samaikya poru
-
చింతలపూడి బంద్‌లో పాల్గొన్న మద్దాల రాజేష్
-
తెలంగాణ బిల్లు చించేయమంటూ మహిళల ఆందోళన
-
రెండో రోజు కూడా పెద్ద ఎత్తున సాగుతున్న దిగ్భందనం
-
సర్కారు కుట్రలను తిప్పికొట్టిన ప్రజా పోరాటం
-
తెలుగు జాతి మనది
-
సమైక్య ఉద్యమానికి ఊపిరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి
-
సమైక్య ఉద్యమానికి 100రోజులు
-
సమైక్యంధ్రతోనే అభివృద్ధి సాధ్యమని నినాదాలు
-
రైతులకు అవగాహన కోసం సమైక్య రైతు భేరీలు
-
ప్రభుత్వ చర్చలకు హాజరవుతాం:ఏపీఎన్జీవోలు
-
17న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమన్వయ కమిటీ భేటీ
సమైక్యాంధ్ర ఎజెండా నుంచి కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు జారిపోవచ్చని రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. అలా సీమాంధ్ర నేతలు జారి పోయిన మిగిలిన వారితో కలసి సమైక్య పోరు కొనసాగిస్తామని ఆయన మంగళవారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. ఈ నెల 17న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమన్యయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం కేంద్రంపై అనుసరించాల్సిన వ్యూహంపై ఆ సమావేశంలో చర్చిస్తామని శైలజానాథ్ పేర్కొన్నారు. విభజనపై ఏర్పాటు అయిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ( జీఓఎం)పై తమకు నమ్మకం లేదని శైలజానాథ్ వెల్లడించారు. -
జగన్‌కు రాత్రి వైద్యులు ప్లూయిడ్స్ ఎక్కించారు-YS భారతి
-
సమన్యాయం చేయండి: మైసూరారెడ్డి
-
ఉద్యమంలోకి అడుగు పెడుతున్నాం-సీమాంధ్ర ఎక్సైజ్ శాఖ
-
నివురుగప్పిన నిప్పులా విజయనగరం
-
నేటితో ఐదో రోజుకు జగన్ దీక్ష
-
వైఎస్ జగన్ దీక్షకు వెల్లువెత్తిన మద్దతు
-
వంగవీటి రాధా దీక్షను భగ్నం చేసిన పోలీసులు
-
సమ్మె విరమించేది లేదన్న విద్యుత్ ఉద్యోగుల జేఏసీ
-
మూడో రోజుకు చేరిన జగన్ దీక్ష
-
రష్ట్ర విభజన విషయంలో వేర్వేరు వాదనలు
-
కర్ఫ్యూ నీడలో విజయనగరం
-
జగన్ దీక్షకు అపూర్వమద్దతు: తరలివస్తున్న జనం
-
అందరూ కలిసి రండి
-
రైల్వేలను తాకిన సమైక్యాంధ్ర ఉద్యమ సెగ
-
శ్రీకాకుళంలో మూడోరోజు కొనసాగుతున్న బంద్
-
విజయనగరంలో ప్రజల పై ఖాకీల ఓవరాక్షన్
-
నేటి నుంచి నిరవధిక సమ్మెలో విద్యుత్ ఉద్యోగులు
-
రెండో రోజు కొనసాగిన సీమాంధ్ర బంద్
-
హర్షకుమార్ ఇంటి పై రాళ్లు రువ్విన సమైక్యవాదులు
-
రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్‌కు సమైక్య సెగ
-
హింసకు పాల్పడితే సహించబోం-డీజీపీ ప్రసాదరావు
-
సమైక్యానికి 'ఒకే ఒక్కడు' కదిలాడు
-
వైఎస్ జగన్ సమైక్య దీక్ష ప్రారంభం
-
ప్రజలకు అభివాదం చేస్తున్న వైఎస్ జగన్
-
శ్రీకాకుళంలో రెండవరోజు కొనసాగుతున్న బంద్
-
సమైక్య దీక్షా ప్రాంగణంలో మాట్లాడుతున్నజూపుడి
-
72 గంటల బంద్ తొలిరోజు సూపర్ సక్సెస్
-
దీక్షాస్ధలి వద్ద ఏర్పాట్లు పూర్తి
-
రాజీనామాలు చేయొద్దని నిర్ణయించుకున్నాం : మంత్రి గంటా
-
కేంద్ర మంత్రి పళ్ళంరాజు ఫ్లెక్సీ ధ్వంసం
-
తిరుమలకి తాకిన సమైక్య సెగ
-
రగులుతున్న సీమాంధ్ర ప్రజలు
-
కాంగ్రెస్ పార్టీ తీరు పై విశాఖ వాసులు ఆగ్రహం
-
విభజనకు నిరసనగా రేపటి నుంచి జగన్ ఆమరణ దీక్ష
హైదరాబాద్ : కనివినీ ఎరగని రీతిలో రాష్ట్ర విభజన జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం లోటస్ పాండ్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీ చావు మీరు చావండి అన్న రీతిలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిందన్నారు. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట శనివారం నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. -
కర్నూలులో కాంగ్రెస్ కార్యాలయం పై సమైక్యవాదుల దాడి
-
విజయనగరంలో బొత్స కళాశాలపై విద్యార్థులు దాడి
-
అనంతలో గుర్నాథరెడ్డి దీక్షా శిబిరంపై టీడీపీ దాడి
-
టీ నోట్ పై రగులుతున్న సీమాంధ్ర
-
అనంతపురంలో కొనసాగుతున్న బంద్
-
తిరుపతిలో 72 గంటల పాటు బంద్
-
గుంటూరు నగరంలో బంద్ సంపూర్ణం
-
బంద్‌లో స్వచ్చందంగా పాల్గొంటున్న ప్రజలు
-
తిరుపతి పై బంద్ ప్రబావం
-
జగన్‌కు సహకరించని కిరణ్, చంద్రబాబు
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహకరించకపోవడంతో రాష్ట్ర విభజకు ఆ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. రాష్ట్రాన్ని విభజిస్తూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రి మండలి ఈ రోజు ఆమోదం తెలిపింది. సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా వైఎస్ఆర్ సిపి ప్రజా ప్రతినిధులు తమ పదవులకు రాజీనామాలు చేశారు. రాష్ట్ర విభజన ప్రతిపాదనకు నిరసనగా ఈ పార్టీ ఎమ్మెల్యేలే మొట్టమొదటిసారిగా రాజీనామాలు చేశారు. అందరినీ రాజీనామా చేయమని కోరారు. అందుకు కాంగ్రెస్, టిడిపి ఎమ్మెల్యేలు ముందుకు రాలేదు. వారు రాజీనామా చేయలేదు. అప్పుడే వారు రాజీనామా చేసి ఉంటే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడి విభజన ప్రక్రియ ఆగి ఉండేది. విభజనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోమని ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ కోరారు. ఆయన ఆ లేఖను వెనక్కు తీసుకోలేదు. రాష్ట్రాన్ని విభజించడానికే చంద్రబాబు ప్రాముఖ్యత ఇచ్చారు. పార్టీ వైఖరి స్పష్టంగా చెప్పకుండా, లేఖను వెనక్కు తీసుకోకుండా కాలం వెళ్లబుచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ఎవరు లేఖరాసినా పార్టీ అధ్యక్షుడుగా తాను మొదటి సంతకం పెడతానని వైఎస్ జగన్మోహన రెడ్డి చెప్పారు. దానికి కూడా చంద్రబాబు నాయుడు ముందుకు రాలేదు. వైఎస్ఆర్ సిపితోపాటు సిపిఎం, ఎంఐఎం కూడా విభజనను వ్యతిరేకిస్తున్నాయి. వాటికి తోడు ప్రధాన రాజకీయ పార్టీలు కలిసి లేఖ రాసినా కొంతవరకు విభజన ప్రక్రియ ఆగి ఉండేది. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వైఎస్ఆర్ సిపి సలహాను పాటించలేదు. శాసనసభను సమావేశపరచి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. కేంద్రం ఆమోదించిన తరువాత అటువంటి తీర్మానం చేసినా అంతగా ప్రయోజనం ఉండదని, ముందే తీర్మానం చేయాలని జగన్మోహన రెడ్డి కూడా కోరారు. శాసనసభను సమావేశపరచడానికి సిఎం కిరణ్ కుమార్ రెడ్డి కూడా సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ విధంగా ఆయన కూడా విభజనను ఆపడానికి సహకరించలేదు. రాష్ట్ర విభజనను ఆపడానికి వైఎస్ఆర్ సిపి చేసిన ప్రయత్నాలకు సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపి ప్రజాప్రనిధులు సహకరించకపోవడంతో కేంద్రం రాష్ట్రాన్ని విభజిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన తరువాత వైఎస్ జగన్ చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ఆయనే మొదటిసారిగా స్పందించారు. ఈ రోజు తనకు కలిగిన బాధ 16 నెలల జైలు జీవితంలో కూడా కలగలేదని చెప్పారు. కాంగ్రెస్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కుమ్మక్కై రాష్ట్రాన్ని అమ్మేశారని బాధపడ్డారు. విభజనకు నిరసనగా పార్టీ తరఫున 72 గంటల బంద్‌కు పిలుపు ఇచ్చారు. ఇప్పటికైనా సీమాంధ్రకు చెందిన మొత్తం 25 మంది లోక్‌సభ్యులు రాజీనామా చేస్తే తద్వారా కేంద్రంలో ప్రభుత్వం పడిపోతుందని చెప్పారు. అప్పుడైనా ప్రక్రియ ఆగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రం నిర్ణయంపై కోర్టులను ఆశ్రయిస్తామని జగన్ చెప్పారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కూడా వైఎస్ఆర్ సిపి నిర్ణయించింది. ఇప్పటికైనా కాంగ్రెస్, టిడిపికి చెందిన సీమాంధ్ర నేతలు జగన్‌కు సహకరించి రాష్ట్రం విడిపోకుండా సహకరిస్తారని ఆశిద్ధాం. -
నడిరోడ్డుపై గడ్డం గీయించుకున్న చెవిరెడ్డి
చంద్రగిరి: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గత రెండు రోజులుగా నిరసన దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఆయన గురువారం ఉదయం దీక్షా శిబిరం వద్ద నడి రోడ్డుపై కూర్చుని గడ్డం గీయించుకున్నారు. చెవిరెడ్డితో పాటుగా వైఎస్ఆర్ సీపీ నేతలు చంద్రగిరిలోని నాయీ బ్రాహ్మణులచే షేవింగ్ చేసుకుంటుండగా సమైక్య వాదులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్ర ప్రజలు చిప్ప చేత బట్టుకుని అడుక్కు బ్రతకాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. రాష్ట్ర రాజధానిగా ఉన్న కర్నూలును మార్చేందుకు ఎన్నెన్నో మాయ మాటలు చెప్పి ఎలాగోలా హైదరాబాదుకు తరలించడం జరిగిందన్నారు. రాయలసీమ వాసులు ఆ సమయంలో అడ్డుచెప్పకుండా రాజధాని మార్పుకు అంగీకరించడమే కాకుండా ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులుగా వెళ్లిన వారంతా కోట్లాది రూపాయలు వెచ్చించి హైదరాబాదును అభివృద్ధి చేశారన్నారు. రాష్ట్ర ఆదాయంలో 50 శాతం వరకు హైదరాబాదు నుంచి వస్తుందన్నారు. రాష్ట్ర విభజనకై తెలంగాణలో సాగిన ఉద్యమం పెట్టుబడి దారుల జేబు నుంచి పుట్టుకొచ్చిన ఉధ్యమమని, సీమాంధ్రలో జరుగుతున్న పోరు ప్రజల గుండెల నుంచి పుట్టుకొచ్చిందన్నారు. నిజానికి తెలంగాణ ప్రాంతంలోని సామాన్య ప్రజలు సమైక్య రాష్ట్రంను కోరుతున్నా వారి మాటలు బయటకు రానీయకుండా అక్కడి రాజకీయ నేతలు తొక్కిపెట్టి ప్రజలు అందరూ తెలంగాణను కోరుకుంటున్నట్లు తెరపైకి తీసుకు వస్తున్నారని చెప్పారు. సీమాంధ్రలో సమైక్య వాదాన్ని రాజకీయ నేతల కంటే ముందుగా ప్రజలు వినిపిస్తున్నారని చెప్పారు. ఈ వినూత్న నిరసన కార్యక్రమంలో నేతలు కొటాల చంద్రశేఖర్‌రెడ్డి, చిన్నియాదవ్, ఎద్దుల చంద్ర శేఖర్‌రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, నంగా బాబు రెడ్డి, గోవిందరెడ్డి, మల్లం చంద్ర మౌళిరెడ్డి, పట్టాభిరెడ్డి, మస్తాన్‌లతో పాటుగా పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు. -
జగన్ రాకతో సమైక్య పోరు ఉధృతం: బోస్
చేబ్రోలు(ఉంగుటూరు): సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం స్వాతంత్య్ర పోరాటాన్ని తలపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలిత సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 2వ రోజు గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో జరుగుతున్న దీక్ష శిబిరాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆదేశాలతో నౌడు వెంకట రమణ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేయటం అభినందనీయమన్నారు. 175 నియోజకవర్గంలో సమైక్యకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 2వరోజు కూడా దీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. సమైక్య కోసం వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేస్తోందన్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలని సీమాంధ్రులేగాక, తెలంగాణావారు కూడా కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర విభజన తీర్మానాన్ని సీడబ్ల్యూసీ వెంటనే విరమించుకోవాలన్నారు. సొనియా గాంధీ తన కొడుకు ప్రధాని చేయటానికే అన్నదమ్ములుగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టారని వారు విమర్శించారు. జగన్ బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత ఉద్యమం మరింత ఊపందుకుందన్నారు. తెలంగాణాకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖను వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు సమైక్యాంధ్రకు మద్దతుగా వర్షం కూడా లెక్కచేయకుండా దీక్షలు చేయటం అభినందనీయమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు నౌడు వెంకట రమణ మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి జగన్ అన్నారు. -
రెండోరోజు వైఎస్ఆర్ సీపీ సమైక్య దీక్షలు
-
వైజాగ్ దర్శి నియోజకవర్గంలో సమైక్య దీక్షలు
-
సమైక్యత కోసం కదం తొక్కుతోన్న వైఎస్ఆర్సిపి శ్రేణులు
హైదరాబాద్: రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు సీమాంధ్ర అంతటా కదం తొక్కుతున్నాయి. సమైక్య వాణిని మరింతబలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల నుంచి సాధారణ కార్యకర్త వరకూ దీక్షలు చేస్తున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి బాటలో 175 నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టారు. విశాఖ జిల్లా చోడవరంలో పార్టీ సమన్వయ కర్త బలిరెడ్డి సత్యారావు అధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరవదిక నిరాహారదీక్షలు ప్రారంభించారు. విశాఖ జిల్లా గాజువాకలో నేతలు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. 5 రోజులపాటు దీక్ష చేస్తామని వారు చెప్పారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి, నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి నేతృత్వంలో దీక్ష చేపట్టారు. విభజన ప్రకటన వచ్చిన వెంటనే తమ పదవులకు రాజీనామాలు చేసింది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులేనని ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి చెప్పారు. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి, అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి నేతృత్వంలో దీక్షలు చేపట్టారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామంచంద్రారెడ్డి ఆమరణదీక్ష ప్రారంభించారు. నేరుగా పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు రంగంలోకి దిగడంతో కార్యకర్తల్లో మంచి ఊపు వచ్చింది. తాము సైతం అంటూ దీక్షల్లో పాల్గొనేందుకు స్వచ్ఛందంగా కార్యకర్తలు ముందుకొచ్చారు. ఉరవకొండలో వెయ్యి మంది దీక్షకు సిద్ధమయ్యారు. విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ దీక్షలో కూర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో చేపట్టిన సమైక్య దీక్షలో పాల్గొన్న జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం త్రికరణశుద్ధిగా పనిచేస్తున్న నేతగా జనం వైఎస్ జగన్మోహనరెడ్డిని నమ్ముతున్నారని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి మసీదు సెంటర్లో దీక్షకు దిగారు. మహత్మగాంధీ, పొట్టి శ్రీరాములు, వైఎస్సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. దీక్షా ప్రాంగణానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. రాష్ట్రంలో పోరాటపటిమ ఉన్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ద్వారంపూడి చెప్పారు. సమైక్యాంధ్ర కోసం తమనేత జగన్ అవిశ్రాంతంగా పోరాడుతారని తిరుపతి దీక్షలో పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పష్టంచేశారు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో సమైక్యసభ జరిగి తీరుతుందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలోని కొయ్యలగూడెంలో ఎమ్మెల్యే బాలరాజు దీక్షలో పాల్గొన్నారు. ప్రజల్లోకి సమైక్య ఉద్యమాన్ని మరింతగా తీసుకెళ్తామన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఒంగోలులో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించిన నిరహారదీక్షకు భారీగా జనం తరలివచ్చారు. గుంటూరుజిల్లా పొన్నూరులో రిలేనిరాహార దీక్షలు చేపట్టారు. ఆ పార్టీ సమన్వయ కర్త రావి వెంకట రమణ ఆధ్వర్యంలో రేపల్లె బస్టాండ్ సెంటర్లో దీక్షలు ప్రారంభించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి 36 గంటల నిరాహార దీక్ష కొనసాగుతోంది. రాష్ట్ర విభజనకు నిరసనగా శ్రీశైలంలో వైఎస్సార్సిపి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణా నుండి వచ్చిన భక్తులను సాదరంగా ఆహ్వానించి మర్యాదలు చేశారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సిపి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక ప్రశంసించింది. పార్టీ నిర్ణయంతో ఉద్యమం మరింత బలపడుతుందని నేతలు పేర్కొన్నారు. మొత్తం మీద గాంధీ జయంతి రోజున ప్రారంభించిన వైఎస్ఆర్సీపీ సమైక్య దీక్షలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. తమ తరపున విభజనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నందుకు ప్రజలు పార్టీ ప్రజాప్రతినిధులకు మద్దతు పలుకుతున్నారు. -
సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ సమైక్య దీక్షలు Part 2
-
సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ సమైక్య దీక్షలు
-
సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ సమైక్య దీక్షలు ప్రారంభం
-
సీమాంధ్రలో వైఎస్ఆర్ సీపీ సమైక్య దీక్షలు ప్రారంభం
హైదరాబాద్ : విభజన నిర్ణయం వెనక్కి తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా జాతిపిత మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఆయన పుట్టినరోజు నుంచి సీమాంధ్ర జిల్లాల్లోని అన్ని నియోజకవర్గాల్లో సత్యాగ్రహాలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య ఉద్యమ ప్రభంజనం సృష్టిస్తోంది. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో రెండునెలలుగా సమైక్య ఉద్యమంలో చురుకుగా వ్యవహరిస్తోన్న వైఎస్సార్సీపీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు సమగ్ర కార్యాచరణతో పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. పార్టీ అధ్యక్షుడు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు సమైక్య పోరు దీక్ష ప్రారంభించాయి. సీమాంధ్రలోని 175 నియోజకవర్గాల్లో బుధవారం ఉదయం ఒకేసారి నిరహార దీక్షలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర సమైక్యత కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు కదం తొక్కుతున్నాయి. సమైక్య వాణిని మరింతబలంగా వినిపించేందుకు సిద్ధం అయ్యాయి. ఎమ్మెల్యేల నుంచి సాధారణ కార్యకర్త వరకు దీక్షకు దిగారు. విశాఖ జిల్లా చోడవరంలో పార్టీ సమన్వయ కర్త బలిరెడ్డి సత్యారావు అధ్వర్యంలోపార్టీ శ్రేణులు నిరవధిక నిరాహార దీక్షకు దిగగా, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో శోభానాగిరెడ్డి , నంద్యాలలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి నేతృత్వంలో 65 మంది దీక్ష చేపట్టారు. మంత్రాలయంలో బాలనాగిరెడ్డి, అనంతపురంలో ఎమ్మెల్యే గురునాథరెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలు దీక్షకు దిగారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామంచంద్రారెడ్డి ఆమరణదీక్షకు దిగగా, రాయచోటిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, పోలవరంలో బాలరాజు, తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి... ఇలా 175 నియోజకవర్గాల్లో దీక్షలు మొదలయ్యాయి. -
19న హైదరాబాద్‌లో జగన్ సమైక్యశంఖారావం
సమైక్యాంధ్రను కోరుకుంటూ మొదటి నుంచీ అనేక పద్ధతుల్లో కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న హైదరాబాద్‌లో సమైక్యశంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నది. ఈ నెల 2 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు రాష్ట్ర విభజన ప్రతిపాదనకు నిరసనగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఈ పార్టీ వివిధ కార్యక్రమాలు చేపడుతుంది. రాష్ట్ర రాజధానిలో నిర్వహించే సమైక్యశంఖారావం ద్వారా సమైక్యరాష్ట్రం ఆకాంక్షను బలంగా వినిపించనున్నది. విభజన, సమైక్యవాదులందరూ సహకరించి తమ సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం విడిపోతే భవిష్యత్ అధోగతేనంటూ ప్రజలు ఎదుర్కొనే విభజన సమస్యలను పార్టీ పదే పదే కేంద్రానికి వివరిస్తోంది. ఇదే అంశంపై హైదరాబాద్‌లో సమైక్యశంఖారావం పేరిట భారీ సమావేశం నిర్వహించనున్నట్లు నిన్న జరిగిన మీడియా సమావేశంలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోన్రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని అయినందున ఇక్కడ సమావేశాన్ని నిర్వహిస్తున్నామని, ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కన్వీనర్ కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. విభజనవాదులు, సమైక్యవాదులు సహకరించాలని ఆయన కోరారు. కాంగ్రెస్, టిడిపిలు కలిసి రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గుంటూరులో, జైలు నుంచే జగన్ నిరాహారదీక్షలు చేసి తీవ్రస్థాయిలో తమ నిరసనను తెలిపారు. సమైక్య స్ఫూర్తిని చాటుతూ షర్మిల బస్సుయాత్ర చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి, విభజనను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని ఉధృత స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. -
అక్టోబర్ 19న సమైక్య శంఖారావం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు
-
మా జీతాలు కాదు.. జీవితాలు ముఖ్యం!!
ఆరు పదుల రోజులు దాటిపోయాయి. ఇప్పటివరకు వారికి జీతాలు లేవు.. పొయ్యిలో పిల్లి లేవట్లేదు. ఆకలి కడుపులను అలాగే కట్టుకుంటున్నారు. అయినా, ఉద్యమ స్ఫూర్తిని మాత్రం వదలబోమంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం పెద్దలు ఏ ముహూర్తంలో రాష్ట్ర విభజన నిర్ణయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారో.. ఆ క్షణం నుంచే సీమాంధ్ర కాస్తా ఉద్యమాంధ్ర అయ్యింది. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, చిరుద్యోగుల నుంచి అధికారుల వరకు ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఉద్యమబాట పట్టారు. ఏ నాయకుడూ పిలుపునివ్వకుండానే, ఎవరూ చెప్పకుండానే అందరూ రోడ్ల మీదకు వచ్చేశారు. వారందరికీ రెండు నెలలుగా జీతం రాళ్లు అందట్లేదు. ఇంట్లో పిల్లా జెల్లా ఏం తింటున్నారో తెలీదు. అయినా.. జీతాలు ముఖ్యం కాదు, కోట్లాది మంది రాష్ట్రవాసుల జీవితాలు ముఖ్యమనుకున్నారు. కలిసి కదిలారు.. ఒక్క గొంతై నినదించారు. తమకు కావాల్సింది తెలుగు జాతి ఐకమత్యమే కానీ, తెలుగు గడ్డ విచ్ఛిన్నం కాదన్నారు. రెండు నెలలుగా తమ జీతాలను కూడా కాదనుకుని సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నారు ఉద్యోగులు. ఆర్టీసీలో కండక్టర్‌గా చేస్తున్న రాజు తమకు కావాల్సింది సమైక్యాంధ్ర, పిల్లల భవిష్యత్తు అని చెప్పారు. తమకుటుంబాలకు ఇబ్బందులు ఉన్నమాట వాస్తవమే అయినా సమైక్యాంధ్ర వచ్చేవరకు ఉద్యమిస్తామంటున్నారు ఏపీఎన్జీవోల కుటుంబ సభ్యులు. పిల్లలను గుడి దగ్గర కూర్చోనైనా పెంచుకుంటాం కానీ.. సమ్మె మాత్రం విరమించం అంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. దిగ్విజయ్ సింగ్‌పై తీవ్రంగా మండిపడ్డారు. విభజన నిర్ణయం ఎందుకు వెనక్కి తీసుకోరో చూస్తామంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు. ఇంట్లో ఉన్న వస్తువులు తాకట్టు పెట్టుకున్నామని, పక్క ఇంటి వాళ్ల దగ్గర అప్పు తెచ్చుకున్నామని రాజమండ్రికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి రాజు చెప్పారు. దయతో ఇచ్చిన వాటిని స్వీకరించడానికి ఇష్టమే గానీ సమ్మె మాత్రం విరమించేది లేదన్నారు. తాత్కాలిక ప్రలోభాలకు లొంగితే భవిష్యత్తు తరాలు దెబ్బతింటాయని స్పష్టం చేశారు. తమ ఇంట్లో ఆడవాళ్ల బంగారాన్ని తాకట్టు పెట్టి రెండు నెలలుగా కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తిరుపతికి చెందిన ఆర్టీసీ కండక్టర్ తాజుద్దీన్ చెప్పారు. రాష్ట్రం విడిపోతే వచ్చే కష్టాల కంటే.. ఈ కష్టాలు తక్కువేనన్నారు. ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉందని తాజుద్దీన్ భార్య హసీనా చెప్పింది. చాలీచాలని జీతాలతో నెట్టకొచ్చే తాము రెండు నెలలుగా జీతాలు రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తిరుపతి ఆర్టీసీ కార్మికులు చెప్పారు. అయితే.. సమైక్యాంధ్ర కోసం ఎన్ని కష్టాలైనా భరిస్తామని చెబుతున్నారు. -
షర్మిల మాటల్ని వక్రీకరించొద్దు: కొణతాల
హైదరాబాద్: సమైక్యాంధ్ర ఉద్యమం ఇకపై ఉధృతం చేయనున్నట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ తెలిపారు. రేపటి నుంచి నవంబర్ ఒకటి వరకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులేకాక సమైక్యవాదులంతా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ ప్రకటించినట్టుగానే సమైక్య శంఖారావం సభ ఈనెల 15-20 మధ్య హైదరాబాద్‌లోనే జరుగుతుందని స్పష్టం చేశారు. పార్టీలు రాజకీయాలకతీతంగా సభను విజయ వంతం చేద్దామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ రాజధాని కాబట్టి ఇక్కడ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్వేషాలను రెచ్చ గొట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. వేర్పాటు వాద పార్టీలు, వ్యక్తులు సోదర భావంతో అర్ధం చేసుకొని సహకరించాలని కోరారు. వేర్పాటు వాదులు సీమాంధ్రలో సభలు పెట్టుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం ఉండబోదన్నారు. హైదరాబాద్‌పై షర్మిల చేసిన వ్యాఖ్యలను వక్రీకరించొద్దని విజ్ఞప్తి చేశారు. మానుకోట ఘటనను పునరావృతమవుతుందన్న కేసీఆర్ వ్యాఖ్యలు సరికావన్నారు. మానుకోట ఘటన వెనుక ఏయే శక్తులున్నాయో అందరికి తెలుసునని కొణతాల రామకృష్ణ అన్నారు. -
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తదాన శిబిరం ఫోటోలు
నేడు జాతీయ రక్తదాన దినోత్సవం. ఈ సందర్భంగా వైఎస్ అభిమానులు రాష్ట్రంలోని అన్ని జిల్లా కార్యాలయాల్లో భారీ ఎత్తున శిబిరాలను ఏర్పాటు చేసి రక్తదానాన్ని ప్రోత్సహిస్తోంది. -
తేట తేట తెలుగు.. సాక్షి టీవీ వెలుగు
తేట తేట తెలుగులా... తెలుగువారి వెలుగులా.. సమైక్య తేజంలా.. పదహారణాల తెలుగుదనం ఉట్టిపడేలా ఉండే యాంకర్లను, న్యూస్ రీడర్లను తెలుగు టీవీ చానళ్లలో చూసి ఎన్నళ్లయ్యింది? ఆడ.. మగ.. ఎవరైనా కూడా చొక్కాలు, వాటిపైన కోట్లు ధరించి తెలుగుదనానికి సుదూరంగా ఉంటున్న ఈ రోజుల్లో 'సాక్షి టీవీ' ఓ సరికొత్త ముందడుగు వేసింది. మొత్తం యాంకర్లు, న్యూస్ రీడర్లు అందరూ అచ్చమైన తెలుగు దుస్తులనే ధరించేలా ఓ 'డ్రస్ కోడ్' పాటిస్తోంది. ఆడవాళ్లంతా ఆరుగజాల చీరలు, మగవాళ్లంతా కుర్తాలు ధరించేలా తనకు తానుగా ఓ నిబంధన విధించుకుంది. బుల్లి తెరపై నిండుగా.. తెలుగుదనం ఉట్టిపడేలా నూటికి నూరుపాళ్ల తెలుగు దుస్తులతో కనిపించేలా చర్యలు తీసుకుంది. సమైక్యాంధ్ర కోసం తెలుగువాళ్లు ఉధృతంగా పోరు సాగిస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగువారంతా ఒక్కటేనన్న భావనతో తెలుగుదనాన్ని ప్రస్ఫుటంగా కనిపించేలా చేయాలన్న ఏకైక లక్ష్యంతో సాక్షి టీవీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో 28 రాష్ట్రాలున్నా, ప్రతి ఒక్క రాష్ట్రానికీ వాళ్ల సొంత దుస్తుల రీతి ఉంది. గతంలో ఉత్తరాది వాళ్లు దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ 'మదరాసీలు' అనేవాళ్లు. ప్రధానంగా ఇక్కడివారు చీరలు కట్టుకోవడం వల్లే అలా పిలిచేవాళ్లు. కానీ, వాస్తవానికి తమిళులు, మళయాళీలు, తెలుగువారు.. ఇలా ప్రతి ఒక్కరికీ చీరకట్టులో వైవిధ్యం కనపడుతుంది. తెలుగువాళ్లు చీరకట్టుకునే తీరును ఆ తర్వాతి కాలంలో చాలామంది ఫాలో కావడం మొదలుపెట్టారు. అలా తెలుగువారికే ప్రత్యేకమైన చీరకట్టును టీవీ చానళ్లు మాత్రం దాదాపుగా మర్చిపోయాయి. అందుకే.. ఇప్పుడు మళ్లీ దాన్ని గుర్తుచేసే ఉద్దేశంతో, తెలుగువారందరినీ ఒక్కటిగా చూపించాలన్న సదుద్దేశంతో సాక్షి టీవీ తమ యాంకర్లు, న్యూస్ రీడర్లకు తెలుగుదనం ఉట్టిపడే దుస్తులు ఇస్తోంది. -
నాన్న దీవెన కోరిన వైఎస్ జగన్
ఇడుపులపాయలోని తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి వద్దకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డి.. తండ్రి దీవెనలు కోరారు.సమాధి వద్ద ప్రార్థన చేశారు. -
వాడ వాడలా సమైక్య ఉద్యమం
-
రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య పోరు
హైదరాబాద్ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో బుధవారం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలోని 175 నియోజక వర్గాల్లో ఒకేసారి నిరహార దీక్షలు చేయనుంది. గాంధీ జయంతి నుంచి రాష్ట్ర అవతరణ దినోత్సవం వరకు ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. ఇందుకోసం పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సమైక్య రాష్ట్రం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తోంది. అక్టోబర్ రెండు నుంచి నవంబర్ ఒకటి వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. సీమాంధ్రలోని 175 నియోజక వర్గాల్లో ఒకేసారి నిరహార దీక్షలు చేపట్టనున్నారు. ఇక సమైక్యాంధ్రనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రేపటి నుంచి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత, ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి 48 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నారు. కేంద్రం సమైక్యాంధ్ర ప్రకటన చేసేవరకూ వైఎస్ఆర్ సీపీ పోరాటం కొనసాగుతుందని శోభా నాగిరెడ్డి తెలిపారు. సమైక్య పోరు వివరాలు: అక్టోబర్ 2 నుంచి శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఇతరులు నిరాహార దీక్షలు చేపడతారు. అక్టోబర్ 7న పదవులకు రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుతంగా మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇంటి ముందు ధర్నాలు నిర్వహిస్తారు. ప్రజా ప్రతినిధులకు పూలు అందజేసి నిరసన తెలుపుతారు. అక్టోబర్ 10న అన్ని మండల కేంద్రాల్లో రైతుల ఆధ్వర్యంలో దీక్షలు నిర్వహిస్తారు. అక్టోబర్ 17న శాసనసభ నియోజకవర్గ కేంద్రాల్లో ఆటోలు, రిక్షాలతో ర్యాలీ. అక్టోబర్ 21న నియోజకవర్గ కేంద్రాల్లో మహిళలతో కార్యక్రమాలు- మానవహారాలు అక్టోబర్ 24న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువజనులతో బైక్ ర్యాలీలు అక్టోబర్ 26న జిల్లాల్లోని సర్పంచ్‌లు, సర్పంచ్ పదవికి పోటీ చేసిన అభ్యర్థులు జిల్లా కేంద్రాల్లో ఒక రోజు దీక్ష అక్టోబర్ 29న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువకులతో శాంతియుత ఆందోళన కార్యక్రమాలు నవంబర్ 1న అన్ని గ్రామపంచాయతీల్లో గ్రామసభ నిర్వహణ- సమైక్యాంధ్రను కోరుతూ తీర్మాణం చేయనున్నారు. వైఎస్ఆర్సీపీ చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు అన్ని వర్గాల ప్రజలు మద్దతుపలుకుతున్నారు. -
రేపటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమైక్య పోరు