adireddy apparao
-
టీడీపీ నేత ఆదిరెడ్డి అప్పారావుకు ఎంపీ భరత్ స్ట్రాంగ్ వార్నింగ్
-
టీడీపీలో నా పరిస్థితే ప్రశ్నార్థకంగా మారింది... ఇంక మీకేం చేయగలను?
సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ – జనసేన పార్టీలకు సంబంధించినంత వరకూ రాజమహేంద్రవరం రూరల్ రాజకీయం రంజుగా మారుతోంది. ఇక్కడి ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై కొనసాగుతున్న పీటముడి ఇంకా వీడటం లేదు. ఇక్కడి నుంచి తాను పోటీ చేస్తానని జనసేన నుంచి ఆ పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్.. కాదు కాదు.. ఈ సీటు తనదేనంటూ టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇప్పటికే ప్రకటించుకున్నారు. ఈ పరిస్థితుల్లో రూరల్ సీటు కేటాయింపుపై రెండు పార్టీల శ్రేణుల్లోనూ సస్పెన్స్ ఏర్పడింది. ముందుగా ప్రకటించుకున్నట్టు దుర్గేష్ పోటీ చేస్తారా.. లేక గోరంట్లకు వదిలేస్తారా అనే విషయం ఎటూ తేలడం లేదు. ఇటీవల మండపేటలో పోటీ చేస్తామని చంద్రబాబు ప్రకటించిన వెంటనే.. రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో పోటీపై పవన్ కల్యాణ్ కూడా హడావుడిగా ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే, రాజమహేంద్రవరం రూరల్ విషయానికి వచ్చేసరికి చంద్రబాబు స్పష్టత ఇవ్వడం లేదు. పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదు. దీంతో రెండు పార్టీల్లోనూ గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓసారి సై.. మరోసారి నైనై.. ఇదిలా ఉండగా జనసేన నేత దుర్గేష్ ఊగిసలాట ధోరణి ప్రదర్శిస్తున్నారంటూ ఆ పార్టీ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. కాసేపు పోటీ చేస్తానని, మరికాసేపు పోటీ చేయనని ఆయన సంకేతాలిస్తున్నారు. జనసేన – టీడీపీ పొత్తులో భాగంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రూరల్ స్థానం నుంచి దుర్గేష్ బరిలోకి దిగడం ఖాయమని తొలుత సంకేతాలు వెలువడ్డాయి. ఆయన సైతం నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి తానే అభ్యర్థినని ప్రకటించుకుని, ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. అంతలోనే ఆయన మనసు మార్చుకున్నారని తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితులు, వ్యక్తిగత సమస్యల కారణంగా రానున్న ఎన్నికల్లో పోటీకి విముఖత చూపుతున్నారని చెబుతున్నారు. దీంతో రూరల్ రాజకీయం తాజాగా మరో మలుపు తిరిగింది. వాస్తవానికి రూరల్ సీటు మరోసారి ఆశిస్తున్న టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల, దుర్గేష్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాకుండా ఈ ఇద్దరు నేతలూ రహస్యంగా కలిసి చర్చించుకుని, ఓ నిర్ణయానికి వచ్చారని, అప్పటి నుంచే ఎన్నికల్లో పోటీకి దుర్గేష్ సుముఖంగా లేరన్న వాదన వినిపిస్తోంది. ఇదే అదునుగా బుచ్చయ్య చౌదరి తన ఎమ్మెల్యే స్థానం తనకే పదిలమని, రూరల్ సీటును తన నుంచి దూరం చేసే దమ్ము ఎవరికై నా ఉందా? అంటూ ఆవేశంతో ప్రకటనలు కూడా చేశారు. తాను ఎమ్మెల్యేగా మరోసారి గెలుపొంది, మంత్రి కావడం ఖాయమనే లెక్కలు వేసుకునేంత వరకూ వెళ్లారాయన. నేతల ఒత్తిడితో మళ్లీ సై పోటీకి దుర్గేష్ దూరమవుతున్న సంగతి తెలుసుకు న్న రూరల్ నియోజకవర్గ జనసేన నేతలు ఆయనపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. సువర్ణ అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకుంటున్నారని వాదనకు దిగారు. ‘ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలన్న మీ కలను మీ రే నాశనం చేసుకుంటారా?’ అని ప్రశ్నించారు. ఇది మంచి పద్ధతి కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. నాయకులు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నా దుర్గే ష్ ససేమిరా అని భీష్మించారు. ‘మీరు చేయకపోతే మరో నేతను రంగంలోకి దింపుతాం. అంతే కానీ సీటు మాత్రం త్యాగం చేసుకునే పరిస్థితి తీసుకురాం’ అని స్పష్టం చేశారు. స్వపక్ష నేతల ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అయిన దుర్గేష్ ఆత్మరక్షణలో పడ్డారు. పార్టీ శ్రేణులను విస్మరిస్తే రాజకీయ భవిష్యత్తు సమాధి అయ్యే ప్రమాదం ఉండటంతో దిక్కు తోచని పరిస్థితిలో చేసేది లేక పోటీకి సై అన్నారు. సిటీపై గోరంట్ల కన్ను దుర్గేష్ తాజా నిర్ణయంతో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డం పడినట్టయ్యింది. ఈ పరిస్థితుల్లో ఆయన ప్రత్యమ్నాయ ఆలోచనలో పడ్డారు. రూరల్ చేజారిన పక్షంలో తనకు అనువైన రాజమహేంద్రవరం సిటీలోనైనా పాగా వేయాలని ప్రయత్నిస్తున్నారు. అందుకు అవసరమైన వ్యూహరచన చేస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబు వద్ద తాడోపేడో తేల్చుకోవాలని సిద్ధమవుతున్నారు. ఆదిరెడ్డి వర్గంలో అలజడి ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్టు.. రూరల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తమ ఆశలకు ఎసరు పెడుతుందేమోనని మరోసారి రాజమహేంద్రవరం సిటీ సీటు ఆశిస్తున్న ఆదిరెడ్డి అప్పారావు వర్గం ఆందోళన చెందుతోంది. తన కుమారుడు వాసును ఎమ్మెల్యేగా చూడాలన్నది ఆదిరెడ్డి అప్పారావు కల. దీనికోసమే ఆయన తన కోడలు, ప్రస్తుత ఎమ్మెల్యే భవానీని ప్రజలకు దూరం పెట్టారు. ఆమె బదులు ఆమె భర్త, తన తనయుడు వాసు ప్రజల్లో ఉండేలా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన కలను గోరంట్ల నాశనం చేస్తారేమోనని అప్పారావు అంతర్మధనం చెందుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ స్థానంపై ఏదో ఒకటి తేల్చుకునేందుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు వద్ద పంచాయతీ పెట్టారు. ‘టీడీపీలో నా పరిస్థితే ప్రశ్నార్థకంగా మారింది. ఇంక మీకేం చేయగలను? మీ స్థాయిలో మీరు చూసు కోండి’ అంటూ అచ్చెన్నాయడు చేతులెత్తేయడంతో ఆదిరెడ్డి వర్గం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ప్రస్తుతం ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టయి, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉన్న సమయంలో ఆయన కుటుంబానికి ఆదిరెడ్డి కుటుంబం వెన్నంటి నిలిచింది. లోకేష్‌తో ఆదిరెడ్డి వాసు సన్నిహిత సంబంధాలు నెరిపి, ఆయన దృష్టిలో పడ్డారు. ఆ నేపథ్యంలో ఇక తనకు ఎవరూ అడ్డురానన్న ధైర్యంతో సిటీలో పర్యటనలు మొదలు పెట్టారు. ఇటువంటి సమయంలో బుచ్చయ్య ప్రయత్నాలు ఆదిరెడ్డి కుటుంబంలో అలజడి రేపుతున్నాయి. ఈ పరిణామం ఎటువైపు దారితీస్తోందనని, చివరకి తమ సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోనని ఆదిరెడ్డి వర్గం ఆందోళన చెందుతోంది. రాజమహేంద్రవరం రూరల్, సిటీ నియోజకవర్గాల్లో నెలకొన్న ఈ గందరగోళ పరిస్థితులపై కాతేరులో సోమవారం నిర్వహించిన రా.. కదలిరా సభలో సైతం చంద్రబాబు ఎటువంటి ప్రకటనా చేయలేదు. ఆయన ఉదాశీన వైఖరితో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరింతగా భగ్గుమంటున్నాయి. -
చిట్స్ స్కాంలో ఆదిరెడ్డి అరెస్ట్: ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలు స్కాంలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జగజ్జనని చిట్స్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బుతో ప్రైవేటు ఆస్తులు కొనుగోలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంపీ భరత్ మంగళవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆదిరెడ్డి విషయంలో కక్ష సాధింపు అని కొందరు అంటున్నారు. ఆదిరెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమా?. జగజ్జననని చిట్‌ఫండ్స్ పేరుతూ ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుతో ఆదిరెడ్డి కుటుంబం అక్రమాలకు పాల్పడింది. ఆదిరెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్స్ చూపించారు. చిట్ ఫండ్స్ చట్టం సెక్షన్-5 ప్రకారం అరెస్టులు జరిగాయి. 20వేలకు నుంచి క్యాష్ రిసీట్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ, కోట్ల రూపాయల లావాదేవీలు జగజ్జననిలో జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఎక్కడా నిబంధనలు పాటించలేదు. అక్రమాలు చేసే సంస్థలను ప్రభుత్వం ఎట్టి పరిస్థిత్తుల్లో ఉపేక్షించదు. జగజ్జనని కూడా మార్గదర్శిలాంటిదే. జగజ్జనని బాధితులు ఎంతోమంది ఉన్నారు. మేము వ్యక్తిగత దూషణ చేయడం లేదు. ప్రభుత్వంపై అనవసరంగా చేసిన ఆరోపణల గురించే మాట్లాడుతున్నాం. కేవలం రాజకీయ నేపథ్యం ఉండటం వలన ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుతో ఆదిరెడ్డి కుటుంబం అక్రమాలకు పాల్పడింది అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: రైతులెవరో తెలియదా రామోజీ? -
రాజమహేంద్రవరంలో మరో మార్గదర్శి
సాక్షి, అమరావతి/సాక్షి, రాజమహేంద్రవరం: మార్గదర్శి తరహాలో మరో భారీ మోసం వెలుగుచూసింది. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జగజ్జనని చిట్స్ పేరుతో టీడీపీ నేతలు ఆర్థిక నేరానికి పాల్పడిన విషయం బట్టబయలైంది. 1982 చిట్‌ఫండ్స్ చట్టం నిబంధనలు ఉల్లంఘించి, ఇష్టానుసారం డిపాజిట్లు సేకరించి, వాటిని ఇతర వ్యాపారాలకు, వడ్డీలకు మళ్లించి అక్రమాలకు తెరతీసిన విషయం సీఐడీ దర్యాప్తులో నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ చిట్‌ఫండ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు–ఏ1, డైరెక్టర్‌గా ఉన్న ఆయన కుమారుడు ఆదిరెడ్డి శ్రీనివాస్–ఏ2 (రాజమహేంద్రవరం సిటీ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త)లను సీఐడీ అధికారులు రాజమహేంద్రవరంలో ఆదివారం అరెస్టుచేశారు. వీరితోపాటు మరో డైరెక్టర్ అయిన ఆదిరెడ్డి అప్పారావు కుమార్తె ఆదిరెడ్డి వెంకట జ్యోత్స్నలపై ఐపీసీ సెక్షన్లు 420, 409, 120బి, 477 (ఎ) రెడ్‌విత్ 34, రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్–5, కేంద్ర చిట్‌ఫండ్ చట్టం–1982 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జగజ్జనని చిట్‌ఫండ్స్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు సీఐడీ విభాగానికి కొన్నినెలల క్రితమే ఫిర్యాదులొచ్చాయి. అక్రమాలు వాస్తవమేనని నిర్ధారణ కావడంతో చిట్ రిజిస్ట్రార్ ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. దాంతో సీఐడీ అధికారులు ఈ ఏడాది మార్చిలో జగజ్జనని చిట్‌ఫండ్స్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో భారీగా ఆర్థిక అక్రమాలు వెలుగుచూశాయి. వీటిపై సంస్థ బ్రాంచి మేనేజర్లు (ఫోర్‌మెన్) సరైన వివరణ కూడా ఇవ్వలేకపోవడంతో సీఐడీ అధికారులు కేసును లోతుగా విచారించి అవకతవకలను నిర్ధారించారు. యథేచ్చగా ఆర్థిక అక్రమాలు.. జగజ్జనని చిట్ ఫండ్స్ కంపెనీ కొన్నేళ్లుగా ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడుతున్నట్లు సీఐడీ తనిఖీల్లో బట్టబయలైంది. ఆ కంపెనీ ఎండీ, డైరెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా చందాదారుల సొమ్మును మళ్లించి సొంత ఆస్తులు భారీగా కూడబెట్టుకున్నట్లుగా ఆధారాలను గుర్తించారు. సీఐడీ అధికారులు గుర్తించిన కొన్ని అంశాలివీ.. ► చిట్‌ఫండ్స్ కంపెనీలు ఇతర వ్యాపారాలు చేయడం చిట్‌ఫండ్ చట్టానికి విరుద్ధం. కానీ, జగజ్జనని సంస్థ మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్ల సేకరణ, అక్రమంగా రుణాలు మంజూరు చేస్తూ వడ్డీ వ్యాపారం నిర్వహిస్తోంది. 2018 నుంచి 2023 వరకు భారీగా అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు.. వాటిపై వడ్డీలు చెల్లించినట్లు గణాంకాలతో సహా వెల్లడైంది. అదే రీతిలో చందాదారుల సొమ్ముతో భారీగా వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు గుర్తించారు. తద్వారా భారీ ఆదాయాన్ని ఆర్జించినట్లు వెల్లడైంది. ► చిట్టీల నిర్వహణలో జగజ్జనని చిట్‌ఫండ్స్ అక్రమాలకు పాల్పడుతోంది. ప్రతి చిట్టీలోనూ యాజమాన్య వాటా టికెట్లతోపాటు మరికొన్ని టికెట్లను కూడా కంపెనీ తమ పేరిట ఉంచుతోంది. కానీ, ఆ టికెట్లపై ప్రతినెలా చెల్లించాల్సిన చందాను చెల్లించడంలేదు. ఇతర చందాదారులు పాడిన చిట్టీ పాటల ద్వారా వచ్చే డివిడెండ్‌ను తమ ఖాతాలో జమ చేసుకుంటోంది. ఇక ఆ టికెట్ల చిట్టీ పాటల ప్రైజ్‌మనీని కూడా జమచేసుకుంటోంది. ఒక చిట్టీ గ్రూప్‌లోని చందా సొమ్మును మరో చిట్టీ గ్రూప్‌లో బుక్ అడ్జస్ట్మెంట్ల ద్వారా కనికట్టు చేస్తోంది. అంటే ఒక్క రూపాయి కూడా చందా చెల్లించకుండా అక్రమంగా ఆర్థిక ప్రయోజనం పొందుతోంది. ► చిట్టీ పాటల నిర్వహణలో కూడా అక్రమాలకు పాల్పడుతున్నారు. 2022 మే నుంచి ఆగస్టు వరకు సంస్థ నిర్వహించిన చిట్టీ పాటల వేలం రికార్డులను పరిశీలించగా ఈ వ్యవహారం వెలుగుచూసింది. చిట్టీ పాట పాడిన వారికి ఇచ్చే మొత్తాన్ని (ప్రైజ్‌మనీ) వాస్తవానికి చిట్టీ పాట నిర్వహించిన తేదీ కంటే ముందే చెల్లించినట్లు బ్యాంకు రికార్డులు వెల్లడించాయి. అంటే చిట్టీ పాటల నిర్వహణ కంటే ముందే ఆ మొత్తాన్ని కొందరికి చెల్లిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. జగజ్జనని చిట్‌ఫండ్స్ నిర్వహిస్తున్న చిట్టీ పాటలు పూర్తిగా బోగస్ అని నిరూపితమైంది. ► ప్రతినెలా 41 చిట్ గ్రూపులను నిర్వహిస్తూ రూ.7,61,50,000 వార్షిక టర్నోవర్‌తో వ్యాపారం చేస్తున్నట్లుగా రికార్డుల్లో సంస్థ చూపిస్తోంది. కానీ, ఆ సంస్థ కాకినాడలోని అసిస్టెంట్ చిట్స్ రిజిస్ట్రార్‌కు సమర్పించిన చిట్ వేలం రికార్డులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఆ సంస్థ ప్రతినెలా క్రమం తప్పకుండా చిట్ వేలాన్ని నిర్వహించడంలేదన్నది వెల్లడైంది. 2022, జనవరి నుంచి 2023 జనవరి వరకు రికార్డులను పరిశీలిస్తే ఒక్కనెల తప్ప మిగిలిన అన్ని నెలల్లోనూ తక్కువ చిట్ వేలమే నిర్వహించింది. ► ఈ కంపెనీ టర్నోవర్‌కు బ్యాంకులో జమచేస్తున్న చందా మొత్తాలు భిన్నంగా ఉన్నాయి. ప్రతినెలా రూ.7.61 కోట్ల టర్నోవర్ అని కంపెనీ చెబుతోంది. అంటే.. డివిడెండ్ మొత్తం మినహాయించుకుంటే ప్రతినెలా రూ.5కోట్లు చొప్పున ఏడాదికి చందా మొత్తాలే రూ.60కోట్లు జమచేయాలి. కానీ, జమచేస్తున్న మొత్తం ఆ దరిదాపుల్లో కూడా లేదు. ► చిట్టీల వేలం సొమ్ము చెల్లింపు ముసుగులో జగజ్జనని చిట్‌ఫండ్స్ నల్లధనాన్ని చలామణిలోకి తెస్తోంది. 49 చిట్టీ పాటల ప్రైజ్‌మనీ మొత్తం రూ.11,76,82,000 చెల్లింపులను పరిశీలించారు. వాటిలో 21 చిట్టీ పాటల ప్రైజ్‌మనీ రూ.4,68,45,753ను బ్యాంకు ఖాతాల్లో జమచేశారు. మిగిలిన 28 చిట్టీల వేలం పాటల ప్రైజ్‌మనీ రూ.7,08,36,247ను నగదు రూపంలో చెల్లించినట్లు చెప్పారు. నగదు రూపంలో చెల్లించడం నిబంధనలకు విరుద్ధం. అంటే.. నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చినట్లు వెల్లడైంది. ► చిట్‌ఫండ్ కంపెనీ అన్ని వ్యవహారాలు నగదులోనే నిర్వహిస్తోంది. అంటే చందాల వసూళ్లు, చిట్ పాట మొత్తం చెల్లింపులన్నీ నగదులోనే నిర్వహిస్తోంది. ఇది ఆదాయపన్ను చట్టానికి విరుద్ధం. ► బ్యాంకు ఖాతాల్లో సంస్థ భారీగా నగదు డిపాజిట్లు కూడా చేస్తోంది. చిట్ వసూళ్లతో ఆ డిపాజిట్లు సరిపోలడంలేదు. ఎక్కువగా బ్యాంకు డిపాజిట్లు నగదు రూపంలోనే చేస్తున్నారు. ► చందా చెల్లించడంలేదని చెబుతున్న చిట్ల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఖాతా నిర్వహించడంలేదు. ► మరోవైపు.. జగజ్జనని చిట్‌ఫండ్స్ వేలానికి సంబంధించిన మినిట్స్ రికార్డులకు బ్యాంకు లావాదేవీలు భిన్నంగా ఉన్నాయి. మచ్చుక్కి 11 చిట్టీ పాటల మినిట్స్‌ను సీఐడీ అధికారులు పరిశీలించారు. అందులో పేర్కొన్న మొత్తం కంటే వాస్తవంగా బ్యాంకు ద్వారా చెల్లించిన మొత్తం తక్కువగా ఉంది. అంటే.. చందాదారులను ఆ చిట్‌ఫండ్స్ సంస్థ మోసం చేస్తోందని వెల్లడైంది. ► చిట్‌ఫండ్ చట్టంలో పేర్కొన్న రికార్డులను జగజ్జనని చిట్‌ఫండ్స్ నిర్వహించడంలేదు. అలాగే, చట్టంలో పేర్కొన్న వార్షిక బ్యాలన్స్ షీట్ పార్ట్–1, పార్ట్–2లనూ సమర్పించడంలేదు. సీఐడీ కార్యాలయం వద్ద టీడీపీ ఎమ్మెల్యే భవానీ అడ్డం తిరిగిన అప్పారావు.. తనను అరెస్టు చేసేందుకు వీల్లేదంటూ సీఐడీ అధికారులతో ఆదిరెడ్డి అప్పారావు వాదనకు దిగారు. జీఎస్టీ ఎగవేత విషయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ చర్యలను నియంత్రిస్తూ గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను చూపుతూ తనను అరెస్టుచేయడం అన్యాయమని వాదించారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఆయనకు సీఐడీ అధికారులు స్పష్టతనిచ్చి అరెస్టుచేశారు. సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌ల అరెస్టు నేపథ్యంలో రాజమహేంద్రవరం సీఐడీ కార్యాలయం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. రాజమహేంద్రవరంలో జరగబోయే మహానాడును అడ్డుకునేందుకే ఇలాంటి చర్యలకు దిగుతున్నారని మాజీమంత్రి జవహర్ విమర్శించారు. అప్పారావు, శ్రీనివాస్‌ను అన్యాయంగా అరెస్టుచేశారని మాజీ హోంమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వ్యాఖ్యానించారు. సీఐడీ కార్యాలయంలో భర్త, మామను ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ పరామర్శించారు. అనుమతి లేకుండా ఆఫీసులు రాజమహేంద్రవరంలోని వీఎల్ పురం, తిలక్ రోడ్డులోని డోర్ నంబర్ 79/2–4/3 చిరునామాతో చిట్‌ఫండ్ కార్యాలయం నిర్వహించేందుకు జగజ్జనని చిట్‌ఫండ్స్ అనుమతి తీసుకుంది. కానీ, అనుమతి లేకుండా 86–26–13/1 తిలక్ రోడ్డు చిరునామాతో ఉన్న భవనంలో కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. దీనిపై చిట్ రిజిస్ట్రార్‌కు ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. అలాగే, జగజ్జనని చిట్‌ఫండ్స్ రాజమహేంద్రవరంలో చిట్‌ఫండ్ వ్యాపారం నిర్వహించేందుకు అనుమతి తీసుకుంది. అందుకు విరుద్ధంగా కాకినాడ జగన్నాథపురంలో అనధికారికంగా మరో బ్రాంచి కార్యాలయాన్ని నిర్వహిస్తోంది. ఇది ఖాతాదారులను మోసం చేయడమే అవుతుంది. -
టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం
రాజమండ్రి: టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదిరి సాక్షిగా టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం తలెత్తింది. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వచ్చేలోపే ఉగాది వేడుకలు పూర్తి కావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు నిలదీయడంతో, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం గట్టిగానే జరిగింది. అయితే నేతల మధ్య రగడ జరిగినా గోరంట్ల బుచ్చయ్య మాత్రం స్పందించలేదు. కాగా ఇటీవలే ఆదిరెడ్డి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాకపై స్థానిక నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రొటోకాల్ వివాదం రాజేసినట్లు అయ్యింది. -
టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్ వివాదం
-
ఇసుక అక్రమ రవాణా అరికట్టడంలో ప్రభుత్వం విఫలం
హైదరాబాద్ : ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆదిరెడ్డి అప్పారావులు ఆరోపించారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ఇసుక అక్రమరవాణాపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. మహిళా సంఘాల పేరుతో ఇసుక మాఫియా రూ. వెయ్యి కోట్లు దోచుకుందని వారు విమర్శించారు. కృష్ణాజిల్లా వనజాక్షిపై దాడి ఘటనలో ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు వ్యాఖ్యానించారు. అయితే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యలకు రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత సమాధాన మిచ్చారు. ఇసుక్ర అక్రమ రవాణాపై ఇప్పటి వరకు 1200లకు పైగా కేసులు నమోదు అయినట్లు తెలిపారు. అలాగే రూ. 4 కోట్ల 64 లక్షల వరకు జరిమానా విధించినట్లు చెప్పారు. అలాగే అక్టోబర్ నుంచి ఇసుక రీచ్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు పీతల సుజాత వివరించారు. -
కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేస్తాయేమో?
హైదరాబాద్: ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో అనూహ్య పరిణామాలు జరిగాయని వైఎస్ఆర్ సీపీ పక్షనేత ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఈ ఎన్నికలో మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు. డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి వెనక్కు తగ్గడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. తెర వెనుక ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడిందని, దానికి బదులుగా ఇప్పుడు టీడీపీకి ఇప్పుడు కాంగ్రెస్ మద్దతిచ్చందని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ విధానాలకు తమ పార్టీ వ్యతిరేకమని మరోసారి రుజువైందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసిపోయి తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఈ రెండు రాజకీయ పార్టీలు కలిసిపనిచేస్తాయేమోనన్నఅనుమానాన్నిఆదిరెడ్డి అప్పారావు అన్నారు. -
నేరుగా క్రమబద్ధీకరించలేం
కాంట్రాక్టు ఉద్యోగులు 13,671 మందే: యనమల మీ మంత్రే 32 వేల మంది ఉన్నారన్నారు నిలదీసిన పలువురు సభ్యులు సాక్షి, హైదరాబాద్: ‘కాంట్రాక్టు ఉద్యోగులందరినీ నేరుగా క్రమబద్ధీకరించాలంటే కుదరదు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆ పరిధి మేరకు నడుచుకోవాలి. అయినా మేం క్రమబద్ధీకరణ విషయూన్ని పరిశీలిస్తున్నాం. దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నాం’ అని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. సోమవారం శాసనసమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ఆయన మాట్లాడుతూ తాము క్రమబద్ధీకరణ చేయలేమని అనట్లేదని, ఆ విషయం పరిశీలిస్తూనే ఉన్నామన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 13,671 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నట్లు చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తాము ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన మాట వాస్తవమేనని, అందుకే ఈ అంశాన్ని పరిశీలించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులు వేరు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వేరని స్పష్టం చేశారు. సొసైటీలు, కార్పొరేషన్లలో పనిచేసే ఉద్యోగులు, ఐకేపీ ఉద్యోగులు కాంట్రాక్టు పరిధిలోకి రారని చెప్పారు. మంత్రుల మధ్య విరుద్ధ ప్రకటనలా? ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తారా? అంటూ పలువురు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి నేత ఆదిరెడ్డి అప్పారావు ప్రశ్నోత్తరాల సమయంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. కాంట్రాక్టు ఉద్యోగులపై మంత్రుల మధ్యే స్పష్టత లేదన్నారు. ఇదే సభలో కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు 32,000 మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని చెప్పారని, ఇప్పుడు ఆర్థిక మంత్రి 13,671 మంది మాత్రమే ఉన్నారని చెబుతున్నారని అభ్యంతరం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డెంగీ మృతులు ఇద్దరేనని ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించటాన్ని ఎమ్మెల్సీ గేయానంద్ సవాల్ చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 42 మంది మృతి చెందారని, కావాలంటే నిరూపిస్తానన్నారు. రాష్ట్రవాప్తంగా 40 వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలుండగా 202 పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. వక్ఫ్ భూములకు సంబంధించి 24 వేల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. -
రాజధాని విషయంలో వృధా ఖర్చులు
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రభుత్వం వృథా ఖర్చులకు పోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యానించారు. శాసనమండలిలో సోమవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ ఏమైందని అడిగారు. రైతుల రుణమాఫీ ఏమైందని ఆదిరెడ్డి అప్పారావు సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలకు, బడ్జెట్‌కు పొంతన లేదని ఆయన అన్నారు. వ్యవసాయ బడ్జెట్‌కు గవర్నర్ అనుమతి ఉందా, లేదా అని ప్రశ్నించారు. -
విభజిస్తే సీమాంధ్ర అధోగతే: ఆదిరెడ్డి అప్పారావు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగానికి, సంప్రదాయ స్ఫూర్తికి భిన్నంగా అడ్డగోలుగా, అప్రజాస్వామికంగా, అసమగ్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును తిప్పిపంపాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఆదిరెడ్డి అప్పారావు డిమాండ్ చేశారు. విభజనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్నదే తమ పార్టీ డిమాండని శనివారం శాసనమండలిలో ఆయన విస్పష్టంగా వెల్లడించారు. ‘ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో అత్యంత సున్నితమైన రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును రాత్రికి రాత్రే పంపడం అప్రజాస్వామికం. అందుకే ఈ బిల్లును మా పార్టీ వ్యతిరేకిస్తోంది. ఐదు దశాబ్దాలుగా మూడు ప్రాంతాల వారు పెట్టుబడులు పెట్టి అభివృద్ధి చేసిన హైదరాబాద్‌ను తెలంగాణకు వదిలేస్తే రేపు సీమాంధ్ర ప్రజలు ఉన్నత విద్య, ఉద్యోగాలు, మెరుగైన వైద్యం కోసం ఎక్కడికి వెళ్లాలి? ఈ సమస్యలకు బిల్లులో పరిష్కారాలు చూపలేదు. విభజిస్తే సీమాంధ్ర ప్రాంతం అధోగతి పాలవుతుంది. అసమగ్రంగా ఉన్న బిల్లుపై చర్చ జరిపించే ప్రయత్నం చేయడం సభా హక్కుల ఉల్లంఘనే’ అని అప్పారావు స్పష్టం చేశారు. ప్రజాప్రభుత్వానికే ‘ఉమ్మడి’పై అధికారం ్డ్డటీఆర్ఎస్ ఎమ్మెల్సీ స్వామిగౌడ్ ప్రసంగిస్తూ.. ‘ఉమ్మడి రాజధాని పరిధిలో భద్రత, ఇతర అంశాలు గవర్నరు పరిధిలో ఉంచాలంటూ బిల్లులో పెట్టిన షరతును తొలగించాలి.గవర్నర్‌కు కాకుండా ప్రజాప్రభుత్వానికే ఉమ్మడి రాజధానిలో భద్రత బాధ్యత అప్పగించాలి’’ అని అన్నారు. ఉల్లంఘనల వల్లే ఉద్యమం టీఆర్ఎల్డీ ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ మాట్లాడుతూ.. ‘రెండు ప్రాంతాలను కలిపి సమైక్య రాష్ట్రం ఏర్పాటు చేసిన సందర్భంగా కుదిరిన ఒప్పందాలను తర్వాత ప్రభుత్వాలు ఉల్లంఘించాయి. ఫలితం గా తెలంగాణ ప్రజల్లో మొదలైన ఆవేదన ఉద్యమానికి కారణమైంది. ఇది పదవుల కోసం ఉద్యమం కాద’ని చెప్పారు. ఆ 3 రాష్ట్రాల్లో దారుణ పరిస్థితులు పీడీఎఫ్ నేత వి.సుబ్రహ్మణ్యం ప్రసంగిస్తూ.. ‘రాజ్యాం గంలోని ఏ అధికరణకు అయినా పరిమితులు ఉంటాయి. అధికరణ 3కు పరిమితులు ఉండవని, కేంద్రం తన ఇష్టప్రకారం రాష్ట్రాలను విభజించడానికి అవకాశం ఉంటుందనే వాదన సరికాదు. ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని బిల్లును వ్యతిరేకిస్తున్నాం. విభజన వల్ల శ్రామిక, కార్మిక వర్గాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుంద’ని అన్నారు. -
సబ్బం చెప్పినవన్నీ అబద్ధాలే: ఆదిరెడ్డి అప్పారావు
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయమై ఎంపీ సబ్బం హరి చెప్పినవన్నీ అబద్ధాలేనని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు స్పష్టం చేశారు. సబ్బం హరి చేసిన విమర్శలను గురువారం ఒక ప్రకటనలో ఆయన తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే ఇది కాంగ్రెస్ పార్టీ దిగజారుడు డ్రామాలో మరో అంకమనే విషయం స్పష్టమవుతుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న నాటకంలో ఆయన పావుగా ఉపయోగపడుతున్నారనే విషయూన్ని చెప్పకనే చెప్పాడన్నారు. ఏఐసీసీ నుంచి ఆహ్వానం అందలేదంటూనే, అదే ఏఐసీసీ డ్రామాలో భాగంగా జగన్మోహన్రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించేందుకు నానా పాట్లూ పడ్డారని ఎద్దేవాచేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్న కాంగ్రెస్‌లోనే కొనసాగడమే కాకుండా.. ఆ పార్టీ ఆడిస్తున్న వీధినాటకాల్లో తానెంతటి నీచపాత్రనరుునా పోషిస్తానని హైకమాండ్‌కు సంకేతాలిస్తున్నాడని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియాలోని ఒక తోకపత్రిక తన ఆత్మానందం కోసం పుట్టించుకున్న ఓ సర్వే అనే బిడ్డను సబ్బం తన భుజాలకు ఎత్తుకుని మోశారని విమర్శించారు. కాంగ్రెస్, దాని అనుబంధ పార్టీ తెలుగుదేశం, సబ్బం హరి చేరాలనుకుంటున్న సీఎం పార్టీల సత్తా ఏమిటో, ఆయనకు జనంలో ఉన్న ఇమేజీ ఏమిటో మరో నాలుగు నెలల్లో తేలిపోతుందని అన్నారు. రామోజీ పత్రికను మత గ్రంథాలతో పోల్చడం ద్వారా రామోజీరావే తనకు దేవుడని సబ్బం చెప్పకనే చెప్పుకున్నారని విమర్శించారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ నినాదం కాదని.. విధానమని స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్‌లోకి వచ్చిన ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలకు అసంతృప్తి ఉండే అవకాశం లేనేలేదని స్పష్టం చేశారు. అసత్య ప్రేలాపనలు కట్టిపెట్టాలని సబ్బం హరిని అప్పారావు హెచ్చరించారు. -
చర్చ ఎక్కడ ప్రారంభమైంది? ఆదిరెడ్డి అప్పారావు ప్రశ్న
-
జగన్ రాకతో సమైక్య పోరు ఉధృతం: బోస్
చేబ్రోలు(ఉంగుటూరు): సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం స్వాతంత్య్ర పోరాటాన్ని తలపిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలిత సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావులు అన్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు 2వ రోజు గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలులో జరుగుతున్న దీక్ష శిబిరాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆదేశాలతో నౌడు వెంకట రమణ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేయటం అభినందనీయమన్నారు. 175 నియోజకవర్గంలో సమైక్యకు మద్దతుగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో 2వరోజు కూడా దీక్షలు విజయవంతంగా జరుగుతున్నాయన్నారు. సమైక్య కోసం వైఎస్సార్సీపీ ఉద్యమాలు చేస్తోందన్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉండాలని సీమాంధ్రులేగాక, తెలంగాణావారు కూడా కోరుకుంటున్నారన్నారు. రాష్ట్ర విభజన తీర్మానాన్ని సీడబ్ల్యూసీ వెంటనే విరమించుకోవాలన్నారు. సొనియా గాంధీ తన కొడుకు ప్రధాని చేయటానికే అన్నదమ్ములుగా ఉన్న రాష్ట్రాన్ని విడగొట్టారని వారు విమర్శించారు. జగన్ బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత ఉద్యమం మరింత ఊపందుకుందన్నారు. తెలంగాణాకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖను వెనుక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలు సమైక్యాంధ్రకు మద్దతుగా వర్షం కూడా లెక్కచేయకుండా దీక్షలు చేయటం అభినందనీయమన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు నౌడు వెంకట రమణ మాట్లాడుతూ కాబోయే ముఖ్యమంత్రి జగన్ అన్నారు.