సమైక్యమే లక్ష్యంగా..
Published Fri, Jan 10 2014 2:39 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సమైక్యాంధ్ర కోరుతూ జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మూడో రోజైన గురువారం కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు.
ఆమదాలవలస: ఆమదాలవలస పట్టణంలోని మున్సిపల్ కాంప్లెక్స్ ఆవరణ లో రాష్ట్రవిభజనకు నిరసనగా వైఎస్సార్‌సీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలేనిరాహారదీక్షలు మూడోరోజూ కొనసాగాయి. దీక్షను పార్టీ నాయకుడు కేవీజీ సత్యనారాయణ ప్రారంభించగా, పార్టీ నాయకులు జి.శ్రీనివాసరావు, బి.మల్లేశ్వరరావు, జి చలపతిరావు, కె.మార్కాండేశ్వరరావు, కె.ఎర్రయ్య, ఎం. నీలయ్య, పి.వెంకటరమణ, ఎస్.వేణుగోపాలరావులు కూర్చున్నారు. వీరికి పట్టణయూత్ కన్వీనర్ డి.అప్పలనాయుడు, పార్టీ నాయకుడు డి.శ్యామలరావు తదితులు సంఘీభావం తెలిపారు.
పాతపట్నం: సమైక్యాంధ్రాను కోరుతూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుమేరకు పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో నిరాహారదీక్షలను కొనసాగించారు. హిరమండలం మండలానికి చెందిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గేదెల జగన్మోహనరావు, రేగాన మోహనరావు, వి.చిరంజీవులు, పతివాత తిరుపతిరావులతో పాటు పాతపట్నం మండలానికి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.
టెక్కలి: పార్టీ అధిష్టానవర్గం పిలుపు మేరకు సంతబొమ్మాళిలో రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. పార్టీ నాయకురాలు దువ్వాడ వాణి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులంతా సమైక్యాంధ్రకు మద్దతుగా జైజగన్ నినాదాలతో దీక్షా శిబిరాన్ని కొనసాగించారు. నాయకులు చింతాడ గణపతి, కోత మురళీ, దవళ రమేస్, శిమ్మ సోమేష్‌లు పాల్గొన్నారు.
ఇచ్ఛాపురం: రాష్ట్రాన్ని విడదీయడానికి వీల్లేదని రాష్ట్ర విభజన బిల్లును వెనక్కు తీసుకోవాలని స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నియోజవర్గ నాయకులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరుకున్నాయి. పార్టీ సోంపేట మండల కన్వీనర్ పిన్నింటి ఈశ్వరరావు, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బస్వా శ్రీను, పార్టీ నాయకులు నిట్ట గోపాల్, రాపాక రామారావు, సునీల్ కుమార్ మండల్, గానాల దుర్యోధన, పి.శ్యామ్ పాల్గొన్నారు. వీరికి మున్సిపల్, మండల కన్వీనర్లు పిలక పోలారావు, కారంగి మోహనరావు, ఎం.వెంకటరెడ్డి, తదితరులు సంఘీబావం తెలిపారు.
రాజాం: రాజాంలో మూడో రోజు దీక్షలు కొనసాగాయి. దీక్షల్లో పాల్గొన్నవారు రాష్ట్రాన్ని ముక్కలు చేయవద్దని నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. పార్టీ జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జీటీ నాయుడు, మండల కన్వీనర్ బి.అచ్చిబాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement