17న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమన్వయ కమిటీ భేటీ | Seemandhra Congress Leaders Coordinating meeting on october 17th, says minister Sailajanath | Sakshi
Sakshi News home page

17న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమన్వయ కమిటీ భేటీ

Published Tue, Oct 15 2013 2:40 PM | Last Updated on Fri, Sep 1 2017 11:40 PM

17న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమన్వయ కమిటీ భేటీ

17న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమన్వయ కమిటీ భేటీ

సమైక్యాంధ్ర ఎజెండా నుంచి కొందరు సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు జారిపోవచ్చని రాష్ట్ర మంత్రి ఎస్.శైలజానాథ్ అభిప్రాయపడ్డారు. అలా సీమాంధ్ర నేతలు జారి పోయిన మిగిలిన వారితో కలసి సమైక్య పోరు కొనసాగిస్తామని ఆయన మంగళవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. 

 

ఈ నెల 17న సీమాంధ్ర కాంగ్రెస్ నేతల సమన్యయ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సమైక్యాంధ్ర కోసం కేంద్రంపై అనుసరించాల్సిన వ్యూహంపై ఆ సమావేశంలో చర్చిస్తామని శైలజానాథ్ పేర్కొన్నారు. విభజనపై ఏర్పాటు అయిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ( జీఓఎం)పై తమకు నమ్మకం లేదని శైలజానాథ్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement