
కాంగ్రెస్, టీడీపీ కలిసి పనిచేస్తాయేమో?
హైదరాబాద్: ఏపీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో అనూహ్య పరిణామాలు జరిగాయని వైఎస్ఆర్ సీపీ పక్షనేత ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. కాంగ్రెస్, టీడీపీలు ఈ ఎన్నికలో మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు. డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి వెనక్కు తగ్గడానికి కారణమేంటని ఆయన ప్రశ్నించారు. తెర వెనుక ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడిందని, దానికి బదులుగా ఇప్పుడు టీడీపీకి ఇప్పుడు కాంగ్రెస్ మద్దతిచ్చందని ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీ విధానాలకు తమ పార్టీ వ్యతిరేకమని మరోసారి రుజువైందన్నారు. కాంగ్రెస్, టీడీపీ కలిసిపోయి తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఈ రెండు రాజకీయ పార్టీలు కలిసిపనిచేస్తాయేమోనన్నఅనుమానాన్నిఆదిరెడ్డి అప్పారావు అన్నారు.