
విభజనకు నిరసనగా రేపటి నుంచి జగన్ ఆమరణ దీక్ష
కనివినీ ఎరగని రీతిలో రాష్ట్ర విభజన జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ : కనివినీ ఎరగని రీతిలో రాష్ట్ర విభజన జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం లోటస్ పాండ్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీ చావు మీరు చావండి అన్న రీతిలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవహరించిందన్నారు. కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట శనివారం నుంచి ఆమరణ దీక్షకు దిగనున్నట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు.