chain snacher
-
రోడ్డుపై నుంచి ఫాలో.. మహిళ ఇంట్లోకి వెళ్లగానే చొరబడి
మైసూరు(బెంగళూరు): మహిళలు రోడ్డు మీద వెళ్తుంటే ఫాలో చేసి అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లగానే.. తాను కూడా చొరబడి మహిళ తలపై రాడ్ కొట్టి తాళి చైన్‌ను లాక్కెళ్లాడో దుండగుడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణం చామలాపుర హుండిలో జరిగింది. వివరాలు.. ప్రైవేటు ఉద్యోగి రవికుమార్ భార్య సవిత (40) సోమవారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఇనుప రాడ్‌తో తలపై గట్టిగా కొట్టి ఆమె మెడలో ఉన్న మాంగళ్యం చైన్‌ను లాక్కొని పారిపోయాడు. మహిళ అరుపులు విని చుట్టుపక్కలవారు వచ్చేసరికి ఆగంకుతుడు పరారయ్యాడు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. నంజనగూడు పోలీసులు పరిశీలించి దుండగుని కోసం గాలింపు చేపట్టారు. చదవండి Video: లంచం తీసుకుంటూ పట్టుబడి.. కరెన్సీని కసాబిసా నమిలి మింగేశాడు -
మరోసారి తెరపైకి సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ పేరు
సాక్షి, హైదరాబాద్: సీరియల్ స్నాచర్ ఉమేష్ ఖతిక్ పేరు మరోసారి తెరమీదికి వచ్చింది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండల్లో అయిదు స్నాచింగ్స్ సహా ఎనిమిది నేరాలు చేశాడు. ఇది జరిగిన రెండు రోజులకే అహ్మదాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. అనారోగ్యమంటూ ఆస్పత్రిలో చేరి కస్టడీ నుంచి పరారయ్యాడు. ఉమేష్ కోసం ముమ్మరంగా గాలించిన అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ గత నెల ఆఖరి వారంలో అరెస్టు చేసింది. ఈ నెల 5న బెంగళూరు పోలీసులు పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లారు. సిటీలో నమోదైన నేరాలకు సంబంధించిన ఇక్కడకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నగరంలో మొత్తం ఏడు నేరాలు... ఉమేష్ స్వస్థలం రాజస్థాన్‌లోని పాలి జిల్లా ఛనోడ్. జనవరి 18న నగరానికి వచ్చి నాంపల్లిలోని హోటల్ ది మెజిస్టిక్‌లో బస చేశాడు. ఆ రోజే మెహదీపట్నం వెళ్లి జిర్రా రోడ్డులో యాక్టివా వాహనం చోరీ చేసుకువచ్చాడు. మరుసటి రోజు ఉదయం ఆల్వాల్ నుంచి మేడిపల్లి వరకు నేరాలు చేశాడు. అయిదు స్నాచింగులకు పాల్పడి.. మరో రెండు చోట్ల యత్నించాడు. మొత్తమ్మీద 18.5 తులాల బంగారం కొట్టేసి పరారయ్యాడు. సంబంధిత వార్త: సీరియల్ స్నాచర్ ఖతిక్ కేసులో మరో ట్విస్ట్ ఇతడిని హైదరాబాద్ పోలీసులు 24 గంటల్లోనే గుర్తించారు. అహ్మదాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడి అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పోలీసులు ఉమేష్‌ను అరెస్టు చేయడంతో పాటు 18.5 తులాలను రికవరీ చేసి తమ కేసుల ఖాతాలో వేసేసుకున్నారు. హైదరాబాద్‌లో నేరాలు చేస్తున్నట్లు చూపిస్తూనే.. ఒక నేరంలో తస్కరించిన గోలుసు మరో స్నాచింగ్ చేస్తున్నప్పుడు పడిపోయినట్లు రికార్డు చేశారు. ఆస్పత్రి నుంచి పరారీ అంటూ... ఈ వ్యవహారం ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడంతో అహ్మదాబాద్ పోలీసులతో మాట్లాడారు. ఇది జరిగిన కొన్ని రోజులకు మరో ఉమేష్ వ్యవహారంలో మరో ట్విస్ట్ వచ్చింది. గతంలోనే ఉమేష్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఇతడికి అరెస్టు ప్రకటించిన వడాజ్ పోలీసులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. విచారిస్తున్నప్పుడు ఫిట్స్ వచ్చిపడిపోయాడని, అందుకే అహ్మదాబాద్‌లో శారదబెన్ ఆస్పత్రికి తరలించామని చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ ఎస్కార్ట్ పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడంటూ ట్విస్ట్ ఇచ్చారు. ఉమేష్ కథకు తాత్కాలిక విరామం వచ్చింది. బంగారం అప్పగించారు.. ఉమేష్ ఖతిక్ నగరంలో కొట్టేసిన బంగారాన్ని కాజేసిన గుజరాత్ పోలీసులు ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికే ఎస్కేప్ ఎపిసోడ్ ప్లాన్ చేశారని విమర్శలు వెలువడ్డాయి. ఈ క్రమంలో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత నెల ఆఖరి వారంలో అతడిని రాజస్థాన్‌లో పట్టుకున్నట్లు ప్రకటిస్తూ అక్కడి నరోల్ పోలీసులకు అప్పగించారు. ఉమేష్ అరెస్టుపై ఇక్కడి పోలీసులకు కాకుండా బెంగళూరు అధికారులకు సమాచారం ఇచ్చారు. చదవండి: Chain Snatcher: ఉమేష్ ఖతిక్‌ను ఇచ్చేదేలే గతేడాది డిసెంబర్ 26న జరిగిన ఈ స్నాచింగ్స్‌కు సంబంధించి రూ.4 లక్షల విలువైన బంగారాన్నీ రికవరీ చేసినట్లు అహ్మదాబాద్ పోలీసులకు చెప్పారు. దీంతో పీటీ వారెంట్ తీసుకువెళ్లిన బెంగళూరు పోలీసులు ఈ నెల 5న తీసుకువెళ్లారు. డిసెంబర్ నాటి కేసుల్లో ఆ పోలీసులకు రూ.4 లక్షల బంగారం అప్పగించిన అహ్మదాబాద్ పోలీసులు జనవరిలో నగరంలో జరిగిన నేరాలకు సంబంధించిన సొత్తుపై మాత్రం నోరు విప్పట్లేదు. -
భార్య ఆనందం కోసం రాజస్థాన్ నుంచి బెంగళూరుకు వచ్చి..
