chit fund scam
-
ఆశలతో ఉచ్చు.. ఎన్నో ఇళ్లలో చిచ్చు
సాక్షి, అమరావతి: ‘మార్గదర్శి తోడుంటే ఆనందం మీవెంటే.. ఇళ్లు, కార్లు, ఫర్నీచర్, నగలు అన్నీ కొనుక్కోవచ్చు..’ ఇదీ టీవీ చానళ్లలో, హోర్డింగుల్లో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఊదరగొట్టే ప్రచారం. అది నిజమేనని నమ్మి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో చేరిన చందాదారుల ఇళ్లల్లో ఆనందం ఆవిరవుతోందన్నది పచ్చి నిజం. కొత్త ఇళ్లు, కార్లు కొనుక్కోవడం దేవుడెరుగు.. ఉన్న ఇళ్లు, భూములు, బంగారం అమ్ముకుంటున్నా అప్పుల ఊబి నుంచి బయట పడటం లేదు. అందమైన కలలు చూపిస్తూ రామోజీరావు సామాన్యుల మెడకు చిట్టీల ఉచ్చు బిగిస్తున్నారు. ఒక చిట్టీ అప్పు తీర్చడం పేరిట మరో చిట్టీలో చేర్పిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారు. ఆస్తులు తెగనమ్ముకున్నా అప్పులు తీరవు.. సరికదా కాల్‌మనీ రాకెట్‌ను తలపిస్తూ మార్గదర్శి సిబ్బంది వేధింపులతో చందాదారుల కుటుంబాలు మానసిక క్షోభ అనుభవిస్తుండటం రామోజీ ఆర్థిక అరచాకాలకు నిదర్శనం. విజయవాడకు చెందిన ఓ ప్రభుత్వ వెటర్నరీ డాక్టర్ కుటుంబానికి ఇలాంటి క్షేభే మిగిలింది. ఈ వెటర్నరీ వైద్యుడి కుటుంబ సభ్యులు కోళ్ల ఫారం నిర్వహిస్తున్నారు. ఆయన భార్య మార్గదర్శి చిట్ ఫండ్స్‌లో ఒక గ్రూపులో చందాదారుగా చేరారు. ఆ తర్వాత ఆమెకు తెలియకుండానే మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో సభ్యురాలిగా చేర్చారు. ఆ చిట్టీ గ్రూపుల చందాలు చెల్లించడం కోసమంటూ మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో చేర్పిస్తూ ఏకంగా 90 చిట్టీ గ్రూపుల్లో సభ్యురాలిగా చూపించారు. నిబంధనల ప్రకారం ఇచ్చిన ష్యూరిటీలను కూడా గుర్తించకుండా ఏకంగా 17 చిట్టీ గ్రూపుల్లో డిఫాల్టర్‌గా చూపించారు. అనంతరం ఆ కుటుంబం ఆస్తులను గుంజుకున్నారు. ఆ వెటర్నరీ వైద్యుడు జీపీఎఫ్ డబ్బులు రూ.35 లక్షలతోపాటు పిల్లల పెళ్లి కోసం దాచుకున్న బంగారం కూడా అమ్మి చెల్లించినా ఇంకా అప్పులు తీరనే లేదు. కాల్‌మనీ రాకెట్ గుండాల మాదిరిగా మార్గదర్శి చిట్‌ఫండ్స్ సిబ్బంది వచ్చి అల్లరి చేసి మరీ వారి ఇంటిని వేలం వేయించారు. అంతటితో రామోజీ ఆగడాలు ఆగలేదు. విదేశాల్లో చదువుతున్న ఆ వెటర్నరీ డాక్టర్ కుమార్తె సంతకాన్ని కూడా ఫోర్జరీ చేసి చందాదారుగా చేర్చారు. ఆమె చిట్టీ పాట పాడినట్టు చూపించారు. రూ.9 లక్షల నష్టానికి చిట్టీ పాట పాడినట్టు చూపించి బకాయిలు మినహాయించుకుని కేవలం రూ.210 మాత్రమే ఇస్తామని రికార్డుల్లో సర్దుబాటు చేశారు. ఆ చిట్టీ గ్రూపునకు సంబంధించి వాయిదాల బకాయిలు చెల్లించాలని మళ్లీ వేధింపులు మొదలు పెట్టారు. అసలు ఈ దేశంలోనే లేని మా కుమార్తె ఎలా చందాదారుగా చేరింది.. ఎలా వేలం పాటలో పాల్గొంది.. అసలు తను వచ్చి ఎప్పుడు సంతకం చేసింది.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే లేదు. ఆమె పేరుతో మార్గదర్శి చిట్ ఫండ్స్ ఉద్యోగులే మోసం చేశారు. తలలు అమ్ముకున్నా తీరని అప్పులు జాతీయ బ్యాంకులుగానీ ప్రైవేటు బ్యాంకులుగానీ తమ ఖాతాదారుల ఆర్థిక పరిస్థితిని సహేతుకంగా అంచనా వేసి తదనుగుణంగా రుణాలు ఇస్తాయి. రుణాలు చెల్లించే స్థోమతను బట్టి ఒక పరిమితి విధిస్తాయి. దేశంలో ఏ ఆర్థిక సంస్థ అయినా ఈ నిబంధనను పాటించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ మాత్రం అవేవీ పట్టించుకోదు. చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి కూడా వారి ఆదాయం, ఆర్థిక స్థోమతను మించి ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తోంది. దాంతో వాయిదాలు చెల్లించలేక వారు అప్పుల ఊబిలో కూరుకుపోయి తమకున్న కొద్దిపాటి ఆస్తులను తమకు ధారాదత్తం చేసే పరిస్థితిని సృష్టిస్తున్నారు. అందుకు విజయవాడకు చెందిన ఓ టాక్సీ డ్రైవర్ దీనగాధే తార్కాణం. ఇతను మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో రూ.2 లక్షల చిట్టీ గ్రూపులో సభ్యునిగా చేరారు. తర్వాత మరిన్ని చిట్టీ గ్రూపుల్లో చేరితే ఆర్థికంగా కలసి వస్తుందని చెప్పడంతో మరో రెండు గ్రూపుల్లో సభ్యుడిగా చేరాడు. తర్వాత ఆయనకు తెలియకుండానే ఏకంగా 20 గ్రూపుల్లో సభ్యునిగా చేర్పించేశారు. నెలకు రూ.50 వేలు వాయిదాల కిందే చెల్లించాల్సిన పరిస్థితి సృష్టించారు. చిట్టీ పాట పాడిన తర్వాత ప్రైజ్‌మనీ తీసుకునేందుకు ఆయన ఇచ్చిన ష్యూరిటీలను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉద్దేశ పూర్వకంగానే కొర్రీలు వేసి తిరస్కరించింది. వాయిదాల బకాయిలు చెల్లించేందుకు తమకున్న ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి సృష్టించారు. అసలు ఓ టాక్సీ డ్రైవర్ నెలకు రూ.50 వేలు చిట్టీ వాయిదాలు ఎలా చెల్లించగలరని మార్గదర్శి చిట్‌ఫండ్స్ విచక్షణతో యోచించి ఉంటే ఆయనకు అంతటి దుస్థితి ఏర్పడేది కాదు. కానీ రామోజీ లక్ష్యం ఆయనకు ఉన్న ఒక్క ఇంటిని గుంజుకోవడమే. బరితెగించి రామోజీ ఆర్థిక ఆగడాలు మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల్లో అత్యధికులది ఇలాంటి దుస్థితే. రాజకీయంగా ఎలాంటి అండాదండా లేని వారు, ప్రభుత్వ ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఇతర మధ్య తరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని రామోజీరావు పక్కాగా తన కుట్రను అమలు చేస్తూ వారి ఆస్తులను కొల్లగొడుతున్నారు. అటువంటి చందాదారుల్లో చిట్టీల చందాలు చెల్లింపులో ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి, వారిని మరికొన్ని చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పిస్తున్నారు. కొత్త చిట్టీ గ్రూపులో ప్రైజ్ మనీతో పాత చిట్టీ గ్రూపు వాయిదాలు చెల్లించవచ్చని ఆశ చూపిస్తున్నారు. మళ్లీ కొత్త చిట్టీ దగ్గరకు వచ్చేసరికి ష్యూరిటీల పేరుతోనో మరో రకంగానో కొర్రీలు వేసి మరిన్ని చిట్టీ గ్రూపుల్లో చేర్పిస్తున్నారు. చాలా మంది చందాదారులకు తెలియకుండానే వారి పేరిట మార్గదర్శి చిట్‌ఫండ్స్ మేనేజర్లు చిట్టీ పాటలు పాడేస్తున్నారు. ఆ ప్రైజ్‌మనీని మరో చిట్టీ గ్రూపులో సర్దుబాటు చేసినట్టు రికార్డుల్లో చూపిస్తున్నారు. అలా చందాదారులు తమకు తెలియకుండానే లెక్కకు మించి చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేరి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇక అప్పులు తీర్చడం వారి తరం కాదని నిర్ధారించుకున్న తర్వాత వారి ఇళ్లపై మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉద్యోగులు దాడులు చేస్తున్నారు. వారిని వేధిస్తూ.. సామాజిక గౌరవానికి భంగం కలిగిస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. దాంతో తమ ఆస్తులను మార్గదర్శి చిట్‌ఫండ్స్ పరం చేసి కట్టుబట్టలతో బయటకు వెళ్లిపోవాల్సిన అనివార్యత సృష్టిస్తున్నారు. కొందరి నుంచి ఆస్తి పత్రాలు, ఎల్ఐసీ బాండ్లు తీసుకుని మరీ డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. మరికొందరిని.. చిట్టీలు పాడినా పాట మొత్తం (ప్రైజ్‌మనీ) ఇచ్చేందుకు నెలల తరబడి తిప్పుతున్నారు. ఇంకొందరి సంతకాలను ఫోర్జరీ చేసి మరొకరికి ష్యూరిటీలో చూపిస్తూ చిట్టీ మొత్తం ఇవ్వకుండా వేధిస్తున్నారు. చిట్టీ వాయిదా ఒక్క రోజు ఆలస్యమైనా రూ.500 జరిమానా వసూలు చేస్తున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్.. తాము చెల్లించాల్సిన చిట్టీ పాట మొత్తాన్ని మాత్రం నెలల తరబడి జాప్యం చేస్తున్నా సరే ఒక్క రూపాయి వడ్డీ చెల్లించడం లేదు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు.. వేలాది మంది మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు గగ్గోలు పెడుతున్నారు. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో 50 శాతం వరకు ఇటువంటి బాధితులే ఉండటం రామోజీ మోసాల తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది. యథేచ్ఛగా చట్టం ఉల్లఘన ► ఎవరైనా ఓ చందాదారుడు చిట్టీ పాట పాడిన తర్వాత తగిన ష్యూరిటీలు చూపించకపోతే... ఆ చిట్టీ పాటను రద్దు చేయాలి. ఆ చిట్టీ గ్రూపునకు మళ్లీ పాట(వేలం) నిర్వహించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆ నిబంధనను పాటించడం లేదు. ఆ చిట్టీ పాటను రద్దు చేయడం లేదు. కొత్తగా పాటను నిర్వహించడమూ లేదు. ఆ చిట్టీ పాట సక్రమంగా నిర్వహించినట్టు చూపిస్తూ ఆ ప్రైజ్‌మనీని వేరే ఖాతాల్లోకి మళ్లించేస్తోంది. ఆ చిట్టీ గ్రూపును యథావిథిగా కొనసాగిస్తోంది. దాంతో ఆ డిఫాల్టర్ చందాదారుడు తర్వాత నెలల వాయిదాలు కూడా చెల్లించాల్సినట్టు చూపిస్తూ అప్పుల ఊబిలోకి కురుకుపోయేలా చేస్తోంది. ► వాయిదాలు చెల్లించలేని చందాదారుడిని డిఫాల్టర్‌గా చూపించాలి. అంతవరకు ఆ చందాదారు చెల్లించిన మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో వేసి కమీషన్ పోగా వెనక్కి ఇచ్చేయాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ అలా చేయడం లేదు. ఆ డిఫాల్టర్ చందాదారు మొత్తాన్ని మరో చిట్టీ బకాయి కింద జమ చేసినట్టు చూపిస్తూ.. ఇంకా బకాయిలు చెల్లించాలని రికార్డుల్లో ఆ చందాదరుని రుణగ్రస్తునిగా చూపిస్తోంది. ► ఎవరైనా ప్రైజ్‌మనీ తీసుకోని చందాదారు వాయిదాలు చెల్లించలేకపోతే డిఫాల్టర్‌గా ప్రకటించాలి. ఆ చందాదారునికి 14 రోజుల నోటీసు ఇచ్చి డిఫాల్టర్‌గా ప్రకటించినప్పటి వరకు చెల్లించిన వాయిదాలను ప్రత్యేక బ్యాంకు ఖాతాలో జమ చేయాలి. ఆ తర్వాత ఏడు రోజుల్లో ఆ మొత్తాన్ని నిర్దేశిత వడ్డీ రేటుతో కలిపి చెల్లించాలి. కానీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఈ నిబంధనను పాటించడం లేదు. అటువంటి చందాదారులను ఉద్దేశ పూర్వకంగా డిఫాల్టర్లుగా ప్రకటించకుండా కొనసాగిస్తూ వారు మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. ► చిట్‌ఫండ్ చట్టం ప్రకారం ప్రతి చిట్టీ గ్రూపు దేనికదే ప్రత్యేకం. ప్రతి చిట్టీ గ్రూపు ఒక ప్రత్యేక కంపెనీ వంటిది. ఒక చిట్టీ గ్రూపు చందాదారుగా చెల్లించిన మొత్తాన్ని మరో చిట్టీ గ్రూపులో సర్దుబాటు చేసినట్టు చూపించకూడదు. ఈ నిబంధనను మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఉల్లంఘిస్తూ చందాదారులను ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యునిగా చూపిస్తూ... అన్ని చిట్టీ గ్రూపుల మొత్తాన్ని ఒకదానికి ఒకటి అనుసంధినిస్తూ చందాదారులను ఉద్దేశ పూర్వకంగా అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. బాధితులకు అండగా చట్టం, ప్రభుత్వం చిట్‌ఫండ్ కంపెనీల మోసాలు, ఆగడాల నుంచి బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేసేందుకు కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టం సరైన వ్యవస్థను ఏర్పాటు చేసింది. చిట్టీ గ్రూపుల డిఫాల్టర్ సభ్యుల విషయంలో అనుసరించాలిన నిబంధనలను కేంద్ర చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 22లో విస్పష్టంగా పేర్కొంది. అయితే దశబ్దాలుగా ప్రభుత్వాలు పట్టించుకోని ఆ చట్టాన్ని వైఎస్సార్సీపీ పటిష్టంగా అమలు చేస్తోంది. చిట్ రిజిస్ట్రార్లతోపాటు ప్రభుత్వం వరకు వివిధ స్థాయిల్లో అప్పీలు చేసుకునే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మార్గదర్శి