తెలంగాణ బిల్లును పార్లమెంటులో పెట్టేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో గురువారం నాడు సమైక్య బంద్ పాటించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. సమైక్య బంద్ను విజయవంతం చేయాలని పార్టీ కోరింది. బంద్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఢిల్లీ గుండెలు అదిరేలా సమైక్య నినాదం వినిపించేలా పార్టీ శ్రేణులన్నీ ఈ బంద్లో ముందుండాలని తన పార్టీ కేడర్ను ఆదేశించింది.
దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ ప్రజాస్వామిక చరిత్రలోనే ఒక రాష్ట్రాన్ని ఇంత దుర్మార్గంగా విభజించే ప్రయత్నం, ఒక జాతిని చీల్చే ప్రయత్నం మునుపెన్నడూ జరగలేదని పేర్కొంది. ఇది ఢిల్లీ అహంకారానికి.. తెలుగు జాతి ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమని, ఈ పోరాటంలో అందరూ కలిసి ఢిల్లీ విభజన వాదం మీద దండెత్తాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది.
రేపు సమైక్య బంద్కు వైఎస్ఆర్సీపీ పిలుపు
Published Wed, Feb 12 2014 6:27 PM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement