devamma
-
ప్రతి ఇంటా.. గ్రామ దేవత పేరే
బాల్కొండ: ఆ గ్రామ ఆరాధ్య దైవం దేవమ్మ.. ఆ దైవం పేరు లేకుండా గ్రామంలోని ఏ కుటుంబంలోని వ్యక్తుల పేర్లు ఉండవు.. అదే బాల్కొండ మండలం వన్నెల్(బి) గ్రామం. ఆ గ్రామ జనాభా సుమారు 5,172 మంది ఉంటారు. 600పై చిలుకు కుటుంబాలు నివసిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో వన్నెల్(బి) ఎంతో అభివృద్ధి బాటలో ఉంది. రాజకీయంగా కూడా ఎంతో చైతన్యం గల గ్రామం. ఆ గ్రామం దేవెంద్రుల పల్లెగా చెప్పుకోవచ్చు. ఆ గ్రామ ఆరాధ్య దైవం దేవమ్మ పేరుతో ప్రతి కుటుంబంలో ఒకరి పేరు కచ్చితంగా ఉంటుంది. మగవారికి దేవేందర్, దేవన్న, ఆడవారికి దేవమ్మ, దేవాయి పేర్లు ఉంటాయి. ఈ తరం పిల్లలకు కూడా ముందుగా ఆ పేరుతో నామకరణం చేసిన తరువాతనే ఇతర పేర్లు పెట్టుకుంటున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ గ్రామంలో అందరూ దేవేందర్‌లు ఉండడం వలన ఇంటి పేరు తప్పని సరిగా వాడాల్సి వస్తుంది. దీంతో అధికంగా పూర్తి పేరుకు బదులు ఇంటి పేర్లతో ఎక్కువ మందిని పిలుచుకుంటారు. లేదంటే అందరు దేవేందర్‌లు ఉండడంతో ఏ దేవేందర్ ఏంటో తెలియదంటారు. దేవమ్మ ఆ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం కావడంతో గ్రామ శివారులో ఆలయం నిర్మించారు. రెండు ఎకరాల కంటే ఎక్కువ భూమిలో చెట్లను పెంచారు. ఆలయాన్ని అభివృద్ధి చేసి ప్రతి సంవత్సరం జూన్ మాసంలో పెద్ద ఎత్తుగా దేవమ్మ పండుగను నిర్వహించుకుంటారు. ప్రతి శుక్రవారం దేవమ్మకు పూజలు నిర్వహిస్తారు. దేవమ్మ కరుణతో అందరం చల్లగా ఉన్నామని ఆ గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లో పేరు ఉంటుంది వన్నెల్(బి) గ్రామంలో ప్రతి ఇంట్లో దేవమ్మ పేరుతో గల దేవేందర్, దేవన్న, లాంటి పేర్లు తప్పకుండా ఉంటాయి. ఇప్పటి పిల్లలకు కూడా మొదట ఆ పేరుతో పేరు పెట్టాకే వేరే పేర్లతో పిలుచుకుంటాం. దేవమ్మ కరుణతో గ్రామస్తులందరం చల్లగా ఉంటున్నాం. – ఏనుగు దేవేందర్, గ్రామస్తుడు మా ఆరాధ్య దైవం.. దేవమ్మ మా గ్రామస్తుల ఆరాధ్య దైవం కావడంతో అందరి ఇళ్లలో అమ్మ వారి పేరుతో పేర్లు పెంటుకుంటాం. ప్రతి సంవత్సరం ఘనంగా దేవమ్మ ఉత్సవాలు నిర్వహించుకుంటాం. అందరివి ఒకే పేర్లు కావడంతో ఇంటి పేర్లు తప్ప కుండా వాడుతాం. – రెంజర్ల దేవేందర్, గ్రామస్తుడు -
కుమారుడి పెళ్లి చూడకుండానే..
కొలిమిగుండ్ల: మరికొన్ని గంటల్లో ఆ ఇంట పెళ్లి బాజాలు మోగాల్సి ఉంది. ఈ వేడుక కోసం బంధువులంతా తరలిరావడంతో సందడి నెలకొంది. మరో వైపు వధువు తరఫు వారు వరుడి ఇంటికి బయలుదేరారు. వరుడి కుటుంబ సభ్యులంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇంతలో వరుడి తల్లి గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం రాఘవరాజుపల్లెలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బూసిగారి కంబయ్య, దేవమ్మ(45) దంపతులకు ముగ్గురు కుమారులున్నారు. చివరి కుమారుడు లక్ష్మణుడికి వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియం మండలం ఎస్. ఉప్పలపాడుకు చెందిన యువతితో వివాహం కుదిరింది. శనివారం ఉదయం 8 గంటలకు వరుడి స్వగృహంలోనే పెళ్లి తంతు జరగాల్సి ఉంది. సంప్రదాయం ప్రకారం పెళ్లి కొడుకును చేశాక బంధువులందరితో కలసి గ్రామంలోని దేవాలయాల్లో టెంకాయలు కొట్టేం దుకు మేళతాళాలతో బయలు దేరి వెళ్లారు. ఇంటి వద్దే ఉన్న దేవమ్మ ఒక్క సారిగా గుండె పోటు రావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. అంతవరకూ ఉత్సాహంగా గడిపిన ఆమె ఇక లేదని తెలియడంతో కుటుంబ సభ్యులు, బం«ధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. -
వడదెబ్బతో ఇద్దరు కూలీల మృతి
సూర్యుడు రోజురోజుకూ తన ప్రతాపాన్ని చూయిస్తున్నాడు. బుధవారం ఎండవేడికి తాళలేక వడదెబ్బతో ఇద్దరు ఉపాధిహామీ కూలీలు మృతిచెందారు. కర్నూలు జిల్లా హోలగుండ మండలం వందవాగిలి గ్రామంలో దేవమ్మ(35) అనే కూలీ మృతిచెందగా..మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ మండలం జూకల్కు గ్రామంలో మాగయ్య(55) అనే కూలీ వడదెబ్బతో చనిపోయారు. -
స్నాచర్ చేతిలో గొలుసును తిరిగి లాక్కుంది
చైతన్యపురి (హైదరాబాద్): బైకుపై వచ్చిన దుండగులు మెడలో గొలుసు లాగేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించి, తన చైన్‌ను లాక్కుని కాపాడుకుంది ఓ మహిళ. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై గురువారం ఈ సంఘటన జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. శారదానగర్‌లో నివసించే దేవమ్మ (43) ఇళ్లలో పనిచేస్తుంటుంది. గురువారం మధ్యాహ్నం కూతురు ఆరోగ్యతో కలిసి సరూర్‌నగర్ కట్టపై వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకుల్లో ఒకడు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాగాడు. తెగిన గొలుసు అతని చేతుల్లో ఉండగానే వెంటనే దేవమ్మ తేరుకుంది. స్నాచర్‌ను గట్టిగా ప్రతిఘటించి తన గొలుసును తిరిగి లాగేసుకుంది. ఆపై ఆమె గట్టిగా కేకలు వేయటంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. -
‘కాంగ్రెస్ నాశనానికి రఘువీరానే కారణం’
అనంతపురం అర్బన్ : నవ్యంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం కావడానికి పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డే కారణమని ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవమ్మ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నాశనం కావడానికి గల కారణాలు, పీసీసీ చీఫ్ పనితీరుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాకు ఈ నెల 20న ఢిల్లీలో నివేదిక సమర్పించినట్లు చెప్పారు. రఘువీరారెడ్డి నాలుగు స్తంభాల ఆట ఆడుతున్నాడని ఆమె విమర్శించారు. జిల్లాలో ఓవైపు పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీతతో, మరోవైపు బీజేపీ నాయకులతో, వైఎస్సార్సీపీ నాయకులతో, ఇటు కాంగ్రెస్ నాయకులతో తనకున్న పరిచయాలను వ్యాపార లావాదేవీలుగా మార్చి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కంకణం కట్టుకున్నాడని రఘువీరాపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో పరిటాల సునీత ఆదేశాల మేరకు కాంగ్రెస్ అభ్యర్థులకు కొన్ని చోట్ల శాసనసభ, పార్లమెంటు సీట్లు కేటాయించడం గమనిస్తే ఆయన రాజకీయ నాటకం ఏంటో స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ఒకప్పుడు జగన్‌ను కాబోయే ముఖ్యమంత్రిని చేస్తామని నమ్మబలికిన రఘువీరా ఇప్పుడు టీడీపీ వారితో చేయి కలిపి జగన్‌పై కేసులు బలపరిచేందుకు కుట్రపన్నుతున్నాడని విమర్శించారు. అలాగే జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యం తన నియంతృత్వ ధోరణి అవలంభిస్తూ మహిళా కాంగ్రెస్‌ను చిన్న చూపు చూస్తునారన్నారు. ఈ విషయాలపై సమగ్రంగా సోనియా గాంధీకి నివేదిక ఇచ్చినట్లు చెప్పారు. సోనియా పిలుపు మేరకు రాష్ట్రంలో మహిళ కాంగ్రెస్ కమిటీ పనిచేసి పార్టీని పటిష్టం చేస్తామని ఆమె తెలిపారు. -
కాంగ్రెస్ పతనానికి రఘువీరా యత్నం
అనంతపురం : ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీని పతనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు దేవమ్మ ఆరోపించారు. పార్టీలో సీనియర్, ద్వితీయ శ్రేణి నాయకులను ఆయన కలుపుకుని పోవటం లేదని విమర్శించారు. గ్రూపు రాజకీయాలు పెంచి పోషిస్తున్న రఘువీరారెడ్డి తీరుపై ఏఐసీసీకి లేఖ రాశానని దేవమ్మ తెలిపారు. గడిచిన ఎన్నికల్లో జిల్లాలో సీనియర్లను కాదని కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనివారికి టికెట్లు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు పొందినవారికి ఎన్నికల్లో సహకరించకుండా గాలి కొదిలేశారని ఆరోపించారు. టికెట్ ఇచ్చి తమపై బండ వేశారని పలువురు అభ్యర్థులు తనతో వాపోయారని దేవమ్మ తెలిపారు. ఎన్నికల సమయంలో రఘువీరారెడ్డి కాంగ్రెస్ నాయకులను అవమానించేలా మాట్లాడారన్నారు. ఈ విషయాన్ని విజయవాడ వేదికపై తాను అధిష్టానం దృష్టికి తీసుకొచ్చానని ఆమో గుర్తు చేశారు. ఆయన నిర్వాకాల గురించి మాట్లాడితే గ్రూపులు అంటగడతారని, బెదిరింపులకు దిగుతారని ఆరోపించారు. ఇప్పటికైనా రఘువీరారెడ్డి తన తీరు మార్చుకుని పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు.