం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మంత్రి అయ్యన్నపాత్రుడుతో పాటు చాలామంది సీనియర్ నాయకులు కాంగ్రెస్‌తో పొత్తును వ్యతిరేకించారని, అయినా చంద్రబాబు ఏకపక్షంగా రాహుల్‌ను కలిశారని, కావున నిజమైన టీడీపీ నాయకులు ఆయన నిజ స్వరూపాన్ని గమనించాలని సూచించారు. ఎంతో సీనియర్ అయిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి లాంటి వారికే కనీస సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమయ్యారంటే ఆ పార్టీలో ఎందుకు ఉండాలో వారే ఆలోచించుకోవాలన్నారు. రాహుల్ తీరు సిగ్గుచేటు రాహుల్‌గాంధీని పప్పుసుద్ద అన్న మొదటివ్యక్తి చంద్రబాబే అని, అలాగే సోనియాను ఇటలీ దెయ్యమని, గాడ్సే, అవినీతి అనకొండ అని విమర్శించిన తీరును రాహుల్‌గాంధీ గతం గతః అనుకోవడం సిగ్గుచేటని బీవై రామయ్య విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వస్తున్న ఆదరణ చూసి సీఎంకు భయం పట్టుకుందని, అందువల్లే స్వార్థం కోసం రాష్ట్రాన్ని రెండు ముక్కలుచేసిన కాంగ్రెస్‌తో చేతులు కలుపుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టీడీపీ పొత్తును ప్రజలెవరూ అంగీకరించరని, 2014లో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే టీడీపీకి 2019లో పడుతుందని అన్నారు. ఆ పార్టీ దుకాణం బంద్ చేసుకొని చంద్రబాబు ఢిల్లీకి పారిపోతారన్నారు. మాట తప్పని, మడమ తిప్పని రాజకీయాలు చేయడం ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డికే సాధ్యమన్నారు. నమ్ముకున్న విలువలే ఆయన్ను 2019 ఎన్నికల్లో సీఎం కుర్చీపై కూర్చోబెడతాయన్నారు. -
‘చంద్రబాబులోని రాక్షసత్వం బయటపడింది’
సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై విచారణ పారదర్శకంగా జరగడం లేదని ఆ పార్టీ కర్నూలు జిల్లా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం వైఎస్సార్ సీపీ కర్నూలు జిల్లా కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ.. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరు చూస్తే.. దీనికి వారే ప్లాన్ చేసినట్టు స్పష్టం అవుతోందన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కూడా స్పందించని చంద్రబాబులోని రాక్షసత్వం ఇప్పుడు బయటపడిందని వ్యాఖ్యనించారు. టీడీపీ నేతల అవినీతి, అక్రమాలకు ఒక్క వైఎస్ జగన్ మాత్రమే అడ్డుగా ఉన్నారని భావించి.. పథకం ప్రకారం ఆయనను తుదముట్టించాలని చూశారని ఆరోపించారు. వైఎస్ జగన్‌పై ఆయన తల్లి, చెల్లి దాడి చేయించారని అనడానికి టీడీపీ నేతలకు సిగ్గు అనిపించడం లేదా అని మండిపడ్డారు. చంద్రబాబుపై అలిపిరిలో జరిగిన దాడి వెనుక ఆయన భార్య భువనేశ్వరి, తనయుడు లోకేశ్ ఉన్నారంటే ఒప్పుకుంటారా అని వారిని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి మాట్లాడుతూ.. కుట్రలతో పొడిచి చంపాలని చూసినా చిరునవ్వుతో హత్యాయత్నం నుంచి బయటపడిన నేత వైస్ జగన్ అని అన్నారు. వైఎస్ జగన్‌పై దాడి చేయడమే కాకుండా వైఎస్సార్ సీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. రాష్ట్రంలో అలజడి రేపాలని టీడీపీ నేతలు ప్రయత్నించారని ఆమె విమర్శించారు. అలాగే ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ.. నిష్పాక్షపాతంగా విచారణ జరగాలంటే స్వతంత్ర విచారణ సంస్థతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్‌కు రాష్ట్రంలో సరైన భద్రత లేదని.. ఆయనకు భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని హఫీజ్ ఖాన్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అన్నారు. -
‘కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు’
సాక్షి, కర్నూలు : ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దాడి ఘటనపై టీడీపీ నాయకులు స్పందించిన తీరు బాధాకరమని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతినేతపై జరిగిన దాడిని ఖండించకపోగా కనీసం సానుభూతి కూడా తెలుపకుండా ముఖ్యమంత్రి, టీడీపీ మంత్రులు మానవ మృగాలుగా వ్యవహరించారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎంపీలను చంద్రబాబు రాజకీయ శిఖండులుగా మార్చుకున్నారని విమర్శించారు. చంద్రబాబుకు అమ్ముడు పోయి, పార్టీ మారిన ఫిరాయింపుదారులు దిగజారుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సానుభూతి కోసమే వైఎస్ జగన్ దాడి చేయించుకున్నారని మాట్లాడటం వారి దగా కోరు రాజకీయాలకు పరాకాష్ట అన్నారు. వైఎస్ జగన్ పేరు ఎత్తే అర్హత కూడా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు లేదన్నారు. కుట్రలు, కుతంత్రాలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. ప్రజల్లో వైఎస్ జగన్‌కు వస్తున్న జనాదరణ చూసి ఓర్వలేకనే దాడులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో టీడీపీ హత్యా రాజకీయాలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై జరిగిన దాడి ఘటననే పరాకాష్ట అన్నారు. సొంత మామను, పార్టీ నాయకులను అడ్డుతొలగించుకున్న చంద్రబాబు, రాజకీయ ప్రత్యర్థులను అంతం చేయడానికి రాజకీయ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేవుని దయ, ప్రజల దీవెనల వల్లే వైఎస్ జగన్‌కు ప్రాణాపాయం తప్పిందని రామయ్య పేర్కొన్నారు. -
జిల్లాకు ఏం చేశారో చెప్పండి?
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జిల్లాకు ఏమి చేశారో చెప్పాలని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య డిమాండ్ చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి జిల్లాకు..ఈ పనిచేశానని గుండెల మీద చేయి వేసుకోవాలని చెప్పాలన్నారు. డిప్యూటీ సీఎంగా ఉండి పత్తికొండ నియోజకవర్గంలోని హంద్రీ–నీవా కాలువ నుంచి చెరువులకు నీళ్లు నింపుకోలేకపోయారని విమర్శించారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకరరెడ్డి తన ప్రాంత రైతులకు సాగునీటి కోసం ప్రభుత్వంపై ఎలా ఒత్తిడి తెచ్చి సాధించుకున్నారో చూసి నేర్చుకోవాలని సూచించారు. తమ్ముడు కేఈ ప్రభాకర్‌కు ఎమ్మెల్సీ ఇప్పించుకోవడం కోసం రాత్రిళ్లు నిద్రపట్టడడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భాలు కేఈ కృష్ణమూర్తి మరచి పోయారా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారం బీసీలకే సిగ్గుచేటన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే అర్హత డిప్యూటీ సీఎంకు లేదన్నారు. సీఎం చంద్రబాబునాయుడు మెప్పు కోసం తమ పార్టీ అధినేతను విమర్శించడం మంచిపద్ధతి కాదన్నారు. ఎన్నికల కోసమే నిరుద్యోగ భృతి వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల కోసమే నిరుద్యోగ భృతి రూ.1000 ఇస్తున్నారన్నారు. గత ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉన్నాయన్నారు. భృతిని మాత్రం మంత్రి లోకేష్‌నాయుడు 10 లక్షలకు కుదించారన్నారు. అందులోనూ ఆరు లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే 2.20 లక్షల మందికే రూ.వెయ్యి భృతి మంజూరైందన్నారు. ఇది ముమ్మాటీకీ నిరుద్యోగులను దగా చేయడమేనన్నారు. కొందరు నిరుద్యోగులు భృతి తీసుకుంటే ఎక్కడ ఉద్యోగాలు ఇవ్వమంటారోనని చేసిన దరఖాస్తులను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కోడుమూరు నియోజకర్గ ఇన్చార్జి మురళీకృష్ణ, నాయకులు సీహెచ్ మద్దయ్య, మదారపు రేణుకమ్మ, కర్నాటి పుల్లారెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, అనుమంతరెడ్డి, నాగరాజుయాదవ్, డీకే రాజశేఖర్, కరుణాకరరెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, కటారి సురేష్, రైల్వే ప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డి, కొనేటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. బీజేపీపై వైఎస్సార్సీపీ పోరాటాలుకనిపించడంలేదా? ప్రత్యేక హోదా కోసం 2014 నుంచి బీజేపీపై వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ చేస్తున్న పోరాటాలు కనిపించడంలేదా అని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తిని బీవై రామయ్య ప్రశ్నించారు. హోదా కోసం బం ద్లు, దీక్షలు, నిరసనలు, రాస్తారోకోలు, యువ భేరీలు, అవిశ్వాస తీర్మానాలు, ఎంపీల రాజీనామాలు..ఎవరిపై చేపట్టినట్లో చెప్పాలన్నారు. బీజేపీతో నాలుగున్నరేళ్ల పాటు కలిసి ఉండి.. బయటకు వచ్చి ఇప్పుడు ధర్మ పోరాటాలు చేస్తే ఏమి లాభమని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఒంటిరిగా పోటీ చేసే దమ్ములేక రాష్ట్రాన్ని అడ్డుగోలుగా విభ జించిన కాంగ్రెస్‌తో ఏ ముఖం పెట్టుకొని పొత్తు పెట్టుకుంటున్నారని, ఈ విషయంపై చంద్రబాబునాయుడిని కేఈ నిలదీయాలని సూచించారు. -
‘ఆయన అనుభవం చంద్రబాబు భజన చేయటానికే!’
సాక్షి, కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుభవం చంద్రబాబు భజన చేయటానికి, జగన్మోహన్ రెడ్డిని విమర్శించటానికే పరిమితం కావటం శోచనీయమని వైఎస్సార్ సీపీ నేత బీవై రామయ్య వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేఈ తన స్థాయి మరిచి వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలనలో జరిగిన అక్రమాలపై వాస్తవాలు చెప్పే ధైర్యం కేఈకి లేదని మండిపడ్డారు. ఉపముఖ్యమంత్రిగా ఉంటూ నాలుగున్నరేళ్లలో జిల్లా ప్రజలకు చేసిన మేలు ఏమిటో చెప్పగలరా అని ప్రశ్నించారు. వైసీపీ నవరత్నాలను విమర్శిస్తున్న కేఈ! ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి పాచిపోయిన లడ్డూలు రుచి చూడలేదా అంటూ ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గంలోని చెరువులను నింపుకోలేని అసమర్థ ఉపముఖ్యమంత్రి అని విమర్శించారు. కుటుంబసభ్యుల రాజకీయ పదవుల కోసం ఆత్మవంచన చేసుకుంటున్నారని అన్నారు. ప్రతిపక్ష నాయకునిపై అనవసర విమర్శలు చేయటం మానుకోవాలని హితవుపలికారు. -
వైఎస్సార్సీపీ యూఏఈ ఆధ్వర్యంలో దుబాయ్‌లో వేడుకలు
దుబాయ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తి అవుతున్న సందర్భంగా వైఎస్సార్ సీపీ యూఏఈ వింగ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐలు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కర్నూలు వైఎస్సార్సీపీ పార్లమెంటు అధ్యక్షులు బీవై రామయ్య హాజరయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చిత్ర పటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్కడ నివసిస్తోన్న తెలుగువారు, రామయ్య దృష్టికి గల్ఫ్ సమస్యలను తీసుకెళ్లారు. వారి సమస్యలను విన్న రామయ్య, పార్టీ అధ్యక్షుల దృష్టికి ఈ సమస్యలను తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా దుబాయ్‌లో ఉన్న ఉద్యోగులందరూ ముక్తకంఠంతో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని బీవై రామయ్యకు మాట ఇచ్చారు. యూఏఈ కమిటీ కన్వీనర్స్ రమేశ్ రెడ్డి, సోమిరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, యాసిన్, కుమార్ చంద్ర, అక్రమ్, కర్ణ, కోటేశ్వర్ రెడ్డి, దిలీప్ రెడ్డి, నర్సింహా రెడ్డి, రమణా రెడ్డి తదీతరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
ధర్మ పోరాటం..అపహాస్యం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తెలుగుదేశం పార్టీ శనివారం కర్నూలులో నిర్వహించిన ధర్మపోరాట సభ అపహాస్యమైందని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. నాలుగు జిల్లాల నుంచి జనాన్ని తరలించినా పది వేల మందికి మించలేదని, ఆ పార్టీ బలమెంతో తేలిపోయిందన్నారు. కర్నూలులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార దుర్వినియోగం చేసి ఆర్టీసీ బస్సుల్లో ఇతర జిల్లాల నుంచి ధర్మపోరాట సభకు ప్రజలను తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని భయపెట్టి సీఎం సభకు తీసుకొచ్చారని, ఈ క్రమంలో మిడ్తూరు మండలం చెరకుచెర్లకు చెందిన అయ్యస్వామి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారన్నారు. హోదా అడిగితే కేసులు పెట్టారు.. నాలుగేళ్లు బీజేపీతో కలసి ఉండి ఏమీ సాధించలేకపోవడంతో ప్రజలు తన్ని తరిమేస్తారన్న భయంతో సీఎం చంద్రబాబునాయుడు..బయటకు వచ్చి అధర్మ ఉపన్యాసాలు ఇస్తున్నారని బీవై రామయ్య అన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి..నాలుగేళ్ల నుంచి చెబుతున్నా పట్టించుకోకుండా ఇప్పుడు టీడీపీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ధర్మ పోరాటాలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. హోదా అడిగిన ప్రతిపక్ష పార్టీ నాయకులు, విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులపై కేసుల పెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. హోదా తెచ్చే సత్తా, సామర్థ్యం జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డికే ఉన్నాయన్నారు. జిల్లాలో పది రకాల హబ్‌లు ఏర్పాటు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి.. పబ్బులు మాత్రం నిర్మించి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. పోరాటంలో ధర్మం లేదు.. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడికి ధర్మ పోరాటం చేసే హక్కు లేదన్నారు. హోదా కోసం టీడీపీ చేసే ధర్మ పోరాటంలో ధర్మం లేదన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డే స్వయంగా.. ధర్మ పోరాటాలు అనవసరమని చెప్పడం ఇందుకు నిదర్శమన్నారు. డబ్బులు ఇచ్చి మద్యం పోస్తామన్నా.. టీడీపీ సభలకు జనాలు రావడంలేదని పత్తికొండ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి అన్నారు. జిల్లాకు ఎన్నో హామీలను ఇచ్చిన చంద్రబాబు.. ఒక్కదానిని కూడా పూర్తిగా అమలు చేయలేదన్నారు. కర్నూలు సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి సీఎం సభకు మందిని రప్పించలేకపోయారని, కర్నూలులో ఆ పార్టీ ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోందన్నారు. సమస్యలు పరిష్కరించాలని నిరసన చేపట్టిన విద్యార్థులపై కేసులు పెట్టడం అన్యాయమన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ కో– ఆర్డినేటర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ..తమ నియోజకవర్గానికి చెందిన అయ్యస్వామి మృతికి రోడ్డు ప్రమాదం కారణం కాదని..ఇది టీడీపీ ప్రభుత్వం చేసిన హత్య అన్నారు. రెండు నెలల క్రితం వచ్చిన పింఛన్ తీసివేస్తామని బలవంతంగా తీసుకొచ్చారని విమర్శించారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన విద్యార్థులతో మాట్లాడే సమయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవ్వకుండా అరెస్టు చేయించడం ఎంత వరకు సబబన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చెరకుచెర్ల రఘురామయ్య, కర్నాటి పుల్లారెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, బెల్లం మహేశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి, ఫిరోజ్, గోపాల్‌రెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డి, కొనేటి వెంకటేశ్వర్లు, కరుణాకరరెడ్డి, వినీత్‌రెడ్డి, రైల్వే ప్రసాద్, ధనుంజయాచారి, శివశంకర్ నాయుడు, మహేశ్వరరెడ్డి, మహిళా నాయకురాలు రేణుకమ్మ, డాక్టర్ శశికళ, విజయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
హబ్‌లు కాదు పబ్‌లు వచ్చాయి
కర్నూలు సీక్యాంప్: జిల్లాలో పారిశ్రామిక హబ్, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు మాటిచ్చారని, అయితే హబ్ కాకుండా ప్రతీ వీధికి పబ్‌లను మాత్రం వచ్చాయని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. కర్నూలు మండలం పసుపల గ్రామంలో పార్టీ మైనార్టీ నాయకుడు కొట్టముల్లా మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచారని, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడం ఆయనకు పెద్ద విషయం కాదన్నారు. ఎన్నికల సమయంలో వందల సంఖ్యలో హామీలు ఇచ్చి ఎన్నికలు ముగిసిన వెంటనే వాటిని మర్చిపోవడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. మోసం చేయడంలో ఆయనకు ప్రత్యేక డిగ్రీలు ఉన్నాయని విమర్శించారు. వాల్మీకులను ఎస్టీ, రజకులను, నాయి బ్రాహ్మణులను ఎస్సీ జాబితాలోకి చేర్చుతానని హామీలు ఇచ్చి.. ఇప్పుడు ఆ వర్గాల వారిని బెదిరిస్తున్నారన్నారు. కులాల మధ్య కుంపటి పెట్టడం, రాజకీయంలో ధన ప్రవాహాన్ని పారించడం చంద్రబాబుకు పరిపాటుగా మారిందన్నారు. ఇలాంటి కుట్ర పూరిత రాజకీయాలు చేసేవారిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీతో నాలుగున్నర సంవత్సరాలు అంటకాగి ఇప్పుడు ముస్లిం మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తానని కల్లబొల్లి మాటలు చెబుతున్నారన్నారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకుందాం.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరువెంకటరెడ్డి మాట్లాడుతూ..మాట తప్పని, మడమ తిప్పని జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలు అమలై ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మురళీకృష్ణ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేయాలన్నారు. టీడీపీ మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు రేమట మునిస్వామి, వెంకట్రాముడు, కర్నూలు మండలం ఎస్సీసెల్ అధ్యక్షుడు పసుపల నాగరాజు, రవికుమార్, అయ్యన్న, ప్రభాకర్, చంద్ర, ప్రదీప్, వెంకటేశ్వర్లు, దొడ్డిపా డు మహబూబ్‌బాష, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఫిరోజ్ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరిక పసుపల గ్రామానికి చెందిన 20మంది టీడీపీ నాయకులు ఆదివారం వైఎస్సార్సీపీలో చేరారు. నాలుగున్నర సంవత్సరాలైనా టీడీపీ ప్రభుత్వం మాటలు చెబుతుంది తప్పా ప్రజా ప్రయోజనకరమైన పనులు చేయడం లేదని టీడీపీ నాయకుడు, పసుపల మాజీ ఉపసర్పంచ్ ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. పార్టీలో చేరిన వారిలో ప్రతాప్‌రెడ్డి, అన్సర్‌బాషా, కమలాకర్, ప్రదీప్, మహేశ్, రాఘవేంద్ర, అనిల్‌కుమార్, రఘు, గరీబ్‌బాషా, మాబాషా, సుల్తాన్‌మియ్యా, మున్నాభాయ్ తదితరులు ఉన్నారు. -
యువనేస్తం.. అడుగడుగునా మోసం..
సాక్షి, కర్నూలు : ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నిరుద్యోగ యువతను సీఎం చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిల్పాచక్రపాణి రెడ్డి, బీవై రామయ్య, ఎమ్మెల్యే ఐజయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్లు దుయ్యబట్టారు. శుక్రవారం జిల్లాలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వాస్తవానికి పది శాతం మంది నిరుద్యోగులకు కూడా భృతి అందడం లేదని చెప్పారు. గతంలో సుమారు రెండు కోట్ల మందికి రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భృతిని కల్పిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు, నాలుగేళ్ల తర్వాత కేవలం 12 లక్షల మందికి రూ. వెయ్యి చొప్పున భృతి కల్పిస్తామని యూటర్న్ తీసుకున్నారని వివరించారు. నయవంచనకు, మోసానికి, వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబని అన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తంతో ప్రభుత్వం చేసిన ప్రకటన కోట్లాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లిందని చెప్పారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. వివిధ శాఖల్లో 1.80 లక్షల ఖాళీలు ఉంటే కేవలం 20 వేల పోస్టులు భర్తీ చేయడమేంటని నిలదీశారు. పదవి కోసం బూటకపు హామీలు ఇచ్చిన బాబు పప్పులు ఇక ఉడకవని పేర్కొన్నారు. కాపులు మొదలుకుని మైనార్టీల దాకా అందరినీ బాబు మోసం చేశారని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్ల పేరిట వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టులను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పాదయాత్రకు కాపు సోదరులు ఇస్తున్న మద్దతు చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఏ సామాజికవర్గ హక్కులకు, డిమాండ్లకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ. 10 వేల కోట్లు ప్రకటించడం వైఎస్ జగన్ దూరదృష్టికి నిదర్శనం అని అన్నారు. గోబెల్స్ ప్రచారంతో చంద్రబాబు వైఎస్ జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని తెలిపారు. చైతన్యవంతులైన ప్రజలు ఈ విషయాలను నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త టీడీపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. -
ఇది ప్రజా విజయం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ను విఘ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పినా..ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విజయవంతం చేశారని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఇప్పటికైనా బీజేపీ, టీడీపీలు డ్రామాలను కట్టిపెట్టి హోదాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. బుధవారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో వారు విలేకరులతో వారు మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని పార్లమెంట్లో అవిశ్వాసం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పడంతో వైఎస్సార్సీపీ బంద్‌కు పిలుపునిచ్చిందన్నారు. ఈ విషయాన్ని మరచిన తెలుగుదేశం ప్రభుత్వం.. పోలీసుల సాయంతో బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసినా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బంద్‌ను పాటించారన్నారు. కొందరు పోలీసు అధికారులు తమ పార్టీ నాయకుల అరెస్టు చేసే సమయంలో అతిగా వ్యవహరించారని, మహిళలపై దురుసుగా ప్రవర్తించారన్నారు. కొన్ని పార్టీల వైఖరి తేటతెల్లం... ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్‌తో ప్రత్యేక హోదాపై కొన్ని పార్టీల వైఖరి తేటతెల్లమైందని బీవై రామయ్య, ఐజయ్య అన్నా రు. ప్రత్యేక హోదా కోసం గతంలో అనేక పార్టీలు బంద్‌కు పిలుపునిస్తే వైస్సార్సీపీ పాల్గొన్నదన్నారు. అయితే వైఎస్సార్సీపీ ఇచ్చిన బంద్‌కు మాత్రం పాల్గొనకూడదని కొందరు నాయకులు బహిరంగ వ్యాఖ్యలు చేయడంతో వారికి ప్రత్యేక హోదాపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు అర్థరహితం... బంద్‌లతో ఏమి సాధిస్తారని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యానించడాన్ని బీవై రామయ్య, ఐజయ్య తప్పుపట్టారు. కేంద్ర ప్రభుత్వంపై మొదటి సారి అవిశ్వాస తీర్మానం ఇచ్చిన ఘనత వైఎస్ఆర్సీపీదేనన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పగలు బీజేపీతో..రాత్రి కాంగ్రెస్‌తో కలసి ఏపీ హక్కులను కాలరాస్తున్నారన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు పెట్టుకుంటానంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్న కేఈ కృష్ణమూర్తి..ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అదే పని చేస్తానని ఎందుకు చెప్పడం లేదన్నారు. ఎస్వీ వ్యాఖ్యలు శోచనీయం.. కర్నూలు సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ.. కర్నూలులో ప్రజలే స్వచ్ఛందంగా ముం దుకు వచ్చి బంద్‌ను విజయవంతం చేశారని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి గమనించాలన్నారు. బంద్ సక్సెస్ కాలేదని ఆయన వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో మృతిచెందిన వైఎస్సార్సీపీ నాయకుడు దుర్గారావుకి సంతాపం ప్రటించారు. కోడుమూరు నియోజకవర్గ ఇన్చార్జి మురళీకృష్ణ, రాష్ట్ర నాయకులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మద్దయ్య, కర్నాటి పుల్లారెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, హనుమంతరెడ్డి, కృష్ణారెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, ఫిరోజ్, పోలూరు భాస్కరరెడ్డి, సలోమి, విజయకుమారి, రమణ, బెల్లం మహేశ్వరరెడ్డి, పర్ల ఆశోకవర్ధన్రెడ్డి, ఆసిఫ్, శ్రీనివాసరెడ్డి, భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ మాటలను ప్రజలు నమ్మరు.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్సే ఇప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామంటే ప్రజలెవరూ నమ్మే స్థితిలో లేరని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఆ పార్టీకి మరో 15 ఏళ్ల పాటు రాష్ట్రంలో అడ్రస్ ఉండదన్నారు. రాష్ట్రబంద్‌ను విఘ్నం చేయాలని చూసి టీడీపీ.. ప్రత్యేక హోదాకు వ్యతిరేకమని నిరూపించుకుందన్నారు. -
‘దుర్గారావుది మరణం కాదు.. హత్య’
సాక్షి, కర్నూలు : చంద్రబాబు మోసానికి, ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదాలు అని ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే ఐజయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు తొత్తులుగా మారిన పోలీసులు పచ్చ చొక్కాలేసుకొని హోదా ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజల సంకల్పం ముందు బాబు కుట్రలు, ఖాకీల కర్కశత్వం తుడిచిపెట్టుకు పోయాయని విమర్శించారు. బంద్‌లో పాల్గొని గుండెపోటుతో మృతి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త దుర్గారావు కుంటుంబానికి సానుభూతిని తెలిపారు. హోదా పోరులో వైఎస్సార్సీపీ సైనికుడు అశువులు బాయటం బాధాకరమని పేర్కొన్నారు. దుర్గారావుది మరణం కాదని చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. ఒక్క రోజు బంద్‌కు పిలుపు నిస్తే అదేదో నేరం అన్నట్లు, ప్రజలు దేశ ద్రోహులు అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ చేట్టిన బంద్‌ను ప్రభుత్వం విఫలం చేయలేదని ప్రజలే భగ్నం చేశారని డిప్యూటి సీఎం కేఈ క్రిష్ణమూర్తి అనడం సిగ్గుచేటన్నారు. ఒక్కరోజు బంద్‌తో హోదా వస్తుందా అన్న కేఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని విమర్శించారు. హోదా పోరాటంలో యూటర్న్ తీసుకుంది చంద్రబాబేనని ఆరోపించారు. నమ్మక ద్రోహం చేసి ఫిరాయించిన మంత్రులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఫిరాయింపుతో వచ్చిన మంత్రి పదవి శాశ్వతం కాదని అఖిలప్రియ తెలుసుకోవాన్నారు. ప్రత్యేక హోదా బంద్‌తో ఎవరు ఎటువైపో తేలిపోయిందన్నారు. ధ్వంద ప్రమాణాల రాజకీయ పార్టీల నైజం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. హోదా కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. -
నేడు ప్రత్యేక బంద్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌కు జిల్లాలో సానుకూల స్పందన లభిస్తోంది. ఉద్యోగ, వ్యాపార, వాణిజ్య, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించేందుకు ముందుకు వచ్చాయి. జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలు మంగళవారం సెలవు ప్రకటించాయి. ఇదే బాటలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు కూడా నడిచే అవకాశం ఉంది. మరోవైపు పీడీఎస్‌యూ, వైఎస్‌ఆర్‌ఎస్‌యూ, ఏఐఎస్ఏ, ఎంఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు బేషరతుగా బంద్‌కు మద్దతును ప్రకటించాయి. ఏపీయూడబ్ల్యూజే, పలు బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల విద్యార్థి, యువజన, మహిళా నాయకులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేసేందుకు ముందుకు వచ్చారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌కు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన చేయడంతో సంపూర్ణమవుతుందని భావిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా బంద్‌కు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. హోదా కోసం ఎందాకైనా.. నాలుగేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్సార్సీపీ నాయకులు ప్రణాళికలు రూపొందించుకున్నారు. మంగళవారం బంద్ సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, క్యాండిల్ లైట్ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం ఎలా డ్రామాలు ఆడుతుందో.. ఐదు కోట్ల మంది ఆకాంక్షను సీఎం చంద్రబాబు నాయుడు ఎలా తాకట్టు పెట్టారో వివరించనున్నారు. డిపోలకే పరిమితం కానున్న ఆర్టీసీ బస్సులు దేశవ్యాప్త సమ్మెతో ప్రస్తుతం లారీల రాకపోకలు స్తంభించి పోయాయి. ఇప్పటికే నాలుగు రోజులుగా లారీలు రోడ్డు ఎక్కడం లేదు. ఈనేపథ్యంలో మంగళవారం రాష్ట్రబంద్ కావడంతో రహదారులపై వాహనాల రాకపోకలు పూర్తిగా స్తంభించేపోయే అవకాశం ఉంది. జిల్లాలోని ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కానున్నాయి. ప్రతి ఒక్కరూ సహకరించాలి: ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం బంద్ చేపడుతున్నాం. ఇందుకు జిల్లాలోని ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయులు, వ్యాపారులు..అన్ని వర్గాల ప్రజలు ముందుకు వచ్చి ప్రత్యేక హోదా కాంక్షను వినిపించాలి. హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఉదయం 5 గంటల నుంచే బస్సుల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ప్రజలు మంగళవారం ఒక్క రోజు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. అత్యవసరం అనుకుంటే బయటకు వచ్చి ఇబ్బంది పడకూడదు. ఏపీకి సంజీవని అయిన ప్రత్యేక హోదా కోసం కొన్ని ఇబ్బందులు తలెత్తినా భవిష్యత్ తరాల కోసం సర్దుకోవాలి. బంద్‌ను సంపూర్ణవంతం చేసి హోదా సెగ ఢిల్లీకి తాకేలా నినదించాలి. -
రాష్ట్రబంద్ విజయవంతం చేయండి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 24న రాష్ట్రబంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పాణ్యం, నందికొట్కూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ హఫీజ్ ఖాన్ పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. నాలుగేళ్ల నుంచి తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి యువభేరీలు, బంద్‌లు, ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేస్తూ హోదా అంశాన్ని సజీవంగా ఉంచారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇందుకు భిన్నంగా.. ఓటుకు కోట్లు కేసు నుంచి బయటపడేందుకు హోదా అంశాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టారన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర అన్యాయం చేశారన్నారు. పార్లమెంట్ వేదికగా హోదా ఇవ్వబోమని బీజేపీ చెప్పినా టీడీపీ వైఖరిలో ఏ మాత్రం మార్పు రాలేదన్నారు. హోదా సాధన కోసం ఎంపీల రాజీనామాలు అడిగితే పట్టించుకోవడం లేదన్నారు. టీడీపీ, బీజేపీల తీరును నిరసిస్తూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చిట్లు చెప్పారు. ఈ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు తెర్నేకల్ సురేంద్ర్రెడ్డి, రెహమాన్, కర్నాటి పుల్లారెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయాచారి, జిల్లా నాయకులు మదారపు రేణుకమ్మ, కరుణాకరరెడ్డి, పిట్టం ప్రతాప్‌రెడ్డి, శౌరీ విజయకుమారి, ఆదిమోహన్‌రెడ్డి, భాస్కరరెడ్డి, రమణ తదితరులు పాల్గొన్నారు. టీడీపీది అవకాశవాద రాజకీయం టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లవి అవకాశవాద రాజకీయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి విమర్శించారు. ఎన్డీఏ నుంచి బయటకి వచ్చి బీజేపీతో యుద్ధం చేస్తున్నామని టీడీపీ చెబుతున్నా...సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం తమకు మిత్రపక్షమేనని కేంద్ర çహోంశాఖమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారన్నారు. స్వప్రయోజనాల కోసం హోదాను తాకట్టుపెట్టిన చంద్రబాబునాయుడుకు రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదన్నారు. చంద్రబాబుకు పరాభవం తెలుగుదేశం, బీజేపీ డ్రామాలను భారతదేశమంతా చూసిందని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య తెలిపారు. అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని దించేందుకు అన్ని రాజకీయ పక్షాలు మద్దతును కూడగట్టామని తెలుగుదేశం పార్టీలు నాయకులు చెప్పారన్నారు. అయితే ఓటింగ్‌లో అనుకూలంగా పాల్గొన్నది 126 మంది మాత్రమేనన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి తీవ్ర పరాభవం ఎదురైందన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో చంద్రబాబును పోల్చుకోలేమన్నారు. టీడీపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి ప్యాకేజీ బాగుందని నరేంద్రమోదీ, అరుణ్‌జైట్లీలకు సన్మానం చేసినప్పుడు ఏపీకి జరిగిన అన్యాయం తెలియరాలేదా అని సీఎం చంద్రబాబునాయుడును వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్రెడిడ్డి ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం చేసిన టీడీపీతోపాటు బీజేపీని కూడా వైఎస్సార్సీపీ విమర్శిస్తూనే ఉందన్నారు. ప్రత్యేక హోదా పోరాట విషయంలో సీఎం, టీడీపీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. బీజేపీతో కొనసాగుతున్న టీడీపీ పొత్తు ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబునాయుడుకు దమ్మూ, ధైర్యం ఉంటే టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి తమ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి చెప్పిన విధంగా నిరాహార దీక్షలకు ముందుకు రావాలని కర్నూలు సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్ సవాల్ విసిరారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ బీజేపీతో అనధికారికంగా పొత్తును కొనసాగిస్తూ ముస్లిం ఓట్ల కోసం వైఎస్సార్సీపీపై నిందలు వేస్తోందన్నారు. తమ పార్టీకి బీజేపీతో ఎలాంటి అధికార, అ నధికార పొత్తుగాని, అవగాహన లేవన్నారు. ఈ విషయంలో ముస్లింలెవరూ టీడీపీ ఆరోపణలను నమ్మవద్దని సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందన్నారు. -
బాబుకు బీసీలంటే చులకన
సాక్షి, ఆదోని (కర్నూలు): టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి బీసీలంటే చులకన అని, ఇందుకు ఎన్నో ఘటనలు సాక్ష్యాలుగా ఉన్నాయని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. పట్టణ శివారులోని బాబా గార్డెన్లో శనివారం నిర్వహించిన ఆదోని నియోజకవర్గస్థాయి బూత్ కమిటీ కన్వీనర్లు, సభ్యుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఎన్నికల ముందు వాల్మీకులు, రజకులు, నాయీబ్రాహ్మణులు, బెస్త కులాల వారిని ఎస్టీలో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. అలాగే బలిజ, కాపు కులాలను బీసీల్లో చేర్చుతామంటూ వాగ్దానం చేశారన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలను మరచిపోయారని, ఎవరైనా గుర్తు చేస్తే ఆగ్రహం వ్యక్తం చేయడం పరిపాటిగా మారిందన్నారు. గిమ్మిక్కులు చేసి ఓట్లు దండుకోవడంలో చంద్రబాబును మించినోళ్లు దేశంలోనే లేరన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. టీడీపీ వర్గాలకు లాభం చేకూర్చేవిగా ఉంటున్నాయని విమర్శించారు. గోబెల్స్ ప్రచారం బీజేపీతో తెగతెంపులు చేసుకున్నట్లు గోబెల్స్ ప్రచారం చేస్తూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని బీవై రామయ్య అన్నారు. బీజేపీతో టీడీపీ మితృత్వం కొనసాగుతోందని హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రసంగం ద్వారా పార్లమెంట్ సాక్షిగా తేటతెల్లమైందన్నారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీలకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రకటించిన నవరత్నాల పథకాలు అమలైతే ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి లబ్ధి పొం దుతారని, ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అలాగే చంద్రబాబు మోసాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలన్నారు. మళ్లీ స్వర్ణయుగం వస్తుంది.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తరహాలోనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన ఉంటుందని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. అధికారం లేకపోవడం వల్ల నాలుగేళ్ల పాటు ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని, మళ్లీ రాష్ట్రంలో స్వర్ణయుగం చూస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాసంకల్ప పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా లక్షల్లో తరలి వచ్చి జననేత అడుగులో అడుగు వేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీపై ప్రజలు పెట్టుకున్న ఆశ, విశ్వాసాలకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆయన చేసే గిమ్మిక్కుల్లో ప్రజలు చిక్కుకోకుండా అప్రమత్తం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక టీడీపీ నాయకులు భూ కబ్జాలకు, అవినీతి అక్రమాలకు పాల్పడుతూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోపాల్‌రెడ్డి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి డాక్టర్ మధుసూదన్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మునిస్వామి, పట్టణ గౌరవ అధ్యక్షుడు చంద్రకాంత్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు దేవా, మైనార్టీ నాయకులు సలీం, అమీన్, సునార్ అబ్దుల్ ఖాదర్, జిల్లా మైనార్టీ అధ్యక్షుడు అహ్మద్, సీనియర్ నాయకులు గోవిందరాజులు, రాముడు, మహిళా నాయకులు జిలేకాబీ, శ్రీదేవి, తాయమ్మ, శ్రీలక్ష్మీ, సౌమ్యారెడ్డి, రవిరెడ్డి, నాగేంద్ర, తిమ్మప్ప, విశ్వనాథరావు తదితరులు పాల్గొన్నారు. -
అవినీతిని అధికారికం చేశారు!
ఎమ్మిగనూరు(కర్నూలు): రాష్ట్రంలో టీడీపీ నేతలు.. నిబంధనలకు విరుద్ధంగా నీళ్లు, మట్టి, ఇసుక, ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ అవినీతిని అధికారికం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. వైఎస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ కె.జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన స్థానిక కుర్ని కల్యాణ మండపంలో శుక్రవారం బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పడంలో సీఎం చంద్రబాబును మించిన వారు లేరన్నారు. నిత్యం ప్రజలను మోసగిస్తూ.. అవినీతి, అక్రమాల్లో టీడీపీ అధినేత నంబర్‌వన్‌గా ఉన్నారన్నారు. పోలవరం, పట్టిసీమ అంటూ వేలకోట్ల రూపాయలు స్వయంగా ముఖ్యమంత్రి దోచుకుంటూ ఉంటే..జన్మభూమి కమిటీల పేరుతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, టీడీపీ నియోజకవర్గఇన్చార్జ్లు అందినకాడికి దండుకుంటున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో దేశంలో ఏపీలోనే ఎక్కువ అవినీతి జరిగిందని సర్వేలు తేటతెల్లం చేస్తున్నా.. చంద్రబాబు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో పూర్తి చేసిన ప్రాజెక్టులకు రంగులేసి తమ ఘనతగా చెప్పుకోవటం బాబుకే చెల్లిందన్నారు. ప్రజల కోసం..ఇచ్చిన మాట కోసం పదవులను త్యాగం చేసి, ఎన్నో కష్టాలు ఎదుర్కొన్న నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. చంద్రబాబులా దొడ్డిదారిలో ముఖ్యమంత్రి కావాలనుకొంటే 2011లోనే అయ్యేవారని, చంద్రబాబులా అబద్ధాలు చెప్పి ఉంటే 2014లోనే సీఎం అయ్యేవారన్నారు. వార్డు మెంబర్‌గా గెలవలేని కుమారుడిని దొడ్డిదారిలో మంత్రిని చేసిన ఘనత చంద్రబాబుదైతే..ఇచ్చిన మాట కోసం పదవులకు త్యాగం చేసి స్వంతంగా పార్టీ పెట్టి 5లక్షల పైచిలుకు మెజార్టీతో ఎంపీగా గెలుపొందిన చరిత్ర వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదన్నారు. అవినీతి సొమ్ముతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నారని, ఈ విషయం ప్రజలకు తెలుసన్నారు. ఎన్నికల్లో కార్యకర్తలు, బూత్ కమిటీ కన్వీనర్ల పాత్ర కీలకమని, చంద్రబాబులాంటి మోసగాడిని ఎదుర్కొనేందుకు మరింత జాగ్రత్తగా మెలగాలని సూచించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మిగనూరులో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రుద్రగౌడ్, కనకవీడు లక్ష్మీకాంత్‌రెడ్డి, కేఆర్ రాఘవరెడ్డి, బుట్టారంగయ్య, రియాజ్, రాజారత్నం, భీంరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, బీఎన్ నాగరాజు, భాస్కర్, సునీల్, గోవిందు, బంద, సయ్యద్‌చాంద్, గౌస్, పాలశ్రీనివాసరెడ్డి, మహిళా అధ్యక్షురాలు అన్నపూర్ణమ్మ, షబ్బీర్, యూకేరాజు, నజీర్, నగేష్, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నేతల అవినీతిని ఎండగడదాం: కె. జగన్మోహన్రెడ్డి టీడీపీ నేతలు చేస్తున్న అవినీతిని ఎండగడుతూ ప్రజలకు రక్షణగా నిలవాలని పార్టీ కార్యకర్తలకు, బూత్ కమిటీ కన్వీనర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కె.జగన్మోహన్రెడ్డి సూచించారు. ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి స్థానికంగా ఉండకుండా ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమ పథకాల్లో టీడీపీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. అన్న క్యాంటీన్ల పేరుతో ఇస్కాన్ సహాయాన్ని కూడా తమ గొప్పగా చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. పింఛన్లు, ఇళ్లు, సబ్సిడీ రుణాల మంజూరులో టీడీపీ నాయకులు ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మరుగుదొడ్ల నిర్మాణల్లోనూ తెలుగుతమ్ముళ్ల అవినీతిని విజిలెన్స్ అధికారులు నిగ్గుతేల్చారన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యం చేయాల్సిన బాధ్యత బూత్‌కమిటీ కన్వీర్లదే అన్నారు. -
బూత్ కమిటీలు కీలకంగా వ్యవహరించాలి
సాక్షి, మంత్రాలయం: బూత్ కమిటీలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలని, కావున కీలకంగా వ్యవహరించాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి సూచించారు. బుధవారం కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురం గ్రామ కల్యాణమండపంలో నియోజకవర్గంలోని 230 బూత్ కమిటీల కన్వీనర్లు, సభ్యుల సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి బూత్ కమిటీ సభ్యుడు పార్టీకి సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బూత్‌ల్లో ఓట్ల గల్లంతుపై పరిశీలించుకుని జాబితాలో నమోదు చేయించాలన్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీ సభ్యుల పేర్లు తొలగించే యత్నంలో ఉన్నారని, ఎప్పటికప్పుడు జాబితాలో పేర్లు పరిశీలించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో మీ కృషి, ప్రజల ఆశీర్వాదాలు తనకు మెండుగా ఉన్నాయన్నారు. రెండు పర్యాయాలు తనపై నమ్మకంతో ప్రజలు గెలిపించారన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈసారి ఎన్నికల్లోనూ కచ్చితంగా గెలుపొంది..వారి రుణం తీర్చుకుంటానన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర శ్రమతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. టీడీపీ నాయకుడు తిక్కారెడ్డి ఎన్ని కుతంత్రాలు పన్నినా తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. నూరు మంది తిక్కారెడ్డిలు తనపై పోటీకి నిలబడినా వారికి ఓటమి తప్పదన్నారు. గ్రామాల్లో చిచ్చు రేగేలా ఆయన ప్రసంగాలు చేయడం మానుకోవాలన్నారు. నిజాయితీకి నిలువుటద్దం జగనన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజాయితీకి నెలువెత్తు సాక్ష్యమని కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. సమావేశానికి అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన ప్రసంగించారు. అబద్ధపు మాటలు మాట్లాడటం జగనన్న జీవిత చరిత్రలో లేదన్నారు. వైఎస్ఆర్ కుటుంబంపై ప్రజల్లో ప్రగాఢ విశ్వాసం ఉందన్నారు. చంద్రబాబు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ఒక్క హామీని పూర్తిస్థాయిలో నెరవేర్చిన పాపాన పోలేదన్నారు. జగనన్న పాదయాత్రలో ప్రభంజనాన్ని చూసి చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టిందన్నారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్ల జాబితాలను తెప్పించుకుని ఓటరు జాబితాలో పేర్లు గల్లంతు చేసే నీచపు పనికి దిగజారారని మండిపడ్డారు. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముకలా అండగా నిలవాలన్నారు. జగనన్న హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర యూత్ కమిటీ సభ్యుడు వై.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి, మంత్రాలయం, కౌతాళం, కోసిగి మండలాల కన్వీనర్లు భీమిరెడ్డి, నాగరాజుగౌడ్, యిల్లూరి ఆదినారాయణశెట్టి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణరెడ్డి, సలహాదారుడు మద్దిలేటి, జెడ్పీటీసీ సభ్యుడు లక్ష్మయ్య, బూత్ కమిటీ మేనేజర్ బెట్టనగౌడ్, నియోజకవర్గ నాయకులు మురళీరెడ్డి, అత్రితనయగౌడ్, విరుపాక్షయ్యస్వామి, నాడిగేని నరసింహులు, నరసన్న, చిన్నతుంబళం సింగిల్‌విండో అధ్యక్షుడు రవీంద్ర, సర్పంచు రాజేంద్ర, ఎంపీటీసీ యల్లప్ప, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. -
లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపిన వైఎస్సార్సీపీ నాయకులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు సీఎం అభ్యర్థి కూడా ఫిరాయింపుదారులే అయినా ఆశ్చర్యపోనవసరం లేదని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు వచ్చే ఎన్నికల్లో బుట్టా రేణుక, ఎస్వీ మోహన్‌రెడ్డిని ప్రకటించి, మరోక్షంగా ఎన్నికలకు ముందే తమ పార్టీలోకి ఆ రెండు సీట్లు చేరేలా చేసిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి వైఎస్ జగన్మోహన్రెడ్డి తయారు చేసిన ఫిరాయింపు అభ్యర్థులే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా ఉంటారని, అంతకంటే ఆ పార్టీకి మరో గత్యంతరం లేదన్నారు. చంద్రబాబునాయుడి మానసిక స్థితి సరిగా లేకపోవడం, మంత్రి నారా లోకేష్ పప్పు లేదా ముద్ద పప్పు కావడంతో భవిష్యత్‌లో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థులుగా కూడా ఫిరాయింపుదారులే అయినా ఆశ్చర్యం లేదన్నారు. లోకేష్ పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీలేదు.. మంత్రి లోకేష్ పర్యటనతో జిల్లాకు ఒరిగిందేమీలేదని, ఆయన తన శాఖ పనితీరుపై కనీసం సమీక్షించకుండా సంబంధంలేని ఇరిగేషన్, హెల్త్, పీఆర్ శాఖలకు సంబంధించిన భవనాలను ప్రారంభించి ప్రజలను అయోమయానికి గురి చేశారని బీవై రామయ్య విమర్శించారు. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందని నిరసన వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడం దారుణమని, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంబీబీఎస్ ప్రవేశాల్లో రిజర్వేషన్ అభ్యర్థులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వాల్సిన మంత్రి, తన పరిధి కాదంటూ దాటవేయడం దారుణమన్నారు. అదే నిజమనుకుంటే ఇరిగేషన్, పీఆర్, హెల్త్ శాఖలకు సంబంధించిన భవనాలను ఎందుకు ప్రారంభించారని ప్రశ్నించారు. తండ్రిబాటలో అబద్ధాలు.. మంత్రి లోకేష్ అబద్ధాలు చెప్పడంలో తండ్రి చంద్రబాబునాయుడును మించిపోయారన్నారు. కర్నూలును దేశ రెండో రాజధానిగా డిమాండ్ చేస్తున్న ఆయన.. రాష్ట్రానికి రెండో రాజధానిగా ప్రకటించమంటే ఎందుకు తోక ముడుస్తున్నారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించడంలో నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న టీడీపీ.. ఇప్పుడు అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. దొడ్డిదారిలో మంత్రి అయిన లోకేష్‌కు తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. జగన్ వండర్..లోకేష్ బ్లండర్ : సిద్ధార్థరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్మోహన్రెడ్డి వండర్ అయితే, నారా లోకేష్ బ్లండర్ అని వైఎస్సార్సీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాల పరామర్శ కోసం ఢిల్లీ పెద్దలను ఎదిరించిన జగనన్నకు, ఓటుకు నోటు కేసుకు భయపడి ప్రత్యేక హోదాను అదే ఢిల్లీలో తాకట్టుపెట్టిన సీఎం చంద్రబాబునాయుడుకు నక్కకు నాగలోకానికున్నంత తేడా ఉందన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని బ్రాహ్మణకొట్కూరులో 2012లో ప్రారంభించిన ట్యాంకుకు రంగులు వేసి సమ్మర్ స్టోరేజ్ ట్యాం కుగా, కలెక్టర్, ఎంపీపీ ప్రారంభించిన పంచా యతీ కార్యాలయానికి లోకేష్ మళ్లీ శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటన్నారు. సొంత పార్టీ నాయకులపై నమ్మకం లేక జిల్లాలో మంత్రి, జెడ్పీ చైర్మన్, మార్కెట్ యార్డు చైర్మన్ తదితర పదవులన్నీ ఫిరాయింపుదారులకే కట్టబెట్టినట్లు జిల్లా నాయకుడు తోట వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీకి బలముంటే వెంటనే కర్నూలు మునిసిపల్ ఎన్నికలను నిర్వహించాలని సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్, అసెంబ్లీ సీట్లను ఫిరాయింపులకు ఇవ్వడం ద్వారా తమ విజయం మరింత సులువైందన్నారు. కార్యక్రమంలో నాయకులు రాష్ట్ర నాయకులు చెరుకుచెర్ల రఘురామయ్య, సీహెచ్ మద్దయ్య, ఎస్ఏ రెహమాన్, కర్నాటి పుల్లారెడ్డి, సత్యం యాదవ్, పర్ల శ్రీధర్‌రెడ్డి, ధనుంజయాచారి, రేణుకమ్మ, కరుణాకరరెడ్డి, కోనేటి వెంకటేశ్వర్లు, ఆసిఫ్, దాసు, సుధాకరరెడ్డి, మహేశ్వరరెడ్డి, చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘వైఎస్సార్ సీపీ ప్రొడక్ట్స్‌పై టీడీపీ మమకారం’
సాక్షి, కర్నూలు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపుదారులే కర్నూలు నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేస్తారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించడం, వారిని గెలిపించాలని పార్టీ నేతలను కోరడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో సొంత నాయకత్వంపై నేతలు నమ్మకం కోల్పోయారని అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో రామయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ నుంచి ఫిరాయించిన వారికి సీట్లను కేటాయింపు చేయడంతో టీడీపీ డొల్లతనం బయటపడిందని విమర్శించారు. ఇప్పటికే రాజకీయ వ్యభిచారం చేస్తున్న సీఎం చంద్రబాబు బాటలోనే లోకేష్ రాజకీయ ప్రయాణం సాగుతుందనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రొడక్టులపై టీడీపీ అధినాయకత్వం బాగానే మమకారం పెంచుకున్నట్లు ఉందని అన్నారు. రానున్న రోజుల్లో ఫిరాయింపుదారులను టీడీపీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసినా ఆశ్చర్యం లేదని చెప్పారు. కర్నూలులో 14 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలను వైఎస్సార్ సీపీ గెలవబోతోందని పేర్కొన్నారు. జిల్లాను ఐటీ హబ్‌గా మారుస్తానని బీరాలు పలికిన లోకేష్ ఆ దిశగా ఒక్క అడుగైనా వేశారా? అని ప్రశ్నించారు. జిల్లాలో అర్హులైన అభ్యర్థులు ఉన్నా వారికి ఐటీ ఉద్యోగాలు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో రిబ్బన్ కటింగ్‌లు, శంకుస్థాపనలతో హడావుడి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా తాగునీటి సమస్యను ఎదుర్కొంటోంది కర్నూలు జిల్లా అయితే, నాలుగేళ్లుగా ఇంఉకోసం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నిధులను కేటాయించలేదని ఆరోపించారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే వన్ కంట్రీ-వన్ ఎలక్షన్ (జమిలీ ఎన్నికలు)కు టీడీపీ భయపడుతోందని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. -
రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన
ఆత్మకూరు: రాష్ట్రంలో ధృతరాష్ట్రుని పాలన సాగుతోందని, ప్రజలు త్వరలోనే చరమ గీతం పాడనున్నారని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన ఆత్మకూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సంక్షేమ పథకాలన్నీ టీడీపీ కార్యకర్తలకే మంజూరు చేస్తున్నారన్నారు. అమరావతిలోని అసెంబ్లీని టీడీపీ కార్యాలయంగా మార్చారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలను ఒకవైపు మోసగిస్తూ..మరోవైపు తాము ధర్మపోరాటం చేస్తున్నామని నీతులు చెప్పడం సిగ్గు చేటన్నారు. పొదుపు మహిళలు, రైతులను రుణమాఫీ పేరుతో నిలువునా ముంచినందుకా దీక్షలు అంటూ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని సంతల్లా పశువుల్లా కొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారన్నారు. ప్రత్యేకహోదా కోసం వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తే అది డ్రామా అంటూ టీడీపీ వారు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని 25 మంది ఎంపీలనూ రాజీనామా చేయిస్తే కేంద్రం దిగి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి చెబుతున్నా.. ముఖ్యమంత్రి స్పందించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలోని బ్రాహ్మణులను సైతం చంద్రబాబు వదలలేదని, వారిపై నిందారోపణలు చేయడం బాధాకరమని అన్నారు. చంద్రబాబు తీరుతో ప్రజలు విసిగిపోయారని, రానున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. నాలుగేళ్ల పాలనలో టీడీపీ విఫలం: బీవై రామయ్య నాలుగేళ్ల పాలనలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు 600 హామీలిచ్చి అందులో 70 కూడా నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములను టీడీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని విమర్శించారు. నవనిర్మాణ దీక్షల పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలకు ఏమి మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. హామీలను నెరవేర్చనందున వచ్చే ఎన్నికల్లో టీడీపీ అడ్రెస్ గల్లంతు కావడం ఖాయమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మైనార్టీలకు ఒరిగిందేమీలేదన్నారు. దుల్హన్ పథకం కింద రుణాలు అందడం లేదన్నారు. కాగా.. ఆత్మకూరు పట్టణంలోని 23 మసీదుల వద్ద ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందును శిల్పా చక్రపాణిరెడ్డి ఏర్పాటు చేశారు. -
ఎమ్మెల్యేలను కొన్నందుకా..రుణమాఫీతో ముంచినందుకా
కర్నూలు జిల్లా: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న నవనిర్మాణ దీక్షలు, ధర్మపోరాటం దేనికోసమని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు శిల్పాచక్రపాణి రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను వంచించినందుకా లేక మహిళలను మోసం చేసినందుకా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొన్నందుకా లేక రైతన్నలను రుణమాఫీ పేరుతో నిట్టనిలువునా ముంచినందుకా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మకూరులో ముస్లిం సోదరులు శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బీవై రామయ్య, కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్ హఫీజ్ ఖాన్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి మాట్లాడుతూ..‘ టీడీపీ ప్రభుత్వంలో అసలైన లబ్దిదారులకు న్యాయం జరగడం లేదు. కేవలం టీడీపీ కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరుగుతోంది. చంద్రబాబుపై ఎవరు మాట్లాడినా జగన్ మోహన్ రెడ్డే వాళ్లతో మాట్లాడిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నవ నిర్మాణ దీక్షలు మొత్తం జగన్‌ను తిట్టడానికే సరిపోయాయి. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను డ్రామాలుగా వర్ణించడం సిగ్గు చేటు. 14 నెలల ముందు రాజీనామా చేసిన ఎంపీల త్యాగాన్ని అందరూ కీర్తించాలి. దమ్ము, చిత్తశుద్ది ఉంటే టీడీపీ ఎంపీలు ఇప్పటికైనా రాజీనామాలు చేయాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు. అసెంబ్లీని టీడీపీ కార్యాలయంగా మార్చార’ని తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బీవై రామయ్య మాట్లాడుతూ.. నాలుగేళ్ల చంద్రబాబు ప్రభుత్వం పరిపాలనలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆరువందల హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలని మోసం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకాలు అపహాస్యం అయ్యాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మంచి నీళ్లు దొరకడం లేదు కానీ మద్యం డోర్ డెలివరీ జరుగుతోందని ఎద్దేవా చేశారు. పంచభూతాలను సైతం దోచుకుతిన్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. నాలుగేళ్లుగా ఏ ఏడు కా ఏడు నవ నిర్మాణ దీక్షలు చేయడం సిగ్గు చేటని తీవ్రంగా మండిపడ్డారు. నవనిర్మాణ దీక్షల పేరుతో ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాన్ని విమర్శించడానికి మాత్రమే నవనిర్మాణ దీక్షలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఉరి వేసుకున్నా ఎవరికీ లాభం లేదని, కాంగ్రెస్‌తో జతకట్టేందుకు టీడీపీ సిద్ధపడి, వైఎస్సార్సీపీని విమర్శించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని ఆయన మామ స్వర్గీయ ఎన్టీఆర్ అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. దిగజారుడు టీడీపీ రాజకీయాలకు పాడె కట్టేందుకు ప్రజలు సిద్ధపడ్డారని, విలువలతో కూడిన రాజకీయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతమని అన్నారు. కర్నూల్ జిల్లాలో 14 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు తప్పక గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. హాఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేసిన మంచి పనులు గురించి చెప్పే ధైర్యం లేదని విమర్శించారు. నాలుగేళ్లలో యూటర్న్ అంకుల్ అన్న పేరు మాత్రమే చంద్రబాబు సాధించిందని ఎద్దేవా చేశారు. మైనార్టీలకు దుల్హన్ కార్యక్రమంలో అసలైన లబ్ధిదారులకు లాభం చేకూరడం లేదని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీలో చేరికలకు గేట్లు ఎత్తితే టీడీపీ ఖాళీ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. -
‘టీడీపీ అంటే టాపిక్ డైవర్షన్ పార్టీ’
సాక్షి, అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించానికే టీడీపీ నవ నిర్మాణ దీక్షలు చేస్తుందని వైఎస్సార్సీపీ నేతలు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన 600 హామీల గురించి ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమస్యలను పక్కదారి పట్టించడం టీడీపీకి అలవాటైన పని అని విమర్శించారు. టీడీపీ అంటే టాపిక్ డైవర్షన్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. బీవై రామయ్య సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని ఆరోపించారు.వైఎస్పార్సీపీ ఎంపీల రాజీనామపై ప్రశ్నించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్ర బాబు 40ఏళ్ల రాజకీయ అనుభవం వేల కోట్ల రూపాయలు లూటీ చేయడానికే పనికొచ్చిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో చేశామన్న అభివృద్ధి మేడిపండును తలపిస్తే.. టీడీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు గురువింద సామెతను గుర్తు చేస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, అతని మంత్రి వర్గం అలీబాబా 40 దొంగల్లాగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. -
రాష్ట్రానికి దశాదిశ..వైఎస్ జగన్
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రజాసంకల్ప యాత్ర ద్వారా తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి లక్షల మందితో మమేకం అవుతున్నారని, రాబోయే రోజుల్లో రాష్ట్రానికి దశాదిశా జననేతేనని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. శనివారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. అంతకు ముందు వైఎస్ఆర్సీపీ నేత, రాయలసీమ రిటైర్డు ఐజీ మహమ్మద్ ఇక్బాల్‌ను పూలబొకేలతో సత్కరించారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుండడంతో ఎంతో మంది నాయకులు ఆకర్షితులవుతున్నారన్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ కూడా జననేత అడుగు జాడల్లో నడిచేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఇక్బాల్ సేవలు ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, పార్టీలో నూతనోత్సాహం వచ్చిందని తెలిపారు. టీడీపీ అడుగడుగునా అణచివేత ధోరణి అవలంబిస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల్ని మభ్యపెడుతోందన్నారు. అన్నపూర్ణ లాంటి ఏపీకి అడుక్కుతినే పరిస్థితి రిటైర్డు ఐజీ ఇక్బాల్ మాట్లాడుతూ.. అన్నపూర్ణ లాంటి ఏపీకి ప్రస్తుతం అడుక్కుతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరిట రైతుల నుంచి భూములు లాక్కుందని, అవి ఎందుకూ పనికిరాకుండా నేడు బీడుగా మారాయని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రణాళికలు ప్రజల అవసరాలకు భిన్నంగా ఉంటున్నాయన్నారు. నాలుగేళ్ల పాటు ప్రత్యేక ప్యాకేజీ పాట పాడిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వసనీయత కోల్పోయి ఇప్పుడు యూటర్న్ తీసుకొని ప్రత్యేక హోదా అనడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. అనుభవం, సీనియారిటీ పనికి రావనేది బాబు పాలనతో తేటతెల్లం అయిందన్నారు. చిత్తశుద్ధి కలిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిలాంటి నాయకుడు అవసరం ఉందని రాష్ట్ర ప్రజలంతా ముక్తకంఠంతో పేర్కొంటున్నారని తెలిపారు. కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ పోరాట యోధుడన్నారు. రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి ఆయనేనని చెప్పారు. మచ్చలేని ఓ ఐపీఎస్ అధికారి ఇక్బాల్ వైఎస్సార్సీపీలో చేరడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనారిటీసెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎ.రహ్మాన్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి సి.హెచ్.మద్దయ్య, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్, లీగల్‌సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, జిల్లా నాయకుడు తోట వెంకటకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు దేవపూజ ధనుంజయాచారి, ఫిరోజ్, పర్ల శ్రీధర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రాజేశ్, విజయకుమారి, సయ్యద్ ఆసిఫ్, కె.రాఘవేంద్రరెడ్డి, ప్రదీప్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్ నాయుడు, రైల్వే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలులో 14 సీట్లు గెలుస్తాం..
సాక్షి, కర్నూలు: కాటసాని రాంభూపాల్ రెడ్డి రాకతో జిల్లాలో పార్టీ బలోపేతం అయిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, అలాంటి వ్యక్తికి తన వంతు సహకారం అందించాలనే కాటసాని పార్టీలో చేరారని తెలిపారు. జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం: కాటసాని రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమనీ, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పాణ్యం నుంచి పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆ విషయం పార్టీ అధినేత చేతుల్లో ఉందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాటసాని మంగళవారం నియమితులయిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ నుంచి ఎప్రిల్ 29న వెఎస్సార్‌సీపీలోకి చేరారు. గతంలో పాణ్యం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. -
చంద్రబాబుది ముమ్మాటికీ 420 దీక్షే..
సాక్షి, కర్నూలు : సీఎం చంద్రబాబు తీరుపై వైఎస్సార్ సీపీ నేత బీవై రామయ్య మండిపడ్డారు. చంద్రబాబుది ముమ్మాటికీ 420 దీక్షే అని ఆయన విమర్శించారు. దీక్ష పేరుతో చంద్రబాబు మరో కుట్రకు తెరలేపారని పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుట్రలు, కుతంత్రాలతో హోదా రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని బీవై రామయ్య ధ్వజమెత్తారు. అంతేకాక ఇప్పుడు మల్లీ ప్రజలను మభ్య పెట్టుందుకు కొంగజపం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలు, ఆమరణ దీక్షకు కలిసిరాని చంద్రబాబు.. ఇప్పుడు మాత్రం ఒకరోజు దీక్ష చేస్తాననడం హాస్యాస్పదమని బీవై రామయ్య ఎద్దేవా చేశారు. -
చంద్రబాబు మళ్లీ ఫేస్ టర్నింగ్ ఇచ్చారు..
సాక్షి, కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ సీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శుక్రవారమిక్కడ ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. కళంకిత సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలుస్తారని వ్యాఖ్యానించారు. ‘ప్రత్యేక హోదాపై పలుమార్లు యూటర్న్ తీసుకున్న చంద్రబాబు మరోసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చారు. నిన్న మొన్నటి వరకూ ఎంపీల రాజీనామాలకు సై అన్న బాబు నేడు నై అంటున్నారు. విచ్చలవిడి అవినీతి, కేసుల భయంతోనే చంద్రబాబు హోదాపై యూటర్న్ తీసుకున్నారు. ఎంపీల రాజీనామా అంటేనే చంద్రబాబుకు భయం పట్టుకుంది. దీంతో హోదా సాధనపై చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏంటో తేలిపోయింది. ఎంపీల రాజీనామాలపై కలిసి రమ్మంటే వెనకడుగు ఎందుకు?. రాష్ట్రంలోని 25మంది ఎంపీలు ఏకతాటిపైకి వచ్చి రాజీనామా చేస్తే కేంద్రం దిగివచ్చేది కదా. ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం చేస్తున్నాం అని కలరింగ్ ఇచ్చే మీరు, మీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయరో చంద్రబాబు చెప్పాలి. బాబు ఓటుకు కోట్లు కేసు వల్ల భయపడుతున్నావా లేక పోలవరంలో మీ అవినీతి బయటపడుతుందన్న భయమా?. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఐదుకోట్ల మంది ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం సరికాదు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో అన్ని రంగాలను అవినీతిమయం చేసిన చంద్రబాబు ఆ అవినీతిపై ఎక్కడ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపిస్తుందోనని బయపడుతున్నట్లు ఉన్నారు. రాష్ట్ర హక్కులను కేంద్రం వద్ద ఫణంగా పెట్టే అధికారాన్ని చంద్రబాబుకు ఎవరిచ్చారు?. దేశంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుపొందిన చంద్రబాబు..ముఖ్యమంత్రి పదవికి కళంకం తెచ్చారు. దేశంలోనే కళంకిత సీఎంగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. అందర్నీ ఆర్థిక నేరస్తులు అంటున్న ఆయన తనపై ఉన్న అభియోగాలపై సీబీఐ విచారణ చేయించుకునే దమ్ముందా?.’ అని నిలదీశారు. వైఎస్ జగన్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి.... కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డిపై బీవై రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించడంపై ఆయన మండిపడ్డారు. ‘వైఎస్ జగన్ భిక్షతో ఎమ్మెల్యేగా గెలిచి, గోడ దూకిన నువ్వు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతున్నావ్. కనీస రాజకీయ పరిజ్ఞానం లేని నువ్వ ఎమ్మెల్యేగా ఎలా అర్హుడివో చెప్పాలి. పార్టీ మారి ప్రజాస్వామ్యంలో జీవచ్చవాలుగా మారిన మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి. ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్ జగన్ అవిశ్రాంత పోరాటం చేస్తున్నది కళ్లకు కనిపించడం లేదా?. చంద్రబాబు మెప్పు కోసం విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అభివృద్ధి పేరుతో పార్టీ మారిన అవినీతి సొమ్ముతో మీరు ఎంత అభివృద్ధి చెందారో అందరికీ తెలుసు. అతి త్వరలో మీ అవినీతిపై మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. హోదాపై మీ ముఖ్యమంత్రికే మొహం చెల్లడం లేదు. మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి. దమ్ము, సిగ్గు, శరం ఉంటే తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.’ అని డిమాండ్ చేశారు. -
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
కర్నూలు(గాయత్రీ ఎస్టేట్):ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బీవై రామయ్య పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీకృష్ణదేవరాయ కూడలిలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. సుమారు 80 మంది ఉపాధ్యాయులు దీక్షలో కూర్చున్నారు. ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డితో కలిసి బీవై రామయ్య వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ మొదటి నుంచి ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం అనేక పోరాటాలు చేస్తుంటే సీఎం చంద్రబాబు ఉద్యమకారులపై కేసులు పెట్టి జైళ్లకు పంపారని గుర్తుచేశారు. జగన్ పోరాటలకు సీఎం మైండ్ బ్లాక్ అయిందని, ఆలోచనా శక్తి సన్నగిల్లి ఏమి మాట్లాడుతున్నారో తెలియని స్థితికి వచ్చారన్నారు. రూ.3.50 లక్షల కోట్ల అవినీతి పాల్పడినట్లు లెక్కలు ఉన్నాయని, ఇవి కేంద్రం దగ్గర కూడా ఉన్నాయన్నారు. సీఎం జైలుకు వెళితే బయటికి వచ్చేపరిస్థి«తి ఉండదన్నారు. ఇదే విషయాన్ని పవన్ కల్యాణ్ సైతం పేర్కొన్నారన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై జగన్‌తో చర్చిస్తామన్నారు. ఎమ్మెల్యే గౌరుచరిత మాట్లాడుతూ ప్రత్యేక హోదానే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కన్నా తన రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ప్రత్యేక హోదాను సాధించుకోలే పోతున్నామన్నామని విమర్శించారు. నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీనే ముద్దుంటూ కబుర్లు చెప్పిన సీఎం ఇప్పుడు మాటమార్చడం ఎంత వరకు సమంజసమో ఆలోచించుకోవాలన్నారు. ప్రత్యేక హోదా కోసం ఏప్రిల్ 6న వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామ చేస్తారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వారంలోపు సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తామని జగన్ ఇదివరకే ప్రకటించారని.. దాన్ని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు వైష్ణవ కరుణానిధిమూర్తి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్క రోజు నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. అంతకు ముందు పీఆర్టీయూ నాయకులు జెడ్పీ నుంచి శ్రీకృష్ణదేవరాయ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. దీక్షలను ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి ఓంకార్‌యాదవ్, కోశాధికారి నారాయణనాయక్‌లు దీక్షలకు మద్దతు ప్రకటించారు. పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, రామకృష్ణ, గోపాల్, ఫయాజ్, బుగ్గన్న, జిల్లా నాయకులు నాగభూషణ్‌గౌడ్, లక్ష్మినారాయణ, జాకీర్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్దాసుపత్రిని ప్రైవేట్‌కు కట్టబెట్టారు
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ ఆసుపత్రిలోని సేవలన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రైవేటుపరం చేశారని..దీంతో పేదలకు సరిగ్గా వైద్యం అందడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను సందర్శించారు. పలు వార్డుల్లో రోగులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. రెండు రోజుల నుంచి రేషన్‌కార్డు/ఎన్టీఆర్ వైద్యసేవ కార్డు ఉంటేనే డయాలసిస్ చేస్తామంటున్నారని పలువురు రోగులు ఆయనకు విన్నవించారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో ఇలా నిబంధనలు ఉండేవి కావని..అందరికీ వైద్యం అందేదన్నారు. తర్వాత కార్డియాలజిలో రోగులకు యాంజియోగ్రామ్ పరీక్షలు చేయడం లేదని తెలియడంతో బీవై రామయ్య అక్కడికి వెళ్లారు. పదిరోజులుగా కేథలాబ్ మిషన్ పనిచేయడం లేదని, ఈ విషయాన్ని యంత్రాలు మరమ్మతులు చేసే టీబీఎస్ కంపెనీకి చెప్పినా ఇప్పటి వరకు రాలేదని వైద్యులు చెప్పారు. అనంతరం బీవై రామయ్య మాట్లాడుతూ వైద్యసేవలను ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించడంతోనే ఆ సంస్థలు ప్రజా ధనాన్ని దోచుకుంటున్నాయి తప్ప సేవలు చేయడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు తీరుతోనే పదేళ్లు ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో మనం వైద్యసేవలు అందుకోలేకపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశా రు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే పేదలందరికీ కార్పొరేట్ వైద్యం అందించడమే కాక డయాలసిస్ చేసుకునే వారికి నెలకు రూ.10వేలు పింఛన్, బస్‌పాస్ ఇస్తారని భరోసా ఇచ్చారు. జూడాల సమ్మెకు మద్దతు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెకు వైఎస్ఆర్సీపీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శిబిరం వద్ద కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం జూడాలు 9 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. ఆయన వెంట కర్నూలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేంద్రరెడ్డి, నగర అధ్యక్షుడు రాజా విష్ణువర్దన్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మద్దయ్య తదితరులు ఉన్నారు. -
బీసీల సంక్షేమానికి కృషి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేస్తుందని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే బీసీ కులాల సమస్యలు..వాటి పరిష్కారాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని ఏర్పాటు చేశారన్నారు. శుక్రవారం వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆ కమిటీ సభ్యులు గురవాచారి, దర్గారావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. వెనుకబడిన కులాల సమస్యల పరిష్కారంపై వైఎస్ఆర్సీపీ చిత్తశుద్ధితో ఉందన్నారు. అందులో భాగంగా ఈ నెల 25వ తేదీన కర్నూలు పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో బీసీ కులాలు, ప్రజా సంఘాలు, వృత్తి నిపుణులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. నంద్యాల చెక్ పోస్టులోని మెగాసిరి ఫంక్షన్ హాలులో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి బీసీ అధ్యయన కమిటీ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పార్టీ కర్నూలు రీజినల్ కోఆర్డినేటర్ మేకపాటి గౌతంరెడ్డి, నంద్యాల, కర్నూలు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి, బీవై రామయ్య అతిథులుగా హాజరవుతారన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ కుల, ప్రజా సంఘాలు వ్యక్తం చేసే అభిప్రాయాలను క్రోడీకరించి బీసీ డిక్లరేషన్‌కు పంపుతామన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీల పేటెంట్ అని సీఎం చంద్రబాబు ఒక వైపు చెబుతూనే బీసీ కులాల పునాదులను కూల్చేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు డీకే రాజశేఖర్, ప్రహ్లాదాచారి, శ్రీధర్‌రెడ్డి, కరుణాకరరెడ్డి,రాజేంద్రప్రసాద్నాయుడు, రామాంజనేయులు పాల్గొన్నారు. -
దోచుకోవడమే టీడీపీ లక్ష్యం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): కర్నూలు నగరాభివృద్ధి పేరుతో నిధులు దోచుకోవడమే టీడీపీ లక్ష్యమని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకే టీడీపీ నేతలు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలంటూ హడావుడి చేస్తున్నారన్నారు. అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగేళ్ల నుంచి స్మార్ట్ సిటీ, గ్రీన్ సిటీ అంటూ వేసిన రోడ్లనే వేస్తూ నిధులు కొల్లగొట్టారన్నారు. ప్రస్తుతం నంద్యాల తరహాలో కర్నూలులో అభివృద్ధి పనులు చేస్తామని ముందుకొస్తున్నారన్నారు. నంద్యాలలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. విస్తరణ పేరుతో తవ్విన రహదారులను ఇప్పటికీ వేయలేదన్నారు. షాపులు కోల్పోయిన వారికి ఒక్కరికీ న్యాయం చేయలేదన్నారు. కుట్టుమిషన్లను ఇస్తామని చెప్పి..ఎవరికీ ఇవ్వలేదన్నారు. 13 వేల ఇళ్లు కట్టిస్తామని చెప్పిన ఒక్క గృహాన్ని కూడా పూర్తి చేయలేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రజలను భయపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి గెలిచారాన్నరు. కర్నూలులో అదే పని చేస్తామంటే భయపడేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్న విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తించుకోవాలని సూచించారు. నాలుగేళ్లుగా అధికారంలో ఉండి కర్నూలు నగరానికి నీటి కొరతను తీర్చేందుకు ఒక్క ట్యాంకునైనా నిర్మించారా అని ప్రశ్నించారు. నగరంలో కొత్తగా ఒక్క రహదారిని కూడా వేయలేదని, శివారు కాలనీల్లో డ్రెయినేజి, నీటి సమస్యలను పరిష్కరించలేదన్నారు. ఇప్పుడు వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పడం సిగ్గుచేటన్నారు. వీటిలో వచ్చే కమీషన్లను దండుకొని నంద్యాలలో మాదిరిగానే ఒక్క పనిని పూర్తి చేయబోరనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. మహిళలను మోసం చేయడానికి కార్పొరేషన్ ద్వారా అనేక తాయిలాలను ప్రకటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని, వాటిని నమొమ్మద్దని సూచించారు. ప్రత్యేక హోదాపై ప్రజల దృష్టి మరల్చడానికే... వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పార్టీ ఎంపీలతో ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయించడానికి నిర్ణయం తీసుకోవడంతో టీడీపీకి దిమ్మదిరిగి పోయిందని బీవై రామయ్య అన్నారు. నాలుగేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఏమి సాధించారనే ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో వచ్చే ఎన్నికల్లో పునాదులు కదులుతాయనే భయంతో ప్రజల దృష్టి మరల్చడానికి టీడీపీ.. కర్నూలు మునిసిపల్ ఎన్నికల అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. ఐదు కోట్ల ఆంధ్రులు ప్రత్యేకహోదా కోసం ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీ గమనించాలని హితవు పలికారు. డబ్బులకు అమ్ముడు పోయిన కొందరు ప్రజాప్రతినిధులు తమ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పేరును ఉచ్చరించడానికి కూడా అర్హులు కాదన్నారు. అలాంటి వారు విమర్శలు చేసేటప్పుడు స్థాయిని గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు తెర్నెకల్లు సురేందర్‌రెడ్డి, సీహెచ్ మద్దయ్య, ధనుంజాయాచారి, సత్యంయాదవ్, రెహమాన్, కృష్ణారెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, నాయకులు బుజ్జీ, సోమిరెడ్డి, సయ్యద్ ఆషీఫ్, ప్రహ్లాదాచారి, కరుణాకరరెడ్డి, అర్చనరెడ్డి మధు, ఆచారి తదితరులు పాల్గొన్నారు. కోర్టు తీర్పు లీకైందా?.. కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై కోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉందని బీవై రామయ్య గుర్తు చేశారు. అయితే మునిసిపల్ శాఖమంత్రి నారాయణ.. నెలలో ఎన్నికలు నిర్వహిస్తామని ఎలా చెబుతారని, కోర్టు తీర్పు ముందుగానే టీడీపీ నాయకులకు లీకైందా అని రామయ్య ప్రశ్నించారు. కర్నూలు కార్పొరేషన్‌కు ఏడేళ్ల నుంచి పాలకవర్గంలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడిచినా ఎన్నికలు నిర్వహించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పదవీ కాలం ముగిసే సమయంలో ఎన్నికలంటూ హడావుడి చేయడం వెనక ఆంతర్యం..అభివృద్ధి పనుల పేరిట కమీషన్లను దండుకోవడమేనన్నారు. ఎన్నికలు వస్తే కర్నూలులో అన్ని కౌన్సిల్ స్థానాలను కైవసం చేసుకొని మేయర్ పదవిని దక్కించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. -
సీఎం తీరుతోనే రాష్ట్రానికి అన్యాయం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : సీఎం చంద్రబాబు నిర్వాకంతో ఆంధ్రప్రదేశ్ ఉనికిని కోల్పోతోందని, కేంద్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయానికి గురైందని వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఓటుకు నోటు కేసుతో పాటు అవినీతి వ్యవహారాలపై కేసులు పెడతారనే భయంతో సీఎం ఏమీ మాట్లాడలేరని తెలిసే కేంద్రం ఏపీకి బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం చేసిందన్నారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గిరాజపురం ఫోర్టు, అమరావతి నిర్మాణం తదితర ముఖ్య ప్రాజెక్టులకు నిధులు ఇవ్వలేదన్నారు. మంగళవారం వారు కర్నూలులోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల 8న వామపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్‌కు వైఎస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. జిల్లాలోని అన్ని మండలాలు, నియోజకవర్గాలు, జిల్లా కేంద్రంలో జరిగే బంద్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. బడ్జెట్‌కు ముందు సీఎం చంద్రబాబు ప్రధానమంత్రిని కలసి పలు సమస్యలపై విన్నవించినట్లు ప్రకటన చేశారని, అయితే.. ఆయన కోరినవి ఏ ఒక్కటీ ఇవ్వలేదని గుర్తు చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రానికి నిధుల వరద పారిందని, అడిగినవన్నీ హక్కుగా సాధించారని తెలిపారు. చంద్రబాబు మాత్రం తన అవినీతి బండారం బయట పడకుండా కేంద్రం ముందు మోకరిల్లారని విమర్శించారు. దేశంలో తనంత సీనియర్ లేరని పదేపదే చెప్పే చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో కేంద్రం నుంచి ఏమి సాధించారని ప్రశ్నించారు. 28 సార్లు ఢిల్లీ వెళ్లిన ఆయన రాష్ట్రానికి ఉన్న లోటు బడ్జెట్‌ను ఎంత తగ్గించారని నిలదీశారు.తన అవినీతి బయట పెట్టకుండా ఢిల్లీ పెద్దలను బుజ్జగించడం, ఎమ్మెల్యే సీట్ల సంఖ్య పెంచాలని కోరడం తప్పా చేసిందేమీలేదన్నారు. రాష్ట్రానికి చంద్ర గ్రహణం పట్టిందని, దాన్ని తొలగించేందుకే వామపక్షాల బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని వివరించారు. కేంద్ర బడ్టెట్‌లో కర్నూలు జిల్లా పేరే ఉచ్చరించలేదని, మంత్రాలయం–కర్నూలు రైల్వేలైన్, రిహాబిలిటేషన్ వర్క్‌షాపునకు నిధులు వస్తాయని ఆశించినా ఫలితం లేకపోవడం నిరాశ కలిగిస్తోందన్నారు. మరోవైపు హైకోర్టును కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం సొంత ప్రయోజనాల కోసం మరోసారి అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని విమర్శించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సోమువీర్రాజు సీఎం చంద్రబాబుపై చేసిన అవినీతి ఆరోపణలు నిజమేననిపిస్తోందన్నారు. సీఎం నియోజకవర్గంలోనే రూ.10 కోట్ల అవినీతి జరిగిందని సోమువీర్రాజు ఆరోపించారని, నాలుగేళ్ల పాలనలో పెదబాబు, చినబాబు కలసి రెండు లక్షల కోట్ల రూపాయల అవినీతి చేశారన్న మిత్రపక్షంలోని బీజేపీ ఆరోపణలను అంత తేలికగా తీసుకోకూడదన్నారు. ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని నమ్మొద్దు ఏపీకి జరిగిన అన్యాయంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించడంలేదని టీడీపీ, ఎల్లో మీడియా చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజమూ లేదని బీవై రామయ్య, ఐజయ్య అన్నారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు కేంద్రం, ప్రధానమంత్రి, మంత్రుల దృష్టికి తీసుకెళ్లారని, ఆందోళనలు కూడా చేపట్టారని గుర్తు చేశారు. గుంటూరులో జగన్ దీక్ష చేపట్టగా అరెస్టుచేసి భగ్నం చేసింది, విశాఖలో ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చిన పిలుపులో పాల్గొనేందుకు వెళుతుండగా విమానాశ్రయంలో అరెస్టు చేసింది టీడీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. అలాగే తమ పార్టీ రెండుసార్లు రాష్ట్ర బంద్ చేపట్టిందన్నారు. పార్టీ ఎంపీలు పార్లమెంటులో పలుమార్లు ప్రైవేట్ బిల్లులతో ఏపీకి ప్రత్యేక హోదాను కోరారని గుర్తు చేశారు. విశాఖకు రైల్వేజోన్ కోసం తమ పార్టీనాయకుడు గుడివాడ అమర్నాథ్ నిరాహారదీక్ష, పాదయాత్ర చేసిన విషయాన్ని ఎవరూ మరువరాదన్నారు. ఇలా ఏపీకి జరిగిన ప్రతి అన్యాయంపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నామన్నారు.కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధానకార్యదర్శి సీహెచ్ మద్దయ్య, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రెహమాన్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ధనుంజయాచారి, సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి సత్యంయాదవ్, నాయకులు శ్రీధర్‌రెడ్డి, భాస్కరరెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, ఆర్.అనిల్‌కుమార్, ఉదయ్‌కుమార్, ఓసీఎం రంగ, నరసింహారెడ్డి, సుబ్బారావు, లతీఫ్ పాల్గొన్నారు. అనంతరం పార్టీ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యంయాదవ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. -
చెన్నపల్లి కోటలో తాంత్రికపూజలు
-
‘ప్రతిపక్ష నేతపై క్షుద్రపూజలు చేస్తారేమో’
సాక్షి, చెన్నంపల్లి కోట(కర్నూలు) : ఆంధ్రప్రదేశ్‌లో తాంత్రికపూజలు మరోసారి కలకలం రేపాయి. కర్నూలు జిల్లాలోని చెన్నపల్లి కోట బురుజు వద్ద బుధవారం తాంత్రిక పూజలు జరిగాయి. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే తాంత్రిక పూజలు జరిగాయని తెలిసింది. కాగా, ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులకు ప్రమేయం ఉన్నట్లు తెలిసింది. కోట బురుజు వద్దకు ఇద్దరు పూజరులను తీసుకొచ్చిన అధికారులు తాంత్రిక పూజలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. కోట బురుజు వద్ద పెద్ద ఎత్తున నిమ్మకాయలు, ఇతర సామగ్రిని స్థానికులు గుర్తించారు. కోటలో తాంత్రికపూజలపై స్పందించిన అధికారులు గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిపినట్లు చెప్పారు. కోట మధ్య భాగంలో తవ్వి ఉండటంపై ప్రశ్నించగా.. 13 రోజులుగా కోటలో నిధుల కోసం వెతుకుతున్నట్లు వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు తవ్వకాలు కొనసాగించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ జరిపిన తవ్వకాల్లో భారీ రాయి గుండ్లు, గుర్రం ఎముకలు, పూత పోసిన ఇటుకలు మాత్రమే దొరికాయని చెప్పారు. తవ్వకాల్లో భాగంగా కోట వెనుక భాగంలో ఉన్న బావిలోని నీటిని పూర్తిగా బయటకు తీసినట్లు వివరించారు. కోటలో ఉన్న పాతాళగంగ నుంచి సొరంగమార్గం ఉన్నట్లు అనుమానిస్తున్నట్లు చెప్పారు. తవ్వకాల్లో పురోగతిని సాధించేందుకు హైదరాబాద్ నుంచి అత్యాధునిక పనిముట్లను తెప్పించినట్లు వెల్లడించారు. అయితే, వాటిని ఉపయోగించినా ఎలాంటి ఫలితం దక్కలేదని చెప్పారు. ప్రతిపక్షం ఫైర్.. కోటలో తవ్వకాలపై జిల్లా కలెక్టర్ కూడా నీళ్లునములుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా రోజుకు రూ. 2 లక్షలు ఖర్చు చేస్తూ గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. మొన్నటికి మొన్న విజయవాడ దుర్గాదేవి గుడిలో తాంత్రిక పూజలు నిర్వహించి తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తుంటే.. రేపోమాపో ప్రతిపక్ష నేతపై ప్రభుత్వ పెద్దలు తాంత్రికపూజలు చేస్తారేమో అనిపిస్తుందంటూ భయాందోళన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఈ దుర్మార్గపు చర్యకు పాల్పడినా పాల్పడొచ్చని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి వినాశన కాలం దాపురించే ఇలాంటి పనులకు ఒడిగడుతోందని మండిపడ్డారు. తాంత్రికపూజలు చేస్తున్న ప్రభుత్వం పెద్దలు ఉనికి లేకుండా పోతారని అన్నారు. అధికారులు ప్రభుత్వానికి తొత్తులుగా మారి.. వాళ్లు తానా అంటే వీళ్లు తందానా అంటున్నారని విమర్శించారు. స్వయం ప్రతిపత్తితో పని చేయడం మానేశారని చెప్పారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో తాంత్రికపూజలపై విచారణ జరిపిస్తారని చెప్పారు. తాంత్రికపూజలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు. క్షుద్రపూజలు మూర్ఖత్వ చర్య ‘దేశంలోని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు మూఢ నమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటివరకూ వాస్తు, జోతిష్యాలను ప్రోత్సహించిన ప్రభుత్వాలు క్షుద్రపూజల వరకూ వెళ్లడం హాస్యాస్పదం. ప్రజల్లోని మూఢ నమ్మకాలను తొలగించాల్సిన ప్రభుత్వాలు.. వాటిని ప్రోత్సహించడం రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుంది. ఏదో ఆశించి ఓ వ్యక్తిపై క్షుద్రపూజలు చేసి లాభపడినట్లు ఆధారాలు ప్రపంచంలో ఎక్కడా లేవు. క్షుద్రపూజలు నిజమే అయితే ఎన్నికల సమయంలో ప్రత్యర్థులపై నెగ్గడానికి రాజకీయ నాయకులు కేవలం క్షుద్రపూజల కోసమే ఖర్చు చేస్తారు. తాంత్రికపూజలు, క్షుద్రపూజలు వంటి వాటిని ప్రభుత్వాలు సమర్ధిస్తే దేశాభివృద్ధి కుంటుపడుతుంది.’ - టీవీ రావు.. జనవిజ్ఞాన వేదిక -
జన్మభూమి అట్టర్ ఫ్లాప్: శిల్పా
సాక్షి, కర్నూలు: వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు టీడీపీ ప్రభుత్వం భయపడుతోందని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. పాదయాత్ర సూపర్ హిట్.. జన్మభూమి అట్టర్ ఫ్లాప్ అని వ్యాఖ్యానించారు. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం సూదేపల్లి గ్రామంలో మంగళవారం రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ప్రజల పాలిట కర్మభూమిగా మారిందని అన్నారు. జన్మభూమి సభల్లో జనాలు లేరన్న విషయాన్ని టీడీపీ గుర్తించాలన్నారు. అధికార పార్టీ నాయకులు జన్మభూమికి వెళ్లలేని పరిస్థితి ఉందని, వాస్తవాలు ఒప్పుకోవడానికి ప్రభుత్వం వెనుకాడుతోందని పేర్కొన్నారు. క్షేత్రస్ధాయిలో వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తున్నామని, సమన్వయంతో వచ్చే ఎన్నికల్లో జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంటామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అరెస్టులు దారుణం నాలుగేళ్ళ టీడీపీ పాలనలో చేసింది శూన్యమని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బివై రామయ్య అన్నారు. అభివృద్ధిపై బహిరంగ సవాల్‌కు ప్రభుత్వం సిద్ధంగా లేదని, బహిరంగ చర్చకు టీడీపీ నాయకులు మొహం చాటేస్తున్నారని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీలకు మాత్రమే జన్మభూమి కార్యక్రమం వల్ల ఉపయోగమన్నారు. ప్రశ్నించే వారిని పోలీసులతో అరెస్టు చేయడం దారుణమన్నారు. మరోసారి మోసం జన్మభూమి కార్యక్రమం పేరుతో ప్రజలను మరోసారి ప్రభుత్వం మోసం చేస్తోందని ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వడం లేదని, అలాంటప్పుడు ప్రజల కష్టాలు ఎలా తీరుతాయని ఆయన ప్రశ్నించారు. -
ఆ ఎమ్మెల్సీ పదవి వైఎస్సార్సీపీ భిక్ష: బీవై రామయ్య
కర్నూలు : వైఎస్సార్సీపీ వదిలేసిన భిక్ష ఎమ్మెల్సీ పదవి అని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. కర్నూలులో పార్టీకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ..వైఎస్సార్సీపీ విసిరేసిన ఎమ్మెల్సీ కోసం కేఈ కుటుంభం దిగజారి వ్యవహరిస్తోందని విమర్శించారు. బీసీలంటే కేఈ కుటుంబం మాత్రమే అన్నట్టు ఇతర బీసీలకు అన్యాయం చేస్తోన్నారని ఆరోపించారు. రాష్ట్ర స్థాయి నుంచి పంచాయతీ స్థాయి వరకు ఏ పదవి అయినా ఆ కుటుంభం తర్వాతే అన్నట్టు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. పార్టీ కోసం ప్రాణాలను, ఆస్తులను ఫణంగా పెట్టిన బీసీలకు కేఈ కృష్ణమూర్తి చేసింది ఏమిటని ప్రశ్నించారు. కర్నూల్ జిల్లాలో బీసీలంటే కేఈ సోదరులేనా...? ఏ అర్హతతో కేఈ ప్రభాకర్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారని ప్రశ్నించారు. జిల్లాలోని టీడీపీకి చెందిన బీసీలు అందరూ అసంతృప్తితో ఉన్నారని, టీడీపీ వెంట ఉన్న నాగేశ్వర యాదవ్, బట్టిన వెంకటరాముడు, బొజ్జమ్మ, గుడిసె కృష్ణమ్మ, తుగ్గలి నాగేంద్ర, బీటీ నాయుడు అర్హులు కారా? నాయి బ్రాహ్మణ, రజక ఇతర కులాల్లో అర్హులైన బీసీలే లేరా..? అని సూటిగా అడిగారు. పదవుల పందేరంలో ముందు వరుసలో ఎప్పుడూ కేఈ కుటుంబం ఉండటం సిగ్గు చేటన్నారు. పదవుల కోసం పార్టీని నమ్ముకున్న వారిపై బెదిరింపులకు దిగడం కేఈ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య అని, ఇప్పటికైనా జిల్లాలోని బీసీ నాయకులందరూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కళ్ల ముందే ప్రజా స్వామ్యాన్ని చంద్రబాబు అపహాస్యం చేస్తున్నా డెప్యూటీ సీఎం ధృతరాష్ట్రుడిలా మారాడని విమర్శించారు. సుదీర్ఘ అనుభవం ఉన్న కేఈ కృష్ణమూర్తి లాంటి వారు కూడా అహంకార పూరిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. తన తమ్ముడు నామినేషన్ వేసి గంటలు గడవకముందే ఎన్నిక ఏకపక్షమే, స్వతంత్ర అభ్యర్ధులు పోటీ నుంచి తప్పుకుంటారు.. అంటూ ఉప ముఖ్యమంత్రి స్థాయిలో బెదిరింపు ధోరణి లో మాట్లాడం పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. వైఎస్సార్సీపీ పోటీలో ఉన్నా అత్యధిక మెజార్టీతో గెలిచేవాళ్లం అంటున్నారు..అది ఎలాగో ఆయనే చెప్పాలని అన్నారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వారిని బెదిరించే ధోరణిలో ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఉండటం దురదృష్టకరమన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు అమాయకులు అనడం చూస్తుంటే.. తన తమ్ముడికి వ్యతిరేకంగా నామినేషన్ వేయకూడదు అన్న ధోరణి కనబడుతోందన్నారు. తప్పుడు సంతకాలతో అభ్యర్థులు నామినేషన్ వేశారని డెప్యూటీ సీఎం అనటం చూస్తుంటే.. అధికారుల పనితీరు పై అనుమానాలు వ్యక్తం చేసినట్టు కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లాలో వెనుకబడిన బీసీలు ఉన్నారని కేఈ కుటుంబం గుర్తించాలన్నారు. -
ఆ పదవి కోసం పోటీ చేయదలుచుకోలేదు: వైఎస్సార్సీపీ
సాక్షి, కర్నూలు: వ్యవస్థలను, ప్రజాస్వామ్య పద్ధతిలో జరగాల్సిన ఎన్నికలను సీఎం చంద్రబాబు నాయుడు అపహాస్యం చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత బీవై రామయ్య మండిపడ్డారు. ప్రస్తుతం జరగనున్న కర్నూలు ఎమ్మెల్సీ ఎన్నికతో ప్రజాస్వామ్యం మరోమారు అపహాస్యం కావడం ఇష్టం లేని కారణంగా తృణప్రాయంగా ఎమ్మెల్సీ పదవిని త్యజించిన మేం.. మళ్లీ ఆ పదవి కోసం పోటీ చేయదలుచుకోలేదన్నారు. పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అవినీతి సొమ్మును వరదలా పారిస్తున్నారని విమర్శించారు. గతంలో కర్నూలు స్థానిక సంస్థల్లో సంఖ్యా పరంగా మాకే మెజారిటీ ఉన్నా రెండుసార్లు టీడీపీ సిగ్గు లేకుండా ఫిరాయింపులను ప్రోత్సహించిందని ఈ సందర్భంగా బీవై రామయ్య గుర్తుచేశారు. మరోమారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినీతికి అవకావం ఇవ్వకూడదని, ప్రజాస్వామ్యం అభాసుపాలు కాకూడదని వైఎస్ఆర్ సీపీ భావిస్తోందన్నారు. చంద్రబాబుకు నిజంగానే ప్రజాస్వామ్యంపై గౌరవం ఉంటే పార్టీ ఫిరాయించిన 22 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని బీవై రామయ్య డిమాండ్ చేశారు. -
దమ్ముంటే వేటు వేయండి
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ‘అసెంబ్లీ నుంచి వైఎస్ఆర్సీపీ పలాయనం చేసిందని విమర్శించే అర్హత మంత్రులు కేఈ కృష్ణమూర్తి, కాలవ శ్రీనివాసులుకు లేదు. దమ్ముంటే మా పార్టీ నుంచి కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించాలి’ అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం వైఎస్ ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని తెలుగుదేశం ప్రభుత్వం, స్పీకర్ కోడెల శివప్రసాద్ ఖూనీ చేస్తుండడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారన్నారు. ఈ నిజాన్ని కప్పి పెట్టేందుకు టీడీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీపై ఆరోపణలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేటికీ నెరవేర్చలేదన్నారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేయడమే కాక.. చదువుకున్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వారి కష్టాలు తెలుసుకొని.. భవిష్యత్తుపై భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ యాత్రతో ఎక్కడ తమ పునాదులు కదులుతాయోనని అధికారపార్టీ నేతలకు భయం పట్టుకుందన్నారు. ఆయన పేరుకే డిప్యూటీ సీఎం.. కేఈ కృష్ణమూర్తి పేరుకు మాత్రమే డిప్యూటీ సీఎం అని ఆయనకు ఎలాంటి అధికారాలు లేవని..రెవెన్యూశాఖలో ఆయన మాట చెల్లుబాటు కాదని బీవై రామయ్య ఎద్దేవా చేశారు. సొంత నియోజకవర్గమైన పత్తికొండలో హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా చెరువులు నింపుకోలేకపోయారన్నారు. రాష్ట్రంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా సీఎంను ప్రశ్నించలేని కేఈకి తమ పార్టీపై విమర్శలు చేసే హక్కు లేదన్నారు. సొంత సామాజికవర్గమైన వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పించలేని మంత్రి కాలవ శ్రీనివాసులుకు ఇతరుల గురించి మాట్లాడే అధికారం లేదన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కవని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సురేందర్‌రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు సీహెచ్ మద్దయ్య, కర్నాటి పుల్లారెడ్డి, శౌరీ విజయకుమారి, రమణ, భాస్కరరెడ్డి, రెహమాన్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
పాదయాత్రపై దృష్టి మరల్చడానికే ఫిరాయింపులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టనున్న పాదయాత్ర నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం చంద్రబాబు మరోసారి ఫిరాయింపులకు తెర లేపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి విమర్శించారు. ఇందులో భాగంగానే కర్నూలు ఎంపీ బుట్టా రేణుకను మభ్యపెట్టి, విలువలను మరచి టీడీపీలో చేర్చుకున్నారని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన కర్నూలులోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు.చంద్రబాబు ఆడుతున్న మైండ్ గేమ్ ప్రజలకు అర్థమైపోయిందని, వచ్చే ఎన్నికల్లో ఫిరాయింపుదారుల అడ్రెస్ గల్లంతు కావడం ఖాయమని అన్నారు. కన్నతల్లి లాంటి పార్టీ, సీటు ఇచ్చిన అధినేతను మోసం చేసిన ప్రజాప్రతినిధులు ప్రజల వజ్రాయుధం ఓటుకు బలికాక తప్పదని హెచ్చరించారు. 2014 ఆగస్టు 15న కర్నూలులో స్వాతంత్య్ర వేడుకలకు హాజరైన సీఎం చంద్రబాబు ఈ జిల్లాకు 35 హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అందులో ఒక్కదాన్నీ అమలు చేసిన పాపానపోలేదన్నారు. అయితే.. జిల్లాలో తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు, ఐదుగురు ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి కొనుగోలు చేశారని ధ్వజమెత్తారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్, ఎమ్మిగనూరులో టెక్స్టైల్స్ పార్కు, ఉర్దూ యూనివర్సిటీ, కళాశాలలు, కర్నూలు స్మార్ట్‌సిటీ ఏమయ్యాయని ప్రశ్నించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను టీడీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోందన్నారు. గుండ్రేవుల, వేదావతి ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టలేదన్నారు. గతంలోనే 90 శాతం పూర్తయిన ముచ్చుమర్రి ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్ పనులను మూడున్నరేళ్లయినా పూర్తి చేయకపోవడం శోచనీయమన్నారు. నంద్యాలలో డబ్బు, అధికార దుర్వినియోగంతో గెలుపొంది వాపును బలంగా భావిస్తున్న టీడీపీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మా నాయకుడి మనోధైర్యం సడలదు... చంద్రబాబు ఎంతమందిని కొనుగోలు చేసినా తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మనోధైర్యం సడలదని గౌరు వెంకటరెడ్డి అన్నారు. చంద్రబాబు కంటే వయసులో చిన్నవారైనా విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని ప్రశంసించారు. ఒక్క నాయకుడు వెళ్లిపోతే వెయ్యి మందిని తయారు చేసుకోగల శక్తి తమ పార్టీకి ఉందన్నారు. చంద్రబాబుకు దమ్ము ధైర్యం ఉంటే తమ పార్టీ నుంచి చేర్చుకున్న ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు. స్వలాభం కోసమే బుట్టా ఫిరాయింపు అభివృద్ధి కోసమే టీడీపీతో కలసి పనిచేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక చెబుతున్న మాటల్లో వాస్తవంలేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య విమర్శించారు. స్వలాభం కోసమే ఆమె పార్టీ ఫిరాయించారన్నారు. మూడున్నరేళ్లలో అభివృద్ధి గురించి ఆలోచించని ఆమె..నాలుగైదు నెలల్లో ఏమి అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. ఆమె కుటుంబ సభ్యుల వ్యాపారాన్ని పెంచుకోవడానికే టీడీపీలోకి వెళ్లారన్నారు. కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసిన ఆమెకు ప్రజాకోర్టులో చెంపదెబ్బ తప్పదన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఫిరాయింపు ప్రజాప్రతినిధులను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు కర్నాటి పుల్లారెడ్డి, రమణ, ఫిరోజ్‌ఖాన్, పర్ల శ్రీధర్‌రెడ్డి, యశ్వంత్, కరుణాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆమెను ఎంపీని చేస్తే ఇదేనా కృతజ్ఞత?
సాక్షి, కర్నూలు : సాధారణ మహిళగా ఉన్న బుట్టా రేణుకకు వైఎస్ఆర్ సీపీ కర్నూలు ఎంపీ టిక్కెట్ ఇచ్చి గెలిపిస్తే కనీస కృతజ్ఞత కూడా లేదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య విమర్శించారు. ప్రాణం ఉన్నంతవరకూ జగన్ వెంటే నడుస్తానని చెప్పిన మాటలు ఏమయ్యాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. తనపై వస్తున్న వార్తలతో బుట్టా రేణుక మనస్తాపం చెందినట్లు వెలువడ్డ వార్తలపై స్పందిస్తూ... గెలిచిన మూడో రోజే ఆమె భర్త పచ్చ కండువా కప్పుకున్నప్పుడు తామెంత మనస్తాపం చెంది ఉంటామో గుర్తించాలన్నారు. రహస్యంగా వెళ్లి సీఎం చంద్రబాబును కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. పార్టీలో ప్రజాదరణ కలిగిన నేతలకు కొదవ లేదు ఫిరాయింపుదారులకు టీడీపీలో ఎలాంటి గౌరవం దక్కుతోందో తెలుసుకోవాలని బుట్టా రేణుకకు బీవై రామయ్య సూచించారు. అక్కడ కనీసం ఆ పార్టీ కార్యకర్తలు కూడా వారికి మర్యాద ఇవ్వడంలేదన్న విషయాన్ని గమనించాలన్నారు. ఫిరాయింపుదారులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కర్నూలులోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఆయన నిన్న (ఆదివారం) విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీలో ప్రజాదరణ కలిగిన నాయకులకు కొదవలేదన్న విషయాన్ని గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు సూచించారు. మూడున్నరేళ్ల టీడీపీ పాలనలో అభివృద్ధి ఏమాత్రం జరగ లేదన్నారు. విపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధులను మభ్యపెట్టి సంతలో పశువుల మాదిరిగా కొనుగోలు చేయడమే చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టనున్న పాదయాత్రతో టీడీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు శౌరి విజయకుమారి, లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్నాటి పుల్లారెడ్డి, నాయకులు పర్ల శ్రీధర్‌రెడ్డి, హరికృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
‘నంద్యాలలో ప్రభుత్వం బీసీలను టార్గెట్ చేసింది’
కర్నూలు: నంద్యాలలో ప్రభుత్వం బీసీలను టార్గెట్ చేసిందని వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య ఆరోపించారు. బీసీ కౌన్సిలర్‌పై పోలీసుల దాడిని మంత్రి కాల్వ శ్రీనివాసులు ఖండించకపోగా, పైగా పోలీసులయ దాడిని సమర్థించడం దారుణమన్నారు. అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. చంద్రబాబు నంద్యాలలో పడుకున్నా ఉప ఎన్నికలో వైఎస్ఆర్ సీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత జీవోలన్నీ చిత్తు కాగితాలుగా మారతాయని, నంద్యాలను సీడ్ క్యాపిటల్‌గా చేస్తామన్న హామీ ఏమైందని బీవై రామయ్య సోమవారమిక్కడ సూటిగా ప్రశ్నించారు. ట్రాక్టర్లు, ఇళ్ల పంపిణీలో అవినీతి కంపు కొడుతోందన్నారు. ఎక్కువ ధరతో ట్రాక్టర్లు కొనుగోలు చేసి అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇళ్ల నిర్మాణంలోను అదే పరిస్థితి అని, కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేయాలని బీవై రామయ్య డిమాండ్ చేశారు. కేశవరెడ్డి కేసు మాఫీ కోసమే ఆదినారాయణరెడ్డి పార్టీ మారారని వ్యాఖ్యానించారు.