అత్యంత నిరంకుశంగా జరిగిన విభజన నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి ఒకే ఒక్కడు కదిలాడు. ప్రాణం కాదు ప్రజలు ముఖ్యమంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆమరణ దీక్ష చేపట్టారు. శనివారం ఉదయం ఆయన లోటస్ పాండ్ వద్ద దీక్ష ప్రారంభించారు. జగన్ దీక్షకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సంఘీభావం తెలిపారు. సమైక్య దీక్షా ప్రాంగణం అభిమానులతో కిటకిటలాడుతోంది. ఇతర పార్టీల నాయకులు కూడా కలిసి రావాలని, వాళ్లంతా తమ తమ పార్టీ జెండాలతోనే రావాలని జననేత పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఇష్టారాజ్యంగా విభజించేశారని, రాజీనామాలతో నాయకులు రాజ్యాంగ సంక్షోభం సృష్టించి విభజనను అడ్డుకోవాలని జగన్ పిలుపునిచ్చారు.