అనంతపురంలో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. ప్రజాగ్రహాన్ని తప్పించుకునేందుకు తెలుగుదేశం పార్టీ కొత్త ఎత్తుగడ వేసింది. అంతే కాకుండా సమైక్యాంధ్రకు మద్దతుగా దీక్షలు, ఆందోళనలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీడీపీ దాడులకు యత్నించింది. టీడీపీ ఎమ్మెల్యేలు సాక్షిగా ఆపార్టీ కార్యకర్తలు దాడులుకు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఫ్లెక్సీలను చించివేసిన ఎమ్మెల్యేల అనుచరులు, అనంతరం ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి దీక్షా శిబిరంపై రాళ్లదాడి చేశారు. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, పార్థసారధి, మహాలక్ష్మి శ్రీనివాస్ అక్కడ ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొడుతున్నారు.