అక్రమాలు, వేధింపులకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మార్గదర్శి చిట్ఫండ్స్తోపాటు ఇతర చిట్‌ఫండ్ కంపెనీల బాధితులు తమ సమస్యను తెలియజేసి న్యాయం పొందేందుకు ప్రత్యేక వ్యవస్థే ఉంది. కేంద్ర చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్ 64 నుంచి 68 వరకు జిల్లా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్‌కు విస్తృత అధికారాలున్నాయి. ఆయనకు జ్యుడీషియరీ అధికారాలను చట్టం కల్పించింది. చందాదారులు తమకు చిట్‌ఫండ్ కంపెనీ మోసం చేసిందీ.. వేధిస్తోంది.. అని భావిస్తే తగిన ఆధారాలతో జిల్లా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయవచ్చు. తాము సరైన ష్యూరిటీలు సమర్పించినా ఆమోదించడం లేదని, తమను డిఫాల్టర్‌గా ప్రకటించి అప్పటి వరకు చెల్లించిన వాయిదాలను వెనక్కి ఇవ్వాలని.. తమ సమ్మతి లేకుండానే ఎన్నో చిట్టీ గ్రూపుల్లో సభ్యులుగా చేర్పించారని... తమ సంతకాలను ఫోర్జరీ చేశారని.. ఇలా ఎటువంటి సమస్యలపైన అయినా ఫిర్యాదు చేయవచ్చు. దానిపై జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ విచారించి తగిన చర్యలు తీసుకుంటారు. ఆమేరకు ఆదేశాలు జారీ చేస్తారు. జిల్లా అసిస్టెంట్ చిట్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఆదేశాలతో సంతృప్తి చెందకపోతే బాధితులు రాష్ట్ర స్థాయిలో కూడా ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. చిట్‌ఫండ్ చట్టంలోని సెక్షన్లు 69, 70 ప్రకారం రాష్ట్ర చిట్స్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయవచ్చు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆదేశాలు ఇచ్చిన రెండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసి తగిన న్యాయం పొందవచ్చు. -
చిట్స్ స్కాంలో ఆదిరెడ్డి అరెస్ట్: ఎంపీ భరత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తూర్పుగోదావరి: టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్ సీరియస్ కామెంట్స్ చేశారు. టీడీపీ నేతలు స్కాంలు చేస్తున్నారని ఆరోపించారు. అలాగే, జగజ్జనని చిట్స్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బుతో ప్రైవేటు ఆస్తులు కొనుగోలు చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంపీ భరత్ మంగళవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. ఆదిరెడ్డి విషయంలో కక్ష సాధింపు అని కొందరు అంటున్నారు. ఆదిరెడ్డిని అరెస్టు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అవసరమా?. జగజ్జననని చిట్‌ఫండ్స్ పేరుతూ ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుతో ఆదిరెడ్డి కుటుంబం అక్రమాలకు పాల్పడింది. ఆదిరెడ్డి ఫోర్జరీ డాక్యుమెంట్స్ చూపించారు. చిట్ ఫండ్స్ చట్టం సెక్షన్-5 ప్రకారం అరెస్టులు జరిగాయి. 20వేలకు నుంచి క్యాష్ రిసీట్స్ తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ, కోట్ల రూపాయల లావాదేవీలు జగజ్జననిలో జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఎక్కడా నిబంధనలు పాటించలేదు. అక్రమాలు చేసే సంస్థలను ప్రభుత్వం ఎట్టి పరిస్థిత్తుల్లో ఉపేక్షించదు. జగజ్జనని కూడా మార్గదర్శిలాంటిదే. జగజ్జనని బాధితులు ఎంతోమంది ఉన్నారు. మేము వ్యక్తిగత దూషణ చేయడం లేదు. ప్రభుత్వంపై అనవసరంగా చేసిన ఆరోపణల గురించే మాట్లాడుతున్నాం. కేవలం రాజకీయ నేపథ్యం ఉండటం వలన ప్రజల వద్ద నుంచి సేకరించిన డబ్బుతో ఆదిరెడ్డి కుటుంబం అక్రమాలకు పాల్పడింది అని కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: రైతులెవరో తెలియదా రామోజీ? -
రామోజీ ఎందుకు ఓర్వలేకపోయారు?.. ఆ భయం వెంటాడిందా?
రామోజీరావులో మరో కోణాన్ని ఆయన తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు బయటపెట్టారు. రామోజీ ఎందుకు ఓర్వలేకపోయారు? తన తోడల్లుడు ఎదిగిపోతానేమోననే భయం రామోజీని ఎందుకు వెంటాడింది? మార్గదర్శి డిపాజిట్లను ఎలా మళ్లించారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఎందుకు హెచ్చరించింది? వంటి ఎన్నో విషయాలను ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డాల్ఫిన్ అప్పారావు వెల్లడించారు. అందుకే లీజు మాస్టర్లు అని పేరొచ్చింది.. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చిన్నగా ప్రారంభమైంది. ఆ తర్వాత రామోజీకి బ్రాంచ్‌లు విస్తరించాలన్న ఆలోచన వచ్చింది. విజయవాడ వచ్చినప్పుడు నన్ను పిలిచి మార్గదర్శి చిట్‌ఫండ్స్ విస్తరిస్తామని చెప్పారు. విజయవాడలో మొదటి బ్రాంచ్ ఏర్పాటు పనుల్ని రెండు మూడు నెలల్లోనే ప్రారంభించాం. ఆ తర్వాత విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, నెల్లూరు సహా 8 బ్రాంచ్‌లను వెంటనే మొదలుపెట్టాం. క్రమంగా చిట్స్ పెరిగాయి. అప్పట్లో ఆ నగదును ఎటూ మళ్లించకపోవడంతో మార్గదర్శి బాగానే ఉంది. ఇంతలో ఈనాడు క్రమంగా విస్తరించి నంబర్‌వన్‌గా మారింది. ఆ తర్వాత డాల్ఫిన్ హోటల్‌పై దృష్టిసారించాం. ఆ బాధ్యతలు కూడా నేనే తీసుకొని.. అద్భుతంగా తీర్చిదిద్దాను. ఈనాడు, డాల్ఫిన్.. ఇలా అన్నింటిని లీజుకు తీసుకున్న స్థలాల్లోనే నడిపాం. అందుకే మాకు లీజు మాస్టర్లు అని పేరొచ్చింది. నన్ను చూసే ఆ స్థల యజమానులు లీజులకు ఇచ్చారు. దీన్ని కూడా రామోజీ ఓర్వలేకపోయారు. నేను ఎదిగిపోతానేమోననే భయం రామోజీని వెంటాడింది. ఆర్బీఐ హెచ్చరించడంతో.. ఒక స్థాయి వరకూ డిపాజిట్లు తీసుకునేంత వరకూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ బాగానే ఉంది. ఈ డిపాజిట్లను మొదట ఈనాడు, డాల్ఫిన్ విస్తరణకు తరలించాం. ఎక్కడా ఇబ్బంది కలగకుండా.. లాభాలు రాగానే తిరిగి మళ్లీ మార్గదర్శిలోకి మళ్లించేవాళ్లం. అయితే.. సుప్రీంకోర్టు నిబంధనలను కఠినతరం చేసింది. ఆ సమయంలో ఒక సుప్రీంకోర్టు జడ్జి అభిప్రాయాల్ని తీసుకున్నాం. దాని లూప్‌హోల్‌ని పసిగట్టిన రామోజీరావు మార్గదర్శి డిపాజిట్లను మళ్లించడం మళ్లీ మొదలు పెట్టారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) హెచ్చరించడంతో నిధుల మళ్లింపును నిలుపుదల చేశారు. అయితే అప్పటికే రూ.వేల కోట్లు మళ్లించేశారు. ఈనాడు అప్పటికే అగ్రస్థానానికి చేరుకోవడంతో ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. ఆ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ దీనిపై పోరాటం మొదలుపెట్టారు. చదవండి: రామోజీ ఓ విషసర్పం.. తోడల్లుడు డాల్ఫిన్ అప్పారావు సంచలన వ్యాఖ్యలు -
2 కోట్లు.. ఓ పెట్రోల్ బంకు
కోల్‌కతా: కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డంపెట్టుకొని తమ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెదిరిస్తోందని తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. తమ పార్టీలో చేరాలని, లేకుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించి చిట్‌ఫండ్ కుంభకోణంలో జైలుకు పంపిస్తామని టీఎంసీ ప్రజాప్రతినిధులను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ఆదివారం కోల్‌కతాలో అమరవీరుల దినాన్ని పురస్కరించుకొని టీఎంసీ భారీ ర్యాలీ నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు భారీగా హాజరైన ఈ ర్యాలీలో ఆమె ప్రసంగించారు. కర్ణాటకలో అనుసరిస్తున్న వైఖరినే రాష్ట్రంలోనూ ప్రయోగించాలని బీజేపీ చూస్తోందని ఆమె విమర్శించారు. దీనికోసం తమ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి రూ.2 కోట్లతోపాటు పెట్రోల్ బంక్ ఇస్తామని ప్రలోభపెడుతోందని ఆరోపించారు. తమ పార్టీ గ్రామ నేతలకు రూ.20 లక్షలు ఇస్తామని ఆశ చూపుతోందన్నారు. డబ్బుతో ఎవరినైనా కొనేయగలమనే అహంకారంలో బీజేపీ ఉందని మండిపడ్డారు. ఇలాగైతే మరో రెండేళ్లే.. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసి బీజేపీ గెలిచిందని మమత ఆరోపించారు. ప్రస్తుత తీరుగానే వారి వ్యవహారం ఉంటే మరో రెండేళ్లే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంటుందని హెచ్చరించారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల నుంచి టీఎంసీ నాయకులు వసూలు సొమ్మును తిరిగిచ్చేయాలని తాను అన్నట్లుగా తన గత ప్రకటనను బీజేపీ వక్రీకరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకాల అమలుపై ఓ కన్నేసి ఉంచాలని తమ పార్టీ నాయకులకి తాను చెప్పానని, అయితే తన మాటలని వక్రీకరించి తమ నాయకులను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ముందు బీజేపీ తరలించిన నల్లధనాన్ని వెనక్కి తీసుకురావాలని, అలాగే ఆ పార్టీ నాయకులు ఉజ్వల పథకంలో వసూలు చేసిన సొమ్మును వెనక్కి ఇవ్వాలన్నారు. ఇదే డిమాండ్‌తో 26వ తేదీన నిరసనలు చేపట్టాలని కార్యకర్తలకు ఆమె పిలుపునిచ్చారు. ఉచిత ఎల్పీజీ పేరుతో బీజేపీ నేతలు డబ్బు వసూలు చేయడంపై దర్యాప్తు జరుపుతామన్నారు. 18 లోక్‌సభ స్థానాలు గెలిచి.. మొత్తం రాష్ట్రాన్ని గెలిచేసినట్లుగా బీజేపీ భావిస్తోందని ఎద్దేవా చేశారు. గంటపాటు ర్యాలీలో ఆమె.. ఏ ఒక్క బీజేపీ నాయకుడి పేరు కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. -
కోటి రూపాయలకు కుచ్చుటోపి
సాక్షి, రణస్థలం(శ్రీకాకుళం) : అధిక వడ్డీలకు ఆశచూపి మోసం చేయడం, అవసరానికి అక్కరకు వస్తుందని దాచుకున్న చిట్టీల సొమ్ముతో ఉడాయించడం... ఇలా పొదుపుదారులకు ఆర్థిక నేరగాళ్లు గుండెపోటు తెప్పిస్తున్నారు. తాజాగా మండలంలోని పైడిభీమవరం పంచాయతీ వరిసాం గ్రామానికి చెందిన అత్మకూరు కామేశ్వరరావు కోటి రూపాయలతో ఉడాయించాడు. గ్రామంతోపాటు చుట్టు్ట పక్కల గ్రామాల ప్రజల నుంచి చిట్టీలు, వడ్డీ వ్యాపారం పేరిట కోటి రూపాయలకుపైగా వసూలు చేశాడు. ఈ మొత్తంతో పరారవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. వరిసాం గ్రామానికి చెందిన పీవీ సత్యనారాయణ, పెద్దినాగభూషన్, కొన లక్ష్మణరావు, పీ నాగేశ్వరరావు, మునకాల రమణ, బీ రాము, జీరు రమణ, ఎం అప్పలనరసయ్య, కే బోగష్, ఎం దుర్గారావు, జీరు కుర్మారావుతోపాటు మరో 15 మంది బుధవారం జేఆర్‌పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అత్మకూరు కామేశ్వరరావు ఒక్కొక్కరి వద్ద రూ. లక్ష నుంచి రూ. 5లక్షల వరకూ పెద్ద మొత్తంలో వేసిన చిట్టీలను తిరిగి ఇవ్వకుండా పరారైనట్లు బోరుమన్నారు. -
రిషబ్ చిట్‌ఫండ్స్ నిందితుల అరెస్ట్
-
రిషబ్ చిట్‌ఫండ్స్ నిందితుల అరెస్ట్
హైదరాబాద్: రిషబ్ చిట్ ఫండ్స్ మోసం కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సీసీఎస్ అడిషనల్ డీసీపీ జోగయ్య తెలిపారు. చిట్‌ఫండ్స్ నిర్వాహకులు శైలేష్ గుజ్జర్, నందినీ గుజ్జర్లను బోయగూడలోని వారి నివాసంలోనే అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అనంతరం వారిని రిషబ్ చిట్‌ఫండ్ కార్యాలయానికి తీసుకువచ్చి వారి సమక్షంలోనే సోదాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ కేసులో సుమారు 600 మంది బాధితులు ఉన్నారని, దాదాపు రూ.70 కోట్ల వరకు చిట్‌ఫండ్స్ పేరిట మోసం జరిగినట్లు ప్రాధమిక విచారణలో తేలిందన్నారు. బాధితుల నుంచి తీసుకున్న డబ్బును వివిధ వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టినట్లు తెలిసిందన్నారు. శైలేశ్ గుజ్జర్ ఇళ్లు, ఆఫీసులు, పలు డాక్యుమెంట్లు, బ్యాంకు అకౌంట్లు కూడా సీజ్ చేసినట్లు జోగయ్య తెలిపారు. నిందితులను రేపు కోర్టులో హాజరుపరుస్తామన్నారు. -
