Katasani RamBhupal Reddy
-
మాట చెప్పడం.. మాట తప్పడం.. చంద్రబాబు నైజం
-
చంద్రబాబుకి కాటసాని సవాల్
-
టీడీపీ నేతలకు కాటసాని రాంభూపాల్ రెడ్డి హెచ్చరిక
-
ఓటమిపై కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన కామెంట్స్
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు
-
‘నాకు రూ.వెయ్యికోట్ల ఆస్తి ఉన్నట్లు నిరూపిస్తే రామోజీకే రాసేస్తా..’
సాక్షి, తాడేపల్లి: తన కుటుంబ సభ్యులపై ఈనాడు తప్పుడు వార్తలు రాస్తోందని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రామోజీ భార్య, కోడలపై కూడా ఇలాగే తప్పుడు వార్తలు రాస్తే ఊరుకుంటారా? అంటూ ధ్వజమెత్తారు. ‘‘మా కుటుంబ సభ్యులు ఏనాడూ రాజకీయాల్లో పాల్గొనరు. నాకు పది శాతం వాటాలు ఎవరు ఇచ్చారో ఈనాడు రామోజీ నిరూపించాలి. పత్రికా స్వేచ్చ అంటే ఇష్టం వచ్చినట్లు రాయటం కాదు. రాసిన తప్పుడు వార్తలపై వివరణ అడగటానికి వెళ్తే ఆఫీసుకు తాళం వేసుకుని పారిపోయారు. మీరు రాసినది నిజమే అయితే పారిపోవాల్సిన అవసరం ఏంటి?. దమ్ముంటే రాజకీయంగా నన్ను ఎదుర్కోవాలి. అంతేగానీ అనవసరంగా కుటుంబ సభ్యులను టార్గెట్ చేయొద్దు’’ అని కాటసాని పేర్కొన్నారు. ‘‘మీ ఇష్టం వచ్చినట్లు రాస్తే మేము నిరసన కూడా తెలపకూడదా?. మేము తప్పులు చేస్తే ఎత్తిచూపండి. కానీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తామంటే అది కరెక్టు కాదు. 1991లో నాకు తప్పులేని విషయంలో నేను బలిపశువుని అయ్యాను. రైతులకు ఏ సమస్య వచ్చినా నేను అండగా ఉంటా. నేను తప్పులు చేశానని నిరూపిస్తే నా అస్తులన్నీ రాసిస్తా. రామోజీ తప్పుడు పనులు చేసినందునే సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది. తప్పుడు పనులు రామోజీ చేస్తూ మాపై ఆరోపణలు చేయటం ఏంటి?. ఒక పార్టీకి కొమ్ము కాస్తూ మాపై తప్పుడు వార్తలు రాయటం పత్రికా స్వేచ్ఛ కాదు’’ అంటూ కాటసాని దుయ్యబట్టారు. ‘‘చంద్రబాబుకు ఈనాడు కరపత్రం. నాకు వెయ్యి కోట్ల ఆస్తి ఉన్నట్టు రామోజీ రాశాడు. ఆ పేపర్లు చూపిస్తే ఆ ఆస్తులన్నీ రామోజీకే రాసిస్తా. ఈనాడులో ఇష్టం వచ్చినట్లు రాసినందునే మా వాళ్లు వెళ్లారు. దాడి చేయాలని మావాళ్లు వెళ్లలేదు. కేవలం నిరసన తెలపటానికే వెళ్లారు. కనీసం ఆఫీసులోకి కూడా మా వాళ్లు వెళ్ల లేదు’’ అని కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి? -
బాబుపై కాటసాని కామెంట్స్
-
చంద్రబాబుకు మరో భారీ షాక్..!
-
రాంభూపాల్‌రెడ్డిపై ఇచ్చిన ఉత్తర్వులు వెనక్కి
సాక్షి, అమరావతి: తిరుమల, తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలి సభ్యుల నియామకంపై దాఖలైన వ్యాజ్యంలో హైకోర్టు జారీచేసిన నోటీసులను పాలక మండలి సభ్యుడు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అందుకోకపోవడంతో అతనికి పత్రికా ప్రకటన ద్వారా నోటీసులు అందజేయాలంటూ తామిచ్చిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం వెనక్కి తీసుకుంది. నోటీసులు అందుకోనందుకు రాంభూపాల్‌రెడ్డి క్షమాపణ కోరడంతో ధర్మాసనం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. నోటీసులు అందుకోని పాలక మండలి సభ్యులు అల్లూరి మల్లీశ్వరి, ఏఎన్ శశిధర్‌లకు పత్రికా ప్రకటనల ద్వారా నోటీసులు జారీచేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. టీటీడీ పాలకమండలి సభ్యు ల్లో పలువురికి నేరచరిత్ర ఉందంటూ వారి నియామ కాన్ని సవాలుచేస్తూ బీజేపీ నేత జి. భానుప్రకాశ్‌రెడ్డి గత ఏడాది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం పాలక మండలి సభ్యులందరికీ నోటీసులు ఇచ్చింది. ఇటీవల ఈ వ్యాజ్యం విచారణకు రాగా, నోటీసులు అందుకోని వారికి పత్రికా ప్రకటన ద్వారా నోటీసులు అందజేయాలంటూ ధర్మాసనం ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. దీంతో రాంభూపాల్‌రెడ్డి.. తన కుటుంబంలో వివాహ కార్యక్రమంవల్ల నోటీసు అందుకోలేకపోయానని, అందుకు క్షమించాలని, పత్రి కా ప్రకటన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలంటూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువా రం విచారించిన సీజే ధర్మాసనం.. రాంభూపాల్‌రెడ్డి విషయంలో తన ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది. -
పేదల సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం
-
ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
-
ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం జగన్
-
ఎమ్మెల్యే కాటసాని కుమారుడి వివాహానికి హాజరైన సీఎం జగన్
01:20PM కర్నూలు జిల్లా పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుని వివాహానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. కర్నూలు మండలం పంచలింగాల సమీపంలోని మాంటిస్సోరి ఒలంపస్ పాఠశాలలో జరుగుతున్న వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వివాహానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. 10:00AM సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం కర్నూలు రానున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుడు కాటసాని శివనరసింహారెడ్డి వివాహానికి హాజరుకానున్నారు. కర్నూలు మండలం పంచలింగాల సమీపంలోని మాంటిస్సోరి ఒలంపస్ పాఠశాలలో వివాహ వేడుక ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు. సీఎం హాజరవుతుండటంతో ప్రొటోకాల్ ప్రకారం పోలీసులు, అధికారులు భద్రత, ఇతర ఏర్పాట్లను చేపట్టారు. బుధవారం ఉదయం 10.20 గంటలకు సీఎం గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి 11.15 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 11.35 గంటలకు పంచలింగాల సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. (మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అక్కడ 11.55 గంటల వరకు జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం వివాహ వేడుకల్లో పాల్గొని 12.15 గంటలకు తిరిగి బయలుదేరుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంగళవారం కలెక్టర్ కోటేశ్వరరావు, కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి, జేసీలు డాక్టర్ మనజీర్ జిలానీ, ఎస్.రామసుందర్‌రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, నారపురెడ్డి మౌర్య, మునిసిపల్ కమిషనర్ డీకే బాలాజీ, డీఆర్వో బి.పుల్లయ్యలతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సీఎం ఓర్వకల్లు చేరుకున్నప్పటి నుంచి వివాహంలో పాల్గొని తిరిగి వెళ్లే వరకు పటిష్ట బందోబస్తుతోపాటు ఏర్పాట్లలో ఎలాంటి లోపం ఉండకూడదన్నారు. ఆయా అంశాలపై అధికారులకు సూచనలు జారీ చేశారు. 09:50AM సీఎం పర్యటనకు పటిష్ట భద్రత కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు పర్యటన సందర్భంగా జిల్లా పోలీసు శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసింది. బందోబస్తు విధులు నిర్వహించే సిబ్బందికి ఎస్పీ సీహెచ్ సుధీర్‌కుమార్‌రెడ్డి తగిన సూచనలు (బ్రీఫింగ్) ఇచ్చారు. ఓర్వకల్లు విమానాశ్రయం, కర్నూలు మండలం పంచలింగాల గ్రామ శివారులోని మాంటిస్సోరి స్కూల్ సమీపంలోని హెలిప్యాడ్ నుంచి వివాహ వేడుక వరకు గల రూట్ అండ్ రూఫ్ టాప్ ప్రాంతాల్లో బందోబస్తు నిర్వహించే పోలీసులు, స్పెషల్‌పార్టీ పోలీసు బృందాలు, పోలీసు జాగిలాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. బందోబస్తుకు పోలీసు నిఘా విభాగాలు ఇంటలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), మఫ్టీ బృందాలతో పాటు 12 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 55 మంది ఎస్ఐలు, 88 మంది ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, 241 మంది కానిస్టేబుళ్లు, 29 మంది మహిళా పోలీసులు, 163 మంది హోంగార్డులు, 4 ప్లటూన్ల ఏఆర్ సిబ్బంది, 15 స్పెషల్ పార్టీ సిబ్బందితో పాటు అగ్నిమాపక సిబ్బందిని కేటాయించారు. -
సీఎం వైఎస్ జగన్ కర్నూలు పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (బుధవారం) కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 22న ఉదయం 10 గంటలకు సీఎం వైఎస్ జగన్ తాడేపల్లిలోని తన ఇంటి నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో కర్నూలు విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామానికి చేరుకుంటారు. అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడతారు. ఆ తర్వాత పంచలింగాలలో పాణ్యం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కుమారుడు శివ నరసింహారెడ్డి పెళ్లికి హాజరవుతారు. అనంతరం తిరిగి బుధవారం మధ్యాహ్నం 12.20 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి కర్నూలు విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు తాడేపల్లిలోని ఇంటికి చేరుకుంటారు. -
న్యాయ రాజధానితోనే అభివృద్ధి
కర్నూలు (అర్బన్): న్యాయ రాజధానిని సాధించుకుంటేనే కర్నూలు జిల్లా అభివృద్ధి చెందుతుందని, వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, సంస్థల నాయకులు స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లుగా చారిత్రక త్యాగాలు చేస్తూ వచ్చిన కర్నూలు జిల్లా వాసులు ఇకపై త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమని ప్రకటించారు. సోమవారం ఉదయం స్థానిక మెగాసిరి ఫంక్షన్ హాల్లో అధికార వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘అధికార వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఏర్పాటు’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే టీడీపీ నేతలు అడ్డుతగలడం దారుణమని, అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో తక్కువ ధరకు సేకరించిన భూములను ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకునేందుకు చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ అక్కడి అమాయక రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ ముసుగులో చేపట్టిన పాదయాత్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని, ఎన్నో త్యాగాలు చేసిన కర్నూలు వాసుల చిరకాల స్వప్నమైన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కలిసి రాని రాజకీయ నేతలంతా కాలగర్భంలో కలిసిపోక తప్పదని హెచ్చరించారు. రాయలసీమ పౌరుషం చూపిస్తాం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ ..1953 నుంచి చారిత్రక త్యాగాలు చేసిన కర్నూలు వాసులు ఇక త్యాగాలు చేసే స్థితిలో లేరని, ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధానిని సాధించుకునేందుకు రాయలసీమ పౌరుషాన్ని చూపిస్తామని అన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని ఆశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడు రాజధానులు ప్రకటిస్తే టీడీపీ అడ్డుకోవడం దారుణమన్నారు. ఇక్కడి టీడీపీ నేతల్లో రాయలసీమ రక్తం ప్రవహిస్తుంటే ఇక నుంచి చేపట్టే ఉద్యమాల్లో కలిసి రావాలన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ మాట్లాడుతూ.. చంద్రబాబు డైరెక్షన్లో సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రలో నిజమైన రైతులు లేరని, ఆ యాత్రలో రియల్ ఎస్టేట్వ్యాపారులు, చంద్రబాబు బినామీలు, టీడీపీ కార్యకర్తలే ఉన్నారని అన్నారు. స్వార్థంతో పేద, మధ్య తరగతి రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన భూములతో రూ.కోట్లు సంపాదించేందుకు టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతూ నిజమైన రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. న్యాయ రాజధాని సాధనకు తొలి అడుగు కర్నూలు ఎంపీ డాక్టర్ ఎస్.సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన న్యాయ రాజధాని సాధన కోసం తొలి అడుగు పడిందని, ఇక పాదయాత్రలు, నిరాహార దీక్షలు, నిరసన దీక్షలు చేపట్టాల్సి ఉందని అన్నారు. జిల్లాలో 95 కిలోమీటర్ల మేర తుంగభద్ర ప్రవహిస్తున్నా తాగేందుకు కూడా నీరు లేని పరిస్థితి ఇక్కడ ఉందన్నారు. న్యాయ రాజధాని ఇక్కడ ఏర్పాటైతే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్నారు. సాధన సమితి అధ్యక్షుడు బి.క్రిష్టఫర్ మాట్లాడుతూ.. అమరావతి రైతుల పేరుతో చంద్రబాబు చేయిస్తున్న పాదయాత్ర రాయలసీమలో అడుగుపెడితే అడ్డుకుంటామన్నారు. మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ.. కరువు కాటకాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న సీమ రైతులను ఆదుకోలేని టీడీపీ నేతలు అమరావతి రైతుల నకిలీ ఉద్యమాలకు చందాలు ఇవ్వడాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. న్యాయ రాజధానికి సీపీఐ కట్టుబడి ఉంది సీపీఐ నేత రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేసే అంశానికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి రైతుల పేరుతో కొనసాగుతున్న పాదయాత్రలు వట్టి బూటకమని, చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలో వారంతా కేవలం పాత్రధారులేనని అన్నారు. ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు సీహెచ్ వెంగళరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధానిని సాధించుకునేందుకు కర్నూలు నుంచి హైకోర్టు వరకు పాదయాత్రలు చేపడదామన్నారు. ఉద్యమాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకుపోయేందుకు ఉద్యోగులంతా వారం రోజులపాటు మాస్ క్యాజువల్ లీవ్ పెట్టేందుకైనా వెనుకాడమన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఐ.విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయ్యేంత వరకు ఉద్యమాలను ఉధృతం చేసే ప్రక్రియలో ఎంతటి త్యాగాలు చేసేందుకైనా సిద్ధమన్నారు. సదస్సులో డిప్యూటీ మేయర్ రేణుక, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, జాతీయ కిసాన్ సంఘ్ ఉపాధ్యక్షుడు వి.సిద్ధారెడ్డి, విద్యాసంస్థల అధినేతలు జి.పుల్లయ్య, కేవీ సుబ్బారెడ్డి, ఏపీ ఎన్జీవో ఉపాధ్యక్షుడు దస్తగిరిరెడ్డి, రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ కన్వీనర్ శ్రీరాములు, కో–కన్వీనర్ ఆర్.చంద్రప్ప, సీనియర్ న్యాయవాదులు వై.జయరాజు, నాగలక్ష్మీదేవి, విశ్రాంత తహసీల్దార్ రోషన్ ఆలీ తదితరులు మాట్లాడారు. -
చంద్రబాబు ఒకవర్గం కోసం పనిచేస్తున్నారు: ఎమ్మెల్యే కాటసాని
-
ఉల్లి విక్రయాలకు తొలగిన అడ్డంకి
కర్నూలు (అగ్రికల్చర్): కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి క్రయవిక్రయాల్లో గత నెల 17 నుంచి నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. యార్డులో నెలకొన్న సమస్యలు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి చొరవతో పరిష్కారమయ్యాయి. మార్కెట్‌కు ఉల్లిగడ్డలు తెప్పించేందుకు, ఈ–నామ్ అమలుకు కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు అంగీకరించారు. దీంతో ఈ నెల 11 నుంచి కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి సహా అన్ని రకాల పంటల కొనుగోళ్లు యథావిధిగా కొనసాగుతాయి. కొత్తగా మినుములు, కొర్రలను కూడా కొనుగోలు చేసే సదుపాయాన్ని మార్కెట్ కమిటీ కల్పించింది. శనివారం ఉదయం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులతో సమావేశమయ్యారు. ఉల్లి క్రయవిక్రయాల్లో మరింత పారదర్శకతను పెంపొందించేందుకు, వ్యాపారుల మధ్య పోటీ ఉండటం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో ప్రభుత్వం ఉల్లికి కూడా ఈ–నామ్ అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు విధిగా కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. సహకరించకపోతే కొత్త కమీషన్ ఏజెంట్లు, కొత్త వ్యాపారులను రంగంలోకి దింపి ఉల్లి సహా అన్ని పంటలను ఈ–నామ్లో కొనుగోలు చేసే ఏర్పాట్లు చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో దిగివచ్చిన కమీషన్ ఏజెంట్లు, వ్యాపారులు ఈ నెల 11 నుంచి తాము కూడా ఈ–నామ్లో కొంటామని సంసిద్ధత వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సెక్రటరీ జయలక్ష్మి, వైఎస్సార్సీపీ నాయకుడు శ్రీధర్‌రెడ్డి, కమీషన్ ఏజెంట్ల సంఘం నేతలు కట్టా శేఖర్, శ్రీనివాసరెడ్డి, జూటూరు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
పింఛన్లపై టిడిపి అనవసర రాద్ధాంతం చేస్తుందన్న ఎమ్మెల్యే
-
సీఎం జగన్ బీసీలకు పెద్దపీట వేశారు
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారని పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య ఆరోపించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ అధికారం చేపట్టాక బీసీలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు. 45వేల కోట్ల రూపాయలను బీసీలకు కేటాయించి బీసీ కార్పోరేషన్, చైర్మన్లను ఏర్పాటు చేశారన్నారు. ఇది తెలిసి టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్‌పై 23 ఆరోపణలు ఉన్నాయని, ఆరోపణలపై చట్టపరమైన విచారణ కొనసాగుతోందని చెప్పారు. బీసీలతో ఓటు వేయించుకోని వారిని మోసం చేశారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముసుగులో జిల్లాలో కొందరు నేతలు అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. వారిపై కూడా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. అలాగే పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందించే దిశగా సీఎం వైఎస్ జగన్ పని చేస్తున్నారన్నారు. బీసీ అభివృద్ధికి 45 వేల కోట్ల రూపాయలను సీఎం జగన్ ఖర్చు చేస్తున్నారని చెప్పారు. టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, ఇది మానుకోవాలన్నారు. కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ ఆరోపణలపై విచారణలో నిజాలు తెలియాల్సి ఉందని, ఈ వ్యవహారంలో టీడీపీ అనుబంధం.. బీసీ సంఘాల తీరును ఖండిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను కులమతాలకు అతీతంగా అందిస్తున్నామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడితే సహించేది లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులపై సైతం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవినీతి పరులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దానిని టీడీపీ రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే ఆరోపించారు. -
దంపతుల ప్రాణాలు కాపాడిన కాటసాని
కర్నూలు (న్యూటౌన్)/ఓర్వకల్లు: కర్నూలు నగర శివారులోని రింగ్‌రోడ్డు వద్ద బుధవారం ఉదయం గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో నన్నూరు గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు రామచంద్రయ్య (50), జానకమ్మ (45) స్పృహ కోల్పోయారు. భార్యభర్తలు వ్యక్తిగత పనినిమిత్తం ద్విచక్రవాహనంపై కర్నూలుకు బయలుదేరారు. టోల్గేట్ సమీపంలోని సఫా ఇంజినీరింగ్ కళాశాల వద్ద కర్నూలు వైపునకు మలుపు తిరుగుతుండగా గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొంది. అదే రహదారిలో పాణ్యం వెళ్తున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆగి అంబులెన్స్‌లో క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి పంపించారు. అనంతరం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌కు ఫోన్ చేసి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అలాగే మహారాష్ట్ర నుంచి తమిళనాడుకు ఉల్లిగడ్డల లోడుతో వెళ్తున్న లారీ ఓర్వకల్లు వద్ద టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి డివైడర్‌ను దాటుకొని బోల్తాపడింది. ఈ సంఘటనలో లారీ డ్రైవర్ వినోద్ కామెడ్ కాలు కేబిన్‌లో ఇరుక్కపోయింది. పోలీసులు స్థానికుల సాయంతో జేసీబీ ద్వారా బయటకు తీశారు. హైవే పెట్రోలింగ్ వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కర్ణాటక నుంచి కర్నూలుకు చేరుకున్న విద్యార్థులు
సాక్షి, కర్నూలు: కరోనా కారణంగా అకస్మాత్తుగా లాక్డౌన్ విధించడంతో ఎక్కడి వారు అక్కడే ఆగి పోయారు. ఎలాంటి రవాణా సౌకర్యాలు లేక ఇంటికి చేరలేక లాక్‌డౌన్‌కి ముందు ఎక్కడ ఉన్నారో అక్కడే చిక్కకుపోయి నానా కష్టాలు పడుతున్నారు. మార్చి నెలలో మొదలయిన లాక్డౌన్ ఇప్పటికి మూడు సార్లు పొడిగించి మే 17 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దీంతో నానాటికి వలస కార్మికులు, వేరే ప్రాంతాల్లో ట్రైనింగ్ కోసం వెళ్లిన విద్యార్ధులు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. (వారి వివరాలు తెలుసుకోవడానికి వెళితే దాడి చేశారు!) అయితే మే 1 నుంచి వలస కార్మికులను, వేరే రాష్ట్రంలో చిక్కుకుపోయిన వారిని తరలించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.విదేశాల నుంచి భారతీయులను తీసుకురావడానికి కూడా అన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే శ్రామిక్ రైలు ద్వారా నిన్న కొంత మంది మత్యకారులు, వలస కూలీలు చెన్నై నుంచి శ్రీకాకుళం చేరుకున్నారు. ఇక బుధవారం నాడు కూడా సోలాపూర్ అగ్రికల్చర్ కాలేజీకి ట్రైనింగ్ కోసం వెళ్లి లాక్డౌన్ కారణంగా అక్కడే చిక్కుకు పోయిన 31 మంది విద్యార్థిని విద్యార్థులు కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వారిని జిల్లాలోకి తీసుకువచ్చారు. జిల్లాకు వచ్చిన విద్యార్థిని విద్యార్ధులను మొదట క్వారంటైన్లో ఉంచి అన్ని పరీక్షలు నిర్వహిస్తారు. పరీక్షలు కోవిడ్-19 ఫలితాలు నెగిటివ్ అని తెలితే వారిని అక్కడి నుంచి వారి సొంత ఊర్లకు పంపించనున్నారు. (మాజీ మంత్రి ఇంట్లో విషాదం) -
ప్రజల ఆరోగ్యమే సీఎం జగన్‌కు ముఖ్యం
-
‘చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు’
సాక్షి, కర్నూలు: అమరావతి విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు తీరు అర్థరహితమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి విమర్శించారు. గత ఐదేళ్లలో అభివృద్ధిని మరిచిన చంద్రబాబు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కర్నూల్లో హైకోర్టు ఏర్పాటుతో పాటు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయాలని, పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. కర్నూలు అభివృద్ధికి సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. బి.వై.రామయ్య మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని ఆయన పేర్కొన్నారు. సీఎం జగనన్న మాట ఇస్తే తప్పే ప్రస్తే లేదని కొనియాడారు. అమరావతిలో జరుగుతున్నది రైతు ఉద్యమం కాదని, చంద్రబాబు బినామీల ఆందోళన మాత్రమేనన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును సమర్థించే టీడీపీ నేతలు కర్నూల్లో హైకోర్టు వద్దని చెప్పగలరా? అని సూటిగా ప్రశ్నించారు. రాయలసీమ టీడీపీ నేతలు చంద్రబాబు మాయలో ఉన్నారన్నారు. ఇకనైనా ప్రాంతాల అభివృద్ధి కోసం టీడీపీ నేతలు ఆలోచించాలని కోరారు. -
రెండో రోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే కాటసాని పాదయాత్ర
-
సాగునీరు అందించేందుకు కృషి
సాక్షి, పాణ్యం: మండలంలోని తమ్మరాజుపల్లె, కందికాయపల్లె, పిన్నాపురం గ్రామాలకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. తమ్మరాజుపల్లెలో ఏటి పాయ చెక్‌డ్యామ్‌ను నిర్మిస్తామన్నారు. ఆయన మంగళవారం గోరుకల్లు గ్రామంలో మొహర్రం సందర్భంగా పెద్ద సరిగెత్తును పురస్కరించుకుని పెద్ద స్వామికి ప్రత్యేక ఫాతెహాలు చదివించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ తమ్మరాజుపల్లె, కందికాయపల్లె, పిన్నాపురం గ్రామాలకు ప్రతి ఏటా నీటిసమస్య ఎదురవుతోందన్నారు. ఈ మూడు గ్రామాలు వర్షాధారంపైనే పంటలు సాగు చేసుకోవాల్సి వస్తోందన్నారు. కళ్ల ముందే నీరు వెళ్తున్నా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉందన్నారు. కావున ఈ మూడు గ్రామాలకు సాగునీరు అందించడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తమ్మరాజుపల్లెకు ఏళ్ల నాటి కలగా మిగిలిన ఏటిపాయ నిర్మాణం జరిపి పొలాలకు సాగునీరు, గ్రామానికి తాగునీటి కొరత లేకుండా చూస్తామన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలోనే కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. గోరుకల్లు బ్యాక్ వాటర్ నుంచి ఎత్తిపోతల స్కీమ్ తెచ్చి పిన్నాపురం, తమ్మరాజుపల్లెకు పుష్కలంగా నీరు ఉండేలా కొచ్చేరును నింపుతామన్నారు. కందికాయపల్లె గ్రామానికి కూడా ఈ జలాలు ఉపయోగించుకునేలా రామతీర్థం వద్ద గానీ, మరో చోట గానీ మోటార్ల సహాయంతో నీటిని పంపింగ్ చేయించి.. పైన ఉన్న చెరువును నింపుతామన్నారు. ఓర్వకల్లు కూడా నీటిని సరఫరా చేయించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. అలాగే రోడ్ల విస్తీరణలో నష్టపోయిన ప్రతి బాధితుడిని ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, నాయకులు కొట్టాల అమర్నాథ్రెడ్డి, లక్ష్మీమద్దయ్య, ఇమాం, భాస్కర్‌రెడ్డి , నాగిరెడ్డి, గగ్గటూరు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.