Samaikya Deeksha
-
సమైక్యమే లక్ష్యంగా..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర కోరుతూ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడో రోజైన గురువారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణ లో రాష్ట్రవిభజనకు నిరసనగా వైఎస్సార్సీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేనిరాహారదీక్షలు మూడోరోజూ కొనసాగాయి. దీక్షను పార్టీ నాయకుడు కేవీజీ సత్యనారాయణ ప్రారంభించగా, పార్టీ నాయకులు జి.శ్రీనివాసరావు, బి.మల్లేశ్వరరావు, జి చలపతిరావు, కె.మార్కాండేశ్వరరావు, కె.ఎర్రయ్య, ఎం. నీలయ్య, పి.వెంకటరమణ, ఎస్.వేణుగోపాలరావులు కూర్చున్నారు. వీరికి పట్టణయూత్ కన్వీనర్ డి.అప్పలనాయుడు, పార్టీ నాయకుడు డి.శ్యామలరావు తదితులు సంఘీభావం తెలిపారు. పాతపట్నం: సమైక్యాంధ్రాను కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో నిరాహారదీక్షలను కొనసాగించారు. హిరమండలం మండలానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గేదెల జగన్మోహనరావు, రేగాన మోహనరావు, వి.చిరంజీవులు, పతివాత తిరుపతిరావులతో పాటు పాతపట్నం మండలానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు. టెక్కలి: పార్టీ అధిష్టానవర్గం పిలుపు మేరకు సంతబొమ్మాళిలో రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ నాయకురాలు దువ్వాడ వాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా సమైక్యాంధ్రకు మద్దతుగా జైజగన్ నినాదాలతో దీక్షా శిబిరాన్ని కొనసాగించారు. నాయకులు చింతాడ గణపతి, కోత మురళీ, దవళ రమేస్, శిమ్మ సోమేష్‌లు పాల్గొన్నారు. ఇచ్ఛాపురం: రాష్ట్రాన్ని విడదీయడానికి వీల్లేదని రాష్ట్ర విభజన బిల్లును వెనక్కు తీసుకోవాలని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నియోజవర్గ నాయకులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. పార్టీ సోంపేట మండల కన్వీనర్ పిన్నింటి ఈశ్వరరావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బస్వా శ్రీను, పార్టీ నాయకులు నిట్ట గోపాల్, రాపాక రామారావు, సునీల్ కుమార్ మండల్, గానాల దుర్యోధన, పి.శ్యామ్ పాల్గొన్నారు. వీరికి మున్సిపల్, మండల కన్వీనర్లు పిలక పోలారావు, కారంగి మోహనరావు, ఎం.వెంకటరెడ్డి, తదితరులు సంఘీబావం తెలిపారు. రాజాం: రాజాంలో మూడో రోజు దీక్షలు కొనసాగాయి. దీక్షల్లో పాల్గొన్నవారు రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. పార్టీ జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జీటీ నాయుడు, మండల కన్వీనర్ బి.అచ్చిబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘సమైక్య’ ఉద్యమానికి ఊపిరి
రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ను అడ్డుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షలు కొనసాగిస్తోంది. అధికార పార్టీ నాయకుల ఆగడాలకు వ్యతిరేకంగా ఊరూరా సమైక్య ఉద్యమాలటకు ఊపిరి పోస్తోంది. విభజన వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ ప్రజల్లో సమైక్య స్ఫూర్తిని నింపుతోంది. జిల్లాలో బుధవారం కూడా వైఎస్ఆర్ సీపీ నాయకుల దీక్షలు కొనసాగాయి. ప్రజలను ఉద్యమంలో భాగస్వాములు చేస్తూ నాయకులు సమైక్య పోరాటాన్ని ముందుకు తీసుకెళుతున్నారు. బొబ్బిలి, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్రం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీక్షలు కొనసాగిస్తోంది. ఆ పార్టీ నాయకులు బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లోనూ, మండలాల్లో దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసి సమైక్య నినాదాలు చేశారు. బొబ్బిలిలో దక్షిణి దేవిడి వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణంలోని పాత బొబ్బిలి గ్రామంలోని ఒకటి, రెండు, మూడు వార్డులకు చెందిన సుమారు వంద మంది వరకూ దీక్షల్లో కూర్చున్నారు. వీరికి వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు సంఘీభావం తెలిపారు. సమైక్యాంధ్ర సాధన కోసం కట్టుబడి ఉండే పార్టీకి ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వాలని కోరారు. సమైక్యాంధ్ర ముసుగులో ప్రజలను మోసగిస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. దీక్షలో ఆ వార్డులకు చెందిన కూరాకుల సంఘ ఉత్తరాంధ్ర నాయకుడు కోట పెదరాములు, మాజీ కౌన్సిలరు కోట అప్పారావు, మింది గుంపస్వామి, తోట కబీరుదాసు, పుప్పాల ప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు. విజయనగరంలో ఆ పార్టీ నాయకుడు అవనాపు విక్రమ్ ఆధ్వర్యంలో రెండో రోజు దీక్షలు జరిగాయి. కొనిశ బంగ్రారాజు, పి.చిన్నప్పన్న, క్రిస్టఫర్ రాజు, కమలమ్మ, వెంకటరెడ్డిలకు విక్రమ్ పూలమాలలు వేసి అభినందించారు. కార్యక్రమంలో నామాల సర్వేశ్వరరావు, బుగత ముత్యాలమ్మ, రాంబార్కి సత్యం, సియ్యాదుల శేఖర్, సంతోష్ తదితరులు ఉన్నారు. ఎస్.కోట నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జిల్లా మైనార్టీ సెల్ కన్వినర్ షేక్ రహ్మాన్ నేతృత్వంలో రిలే నిరాహార దీక్షల శిబిరం రెండో రోజూ కొనసాగింది. సీతంపేట గ్రామానికి చెందిన చిప్పాడ సత్యన్నారాయణ, నౌదాసరి అప్పారావు, ఎలమంచిలి సోమునాయుడు, నౌదాసరి నర్సింగరావు, ఎలమంచిలి అప్పారావు, సరిత అప్పారావులు దీక్షల్లో కూర్చున్నారు. జిల్లా మైనార్టీసెల్ కన్వీనర్ షేక్ రహ్మాన్‌తో పాటు మండల కన్వీనర్ ఎస్.సత్యం తదితరులు వారికి సంఘీభావం తెలిపారు. అలాగే పార్టీ రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు కోళ్ల గంగాభవానీ కూడా లక్కవరపుకోటలో దీక్ష చేపట్టారు. గజపతినగరం నియోజకవర్గంలో సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు, మ క్కువ శ్రీధర్, డాక్టరు పెద్దినాయుడుల ఆధ్వర్యంలో శిబిరాలు జరిగాయి. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన రెండో రోజు దీక్షను సమన్వయకర్త మీసాల వరహాలనాయుడు ప్రారంభించారు. నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో జనా ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో మహిళలు పాల్గొన్నారు. పార్టీ నాయకుడు పెనుమత్స సురేష్ బాబు వీరికి సంఘీభావం తెలిపారు. అన్ని దీక్షా శిబిరాల వద్ద నాయకులు సమైక్య నినాదాలతో హోరె త్తించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్ఆర్ సీపీ మాత్రమే పోరాడుతోందని స్పష్టం చేశారు. భవిష్యత్‌లోనూ పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తామని నాయకులు, కార్యకర్తలు తెలిపారు. -
జిల్లా వ్యాప్తంగా సమైక్య దీక్షలు
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేసి నరసన తెలిపారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తే సహించమని హెచ్చరించారు. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా కదలివచ్చారు. శ్రీకాకుళం: తహశీల్దారు కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలను వైఎస్ఆర్సీపీ సీఈసీ సభ్యురాలు, శ్రీకాకుళం నియోజకవర్గ సమన్వయ కర్త వరుదు కల్యాణి ప్రారంభించారు. సమైక్య నినాదాలు చేశారు. పార్టీ నాయకులు మార్పు ధర్మారావు, అందవరపు సూరిబాబు, శ్రీనివాస్పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. టెక్కలి: పార్టీ నాయకురాలు దువ్వాడ వాణి ఆధ్వర్యంలో టెక్కలి వైఎస్ఆర్ కూడలిలో రిలే దీక్షను ఏర్పాటు చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. పార్టీ నాయకులు సంపతిరావు రాఘవరావు, తిర్లంగి జానకిరామయ్య తదితరులు పాల్గొన్నారు. పలాస: కాశీబుగ్గ బస్టాండ్ వద్ద రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని పార్టీ నాయకులు నిర్వహించారు. నియోకజకవర్గ సమన్వయకర్త వజ్జ బాబూరావుతో పాటు నాయకులు డబ్బీరు భవానీశంకర్, బోనెల రాము, నర్తు ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. పలాస-కాశీబుగ్గ పట్టణాల్లోని మదర్‌థెరిసా కాన్సెప్ట్ స్కూల్, శ్రీ గురుకుల విద్యాలయం, విద్యావాహిని, షిర్డీసాయి డిగ్రీ కళాశాల, బీఈటీ స్కూల్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఇచ్ఛాపురం: నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన దీక్షా శిబిరంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. పార్టీ జిల్లామహిళా కన్వీనర్ బి.హేమామాలిని రెడ్డి, ఎన్ఆర్ఐ బల్లాడ రవికుమార్ రెడ్డి పాల్గొన్నారు. పాతపట్నం: పాతపట్నం వైఎస్సార్ విగ్రహం ముందు రిలే నిరాహార దీక్షను పార్టీ నాయకులు చేపట్టారు. నియోజకవర్గ సమన్వయకర్త కలమట వెంకటరమణ శిబిరాన్ని ప్రారంభించగా.. మండల యూత్ అధ్యక్షుడు బి.వసంతరావు, మండల కన్వీనర్ కె. అర్జునరావు పాల్గొన్నారు. రాజాం: రాజాం వైఎస్సార్ విగ్రహ కూడలి వద్ద పార్టీ నాయకులు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త పీఎంజే బాబు, మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు. ఆమదాలవలస: స్థానిక మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణంలో నిర్వహించిన రిలే నిరాహారదీక్షలో పార్టీ నాయకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. నియోజకవర్గ సమన్వయకర్తలు కిల్లి రామ్మోహన్రావు, బొడ్డేపల్లి మాధురి తదితరులు పాల్గొన్నారు. ఎచ్చెర్ల: రణస్థలం మండల పరిషత్ కార్యాలయ సమీపంలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఎచ్చెర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్లె కిరణ్‌కుమార్, జెడ్పీటీసీ మాజీ సభ్యులు టంపాల సీతారాం పాల్గొన్నారు. -
‘సమైక్య’ దీక్షలు
బొబ్బిలి, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన ప్రక్రియకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనలు కొనసాగిస్తున్నారు. మంగళవారం జిల్లావ్యాప్తంగా ఆ పార్టీ నాయకులు విభజనను వ్యతి రేకిస్తూ.. రిలే దీక్షలు చేపట్టారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే రెండు ప్రాంతాల్లోనూ అభివృద్ధి సాధ్యమని నినదించారు. బొబ్బిలి పట్టణంలో మొదటి రోజు సుమారు 70 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు దీక్షలో కూర్చున్నారు. పట్టణానికి చెందిన 4, 5 వార్డులతో పాటు గొల్లపల్లి గ్రామస్తులు శిబిరంలో కూర్చున్నారు. వారికి ఆ పార్టీ జిల్లా కన్వీనరు పెనుమత్స సాంబశివరాజు, ఉత్తరాంధ్ర జిల్లాల సమన్వయకర్త ఆర్వీ సుజయ్ కృష్ణ రంగారావు, అరుకు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు ఆర్వీఎస్కేకే రంగారావు (బేబీనాయన) సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకు లు సుజయ్, సాంబశివరాజు మాట్లాడు తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వరకూ పోరాటాన్ని ఆపేది లేదన్నా రు. నెల్లిమర్లలో చేపట్టిన దీక్షలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, సింగుబాబు, సేవాదళ్ జిల్లా కన్వీనరు తూముల రాంసుధీర్, మాజీ కౌన్సిలర్లు, వార్డుస్థాయి నాయకులు పాల్గొన్నారు. విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అవనాపు విజయ్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కాళ్ల గౌరీశంకర్, శిరువురి పార్వతి, రాంబార్కి సత్యం, గండికోట శాంతి, బుగత ముత్యాలమ్మ, తదితరులు పాల్గొన్నారు. గజపతినగరంలో నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద డాక్టర్ పెద్దినాయుడు, మక్కువ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షా శిబిరానికి పార్టీ జిల్లా కన్వీనరు సాం బశివరాజు సంఘీభావం తెలిప ారు. అలాగే బీఎస్ఆర్ ఆస్పత్రి ముందు సమన్వయకర్త కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహించారు. ఎస్. కోటలో జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ రెహ్మాన్, పార్టీ రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు కోళ్ల గంగాభవాని ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. చీపురుపల్లిలో సమన్వయకర్త మీసా ల వరహాలనాయుడు ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి, గుర్ల, గరివిడి మండలాల కన్వీనర్లు మీసాల అప్పలనాయుడు, సీహెచ్ సత్యనారాయణ రెడ్డి, కెల్ల సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.సాలూరులో మున్సిపల్ మాజీ చైర్పర్సన్, రాష్ర్ట మహిళా సభ్యురా లు ముగడ గంగమ్మ, మంచాల వెంకటరమణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. -
వైయస్ జగన్మోహన్ రెడ్డి సమైక్య దీక్ష
-
గళం.. సమైక్యం
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర పరిరక్షణకు సమైక్యవాదులు కంకణబద్ధులై ముందుకు సాగుతున్నారు. విభజన ప్రకటనను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించగా.. రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. కర్నూలులో భూగర్భ జలశాఖ ఉద్యోగులు ర్యాలీగా వచ్చి స్థానిక కలెక్టరేట్ ఎదుటనున్న మహాత్మాగాంధీ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాల అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్లో రిలే దీక్షలు తిరిగి ప్రారంభించారు. డోన్ పట్టణంలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 83వ రోజుకు చేరుకున్నాయి. ఆదోని పట్టణ జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్జులు రిలే నిరాహర దీక్ష చేపట్టారు. సమైక్యాంధ్ర ప్రకటన వెలువడే వరకు దీక్షలు విరమించేది లేదని పట్టణ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఆత్మకూరులో వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది గౌడ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. నంద్యాలలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మునిసిపల్ టౌన్హాల్లో రైతు గర్జన నిర్వహించారు. రాష్ట్ర విభజన వల్ల రైతులకు కలిగే నష్టాలను వివరించారు. నందికొట్కూరులో కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పటేల్ సెంటర్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఇక మండల కేంద్రమైన కోసిగిలో విద్యార్థి గర్జన పెద్ద ఎత్తున నిర్వహించారు. వివిధ పాఠశాలల నుంచి వేలాది విద్యార్థులు పాల్గొన్నారు. -
ఉద్యమానికి బాసటగా వైఎస్సార్సీపీ పోరు
సాక్షి నెట్వర్క్: రాష్ట్ర సమైక్య సాధన కోసం వైఎస్సార్సీపీ శ్రేణులు ఆదివారం నాడూ అవిశ్రాంత పోరాటం సాగించాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు నేతలు, కార్యకర్తలు వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో పార్టీ సమన్వయకర్త షమీమ్ అస్లాం నేతృత్వంలో ధర్నా నిర్వహించారు. తిరుపతిలో కార్యకర్తల రిలే నిరాహారదీక్షను ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రారంభించారు. శ్రీకాళహస్తిలో కృష్ణారెడ్డి, పలమనేరులో మాజీ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. కృష్ణాజిల్లా కురుమద్దాలి శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ వైఎస్సార్ సీపీ నేత ఉప్పులేటి కల్పన ప్రత్యేక పూజలు చేశారు. తిరువూరులో శీలం నాగనర్సిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు రిలేదీక్ష చేపట్టారు. ప్రకాశం జిల్లా చీరాలలో 530 మంది ఆర్టీసీ కార్మికులకు పార్టీ నేత చినరోశయ్య, ఎన్ఆర్ఐ విభాగం నాయకుడు బాలాజీలు బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా మాచర్లలోని రిలే దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి, కావలిలో, అనంతపురం జిల్లా ధర్మవరంలో పార్టీ కార్యకర్తలు రిలేదీక్షలు చేపట్టారు. -
ఆందోళనకరంగా కీటోన్స్ స్ధాయి
-
జగన్‌కు రాత్రి వైద్యులు ప్లూయిడ్స్ ఎక్కించారు-YS భారతి
-
జగన్ దీక్ష భగ్నం
-
నెల రోజుల వ్యవధిలోనే రేండుసార్లు ఆమరణ దీక్ష
-
వైఎస్ జగన్ దీక్షకు వెల్లువెత్తిన మద్దతు
-
అనంతలో వైఎస్ జగన్ దీక్షకు వెల్లువెత్తిన మద్దతు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య దీక్షకు అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. జగన్ దీక్షకు సంఘీభావంగా కళ్యాణదుర్గంలో ఎల్ఎమ్ మోహన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష మంగళవారం నాలుగోరోజుకు చేరుకుంది. అలాగే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో దీక్షలు కొనసాగుతున్నాయి. వీటితోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లాలోని కదిరి, ఒడిసి తదితర ప్రాంతాల్లో వైఎస్ జగన్ అభిమానులు దీక్షలు చేపట్టారు. -
నీరసించిన జగన్.. నాలుగో రోజుకు చేరిన దీక్ష
-
వంగవీటి రాధా దీక్షను భగ్నం చేసిన పోలీసులు
-
అందరూ కలిసి రండి
-
అందరూ కలిసి రండి
హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతు కూడగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నేతలతో భేటీ కానుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ బృందానికి నాయకత్వం వహిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం నాడిక్కడ విలేకరులకు తెలిపారు. ‘మేము మీ నుంచి మద్దతు కోరుతున్నాం. సోషల్ మీడియా మద్దతు కూడా కోరుతున్నాం. ప్రజాస్వామ్యంపై విశ్వా„సమున్న ప్రతిఒక్కరి మద్దతు మాక్కావాలి..’ అని జగన్ అన్నారు. ఈ అన్యాయాన్ని అడ్డుకునేందుకు అంతా కలిసి ముందుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘అన్ని పార్టీలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతల సహకారం మాకు కావాలి. ఎందుకంటే ఇవాళ ఇక్కడ జరిగేది రేపు మరెక్కడైనా జరగవచ్చు. రాష్ట్ర విభజన సమయంలో అసెంబ్లీ తీర్మానాన్ని విస్మరించిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి. ఎందుకంటే అది ప్రజాభిప్రాయానికి అద్దం పడుతుంది..’ అని చెప్పారు. 2014 ఎన్నికల తర్వాత ఎవరికి మద్దతిస్తారƒ న్న ప్రశ్నకు జవాబిస్తూ.. తమ పార్టీ లౌకికవాదానికి కట్టుబడి ఉంటుందని, అలాగే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుంటామని జగన్ స్పష్టం చేశారు. ఇప్పుడది తమకంత ముఖ్యమైన అంశం కాదని అన్నారు. ‘ఎన్నో లౌకిక పార్టీల గురించి నేనెంతో స్పష్టంగా మీకు చెప్పినప్పుడు.. ఆరునెలల తర్వాత జరగబోయేదానిపై ఇప్పుడెందుకు మనం ఊహాగానాలు చేయాలి...’ అని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత నీళ్లు, రెవెన్యూ పంపకం పెద్ద సమస్యగా మారుతుందని, ప్రజలు నీటి కోసం అలమటించాల్సి వస్తుందని జగన్ స్పష్టం చేశారు. జగన్ సమైక్య దీక్షకు విశేష స్పందన ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న సమైక్యదీక్షకు రెండో రోజు ఆదివారం జనం నుంచి విశేష స్పందన లభించింది. తండోపతండాలుగా జనం ఆయనకు మద్దతు తెలపడానికి తరలి వచ్చారు. యువకులు, మహిళలు, వృద్ధులు, సాధారణ ప్రజలు ఆసక్తిగా జగన్‌తో కరచాలనం చేసేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. చిన్న పిల్లలను చంకన పెట్టుకుని వచ్చిన తల్లులు పెద్ద సంఖ్యలో కనిపించారు. తనను కలవడానికి వచ్చిన వారందరినీ జగన్ చిరునవ్వుతో పలుకరించారు.పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కొరుముట్ల శ్రీనివాసులు, భూమా శోభానాగిరెడ్డి, ఆకేపాటి అమరనాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ, అంబటి రాంబాబు, జలీల్‌ఖాన్, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు జగన్‌ను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త కె.రఘురామకృష్ణంరాజు కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి(కాంగ్రెస్) కూడా జగన్ వద్దకు వచ్చి మద్దతు ప్రకటించారు. సమైక్యానికి మద్దతుగానే జగన్‌ను కలిశా కాటసాని రాంభూపాల్‌రెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం ఎవరు ఉద్యమించినా తాను మద్దతిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కాటసా ని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారమిక్కడ ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. అనంతరం కాటసాని మీడియాతో మాట్లాడుతూ.. సమైక్యాంధ్ర కోసం జగన్ ఆమరణ దీక్ష చేస్తున్నందున సంఘీభావం తెలిపేందుకు వచ్చినట్లు చెప్పారు. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయి, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ‘జై సమైక్యాంధ్ర’ అని అంటే... ఒక సమైక్య వాదిగా మద్దతిస్తానని ఒక ప్రశ్నకు బదులుగా చెప్పారు. సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్‌పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్ర విభజన నోట్‌ను కేంద్ర కేబినేట్ ఆమోదించడంతో ఆ పార్టీలో ఉండటం మంచిది కాదనే ఉద్దేశంతో తాను రాజీనామా ప్రకటించినట్లు వివరించారు. ఏ పార్టీలో చేరాలనేది తానొక్కడిని తీసుకునే నిర్ణయం కాదని, తనƒ కు అన్ని విధాలుగా అండదండలు ఇచ్చిన కార్యకర్తలతో చర్చించి వారి ఆలోచన మేరకు నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. -
జగన్ సమైక్య దీక్షకు కాటసాని రాంభూపాల్ రెడ్డి మద్దతు
సమైక్యాంద్రకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు కర్నూలు జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మద్దతు పలికారు. హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయానికి ఎదురుగా జగన్ సమైక్య దీక్ష చేస్తున్న వేదిక వద్దకు ఆదివారం రాంభూపాల్ రెడ్డి వచ్చి సంఘీభావం ప్రకటించారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ జగన్ శనివారం ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. జగన్‌కు మద్దతు తెలిపేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు తరలివస్తున్నారు. -
కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక పాలన చేస్తోంది:రోజా
-
అలా చెబితే బాబు దీక్షకు మద్దతిస్తా: జగన్
-
సమైక్యానికి 'ఒకే ఒక్కడు' కదిలాడు
-
ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
-
సమైక్య దీక్షా ప్రాంగణంలో మాట్లాడుతున్నజూపుడి
-
72 గంటల బంద్ తొలిరోజు సూపర్ సక్సెస్
-
దీక్షాస్ధలి వద్ద ఏర్పాట్లు పూర్తి
-
రెండోరోజు వైఎస్ఆర్ సీపీ సమైక్య దీక్షలు
-
వైజాగ్ దర్శి నియోజకవర్గంలో సమైక్య దీక్షలు
-
తూర్పుగోదావరి జిల్లాలో సమైక్య దీక్షలు
-
అనంతపురం జిల్లాలో మార్మోగిన సమైక్యవాదం
-
సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ సమైక్య దీక్షలు Part 2
-
వైఎస్ఆర్ సీపీ సమైక్య దీక్షకు కళాకారుల మద్దతు
విశాఖ : సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు విశాఖలో కళాకారులు సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంద్రకు మద్దతుగా పాటలతో హూషారెత్తించారు. సమైక్యాంద్ర స్పూర్తిని రగిలించారు. వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కళాకారులు ప్రకటించారు. 19 హైదరాబాద్ లో జరిగే సమైక్యశంఖారావాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా సమైక్యాంధ్రా పోరులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శాంతియుతంగా సమైక్య రాష్ట్ర సాధనలో వైఎస్సార్ కాంగ్రెస్ .... అన్ని రాజకీయ పక్షాలకు ఆదర్శంగా నిలవడంతో పాటు... కేంద్రం నుంచి సమైక్య ప్రకటన వెలువడేవరకు పోరాటం సాగిస్తుందని యువజన విభాగం విజయనగరం జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త అవనాపు విజయ్ అన్నారు. పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు శాంతియతంగా పార్టీ శ్రేణులు ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు చెప్పారు. అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఆ పార్టీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, మాజీ వైఎస్ చైర్మన్ సూర్యనారాయణరెడ్డిలు 36 గంటల పాటు నిరాహారదీక్షకు కూర్చున్నారు. ముందుగా స్ధానిక పాత బస్టాండ్ సర్కిల్ లోని మహాత్మగాంధీ.. పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూల మాలలు వేసి దీక్ష ప్రారంభించారు. వీరికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆర్డీవో రఘునాథ రెడ్డి మద్దతు పలికారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నియోజకవర్గంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆ పార్టీ కార్యకర్తలు నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించారు. పార్టీ సమన్వయకర్త జంగా క్రిష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరిజిల్లాలో సమైక్యహోరు జోరందుకుంది. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త తోటగోపీ రిలే నిరాహారదీక్షలకు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. కృష్ణా జిల్లా వైఎస్ఆర్ సీపీ కన్వీనర్ సామినేని ఉదయభాను బుధవారం జగ్గయ్యపేటలో నిరాహార దీక్షను ప్రారంభించారు. ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీతో బయలుదేరి ఆయన దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఉదయభాను రిలే దీక్షను తెలంగాణకు చెందిన వైఎస్ఆర్సీపీ నేత గట్టు రామచంద్రరావు ప్రారంభించారు. -
సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ సమైక్య దీక్షలు
-
సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ సమైక్య దీక్షలు ప్రారంభం
-
' పోరాట పటిమ ఉన్న ఏకైక నాయకుడు జగన్'
కాకినాడ : కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిచేలా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కాకినాడ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర కన్వీనర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులు, ఎమ్మెల్యేలు బుధవారం నుంచి నిరాహారదీక్షలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మసీదు సెంటర్లో దీక్షకు దిగారు. మహత్మగాంధీ, పొట్టి శ్రీరాములు, వైఎస్సార్ చిత్రపటాలకు ద్వారంపూడి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. దీక్షా ప్రాంగణానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో పోరాట పటిమ ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ద్వారంపూడి అన్నారు. జగన్ నేతృత్వంలో తాము సమైక్యాంధ్ర సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. -
సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ సమైక్య దీక్షలు ప్రారంభం
