
సాక్షి,న్యూఢిల్లీ:పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపును వ్యతిరేకిస్తున్నామని,ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్ర గ్రహణమని రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై వైవీ సుబ్బారెడ్డి సోమవారం(ఫిబ్రవరి3) రాజ్యసభలో మాట్లాడారు. ‘పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించేందుకు గోదావరి ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. 150 ఫీట్ల ఎత్తుతో 194 టీఎంసీల నీటిని నిలువ చేసుకునే అవకాశం ఇచ్చారు. 41.15 మీటర్లకు ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం టీవల నిర్ణయం తీసుకుంది.
135 ఫీట్లకే ప్రాజెక్టు ఎత్తు పరిమితం చేశారు.ఇది ప్రజల ఆకాంక్షలకు,ట్రిబ్యునల్ ఇచ్చిన నిర్ణయానికి విరుద్ధం. ఈ విషయంపై టీడీపీ ప్రభుత్వం మౌనంగా మద్దతు తెలిపింది.ఈ నిర్ణయాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నిర్ణయం రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం. 55 వేల కోట్ల రూపాయల అంచనాలకి ఆమోదం తెలపాలి.పోలవరం ఎత్తు తగ్గించడం వల్ల ఆయకట్టుకు పూర్తిగా నీరు ఉండదు, విశాఖపట్నానికి నీరు అందించే అవకాశం కోల్పోతాం. ఉత్తరాంధ్ర జిల్లాలకు సుజన స్రవంతి నీరు అందదు.పోలవరం కెనాల్స్‌కు సరిపడా నీరు అందదు. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకుని పోలవరం ఎత్తును యథాతథంగా ఉంచాలి
సూపర్‌సిక్స్ పేరు చెప్పి చంద్రబాబు మోసం చేశారు..
ఏపీలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపైన తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని,గుడ్ గవర్నెన్స్ అంటే ఇదేనా అని రాజ్యసభ ఎంపీ వైవీసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ‘ఏకంగా సోషల్ మీడియా కార్యకర్తలపై ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు పెడుతున్నారు. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు.రెడ్‌బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు.
ప్రధాని,హోంమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి.చంద్రబాబు ఏపీలో మేనిఫెస్టో అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారు. సూపర్‌సిక్స్ పేరుతో మేనిఫెస్టో ఇచ్చారు.20 లక్షల ఉద్యోగాలు,ఫ్రీ బస్సు ఇస్తామన్నారు. రైతులకు 20వేలు ఇస్తానన్నారు. మేనిఫెస్టో అమలు చేయకపోతే ఎన్నికల సంఘం,సుప్రీంకోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలి.వక్ఫ్ సవరణ బిల్లును మేం వ్యతిరేకిస్తున్నాం. ఈ బిల్లుపై తొందరపాటు తగదు.ఏపీలో ఇప్పటివరకు జనాభా లెక్కలు జరగలేదు.ఏపీలో ప్రత్యేకంగా జనాభా లెక్కల కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలి.
వైఎస్సార్సీపీ కృషివల్లే కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూడో బ్లాస్ట్ ఫర్నేస్‌లో ఉత్పత్తి ప్రారంభించబోతోంది. ఉద్యోగుల జీతాలను సైతం చెల్లించలేకపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం.సెయిల్‌లో విలీనం చేయడంలో విఫలమయ్యారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించాలి’అని వైవీసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు.
ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారు: రాజ్యసభలో ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్
- ఏపీలో రైతులు సంక్షోభంలో ఉన్నారు
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి పండించే రైతులను ఆదుకోవాలి
- రైతులను ఆదుకునేందుకు నాడు వైఎస్ జగన్ 11 పథకాలు అమలు చేశారు
- ఆ పథకాలన్నిటినీ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది
- రైతులను ఆదుకోవడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది
- ఆదాయాలు ఉన్నా రైతులను ఎందుకు ఆదుకోవడం లేదు
- నా ప్రసంగానికి అడ్డుపడి, రాజకీయాలకే పరిమితం కాకండి
- రైతుల సంక్షేమం కోసం రైతు భరోసా సున్నా వడ్డీ, ఉచిత పంట బీమా , జల కళ పథకాలను వైఎస్ జగన్ అమలు చేశారు
- చంద్రబోస్ ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డ టీడీపీ ఎంపీలు, మంత్రి పెమ్మసాని
Comments
Please login to add a commentAdd a comment