
జగన్ సమైక్య దీక్షకు కాటసాని రాంభూపాల్ రెడ్డి మద్దతు
సమైక్యాంద్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మద్దతు పలికారు. హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయానికి ఎదురుగా జగన్ సమైక్య దీక్ష చేస్తున్న వేదిక వద్దకు ఆదివారం రాంభూపాల్ రెడ్డి వచ్చి సంఘీభావం ప్రకటించారు.
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ శనివారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. జగన్కు మద్దతు తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు తరలివస్తున్నారు.