రాజధాని విషయంలో వృధా ఖర్చులు | adireddy Apparao demands on andhra pradesh capital | Sakshi
Sakshi News home page

రాజధాని విషయంలో వృధా ఖర్చులు

Published Mon, Aug 25 2014 1:02 PM | Last Updated on Fri, Jul 12 2019 6:01 PM

adireddy Apparao demands on andhra pradesh capital

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ప్రభుత్వం వృథా ఖర్చులకు పోతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యానించారు. శాసనమండలిలో సోమవారం బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు కేంద్రం ఇచ్చే ప్రత్యేక ప్యాకేజీ ఏమైందని అడిగారు. రైతుల రుణమాఫీ ఏమైందని ఆదిరెడ్డి అప్పారావు సూటిగా ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలకు, బడ్జెట్కు పొంతన లేదని ఆయన అన్నారు. వ్యవసాయ బడ్జెట్కు గవర్నర్ అనుమతి ఉందా, లేదా అని ప్రశ్నించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement