
'పారిపోయినవారు పిరికి పందలు'
అనంతపురం : రాష్ట్ర విభజన దురదృష్టకరమని మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. ఆయన శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ విభజన వల్ల అనంతపురం ఎక్కువగా నష్టపోయిందని తెలిపారు. కష్టాలు వచ్చినప్పుడు పారిపోయినవారు పిరికిపందలు అని రఘువీరా వ్యాఖ్యానించారు.
తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని ఆయన తెలిపారు. సీమాంధ్రకు కేటాయించిన ప్రత్యేక ప్యాకేజీలో అనంతపురంకు నిధులు ఎక్కువగా కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటికైనా జిల్లా అభివృద్ధి కోసం అన్ని రాజకీయ పార్టీలు కలిసి కృషి చేయాలని రఘువీరా పిలుపునిచ్చారు.