
మైసూరు(బెంగళూరు): మహిళలు రోడ్డు మీద వెళ్తుంటే ఫాలో చేసి అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లగానే.. తాను కూడా చొరబడి మహిళ తలపై రాడ్ కొట్టి తాళి చైన్‌ను లాక్కెళ్లాడో దుండగుడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణం చామలాపుర హుండిలో జరిగింది. వివరాలు.. ప్రైవేటు ఉద్యోగి రవికుమార్ భార్య సవిత (40) సోమవారం ఉదయం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యక్తి చొరబడ్డాడు.
ఇనుప రాడ్‌తో తలపై గట్టిగా కొట్టి ఆమె మెడలో ఉన్న మాంగళ్యం చైన్‌ను లాక్కొని పారిపోయాడు. మహిళ అరుపులు విని చుట్టుపక్కలవారు వచ్చేసరికి ఆగంకుతుడు పరారయ్యాడు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. నంజనగూడు పోలీసులు పరిశీలించి దుండగుని కోసం గాలింపు చేపట్టారు.
చదవండి Video: లంచం తీసుకుంటూ పట్టుబడి.. కరెన్సీని కసాబిసా నమిలి మింగేశాడు
Comments
Please login to add a commentAdd a comment