సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు విశాఖలో కళాకారులు సంఘీభావం ప్రకటించారు.
విశాఖ : సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలకు విశాఖలో కళాకారులు సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంద్రకు మద్దతుగా పాటలతో హూషారెత్తించారు. సమైక్యాంద్ర స్పూర్తిని రగిలించారు. వైఎస్ జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కళాకారులు ప్రకటించారు. 19 హైదరాబాద్ లో జరిగే సమైక్యశంఖారావాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
కాగా సమైక్యాంధ్రా పోరులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శాంతియుతంగా సమైక్య రాష్ట్ర సాధనలో వైఎస్సార్ కాంగ్రెస్ .... అన్ని రాజకీయ పక్షాలకు ఆదర్శంగా నిలవడంతో పాటు... కేంద్రం నుంచి సమైక్య ప్రకటన వెలువడేవరకు పోరాటం సాగిస్తుందని యువజన విభాగం విజయనగరం జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త అవనాపు విజయ్ అన్నారు. పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు శాంతియతంగా పార్టీ శ్రేణులు ప్రతి నియోజకవర్గ కేంద్రంలోనూ నిరాహార దీక్షలు చేపడుతున్నట్టు చెప్పారు.
అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఆ పార్టీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణ రెడ్డి, మాజీ వైఎస్ చైర్మన్ సూర్యనారాయణరెడ్డిలు 36 గంటల పాటు నిరాహారదీక్షకు కూర్చున్నారు. ముందుగా స్ధానిక పాత బస్టాండ్ సర్కిల్ లోని మహాత్మగాంధీ.. పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూల మాలలు వేసి దీక్ష ప్రారంభించారు. వీరికి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆర్డీవో రఘునాథ రెడ్డి మద్దతు పలికారు.
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నియోజకవర్గంలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఆ పార్టీ కార్యకర్తలు నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభించారు. పార్టీ సమన్వయకర్త జంగా క్రిష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ దీక్షలు కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరిజిల్లాలో సమైక్యహోరు జోరందుకుంది. తాడేపల్లిగూడెంలో వైఎస్సార్ సీపీ సమన్వయ కర్త తోటగోపీ రిలే నిరాహారదీక్షలకు దిగారు.
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు.. కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్ సీపీ కన్వీనర్ సామినేని ఉదయభాను బుధవారం జగ్గయ్యపేటలో నిరాహార దీక్షను ప్రారంభించారు. ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీతో బయలుదేరి ఆయన దీక్షా శిబిరానికి చేరుకున్నారు. ఉదయభాను రిలే దీక్షను తెలంగాణకు చెందిన వైఎస్‌ఆర్‌సీపీ నేత గట్టు రామచంద్రరావు ప్రారంభించారు.