బనశంకరి(బెంగళూరు): ప్రేమ వివాహం చేసుకున్న భార్యను సంతోష పెట్టడం కోసం ఓ ఘనుడు రాజస్థాన్ నుంచి బెంగళూరుకు విమానంలో వచ్చి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతూ సోమవారం చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీసులకు చిక్కాడు. నిందితుడు ఉమేశ్ ఖతిక్ నుంచి రూ. 4 లక్షల విలువైన బంగారు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. వివరాలు... విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఉమేశ్ చైన్ స్నాచింగ్‌లకు పాల్పడేవాడు. ఇటీవల మారతహళ్లి, పుట్టేనహళ్లి, చెన్నమ్మకెరె అచ్చుకట్టు పరిధిలో మూడు స్నాచింగ్‌లు జరిగాయి. దీంతో పోలీసులకు నిద్రలేకుండా పోయింది. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం సోమవారం ఉమేశ్‌ను అరెస్ట్ చేశారు. ఇతడిపై రాజస్థాన్‌లో 18, హైదరాబాద్‌లో 7, బెంగళూరులో 7 చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయి. బైక్ మీద వెళ్తుండగా గొలుసు చోరీ మైసూరు: బైక్ మీద భర్తతో కలిసి వెళ్తున్న మహిళ మెడలో ఉన్న గొలుసును దుండగులు లాక్కెళ్లారు. ఈ ఘటన మైసూరు బోగాది రెండో స్టేజిలోని ప్రశాంత్ నగర్లో సోమవారం జరిగింది. అర్చన అనే మహిళ భర్తతో కలిసి బైక్‌పై వెళ్తోంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మరో బైక్‌పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును తెంచుకెళ్లారు. గొలుసు 55 గ్రాములు ఉన్నట్లు బాధితురాలు సరస్వతిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
నేనే దొంగ.. నేనే పోలీస్
సాక్షి,కైకలూరు(పశ్చిమ గోదావరి): ప్రజలను రక్షించాల్సిన ఆ కానిస్టేబుల్ చైన్ స్నాచర్ అవతారమెత్తాడు. కైకలూరులో మహిళ మెడలో గొలుసు తెంచి పారిపోతుండగా అతన్ని పోలీసులు పట్టుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి పోలీసు స్టేషన్లో సింగిడి సత్యనారాయణ 2008 నుంచి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతని సొంతూరు గణపవరం సమీపంలోని అప్పనపేట. సత్యనారాయణ ఇటీవల క్రికెట్ బెట్టింగులు, ఆన్లైన్ పేకాటలో అప్పుల పాలయ్యాడు. సత్యనారాయణ వాలీబాల్ ఆడుతుంటాడు. ఈ క్రమంలో ఉండి సమీపంలోని ఉప్పులూరుకు చెందిన బుద్దాల సుభాష్(21)తో పరిచయమైంది. ఇద్దరూ కలిసి మంగళవారం రాత్రి కైకలూరుకు కేటీఎం స్పోర్ట్స్ మోటారు బైక్‌పై వచ్చారు. సంతమార్కెట్ వద్ద గూడూరి వెంకట వరప్రసాద్ పచారీ దుకాణానికి వెళ్లారు. అతను కౌంటర్లో ఉండగా భార్య లోపల సరుకుల వద్ద ఉంది. సత్యనారాయణ జీడిపప్పు కావాలని ఆమెను అడిగాడు. ఆమె వెనక్కి తిరగగానే మెడలో 4 కాసుల బంగారు గొలుసు తెంచుకుని బయటకు వచ్చాడు. అప్పటికే బైక్‌పై సిద్ధంగా ఉన్న సుభాష్‌తో కలిసి ఏలూరురోడ్ వైపు పరారయ్యాడు. ప్రజలు వెంబడించగా సత్యనారాయణ తప్పించుకున్నాడు. సుభాష్ దొరకగా.. కైకలూరు స్టేషన్‌కు తరలించారు. అతని చెప్పిన సమాచారంతో సత్యనారాయణను ఆటపాకలో బుధవారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ.1,20,000 విలువ చేసే గొలుసు, చాకు, పెప్పర్ స్ప్రే బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కైకలూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: మేనేజర్ రోజూ ఏదో ఒక వంకతో మా దగ్గరకు వచ్చి.. -
ఐదున్నర గంటలు..6 నేరాలు.. వీడు మామూలోడు కాదురోయ్!
సాక్షి,హైదరాబాద్: నగరంలో తొలిసారి ఓ చైన్ స్నాచర్ ఒంటరిగా వరసపెట్టి పంజా విసిరాడు. బుధవారం సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఆరు నేరాలు చేశాడు. ఐదు చోట్ల గొలుసు లు అతడికి చిక్కగా.. మరో ప్రాంతంలో ప్రయత్నం ఫలించలేదు. పేట్‌బషీరాబాద్, మారేడ్‌పల్లి, తుకారాంగేట్, మేడిపల్లి ఠాణాల పరిధిలో ఐదున్నర గంటల వ్యవధిలోనే ఈ ఉదంతాలు చోటుచేసుకున్నాయి. జర్కిన్ వేసుకున్న యువకుడు తలకు టోపీ, ముఖానికి మాస్క్ ధరించి.. యాక్టివా వాహనంపై సంచరిస్తూ ఈ నేరాలు చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితుడి కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఆధారాలతో ముందుకెళ్తున్నాయి. నిందితుడు వినియోగించిన యాక్టివా వాహనం మంగళవారం మధ్యాహ్నం ఆసిఫ్‌నగర్ పరిధిలోని జిర్రా రోడ్డులో చోరీకి గురైనట్లు గుర్తించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. తుకారాం గేట్ పీఎస్ పరిధిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుడు సుదీర్ఘ కాలం తర్వాత.. మహా నగరం ఒకప్పుడు వరుస స్నాచింగులతో బెంబేలెత్తిపోయేది. స్నాచర్ల బారినపడి ప్రాణాలు కోల్పోయిన వాళ్లూ ఉన్నారు. 2014 తర్వాత పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. ఆ తర్వాత కూడా వరుస ఉదంతాలు లేకపోయినా.. అడపాదడపా స్నాచర్లు పంజా విసురుతూనే ఉన్నారు. 2018 డిసెంబర్లో ఆఖరుసారిగా వరుస స్నాచింగ్స్ చోటుచేసుకున్నాయి. ఆ నెల చివరి వారంలో ఉత్తరప్రదేశ్‌లోని బవారియా నుంచి వచ్చిన గ్యాంగ్ కేవలం రెండు రోజుల వ్యవధిలో రాచకొండ పరిధిలోని 9 ప్రాంతాల్లో పంజా విసిరింది. ఈ గ్యాంగ్‌ను వారం రోజుల్లోనే హైదరాబాద్ దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత గడిచిన రెండేళ్లల్లో ఈ తరహాలో వరుస ఉదంతాలు చోటుచేసుకోలేదు. అదను చూసుకుని పంజా.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో గడిచిన కొన్నాళ్లుగా హడావుడి నెలకొంది. కరోనా థర్డ్‌వేవ్ ప్రారంభమవుతున్న పరిస్థితుల్లో న్యూ ఇయర్ వేడుకలు, ఆ తర్వాత వచ్చిన సంక్రాంతి పండగ నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తంగా వ్యవహరించింది. సాధ్యమైనంత వరకు నేరాలు జరగకుండా వ్యూహాత్మకంగా గస్తీ నిర్వహించింది. గడిచిన కొన్ని రోజుల్లో మూడు కమిషనరేట్లలోని పోలీసుల్లో అనేక మంది కరోనా బారినపడ్డారు. దాదాపు 800 మందికి పాజిటివ్ రావడంతో ఐసోలేషన్‌కు వెళ్లారు. దీని ప్రభావం పోలీసింగ్‌తో పాటు ఠాణాల నిర్వహణ, గస్తీపై పడింది. ఈ అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న చైన్ స్నాచర్ అదను చూసుకుని, గస్తీ లేని ప్రాంతాల్లో సంచరిస్తూ వరుసగా మూడు కమిషనరేట్ల పరిధిలో పంజా విసిరాడు. తుకారాం గేట్ పీఎస్ పరిధిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుడు 22.3 కి.మీ.. 18.5 తులాలు.. సైబరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీలో ఇతగాడు తన ‘పని’ ప్రారంభించాడు. అక్కడ నుంచి రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్‌నగర్ కాలనీల్లో ‘సంచరిస్తూ’.. హైదరాబాద్ కమిషనరేట్‌లో ప్రవేశించి మారేడుపల్లి ఠాణా పరిధిలోని ఇంద్రపురి రైల్వే కాలనీలో పంజా విసిరాడు. అట్నుంటి తుకారాంగేట్ పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న సమోసా గార్డెన్స్ వద్ద చివరి స్నాచింగ్ చేశాడు. చివరగా రాచకొండ కమిషనరేట్‌లోని మేడిపల్లి పరిధిలో ఉన్న బోడుప్పల్ లక్ష్మినగర్ కాలనీలో పంజా విసిరాడు. బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మొదటి ఉదంతం జరిగితే ఆ ప్రాంతానికి 22.3 కి.మీ దూరంలో సాయంత్రం 4.30 గంటలకు చివరి ఉదంతం చోటుచేసుకుంది. నాలుగు చోట్ల ‘సఫలీకృతుడైన’ స్నాచర్.. మొత్తం 18.5 తులాల బంగారం చేజిక్కించుకున్నాడు. స్నాచర్ కోసం గాలిస్తున్న టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీలకు చెందిన ప్రత్యేక బృందాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాల ఆధారంగా ముందుకు వెళ్తున్నాయి. ‘ముగ్గురూ’ పోటాపోటీగా... మూడు కమిషనరేట్ల పరిధిలో హల్చల్ చేసిన చైన్ స్నాచర్ కోసం పోలీసులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌తో పాటు సైబరాబాద్, రాచకొండలకు చెందిన స్పెషల్ ఆపరేషన్ టీమ్స్ పోటాపోటీగా గాలిస్తున్నాయి. తుకారాంగేట్ తర్వాత అడ్డగుట్ట నుంచి సదరు స్నాచర్ రాచకొండ పరిధిలోకి ప్రవేశించి మేడిపల్లిలో పంజా విసిరాడు. ఈ నేపథ్యంలోనే ఆ అధికారులు గాలింపు చేపట్టారు. బుధవారం రాత్రి వరకు ఆయా ప్రాంతాల్లోని దాదాపు 150 సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించారు. నగర పోలీసు విభాగానికి చెందిన ఓ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘సైబరాబాద్, రాచకొండ పోలీసులతో సమన్వయం ఏర్పాటు చేసుకుని పని చేస్తున్నాం. స్నాచర్‌ను అదుపులోకి తీసుకున్నామంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదు. ఒకటిరెండు రోజుల్లో కచ్చితంగా పట్టుకుంటాం’ అని అన్నారు. ► భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన ఉమారాణి తన ఇంటి ఎదుట నిల్చుని ఉండగా.. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసు తెంచుకుపోయేందుకు ప్రయత్నించాడు. ఆమె వారిస్తూ గట్టిగా అరవడంతో సఫలీకృతుడు కాలేదు. ►రాఘవేంద్ర కాలనీకి చెందిన అనురాధ కూరగాయలు ఖరీదు చేసేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లారు. రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన స్నాచర్ మెడలోని రెండు తులాల బంగారు గొలుసు లాక్కుపోయాడు. ► శ్రీరామ్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో వరలక్ష్మి మెడలో నుంచి నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని బాలానగర్ వైపు పారిపోయాడు. ►మారేడుపల్లి పరిధిలోని సంజీవయ్య నగర్‌కు చెందిన విజయ (55) కుమార్తె ఏఓసీ సెంటర్ సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. విజయ అక్కడ నుంచి సమీపంలోనే ఉన్న తమ బస్తీకి కాలినడకన బయలుదేరింది. ఇంద్రపురి రైల్వే కాలనీ వద్దకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన స్నాచర్ ఆమె మెడలోని 5 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ► తుకారాంగేట్ పరిధిలోని నందనార్ నగర్ సమోసా గార్డెన్స్ వద్ద అద్దె ఇంటికోసం వెతుకుతున్న సాయినగర్‌కు చెందిన రాంబాయి (65) మెడలోంచి రెండు తులాల చైను లాక్కెళ్లాడు. అక్కడ నుంచి అడ్డగుట్ట చౌరస్తా మీదుగా ఉండాయించాడు. ► మేడిపల్లి ఠాణా పరిధిలోని బోడుప్పల్ లక్ష్మినగర్ కాలనీకి చెందిన కట్ట అంజమ్మ (50) వాకింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వాహనంపై వచ్చిన దుండగుడు ఆమె మెడలో ఉన్న 5 తులాల బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు. దొంగతనం జరిగిందిలా.. ► ఉదయం 11గం.. భాగ్యలక్ష్మి కాలనీ ఉమారాణి స్నాచింగ్‌కు యత్నం ►ఉదయం 11:10 గం.. రాఘవేంద్ర కాలనీ అనురాధ, 2 తులాలు ►ఉదయం 11:20 గం.. శ్రీరాంనగర్ కాలనీ వరలక్ష్మి, 4 తులాలు ►మధ్యాహ్నం 12:30 గం.. ఇంద్రపురి రైల్వే కాలనీ విజయ, 5 తులాలు ►మధ్యాహ్నం 12:55 గం.. సమోసా గార్డెన్స్ రాంబాయి, 2.5 తులాలు ►సాయంత్రం 4:30గం.. లక్ష్మీనగర్ కాలనీ అంజమ్మ, 5 తులాలు -
ఎన్కౌంటర్లో చైన్ స్నాచర్ హతం
సాక్షి, చెన్నై: కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు సమీపంలోని అటవీ ప్రాంతంలో సోమవారం ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఓ చైన్ స్నాచర్ హతమయ్యాడు. మరో స్నాచర్‌ను అరెస్టు చేశారు. కాంచీపురం జిల్లా పెన్నలూరుకు చెందిన ఇందిర అనే వృద్ధురాలి వద్ద ఆదివారం ఇద్దరు యువకులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. టోల్గేట్ వద్ద వారిని అడ్డుకునేందుకు అక్కడి దుకాణదారులు ప్రయత్నించగా, ఆ యువకులు తుపాకీతో బెదిరించి తప్పించుకున్నారు. శ్రీ పెరంబదూరు పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు. ఎదురుకాల్పుల్లో హతం సోమవారం నిందితులు మేవలూరు కుప్పం వైపుగా వెళ్తున్నారనే సమాచారంతో పెరంబదూరు స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మోహన్ రాజ్‌తో పాటుగా మరికొందరు ఛేజ్æ చేశారు. ఈ సమయంలో ఆ స్నాచర్లలో ఒకడు పోలీసులకు చిక్కాడు. దీంతో ఆగ్రహించిన మరొకడు తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మోహన్‌రాజ్ గాయపడ్డారు. అనంతరం తేరుకుని ఎదురు కాల్పులు జరిపాడు. దీంతో ఆ యువకుడు అక్కడిక్కడే నేలకొరిగాడు. సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఘటనా స్థలంలో ఉన్న నిందితుడి తుపాకీతో పాటుగా మరో రెండు కత్తుల్ని స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని శ్రీ పెరంబదూరు ఆస్పత్రి మార్చురికి తరలించారు. ఈ ఘటనపై మేజిస్ట్రేట్ విచారణ జరుగుతోంది. జార్కండ్ వాసులుగా గుర్తింపు విచారణలో నిందితులిద్దరూ జార్కండ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఎన్కౌంటర్లో హతమైన యువ కుడి పేరు ముర్తుజాగా, పట్టుబడ్డ యువకుడు నయూ మ్ అక్తర్‌గా తేలింది. మరికొందరు చైన్ స్నాచర్లు కార్మికుల రూపంలో ఉండే అవకాశం ఉండడంతో పోలీసులు ఉత్తరాది వారిపై గురి పెట్టారు. -
ప్రైవేటు కంపెనీలో మేనేజర్.. లాక్డౌన్ దెబ్బకి దొంగగా మారాడు
బెంగళూరు: లాక్డౌన్ కారణంగా ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో కొందరు ఉపాధి లేక కూలి పనులు చేసుకోగా, మరికొందరు వారి చదువు కన్నా తక్కువ స్థాయి పని చేస్తూ రోజులు గడుపుతున్నారు, ఇంకొందరు ఉద్యోగ సమయంలో చేసిన అప్పులు తీర్చలేక అడ్డదారులు తొక్కుతున్నారు. అలా ఓ ఎంబీఏ చదివిన యువకుడి ఉన్న ఉద్యోగం పోవడంతో దొంగగా మారి కటకటలా పాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని బనశంకరిలో చోటు చేసుకుంది. అతడు ఎంబీఏ చదివి ప్రైవేటు కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. మంచి ఉద్యోగం చూస్తూ కాలం గడుపుతున్న ఆ యువకుడికి కరోనా దెబ్బతో కష్టాలు మొదలయ్యాయి. దీంతో చైన్‌స్నాచర్ అవతారం ఎత్తాడు. జయనగర పూర్ణిమా కన్వెన్షన్ హాల్ నుంచి వస్తున్న మహిళ మెడలో బంగారుచైన్ లాక్కుని పారిపోయిన షేక్ గౌస్ అనే చోరున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రశ్నించగా తన దయనీయ గాథ చెప్పాడు. సార్ నేను ఎంబీఏ పూర్తి చేశా. కరోనా లాక్డౌన్ వల్ల నన్ను ఉద్యోగం నుంచి తీసేశారు. రూ.35 వేల అప్పు ఉంది. అప్పుల వాళ్ల వేధింపులు తీవ్రమయ్యాయి. వేరే ఉద్యోగాలేవీ దొరకలేదు. దీంతో చైన్‌స్నాచింగ్ చేశానని చెప్పాడు. -
ఈసారి చెన్నై పోలీసులకు..
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు అమోల్.. మహారాష్ట్రకు చెందిన ఇతగాడు జల్సాలకు అలవాడుపడి నేరగాడిగా మారాడు.. కుడిచేత్తో బైక్ నడుపుతూ ఎడమ చేత్తో స్నాచింగ్ చేస్తాడు.. దక్షిణాదిలో బంగారం ఎక్కువనే ఉద్దేశంతో ఈ వైపునకు వచ్చాడు.. సైబరాబాద్‌లో 17 నేరాలు చేసి 2018లో పోలీసులు చిక్కాడు.. తాజాగా హైదరాబాద్‌లో చోరీ చేసిన బైక్ వాడి చెన్నైలో నాలుగు నేరాలు చేశాడు.. ఇక్కడి పోలీసుల సహకరారంతో అక్కడి పోలీసులు అమోల్‌ను ఇటీవల అరెస్టు చేశారు. జల్సాల కోసం నేరబాట.. మహారాష్ట్రలోని పర్భనీ జిల్లా యశ్వంత్‌నగర్‌కు చెందిన అమోల్ బాబాసాహెబ్ షిండే కుటుంబం పెద్దదే. పెద్దగా చదువుకోని ఇతగాడు బతుకుతెరువు కోసం డ్రైవర్‌గా మారాడు. ఈ వృత్తిలో వస్తున్న ఆదాయం కుటుంబ పోషణ, తన జల్సాలకు సరిపోకపోవడంతో నేరాల బాటపట్టాడు. సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చైన్ స్నాచర్‌గా మారాడు. 2013లో అక్కడి పర్భనీ జిల్లాలో గొలుసు దొంగతనానికి పాల్పడి తొలిసారిగా జైలుకు వెళ్లాడు. ఆ తర్వాతి ఏడాది జైలు నుంచి విడుదలైన ఇతగాడు తన మకాంను ఔరంగాబాద్‌కు మార్చాడు. అక్కడ వరుసగా నాలుగు స్నాచింగ్స్ చేసి అరెస్టు అయ్యాడు. ఈ కేసులో బెయిల్‌పై వచి్చన తర్వాత కొన్నాళ్లు మిన్నకుండిపోయాడు. స్నేహితుడి సలహాతో ఇటు.. అమోల్ 2016లో లాతూర్‌లో షెల్టర్ ఏర్పాటు చేసుకుని సంజయ్ హాకాని యాదవ్ అనే మరో నేరగాడితో కలిసి ముఠా కట్టాడు. అయితే ఏ ఉదంతంలోనూ అతడితో కలిసి నేరం చేయలేదు. సంజయ్‌ను కేవలం ‘సలహాలు–సూచనలకు’ మాత్రమే పరిమితం చేశాడు. మహారాష్ట్రలోని ఏ ప్రాంతంలో స్నాచింగ్ చేసినా.. ఆ గొలుసు కనీసం తులం కూడా ఉండట్లేదని సంజయ్ వద్ద వాపోయాడు. దీంతో దక్షిణాదిలో ఉన్న వాళ్లు.. ప్రధానంగా తెలుగు వాళ్ళు ఎక్కువగా బంగారం ధరిస్తారని అక్కడ స్నాచింగ్స్ చేస్తే ఒక్కో గొలుసు కనీసం మూడు తులాలు ఉంటుందని సలహా ఇచ్చాడు. దీంతో అమోల్ కన్ను 2017 ఈ ప్రాంతంపై కన్నేశాడు. ఆ ఏడాది ఆగస్టులో లాతూర్లోనే ఓ సెకండ్ హ్యాండ్ బైక్ ఖరీదు చేసి దాని పైనే హైదరాబాద్‌కు వచ్చాడు. సిగింల్ హ్యాండ్ స్నాచర్.. ఓ ప్రాంతానికి వచ్చిన తర్వాత లాడ్జిలో బస చేసి, పక్కాగా రెక్కీ నిర్వహించిన తర్వాతనే అమోల్ స్నాచింగ్ చేస్తుంటాడు. దేవాలయాలు, దుకాణాలకు ఒంటరిగా వెళ్ళే మహిళల్నే ఇతగాడు టార్గెట్‌గా చేసుకునే వాడు. స్నాచింగ్ చేయడానికి ఇతడికి ఎవరి సహాయం అవసరం లేదు. తానే స్వయంగా బైక్‌ను నడుపుకుంటూ టార్గెట్‌కు ఎదురుగా వచ్చి వారి పక్కగా వాహనాన్ని పోనిచ్చేవాడు. హఠాత్తుగా తన ఎడమ చేత్తో వారి మెళ్ళోని గొలుసు లాక్కుని ఉడాయించేవాడు. ఈ పంథాలో కేపీహెచ్బీలో మూడు, మియాపూర్‌లో ఒక నేరం చేసి తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు. మళ్ళీ 2018 జనవరి 6న సిటీకి వచి్చన అమోల్ మియాపూర్‌లోని గాయత్రి లాడ్జిలో బస చేశాడు. అదును చూసుకుని మియాపూర్‌లో రెండు, చందానగర్‌లో ఒకటి, కేపీహెచ్బీలో మరోటి స్నాచింగ్స్ చేశాడు. ఇలా మొత్తం ఐదు నెలల కాలంలో 17 స్నాచింగ్స్‌కు పాల్పడి పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేశాడు. మరోసారి వచ్చినప్పుడే చిక్కి.. ఈ నేరాలు చేస్తున్నప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేసిన పోలీసులు అనుమానితుడి ఫొటోను ఇతర రాష్ట్రాలకు పంపారు. దీంతో మహారాష్ట్ర పోలీసుల ఆ నేరగాడు అమోల్ అని గుర్తించి సైబరాబాద్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడిని పట్టుకోవడానికి ఓ ప్రత్యేక బృందం పర్భనీకి వెళ్ళినా ఫలితం దక్కలేదు. అప్పటి నుంచి నిఘా ఉంచిన పోలీసులు 2018 జనవరి 28న మరోసారి సిటీకి వచి్చనట్లు గుర్తించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు అనేక చోట్ల గాలించి చివరకు మియాపూర్‌లో పట్టుకుని అరెస్టు చేశారు. ఆ సమయంలో ఇతడి నుంచి దాదాపు 47 తులాల బంగారం రికవరీ చేశాడు. ఇతడిపై మహారాష్ట్రతో పాటు కర్ణాటకలోనూ కేసులు ఉన్నాయని, పలు ఎన్బీడబ్ల్యూలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించారు. సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన అమోల్ -
చైత్రకు చిక్కాడు స్నాచర్
-
నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ
సాక్షి, ఖమ్మంక్రైం: చెన్నై నుంచి అహ్మదాబాద్ వెళుతున్న నవజీవన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో వస్తున్న ఇద్దరు మహిళల మెడలోని బంగారు ఆభరణాలను ఓ దొంగ అపహరించుకుని పోయిన సంఘటన సోమవారం తెనాలిలో జరిగింది. ఖమ్మం జీఆర్పీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెన్నై నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో వస్తున్న ఇల్లెందు మండలానికి చెందిన ఇద్దరు మహిళల నుంచి బంగారం దోచుకున్నారు. తెనాలి స్టేషన్లో రైల్లోని బాత్రూంలో వేచి ఉన్న దొంగ రైలు కదిలే సమయానికి బాత్రూంలోంచి బయటకు వచ్చాడు. బోగి మహిళలది కావడంతో వారు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తేరుకొనేలోపే ఆగంతకుడు సీట్లో కూర్చొని ఉన్న భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం కొమ్ముగూడేనికి చెందిన గుగులోత్ సుజాత, ఖమ్మం నగరానికి చెందిన బి.పద్మ అనే మహిళలను కత్తితో బెదిరించాడు. వారి మెడలో ఉన్న గొలుసులు, రింగులు, నగదును లాక్కొన్నాడు. సుజాత ప్రతిఘటించటంతోపాటు, రైలు చైన్ లాగటానికి ప్రయత్నిస్తుండగా ఆగంతుకుడు కత్తితో మెడపై తీవ్ర గాయం చేసి కిందపడేసాడు. ఆమె తలకు గాయం అయింది. ఈ సంఘటనతో బోగీలోని మహిళలంతా గట్టిగా కేకలు వేశారు. అప్పటికే ఆగంతకుడు రైలు నుంచి దూకి పారిపోయాడు. పక్కనే ఉన్న గార్డ్‌కు సమాచారం అందించినా గార్డు పట్టించుకోలేదు. విజయవాడ రైల్వే పోలీసుల ఓవర్‌యాక్షన్.. ఆగంతకుడి చేతిలో తీవ్రంగా గాయపడి, సొత్తు పోగొట్టుకొన్న ఇద్దరు మహిళలు విజయవాడలో రైలు ఆగగానే రైల్వే పోలీసులను సంప్రదించగా వారు కనీసం స్పందించకపోగా మీరు ఖమ్మం వెళ్లి జీఆర్పీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి అని చెప్పారు. కనీసం మానవత్వం కూడా లేకుండా రక్తం కారుతున్న మహిళలకు ప్రాథమిక చికిత్స చేయకుండా అక్కడి పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణమని మహిళలు మీడియా వద్ద వాపోయారు. ఇద్దరి మహిళలలో పద్మ అనే మహిళ పుస్తెలతాడు, గుగులోతు సుజాత రెండు తులాల చైన్, రెండు బంగారు రింగులు, వెయ్యి రూపాయల నగదును ఆగంతుకుడు అపహరించుకుపోయాడు. వీరిలో సుజాత చైన్నె నుంచి వస్తుండగా, పద్మ సూళ్లూరుపేట నుంచి వస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు జీఆర్పీ ఎస్ఐ రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టపగలే మహిళా బోగీలలో జొరబడి దొంగతనాలకు పాల్పడుతుంటే రాత్రిపూట ప్రయాణం చేసే మహిళలకు భద్రత ఎక్కడిదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
రాత్రికి రాత్రే జీవితం మారిపోయింది.!
సాక్షి, చెన్నై: రాత్రికి రాత్రే వారి జీవితం మారిపోయిందిరా.. అని చెప్పుకుంటుంటాం!. ఇందుకు మంచి ఉదాహరణ 18 ఏళ్ల సూర్యకుమార్. పెద్దగా చదువుకోకపోయినా మెకానిక్‌గా పనిచేస్తూ ఎంతో నిజాయతీగా బతుకుతున్న సూర్యకుమార్ జీవితం ఏప్రిల్ 19వ తేదీ రాత్రి తర్వాత ఒక్కసారిగా మారిపోయింది. ఇంతకీ ఆరోజు ఏం జరిగిందంటే... చెన్నై లోని అన్నానగర్‌లో ఉన్న మెకానిక్ షెడ్లో పనిచేస్తుండగా ఒక్కసారిగా ఓ మహిళ అరుపులు విన్నాడు. బయటకు వచ్చి చూస్తే డాక్టర్ అముతా అనే మహిళ మెడలో నుంచి ఓ దొంగ గొలుసు తెంచుకొని పారిపోతున్నాడు. సూర్యకుమార్ అతణ్ని వెంబడించి, పట్టుకొని, పోలీసులకు అప్పగించాడు. నిజాయతీగా గొలుసు తీసుకొచ్చి డాక్టర్‌కు ఇచ్చేశాడు. సూర్యకుమార్ ధైర్యసాహసాలు, నిజాయతీని మెచ్చుకున్న ఎస్ఆర్ఎమ్ గ్రూపు సంస్థ లక్ష రూపాయలు, చెన్నై రోటరీ క్లబ్ రూ.2 లక్షలు రివార్డుతో అభినందించాయి. చెన్నై పోలీస్ కమిషనర్.. సూర్యకుమార్‌ను స్వయంగా తనవద్దకు పిలిపించుకొని అభినందించాడు. నీకేం కావాలి? అని అడగ్గా.. ఉద్యోగం కావాలని చెప్పడంతో టీవీఎస్ సుందరం మోటార్స్ సంస్థ ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. పోలీస్ బాస్ సమక్షంలోనే గురువారం అపాయింట్మెంట్ లెటర్ కూడా అందుకున్నాడు. నాకెందుకులే అనుకున్నా.. గొలుసును తెచ్చి ఇవ్వకపోయినా సూర్యకుమార్ ఈ రోజు మెకానిక్‌గానే ఉండేవాడు. కానీ అతని ధైర్యసాహసాలు, నిజాయతీ ఇప్పుడతణ్ని ఓ ఉద్యోగిని చేశాయి. -
మీర్పేట్లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్
-
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
-
గొలుసులు మళ్లీ తెగాయ్!
- కర్నూలులో చైన్ స్నాచర్స్ హల్చల్ - గంట వ్యవధిలో నాలుగుచోట్ల చైన్‌స్నాచింగ్ - ఆరు తులాల బంగారు గొలుసులు అపహరణ - ఓ మహిళ మెడలో గిల్ట్ నగలు కూడా తెంపుకెళ్లిన దండగులు కర్నూలు: కర్నూలు నగరంలో రెండు వారాల విరామం తర్వాత చైన్ స్నాచర్స్ హల్చల్ చేశారు. మంగళవారం గంట వ్యవధిలో నాలుగు చోట్ల చేతివాటం ప్రదర్శించారు. రెండు చోట్ల నలుగురు మహిళల మెడలో రెండు గొలుసులకు తెంచే ప్రయత్నం చేశారు. కాగా ఓటో వారికి గిల్ట్ నగలు చేతికందక, మరో చోట మహిళ ప్రతి ఘటించడంతో పరారయ్యారు. మరో ఇద్దరి మహిళల నుంచి ఆరు తులాల బంగారు గొలుసులు అపహరించారు. చైన్‌స్నాచింగ్‌కు పాల్పడింది ఇలా.. ఉదయం 6.30 గంటలకు.. అనంతపురం జిల్లా యాడికి పట్టణానికి చెందిన చంద్రారెడ్డి ఆయన భార్య సత్యవతి కర్నూలులోని కేశవరెడ్డి స్కూలు సమీపంలోని అపార్టుమెంటులో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా, ఇద్దరు డిగ్రీ, ఒకరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. చంద్రారెడ్డి భార్య సత్యవతి ఇంటి నుంచి ఉదయం 6.30గంటల సమయంలో నడుచుకుంటూ వాకింగ్‌కు వెళ్తుండగా, ఇద్దరు యువకులు పల్సర్ వాహనంపై ఆమెను సమీపించి మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని ఉడాయించారు. అయితే అవి గిల్టు నగలు (రోల్డ్‌గోల్డ్) కావడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. 6.45 గంటలకు.. వెంకట రమణ కాలనీ నుంచి బయలుదేరిన దొంగలు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యూకృష్ణానగర్లోకి ప్రవేశించారు. నర్సింగ్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న అన్నపూర్ణ నడుచుకుంటూ వెళ్తుండగా, ఆమె మెడలో ఉన్న మూడు తులాల గొలుసు లాక్కొని పారిపోయారు. 7.00 గంటలకు.. న్యూ కృష్ణా నగర్ నుంచి గాయత్రి ఎస్టేట్‌లోకి ప్రవేశించి మోడ్రన్ ఐ హాస్పిటల్ సమీపంలో సుజాత అనే మహిళ ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఆమెను సమీపించి మెడలో ఉన్న రెండు బంగారు గొలుసులను లాక్కునేందుకు విఫలయత్నం చేశారు. ఆమె అప్రమత్తమై ప్రతిఘటించి కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. 