ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన సమైక్య దీక్షకు అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున మద్దతు లభిస్తుంది. జగన్ దీక్షకు సంఘీభావంగా కళ్యాణదుర్గంలో ఎల్ఎమ్ మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష మంగళవారం నాలుగోరోజుకు చేరుకుంది.
అలాగే ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో దీక్షలు కొనసాగుతున్నాయి. వీటితోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త వై.వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లాలోని కదిరి, ఒడిసి తదితర ప్రాంతాల్లో వైఎస్ జగన్ అభిమానులు దీక్షలు చేపట్టారు.