టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్‌ వివాదం | Protocol issue between tdp leaders adireddy apparao, varireddy rambabu in rajahmundry | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్‌ వివాదం

Published Wed, Mar 29 2017 2:16 PM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్‌ వివాదం - Sakshi

టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్‌ వివాదం

రాజమండ్రి: టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదిరి సాక్షిగా టీడీపీ నేతల మధ్య ప్రోటోకాల్‌ వివాదం తలెత్తింది. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వచ్చేలోపే ఉగాది వేడుకలు పూర్తి కావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై ఆయన డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు నిలదీయడంతో, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. 

ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వివాదం గట్టిగానే జరిగింది. అయితే నేతల మధ్య రగడ జరిగినా గోరంట్ల బుచ్చయ్య మాత్రం స్పందించలేదు. కాగా ఇటీవలే ఆదిరెడ్డి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన రాకపై స్థానిక నేతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో  మళ్లీ ప్రొటోకాల్‌ వివాదం రాజేసినట్లు అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement