జగన్ రాకతో సమైక్య పోరు ఉధృతం: బోస్
చేబ్రోలు(ఉంగుటూరు): సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం స్వాతంత్య్ర పోరాటాన్ని తలపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలిత సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు అన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు 2వ రోజు గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో జరుగుతున్న దీక్ష శిబిరాన్ని వారు సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆదేశాలతో నౌడు వెంకట రమణ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేయటం అభినందనీయమన్నారు. 175 నియోజకవర్గంలో సమైక్యకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో 2వరోజు కూడా దీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. సమైక్య కోసం వైఎస్సార్‌సీపీ ఉద్యమాలు చేస్తోందన్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలని సీమాంధ్రులేగాక, తెలంగాణావారు కూడా కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర విభజన తీర్మానాన్ని సీడబ్ల్యూసీ వెంటనే విరమించుకోవాలన్నారు.
సొనియా గాంధీ తన కొడుకు ప్రధాని చేయటానికే అన్నదమ్ములుగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టారని వారు విమర్శించారు. జగన్ బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత ఉద్యమం మరింత ఊపందుకుందన్నారు. తెలంగాణాకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖను వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు సమైక్యాంధ్రకు మద్దతుగా వర్షం కూడా లెక్కచేయకుండా దీక్షలు చేయటం అభినందనీయమన్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు నౌడు వెంకట రమణ మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి జగన్ అన్నారు.