7.15 గంటలకు.. గాయంత్రి ఎస్టేట్ నుంచి రాధానగర్ (హనుమాన్ కాట వద్ద) నివాసం ఉంటున్న నిర్మల మెడలో కూడా మూడు తులాల బంగారు గొలుసును లాక్కున్నారు. ఇంటి ముందు ఆమె పూలు తెంచుకుంటుండగా పల్సర్ వాహనంపై ఆమెను సమీపించి, మెడలో ఉన్న గొలుసును లాక్కొని ఉడాయించారు. పోలీసులు అప్రమత్తమైనా పరార్.. గొలుసు దొంగలు పలు కాలనీల్లో హల్చల్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. శివారు కాలనీలపై ప్రత్యేక నిఘా ఉంచి ‘సెట్’లో గస్తీ సిబ్బందిని అప్రమత్తం చేసినప్పటికీ దొంగలు తప్పించుకొని పారిపోయారు. బాధితుల కథనం ప్రకారం పల్సర్ వాహనంపై ఇద్దరు యువకులు చైన్ స్నాచింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తుంది. వాహనం వెనుక కూర్చున్న యువకుడు ఆనంద్ కలర్ టీషర్టు ధరించాడని బాధితురాలు నిర్మల పోలీసులకు తెలిపింది. రంగంలోకి ప్రత్యేక బృందాలు దొంగల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు టౌన్ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. స్టేషన్ల వారీగా మఫ్టీలో ప్రత్యేక బృందాలను నియమించి దొంగల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మహిళలు నగలు ధరించి బయటికి వెళ్లేటపుడు అవి కనిపించకుండా కొంగుపైట కప్పుకోవాలని సూచించారు. అనుమానితుడు కాలనీలో సంచరిస్తే డయల్ 100కు కానీ, సంబంధిత పోలీస్ స్టేషన్‌కు గానీ సమాచారం అందించాలని సూచించారు. -
వివాహితపై స్నాచర్స్ దాడి
చాంద్రాయణగుట్ట (హైదరాబాద్): నగరంలోని చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో ఆగంతకులు ఓ మహిళ మెడలో పుస్తెల తాడును తెంపుకుపోయారు. శుక్రవారం రాత్రి జంగంమెట్ యాదగిరి కాలనీలో అనసూయ (50) అనే మహిళ ఇంటి ముందు నడుస్తున్న సమయంలో ఇద్దరు ఆగంతకులు బైక్‌పై వచ్చి ఆగారు. ఒకడు కిందకు దిగి ఆమె మెడలోని ఐదున్నర తులాల బంగారు పుస్తెలతాడును తెంపుకుని వచ్చిన బైక్‌పై పరారయ్యారు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ కెమెరా ఫుటేజీలను పరిశీలించగా, ఆగంతుకుల ముఖాలు స్పష్టంగా కనిపించలేదు. -
'చైన్ స్నాచర్ దొరికిపోయాడు'
హైదరాబాద్: మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించిన దుండగుడి యత్నాన్ని ఆ మహిళ తిప్పికొట్టింది. అరుపులతో చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసింది. దీంతో వారు అతడిని పట్టుకుని కటకటాల పాలు చేశారు.ఈ ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్.ఐ. జయశంకర్ తెలిపిన వివరాల ప్రకారం.. బౌద్ధనగర్‌కు చెందిన పి.శ్రీలక్ష్మి (37) ప్రైవేటు సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గురువారం రాత్రి 8 గంటల సమయంలో తన తల్లి, కుమార్తెతో కలసి షాపింగ్ చేసుకుని నడిచి ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో వారాసిగూడ ప్రాంతానికి చెందిన హమీద్ (21) ద్విచక్రవాహనంపై వచ్చి శ్రీలక్ష్మి మెడలోని బంగారు మంగళ సూత్రాన్ని గట్టిగా పట్టుకుని, తెంపేందుకు యత్నించాడు. ఆ ప్రయత్నాన్ని ఆమె అడ్డుకుని, గట్టిగా కేకలు వేశారు. స్థానికులు అప్రమత్తమై వెంటనే హమీద్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిని శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. -
స్నాచర్ చేతిలో గొలుసును తిరిగి లాక్కుంది
చైతన్యపురి (హైదరాబాద్): బైకుపై వచ్చిన దుండగులు మెడలో గొలుసు లాగేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించి, తన చైన్‌ను లాక్కుని కాపాడుకుంది ఓ మహిళ. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై గురువారం ఈ సంఘటన జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. శారదానగర్‌లో నివసించే దేవమ్మ (43) ఇళ్లలో పనిచేస్తుంటుంది. గురువారం మధ్యాహ్నం కూతురు ఆరోగ్యతో కలిసి సరూర్‌నగర్ కట్టపై వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకుల్లో ఒకడు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాగాడు. తెగిన గొలుసు అతని చేతుల్లో ఉండగానే వెంటనే దేవమ్మ తేరుకుంది. స్నాచర్‌ను గట్టిగా ప్రతిఘటించి తన గొలుసును తిరిగి లాగేసుకుంది. ఆపై ఆమె గట్టిగా కేకలు వేయటంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. -
మోస్ట్ వాంటెడ్ అకీలుద్దీన్ అరెస్ట్