స్నాచర్ చేతిలో గొలుసును తిరిగి లాక్కుంది | woman pull her chain from chain snacher | Sakshi
Sakshi News home page

స్నాచర్ చేతిలో గొలుసును తిరిగి లాక్కుంది

Published Thu, Sep 3 2015 9:30 PM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

స్నాచర్ చేతిలో గొలుసును తిరిగి లాక్కుంది - Sakshi

స్నాచర్ చేతిలో గొలుసును తిరిగి లాక్కుంది

చైతన్యపురి (హైదరాబాద్): బైకుపై వచ్చిన దుండగులు మెడలో గొలుసు లాగేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించి, తన చైన్‌ను లాక్కుని కాపాడుకుంది ఓ మహిళ. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై గురువారం ఈ సంఘటన జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. శారదానగర్‌లో నివసించే దేవమ్మ (43) ఇళ్లలో పనిచేస్తుంటుంది.

గురువారం మధ్యాహ్నం కూతురు ఆరోగ్యతో కలిసి సరూర్‌నగర్ కట్టపై వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకుల్లో ఒకడు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాగాడు. తెగిన గొలుసు అతని చేతుల్లో ఉండగానే వెంటనే దేవమ్మ తేరుకుంది. స్నాచర్‌ను గట్టిగా ప్రతిఘటించి తన గొలుసును తిరిగి లాగేసుకుంది. ఆపై ఆమె గట్టిగా కేకలు వేయటంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement