
సాక్షి, కర్నూలు: కాటసాని రాంభూపాల్ రెడ్డి రాకతో జిల్లాలో పార్టీ బలోపేతం అయిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాలను వైఎస్సార్‌సీపీ గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, అలాంటి వ్యక్తికి తన వంతు సహకారం అందించాలనే కాటసాని పార్టీలో చేరారని తెలిపారు.
జగన్‌ను సీఎం చేయడమే లక్ష్యం: కాటసాని
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం కృషి చేస్తానని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రి చేయడమే తన లక్ష్యమనీ, పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో పాణ్యం నుంచి పోటీ చేస్తారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ఆ విషయం పార్టీ అధినేత చేతుల్లో ఉందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాటసాని మంగళవారం నియమితులయిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ నుంచి ఎప్రిల్ 29న వెఎస్సార్‌సీపీలోకి చేరారు. గతంలో పాణ్యం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment