కాంగ్రెస్ పతనానికి రఘువీరా యత్నం | Anantapur District Mahila congress president Devamma slams raghuveera reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పతనానికి రఘువీరా యత్నం

Published Tue, Jul 1 2014 10:18 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్ పతనానికి రఘువీరా యత్నం - Sakshi

కాంగ్రెస్ పతనానికి రఘువీరా యత్నం

అనంతపురం : ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని పతనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు దేవమ్మ ఆరోపించారు. పార్టీలో సీనియర్, ద్వితీయ శ్రేణి నాయకులను ఆయన కలుపుకుని పోవటం లేదని విమర్శించారు. గ్రూపు రాజకీయాలు పెంచి పోషిస్తున్న రఘువీరారెడ్డి తీరుపై ఏఐసీసీకి లేఖ రాశానని దేవమ్మ తెలిపారు. గడిచిన ఎన్నికల్లో జిల్లాలో సీనియర్లను కాదని కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనివారికి టికెట్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు పొందినవారికి ఎన్నికల్లో సహకరించకుండా గాలి కొదిలేశారని ఆరోపించారు.

టికెట్ ఇచ్చి తమపై బండ వేశారని పలువురు అభ్యర్థులు తనతో వాపోయారని దేవమ్మ తెలిపారు. ఎన్నికల సమయంలో రఘువీరారెడ్డి కాంగ్రెస్ నాయకులను అవమానించేలా మాట్లాడారన్నారు. ఈ విషయాన్ని విజయవాడ వేదికపై తాను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చానని ఆమో గుర్తు చేశారు. ఆయన నిర్వాకాల గురించి మాట్లాడితే గ్రూపులు అంటగడతారని, బెదిరింపులకు దిగుతారని ఆరోపించారు. ఇప్పటికైనా రఘువీరారెడ్డి తన తీరు మార్చుకుని పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement