సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ నేతలపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలు స్కాంలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జగజ్జనని చిట్స్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బుతో ప్రైవేటు ఆస్తులు కొనుగోలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఎంపీ భరత్ మంగళవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆదిరెడ్డి విషయంలో కక్ష సాధింపు అని కొందరు అంటున్నారు. ఆదిరెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమా?. జగజ్జననని చిట్‌ఫండ్స్ పేరుతూ ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుతో ఆదిరెడ్డి కుటుంబం అక్రమాలకు పాల్పడింది. ఆదిరెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్స్ చూపించారు. చిట్ ఫండ్స్ చట్టం సెక్షన్-5 ప్రకారం అరెస్టులు జరిగాయి.
20వేలకు నుంచి క్యాష్ రిసీట్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ, కోట్ల రూపాయల లావాదేవీలు జగజ్జననిలో జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఎక్కడా నిబంధనలు పాటించలేదు. అక్రమాలు చేసే సంస్థలను ప్రభుత్వం ఎట్టి పరిస్థిత్తుల్లో ఉపేక్షించదు. జగజ్జనని కూడా మార్గదర్శిలాంటిదే. జగజ్జనని బాధితులు ఎంతోమంది ఉన్నారు. మేము వ్యక్తిగత దూషణ చేయడం లేదు. ప్రభుత్వంపై అనవసరంగా చేసిన ఆరోపణల గురించే మాట్లాడుతున్నాం. కేవలం రాజకీయ నేపథ్యం ఉండటం వలన ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుతో ఆదిరెడ్డి కుటుంబం అక్రమాలకు పాల్పడింది అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: రైతులెవరో తెలియదా రామోజీ?
Comments
Please login to add a commentAdd a comment