వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య ఆమరణ నిరాహార దీక్ష నేటికి మూడోరోజుకు చేరింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరి మద్దతు కావాలని విజ్ఞప్తి చేశారు. అన్యాయాన్ని అడ్డుకునేందుకు అంత కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ విభజనకు వ్యతిరేకంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్య దీక్షకు జనం నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఉదయం నుంచే ఆయనకు మద్దతు తెలపడానికి తరలి వస్తున్నారు. మరోవైపు సమైక్యాంధ్రప్రదేశ్‌కు మద్దతు కూడగట్టేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం సోమవారం ఢిల్లీలో వివిధ జాతీయ పార్టీల నేతలతో భేటీ కానుంది. పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఈ బృందానికి నాయకత్వం వహించనున్నారు.