హైదరాబాద్ : విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఆయన పుట్టినరోజు నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సత్యాగ్రహాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య ఉద్యమ ప్రభంజనం సృష్టిస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో రెండునెలలుగా సమైక్య ఉద్యమంలో చురుకుగా వ్యవహరిస్తోన్న వైఎస్సార్సీపీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సమగ్ర కార్యాచరణతో పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సమైక్య పోరు దీక్ష ప్రారంభించాయి. సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం ఒకేసారి నిరహార దీక్షలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. సమైక్య వాణిని మరింతబలంగా వినిపించేందుకు సిద్ధం అయ్యాయి. ఎమ్మెల్యేల నుంచి సాధారణ కార్యకర్త వరకు దీక్షకు దిగారు. విశాఖ జిల్లా చోడవరంలో పార్టీ సమన్వయ కర్త బలిరెడ్డి సత్యారావు అధ్వర్యంలోపార్టీ శ్రేణులు నిరవధిక నిరాహార దీక్షకు దిగగా, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి , నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి నేతృత్వంలో 65 మంది దీక్ష చేపట్టారు. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి, అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలు దీక్షకు దిగారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామంచంద్రారెడ్డి ఆమరణదీక్షకు దిగగా, రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పోలవరంలో బాలరాజు, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి... ఇలా 175 నియోజకవర్గాల్లో దీక్షలు మొదలయ్యాయి. -
175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతల సమైక్య దీక్షలు
-
175 నియోజకవర్గాల్లో వైసీపీ నేతల సమైక్య దీక్షలు
విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యం సాక్షి నెట్వర్క్: జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో.. ఆయన పుట్టినరోజైన అక్టోబర్ 2వ తేదీ నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సత్యాగ్రహాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య ఉద్యమ ప్రభంజనం సృష్టించనుంది. రాష్ర్ట విభజన నిర్ణయం నేపథ్యంలో రెండునెలలుగా సమైక్య ఉద్యమంలో చురుకుగా వ్యవహరిస్తోన్న వైఎస్సార్సీపీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సమగ్ర కార్యాచరణతో పోరాటాన్ని మరింత ఉధృతం చేయనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతలంతా ఒకేరోజున నిరాహారదీక్షలు చేపట్టడం ద్వారా సమైక్య ఉద్యమ ఉధృతికి తోడ్పడుతూ, విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించింది. మహాత్మాగాంధీ, లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతి పురస్కరించుకుని ఈ నెల 2 నుంచి నవంబర్ ఒకటి రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలను ఇప్పటికే పార్టీ ప్రకటించింది. తద్వారా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రజలకు బాసటగా నిలవాలని నిర్ణయించింది. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఉధృతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్లు పార్టీ సీనియర్ నేత కొణతాల రామకృష్ణ మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులకు తెలిపారు. కేంద్రంలో కదలిక తీసుకొచ్చేందుకు నెలరోజుల ఉద్యమ కార్యచరణను రూపొందించినట్లు చెప్పారు. ‘‘తొలిరోజు బుధవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ సమన్వయకర్తలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. 7న మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల ముందు శాంతియుతంగా ధర్నాలు ఉంటాయి. అసెంబ్లీని తక్షణం సమావేశపరిచి సమైక్య తీర్మానం చేయించాలనే డిమాండ్‌తో పాటు తదనంతరం పదవులకు రాజీనామా చేయాలని కోరుతూ, ప్రజాప్రతినిధులకు పూలు అందజేసి నిరసన తెలియజేస్తాం. 10న అన్ని మండల కేంద్రాల్లో రైతుల ఆధ్వర్యంలో దీక్షలుంటాయి. 17న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీలు, 21న నియోజకవర్గ కేంద్రాల్లో యువజనులతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తాం. 26న సర్పంచులు, సర్పంచ్ పదవికి పోటీచేసిన అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో ఒకరోజు దీక్ష చేస్తారు. 29న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో శాంతియుత ఆందోళన కార్యక్రమాలుంటాయి. నవంబర్ 1న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభ నిర్వహించి సమైక్యాంధ్ర కోరుతూ తీర్మానాలు చేసే కార్యక్రమాలు చేపడతాం’’ అని కొణతాల వివరించారు. దీక్షలు ఎవరెక్కడ నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్సీపీ శాసనసభాపక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి దీక్షలో కూర్చోనున్నారు. నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి నేతృత్వంలో 65 మంది దీక్ష చేపట్టనున్నారు. మంత్రాలయంలోని రాఘవేంద్ర కూడలిలో తాజా మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి దీక్షకు సిద్ధం కాగా.. ఆయన సోదరుడు సీతారామిరెడ్డి కుమారుడు ప్రదీప్‌రెడ్డి ఆమరణ దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బుధవారం నుంచి ఆమరణదీక్ష చేపట్టనున్నారు. అనంతపురంలో ఎమ్మెల్యే బి.గురునాథరెడ్డి నేతృత్వంలో దీక్ష చేపట్టనున్నారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో రిలే నిరాహార దీక్షలు జరగనున్నాయి. ఉరవకొండలో పార్టీ సీఈసీ సభ్యుడు విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మంది దీక్ష చేపడుతున్నారు. చిత్తూరు జిల్లా తిరుపతిలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి నాయకత్వంలో తుడ సర్కిల్ వద్ద రెండురోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. వైఎస్సార్ జిల్లా రాయచోటిలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కమలాపురంలో పి.రవీంద్రనాథ్‌రెడ్డి, పులివెందులలో వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేటలో ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, పెనగలూరులో కొరముట్ల శ్రీనివాసులు దీక్షలు చేపట్టనున్నారు. గుంటూరు నగరంలో నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగనున్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటలోని నరసరావుపేట సెంటర్లో దీక్షకు దిగనున్నారు. మాచర్లలోని అంబేద్కర్ సెంటర్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సత్తెనపల్లిలో తాలూకా సెంటర్లో అంబటి రాంబాబు దీక్షకు కూర్చుంటారు. మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిరవధిక నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. వైఎస్సార్ సీఎల్పీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో దీక్ష చేపట్టనున్నారు. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు కొండపిలో దీక్ష చేస్తారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆమరణ దీక్ష చేపట్టనున్నారు. మచిలీ„పట్నం కోనేరు సెంటర్లో నియోజవకర్గ సమన్వయకర్త పేర్ని నాని ఆధ్వర్యంలో రిలే దీక్షలు, వినూత్న కార్యక్రమాలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో పార్టీ సమన్వయకర్త, తాజా మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టనున్నారు. నెల్లూరు జిల్లా ఉదయƒుగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కోవూరు నియోజకవర్గానికి సంబంధించి నార్తురాజుపాళెంలో జరిగే దీక్షల్లో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొంటారు. విశాఖ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో ఆయా నియోజకవర్గాల పరిధిలో సమన్వయకర్తల ఆధ్వర్యంలో ప్రధాన నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలతో నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో తాజా మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ సతీమణి విజయ, నరసన్నపేటలో ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్‌లు దీక్షలో కూర్చోనున్నారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త ఆర్వీ సుజయకృష్ణ రంగారావు, విజయనగరం జిల్లా బొబ్బిలి పాత పెట్రోలు బంకు ఆవరణలో నిరాహార దీక్ష చేయనున్నారు. అలాగే పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలో దీక్షకు కూర్చోనున్నారు. పార్టీ పశ్చిమగోదావరి జిల్లా కన్వీనర్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పోలవరం నియోజకవర్గ నేతలతో కలిసి కొయ్యలగూడెంలో నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ సీజీసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ద్రాక్షారామ సెంటర్లో వెయ్యి మందితో దీక్షకు ఉపక్రమిస్తున్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కాకినాడ మసీదుసెంటర్‌లో దీక్ష చేపట్టనున్నారు. బాలాజీచెర్వు సెంటర్లో దీక్ష కొనసాగించాలని ఆయన నిర్ణయించారు. రాజానగరం సాయిబాబా గుడి వద్ద పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలకిష్మ దీక్ష చేస్తారు. రాజమండ్రి కోటగుమ్మం సెంటర్లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ కోఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్‌ల ఆధ్వర్యంలో 500 మందితో దీక్షలు జరగనున్నాయి.