వెంకట్రాయ చిట్‌ఫండ్ మోసం; చంద్రబాబు కుట్ర
సాక్షి, హైదరాబాద్: ప్రజల్ని నిలువునా ముంచేసిన వెంకట్రాయ చిట్‌ఫండ్ మోసం వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ యంత్రాంగం దొడ్డిదారి వ్యవహారాలకు తెరలేపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపిచారు. మోసం చేసిన సంస్థకు సంబంధించిన ఆస్తుల వేలాన్ని కుట్రపూరితంగా అడ్డుకుంటున్నారని, తద్వారా టీడీపీ నాయకుల అక్రమాలకు ముఖ్యమంత్రి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాధితులకు ప్రభుత్వమే డిపాజిట్లు ఇస్తుందా?: ‘‘అగ్రిగోల్డ్ కుంభకోణం కేసులో ఆ సంస్థ ఆస్తులను అమ్మేసి, తద్వారా వచ్చిన డబ్బును బాధితులకు ఇస్తున్నారు. మరి వెంకట్రాయ చిట్‌ఫండ్ కేసులో మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు? డీజీపీ ఉత్తర్వుల ద్వారా వెంకట్రాయ ఆస్తుల వేలాన్ని ప్రభుత్వం ఎందుకు నిలుపుదల చేయించింది? వెంకట్రాయ సంస్థ టీడీపీ నాయకులకు చెందిందనే కదా! ఖాతాదారుల ఫిర్యాదు మేరకు అప్పటి ప్రభుత్వం వెంకట్రాయ చిట్‌ఫండ్ కుంభకోణంపై కమిటీ వేసింది.. దొడ్డి దారిన తన ఆస్తుల్ని అమ్ముకుంటున్నట్లు గుర్తించిన వెంటనే సంస్థ ఆస్తుల్ని స్వాధీనం చేసుకుంది. కానీ ఇప్పుడు.. ఆ ఆస్తుల వేలానికి టీడీపీ ప్రభుత్వం అడ్డుపడుతోంది. ఇలా చేస్తే ఖాతాదారులకు డిపాజిట్లను ఎవరు చెల్లించాలి, ప్రభుత్వమే చెల్లిస్తుందా, జనం గోస మీకు పట్టదా?’’ అని బొత్స నిలదీశారు. వెంకట్రాయ, అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్సీపీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తోడుదొంగలు టీడీపీ-బీజేపీ ఇంకా కలిసే ఉన్నారు: బీజేపీతో తెగదెంపులు చేసుకున్నామని టీడీపీ పైకి చెబుతున్నా వారింకా కలిసే ఉన్నారనడానికి బోలెడు ఉదాహరణలున్నాయని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ‘‘కర్ణాటక ఎన్నికలు అయిపోగానే చంద్రబాబుపై బీజేపీ కేసులు పెడుతుందని, ప్రజలంతా అండగా ఉండాలని టీడీపీ ప్రచారం చేసుకుంది. కర్ణాటక ఎన్నికలు ముగిసి 40 రోజులు కావొస్తోంది. మరి ఆ కేసులేమైనట్లు? ఇది ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయానికి నిదర్శనం కాదా? ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు వంగివంగి దండాలు పెట్టి దాదాపు 10రోజులైంది. దానిపై వివరణలేకపోగా, కేంద్రానికి లేఖలంటూ చంద్రబాబు కొత్త నాటకాలు మొదలుపెట్టారు. పదవీకాలం వారంలో ముగుస్తుందనగా కేంద్ర మంత్రి భర్త.. ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు, మరి టీటీడీ పాలక మండలి సభ్యురాలిగా ఉన్న మహారాష్ట్ర బీజేపీ మంత్రి భార్య రాజీనామా చేయకపోవడానికి గల కారణాలేమిటి? టీడీపీ సర్కార్ అసమర్థత, కమిషన్ల కక్కుర్తి వల్లే కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకాలేదన్నది పచ్చి వాస్తవం. టీడీపీ-బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు రాష్ట్రాన్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లాయి. వీళ్ల డ్రామాలను ప్రజలకు తెలియజెప్పడానికే ఈ నెల 30న అనంతపూర్‌లో వైఎస్సార్సీపీ దీక్ష చేయబోతున్నాం’’ అని బొత్స వివరించారు. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా సాధన దిశగా ప్రజలను సమాయత్తం చేయడంలో భాగంగా వైఎస్సార్సీపీ అన్ని జిల్లాల్లో దీక్షలు చేస్తున్న సంగతి తెలిసిందే. వెంకట్రాయ బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం: కారుమూరి వేలమంది డిపాజిటర్లను మోసం చేసిన వెంకట్రాయ చిట్‌ఫండ్ కంపెనీ ఆస్తులను వేలం వేయనీయకుండా ప్రభుత్వం అడ్డుకోవడం దారుణమని తణుకు నియోజకవర్గం వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చిట్‌ఫండ్ బాధితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నదని వాపోయారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే వెంకట్రాయ ఆస్తుల విక్రయాలను ప్రభుత్వం నిలిపేసిందని.. అగ్రిగోల్డ్ పట్ల ఒక రకంగా, వెంకట్రాయ చిట్ ఫండ్ పట్ల ఇంకో రకంగా వ్యవహరిస్తున్నారని, అనుకూలంగా ఉండే వ్యక్తులను మాత్రమే విచారించి కేసును మూసేయడం కుట్రపూరితంగా జరిగిందేనని ఆరోపించారు. ఈ కుంభకోణంపై తక్షణమే సీబీఐ విచారణ చేసి బాధితులకు న్యాయం చేయాలని కారుమూరి డిమాండ్ చేశారు. బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ నిరంతరాయంగా పోరాడుతుందని తెలిపారు. -
బీజేడీ ఎమ్మెల్యే అరెస్టు
- సీషోర్ చిట్‌ఫండ్ కుంభకోణం కేసు విచారణ భువనేశ్వర్ : ఒడిశాలో ఓ చిట్‌ఫండ్ కుంభ కోణం కేసు విచారణలో భాగంగా అధికార బీజేడీ ఎమ్మెల్యే ప్రవత్ రంజన్ బిస్వాల్‌ను సీబీఐ అరెస్టు చేసింది. కోట్ల రూపాయల సీషోర్ గ్రూప్ చిట్‌ఫండ్ కుంభకోణం కేసును విచారిస్తున్న సీబీఐ సోమవారం సాయంత్రం బిస్వాల్‌ను ప్రశ్నించి అదుపులోకి తీసుకుంది. ఆ తరువాత సీబీఐ కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయన్ని 5 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించింది. -
రోజ్‌వాలీ చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో మరో మలుపు
-
చిట్‌ఫండ్ స్కాంపై ఐదు రాష్ట్రాల్లో సోదాలు
న్యూఢిల్లీ: విశాఖజిల్లాకు చెందిన ఓ చిట్‌ఫండ్ సంస్థ అధినేత ఆస్తులపై సీబీఐ తనిఖీలు నిర్వహించింది. ఐదు రాష్ట్రాల్లో ఆయనకు సంబంధించిన 82 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఆయన ఇంట్లో దాదాపు రూ.50 లక్షల నగదును, ఓ ప్రైవేట్ కంపెనీ డైరెక్టర్ ఇంట్లో రూ.16.80 లక్షల నగదును స్వాధీనం చేసకున్నట్లు వారు వెల్లడించారు. జార్ఖండ్, బిహార్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు ఇళ్లు, కార్యాలయాలు, ఎస్టేట్స్, ఇతర ఆస్తులపై ఆరోపణలు రావడంతో తాము సోదాలు నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది భారీ చిట్ ఫండ్ కుంభకోణమని, ఇందుకు సంబంధించి రెండు కేసులు కూడా నమోదైనట్లు వివరించారు. -
బీజేడీ ఎంపీ రామచంద్ర అరెస్ట్
న్యూఢిల్లీ: ఒడిశా ఛిట్ ఫండ్ కేసులో బీజేడీ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు రామచంద్ర హన్సడాహ్ ను సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలను సీబీఐ అదుపులోకి తీసుకుంది. బీజేపీ మాజీ ఎమ్మెల్యే హితేష్ కుమార్ బగర్టీ, బీజేడీ మాజీ ఎమ్మెల్యే సుబర్న నాయక్ అరెస్టయిన వారిలో ఉన్నారు. నవ దిగంత గ్రూపు నుంచి నిధులను అక్రమంగా మళ్లించినట్టు వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పశ్చిమ బెంగాల్ లో శారదా ఛిట్ ఫండ్ కుంభకోణం కేసులో పలువురు రాజకీయ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.