Sarurnagar
-
సరూర్ నగర్ సభలో ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్
-
మరోసారి సమన్వయ లోపం.. కాంగ్రెస్‌లో ‘ఎంపీలాట’! నల్లగొండ సభ వాయిదా
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ సభల నిర్వహణ విషయంలో కాంగ్రెస్‌లో సమన్వయ లోపం మరోసారి కనిపించింది. నల్లగొండ సభ విషయంలో ముఖ్యనేతల మధ్య వివాదం తలెత్తడంతో.. అధిష్టానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. చివరికి శుక్రవారమే జరగాల్సిన ఈ సభ 28వ తేదీకి వాయిదా పడింది. టీఎస్పీఎస్సీ పరీక్షల లీకేజీ, నిరుద్యోగుల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై నిరసనలు చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ సభలతోపాటు వచ్చేనెల మొదటి వారంలో పార్టీ ముఖ్యనేత ప్రియాంకా గాంధీతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు టీపీసీసీ సిద్ధమైంది. నల్లగొండలో శుక్రవారం నిరుద్యోగ సభ నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండలో నిర్వహించే సభ గురించి తనకు సమాచారం లేదని ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇక రేవంత్ తీసుకునే నిర్ణయాలన్నీ ఏకపక్షంగా ఉంటాయని కొంతకాలంగా విమర్శలు గుప్పిస్తున్న మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ అసెంబ్లీ స్థానానికి ఇన్చార్జిగా ఉండి కూడా.. నల్లగొండ సభ విషయంలో సైలెంట్ అయిపోయారు. ఇలా ముగ్గురు కీలక నేతల మధ్య నల్లగొండ సభ జగడం పార్టీలో గందరగోళానికి దారితీసింది. దీనితో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శి నదీం జావేద్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. వారు ఎంపీలతో చర్చించి 21న జరగాల్సిన నల్లగొండ సభను 28కి వాయిదా వేయించారు. మిగతా జిల్లా కేంద్రాల్లో ప్రకటించిన నిరుద్యోగ సభలు యథాతథంగా జరగనున్నాయి. 24న ఖమ్మం, 26న ఆదిలాబాద్, 28న నల్లగొండ, 30న పాలమూరు, మే 1న రంగారెడ్డి జిల్లాలో నిరుద్యోగ సభలు జరుగుతాయి. మే 4న లేదా 5న తేదీల్లో ప్రియాంక సభ నిరుద్యోగ సభల అనంతరం మే 4న లేదా 5న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో రాష్ట్రస్థాయిలో సభ నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఆ సభకు పార్టీ కీలకనేత ప్రియాంకా గాంధీ హాజరుకానున్నారు. అయితే ఏ రోజున ప్రియాంక పర్యటన ఉంటుందన్నది ఒకట్రెండు రోజుల్లో ఖరారు అవుతుందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. ప్రియాంక సభతో రాష్ట్రపార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. -
భార్య మోసం చేసిందని భర్త ఆత్మహత్య
-
నవీకరణ.. నవ్విపోదురు గాక!
సరూర్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ మలయ్యకు అయిదుగురు సంతానం. రేషన్ కార్డులో కుటుంబ సభ్యులుగా భార్యాభర్తలతోపాటు మరో ఇద్దరి (పిల్లల) పేర్లు మాత్రమే ఉన్నాయి. అయిదేళ్ల క్రితం మిగిలిన కుటుంబ సభ్యుల పేర్ల నమోదు కోసం మీ సేవ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యుల జాబితాలో మిగతావారి పేర్లు చేరలేదు. దీంతో నెలవారీ రేషన్ బియ్యంతో పాటు వివిధ రెవెన్యూ ధ్రువీకరణ పత్రాలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు. సాక్షి హైదరాబాద్: గత అయిదేళ్లుగా ఆహార భద్రత (రేషన్ ) కార్డులో నవీకరణ (మార్పులు, చేర్పులు) కోసం ఆన్లైన్ ద్వారా నమోదైన దరఖాస్తులు పెండింగ్‌లో మగ్గుతూనే ఉన్నాయి. పౌరసరఫరా శాఖ అధికార లాగిన్‌లో కార్డులోని యూనిట్లు (పాత సభ్యులు) తొలగించేందుకు అవకాశం ఉన్నప్పటికీ కొత్త యూనిట్ల (అదనపు సభ్యులు)ను ఆమోదించేందుకు అనుమతి లేకుండా పోయింది. కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతున్నా కార్డుల్లో యూనిట్లు (సభ్యులు) పెరగకపోవడం పేదల పాలిట శాపంగా పరిణమించింది. రాష్ట్ర ఆవిర్భావానంతరం టీఆర్ఎస్ ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులు రద్దు చేసి వాటిని పూర్తిగా ఆహార భద్రత కార్డులుగా బదిలీ చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ కార్డులు మంజూరు చేసింది. ఏడాది పాటు కార్డులో చేర్పు లు, మార్పులు ప్రక్రియ సైతం కొనసాగించి అర్ధంతరంగా నిలిపివేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రి య మాత్రం కొనసాగిస్తోంది. దీంతో రోజురోజుకూ దరఖాస్తుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. ధ్రువీకరణ పత్రాలకు తిప్పలు.. పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు సంక్షేమ ఉపకాల వేతనాల కోసం తిప్పలు తప్పడం లేదు. ఉపకార వేతనాల కోసం కుటుంబ ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి. రెవెన్యూ అధికారులు వార్షిక ఆదాయ నిర్ధారణ కోసం రేషన్ కార్డును ప్రామాణికంగా పరిగణించి ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేస్తారు. రేషన్ కార్డులో పేర్లు లేని కారణంగా ధ్రువీకరణ పత్రం జారీ సమస్యగా తయారైంది. ఆదాయ ధ్రువీకరణ పత్రాలు లేక సంక్షేమ ఉపకార వేతనాలకు అర్హత కోల్పోతున్నారు. అయిదేళ్ల వయసు దాటితే.. ఆహార భద్రత చట్టం ప్రకారం కుటుంబంలోని సభ్యుల వయసు అయిదేళ్లు పైబడితేనే యూనిట్‌గా పరిగణిస్తారు. కార్డులు మంజూరైన నాటికి అయిదేళ్లలోపు సభ్యులు అర్హత సాధించలేక పోయారు. ఆ తర్వాత సభ్యులుగా చేరి్పంచేందుకు దరఖాస్తు చేసుకుంటే నమోదు ప్రక్రియ మాత్రం ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. కార్డు కలిగిన కుటుంబాల్లో కొత్త సభ్యుల సంఖ్య పెరుగుతున్నా.. కార్డులో మాత్రం యూనిట్లుగా నమోదు కాని పరిస్థితి నెలకొంది. గ్రేటర్ జిల్లాల పరిధిలో సుమా రు 2.13 లక్షల కుటుంబాల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కనీసం క్షేత్ర స్థాయి విచారణలో 55 శాతానికిపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, విచారణ పూర్తయి ఏఎస్వో లు, ఎమ్మార్వో లాగిన్‌లో 25 శాతం దరఖాస్తులు, డీఎస్వో లాగి¯న్లో 20 శాతం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు ఆన్లైన్ నివేదిక స్పష్టం చేస్తోంది. (చదవండి: ఇంజనీరింగ్ పట్టాతో ఎగిరిపోవాల్సిందే.. ఉద్యోగం వచ్చినా వద్దే వద్దు) -
తెలంగాణలో ఎకరం రూ.24.22 కోట్లు.. ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలూ ఖరారయ్యాయి. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, బహదూర్‌పురా మండలాల్లో ఎకరం రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.24.22 కోట్లకు పెంచారు. ఆ తర్వాత హైదర్‌నగర్, కూకట్పల్లి, బాలానగర్, మూసాపేట్ మండలాల్లో ప్రస్తుతం ఎకరం రూ.18.87 కోట్లు, కర్మన్‌ఘాట్‌లో రూ. 13.55 కోట్లు, మాదాపూర్‌లో రూ. 12.58 కోట్లు ఉండగా.. ఈ విలువను 10 శాతం పెంచారు. ఆ తర్వాత గచ్చిబౌలి, మియాపూర్, నానక్‌రాంగూడ లో రూ.9.43 కోట్లు, నిజాంపేట, అత్తాపూర్‌లో రూ.6.29 కోట్లు, నాగోల్ బండ్లగూడలో రూ. 5.03 కోట్లుగా ఉన్న విలువను 20 శాతం పెంచారు. కాగా సాగు, సాగేతర భూముల విలువలన్నిటినీ శనివారం జిల్లాల్లో జరిగే కమిటీలు ఆమోదించనున్నాయి. -
సరూర్ నగర్ చెరువు నిండి కాలనీల్లో వరద
సాక్షి, హైదరాబాద్: నగరంలో శనివారం కురిసిన భారీ వర్షంతో మరోసారి లోతట్టు ప్రాంతాలు, పలు కాలనీలు, రోడ్లు జలమయం అయ్యాయి. భారీ వర్షాలకు సరూర్ నగర్ చెరువు నిండి సమీపంలోని కాలనీలకు వరద నీరు ప్రవహిస్తోంది. చెరువు నిండి దిల్‌సుఖ్‌నగర్‌లోని కమలానగర్లో వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. చైతన్యపురి, దిల్సుఖ్ నగర్ కాలనీలన్నీ జలమయం అయ్యాయి. శనివారం నుంచి కరెంట్ లేక తాగడానికి నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్మెంట్ వాసులు కిందికి దిగే పరిస్థితి కనిపించడం లేదు. నిత్యవసర సరుకులు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. వరద తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రజలు భయాందోలనలో బతుకుతున్నారు. వర్షం, వరద నీటితో దిల్సుఖనగర్ ప్రధాన రోడ్డు స్థబించి, ఎల్బీ నగర్, నల్గొండ నుంచి వచ్చే వాహనలు మూడు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం సమీప కాలనీల నుంచి వస్తున్న వరద నీరుతో ప్రధాన రహదారి జలదిగ్భందమవడం వల్ల వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దిల్సుఖ్ నగర్‌లోని సెల్లార్లలో ఉన్న పలు వస్త్ర దుకాణాలన్నీ వరద నీటిలో మునిగిపోవడంతో భారీ నష్డం వాటిల్లింది. దాదాపు 35 బట్టల దుకాణాలు నీటిలో మునిగాయని, అధికారులు మోటర్ల సాయంతో నీటిని తోడేస్తే కొంతలో కొంతైన బట్టలు చేతికి దక్కుతాయని లేదంటే పూర్తిగా నష్టం వాటిల్లుతుందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనప్రియ, మీర్‌పేటలో రోడ్లు జలయమం అయ్యాయి. పెద్దచెరువు నిండటంతో పలు కాలనీలు నీటమునిగాయి. చెరువుకి గండిపడటంతో జనప్రియ కాలనీలోకి వరద నీరు తీవ్ర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
సీనియర్ సిటీజన్లను కాపాడిన పోలీసులు
-
సరూర్ నగర్ చెరువు నిండి కాలనీల్లో వరద
-
నేడు సకల జనుల సమరభేరి
-
నేడు ఆర్టీసీ కార్మికుల సకల జనుల సమరభేరి
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా బుధవారం సకల జనుల సమరభేరి పేరుతో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభలో విపక్ష పార్టీలన్నీ పాల్గొనబోతున్నాయి. తొలుత ఈ సభను సరూర్‌నగర్ మైదా నంలో భారీ స్థాయిలో నిర్వహించాలని అనుకున్నా.. హైకోర్టు సూచనలతో పరిమితులతో కూడిన సభలాగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభ జరగనుంది. స్టేడియం సామర్థ్యం ఐదు వేలే... సభను 3 లక్షల మందితో భారీగా నిర్వహించాలని జేఏసీ తొలుత నిర్ణయించింది. వీరిలో దాదాపు లక్షన్నర మంది కార్మికుల కుటుంబీకులే ఉంటారని అంచనా వేసింది. సమ్మెకు విపక్షాలన్నీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుండటంతో, జనసమీకరణకు ఆయా పార్టీలన్నీ హామీ ఇచ్చాయి. సరూర్‌నగర్ మైదానంలో సభకు ప్రణాళిక సిద్ధం చేసుకుని అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. కానీ సభకు అనుమతి ఇవ్వలేమని పోలీసులు చెప్పడంతో మంగళవారం జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న అనంతరం షరతులతో అనుమతి మంజూరు చేసింది. ఫలితంగా వేదికను ఇండోర్ స్టేడియంలోకి మార్చాల్సి వచి్చంది. స్టేడియం సామర్థ్యం కేవలం 5 వేలే కావడంతో జనసమీకరణ కసరత్తును విరమించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉధృతంగా నిరసనలు.. హైకోర్టు వ్యాఖ్యలతో కార్మికుల్లో ఉత్సాహం పెరిగింది. దీంతో గత రెండు రోజులుగా వారు నిరసనల హోరు పెంచారు. మంగళవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల వద్ద కార్మికులు, వారి కుటుంబ సభ్యులు, విపక్షాల కార్యకర్తలు నిరసనలు నిర్వహించారు. నిజామాబాద్ కలెక్టరేట్ వద్ద కార్మికులు ధర్నా చేశారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు సమ్మెకు మద్దతుగా నిలిచారు. ఆర్మూర్‌లో కార్మికులు, అఖిలపక్ష నేతలు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి బస్టాండు వద్ద కార్మికులు మోకాళ్లపై మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల పోరాట సహాయ నిధికి తెలంగాణ ఉపాధ్యాయ సంఘం పక్షాన రూ.25 వేలు, కామారెడ్డి కోర్టు సిబ్బంది రూ.5 వేలు అందజేశారు. సమ్మె మొదలయ్యాక మృతి చెందిన ఆర్టీసీ కార్మికులకు బాన్సువాడ, జగిత్యాల, మెట్పల్లి, గోదావరిఖని, హుస్నాబాద్ డిపోల వద్ద నివాళులరి్పంచారు. మంథని వద్ద గోదావరి నదిలో బీజేపీ ఆధ్వర్యంలో జలదీక్ష చేపట్టారు. నల్లగొండలో కార్మికుల నిరసనలకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మద్దతు ప్రకటించారు. కండక్టర్ నీరజ ఆత్మహత్య నేపథ్యంలో సత్తుపల్లిలో బంద్‌కు పిలుపినివ్వటంతో బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. సీఐటీయూ నేతను అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ కార్యకర్తలు, కార్మికులు ఖమ్మం టూటౌన్ పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. సిద్దిపేటలో కార్మికుల దీక్షా శిబిరం వద్ద సీపీఐ నేతలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎమ్మారీ్పఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కార్మికులకు సంఘీభావంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. మరోవైపు ఆర్టీసీ పరిరక్షణ, హక్కుల సాధన కోసం తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్నది వీరోచిత పోరాటమని ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ కొనియాడింది. వారి పోరాటానికి ఏపీఎస్‌ఆరీ్టసీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. మరోవైపు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 73 శాతం బస్సులను తిప్పినట్టు ఆర్టీసీ ప్రకటించింది. ‘కోర్టుకు తప్పుడు వివరాలిస్తోంది’ ప్రభుత్వం కోర్టుకు తప్పుడు వివరాలు అందిస్తోం దని ఆర్టీసీ జేఏసీ ఆరోపించింది. ముఖ్యంగా నిధులకు సంబంధించి తప్పుడు లెక్కలు ఇస్తోందని ఆరోపించింది. మంగళవారం సాయంత్రం జేఏసీ నేతలు అశ్వత్థామరెడ్డి, రాజిరెడ్డి, వీఎస్‌రావు తదితరులు మాట్లాడుతూ.. ఉమ్మడి ఏపీలో 2014 వరకు రూ.1,099 కోట్లు, ఆ తర్వాత 2019 వరకు రూ.1,375 కోట్లు రాయితీ పాస్‌లకు సంబంధించి రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వాల్సి ఉందని, జీహెచ్ఎంసీ నుంచి రూ.1,496 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామంటూ ప్రభుత్వం చెప్పడం శోచనీయమని పేర్కొన్నారు. షరతులతో హైకోర్టు అనుమతి ఆర్టీసీ జేఏసీ బుధవారం తలపెట్టిన సభకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. దీని ప్రకారం సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. సరూర్‌నగర్ స్టేడియంలో సభ నిర్వహణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్టీసీ జేఏసీ ఈనెల 24న పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. అయితే, పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో జేఏసీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం విచారణ జరిపిన జస్టిస్ టి.వినోద్‌కుమార్ షరతులతో కూడిన అనుమతిని మంజూరు చేశారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో సాయంత్రం 3 నుంచి 6 గంటల మధ్య సభ నిర్వహించి, 7 గంటల కల్లా ఖాళీ చేయాలని, శాంతియుతంగా నిర్వహిస్తామని పోలీసులకు జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి హామీ ఇవ్వాలని ఆదేశించారు. సభలో ప్రసంగించే వారి సంఖ్యను ఐదుగురికి పరిమితం చేయాలన్నారు. మరో ఒకరిద్దరికి అవకాశం ఇవ్వొచ్చని, ప్రసంగించే వారి పేర్లను పోలీసులకు ఇవ్వాలని సూచించారు. సభలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని, ఐదువేల మందికి మించి పాల్గొనవద్దని ఆదేశించారు. -
సరూర్‌నగర్‌లో మిస్సింగ్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : చేవూరి విద్యాసాగర్ రావు అనే వ్యక్తిపై రాచకొండ కమిషనరేట్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు నమోదైంది. కాగా ఈ నెల 10 నుంచి విద్యాసాగర్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరూర్ నగర్‌లోని బాపూ నగర్లో ఉంటున్న విద్యాసాగర్ రావు ఇద్దరు పిల్లలు. భార్య ఉపాద్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో తనకు అవమానం జరిగిందని దీంతో తీవ్రంగా ఆవేదన చెందాడనీ.. ఆ తర్వాత అప్పుడప్పుడు మతిస్థిమితం తప్పినట్టుగా ప్రవర్తిస్తుంటాడని కుటుంబసభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఓ పెళ్లి వివాహానికి వెళ్లి వచ్చే తండ్రి ఇంట్లో కనింపించడం లేదని, తమ ప్రాంతంలోని సీసీ కెమెరాల్లో లభించిన దృశ్యాలను పరిశీలిసంచగా కొత్తపేటలో చివరిసారిగా కనిపించాడని ఆయన కుమారుడు పోలీసులకు తెలిపారు. ఆయన ఆచూకీ తెలిసిన వారు 9703521011 నెంబర్‌కు గానీ, పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. దీనిపై ఫిర్యాదు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
26న హైదరాబాద్ హైటెక్స్‌లో డా. ఖాదర్ సదస్సులు
అటవీ కృషి, సిరిధాన్యాల సాగు– సిరిధాన్యాల ఆహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందే మార్గాలపై అటవీ కృషి, ఆరోగ్య, ఆహార నిపుణులు డా. ఖాదర్ వలి ఈ నెల 26న అనేక సదస్సుల్లో ప్రసంగించనున్నారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ‘సేంద్రియ ఉత్పత్తులు–చిరుధాన్యాలు– సంప్రదాయ వైద్య రీతులు’ పేరిట ఏర్పాటయ్యే మూడు రోజుల ఎగ్జిబిషన్లో భాగంగా ఈనెల 26 (ఆదివారం)న ఉ. 10 గం.–మ.12, మ.1 గం.–4 గం. మధ్య జరిగే సదస్సుల్లో డాక్టర్ ఖాదర్ ప్రసంగిస్తారని నిర్వాహకురాలు మాధవి తెలిపారు. రైతులు, ప్రజల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు. ఈ ఉచిత సదస్సులకు అందరూ ఆహ్వానితులే. వివరాలకు.. 89782 45673, 81066 44699. ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం’ ఆంగ్ల పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరిస్తారు. 28న హైదరాబాద్ సరూర్‌నగర్‌లో డా. ఖాదర్ సదస్సు హైదరాబాద్ సరూర్‌నగర్‌లోని కొత్తపేట బాబూ జగ్జీవన్‌రాం భవన్లో ఈ నెల 28(మంగళవారం)న మ. 3 గం. నుంచి రా. 7 గం. వరకు ‘సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం– అటవీ కృషి ఆవశ్యకత’పై జరిగే సదస్సులో ప్రముఖ అటవీ కృషి, ఆహార, ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్‌వలీ ప్రసంగిస్తారని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రవేశం ఉచితం. వివరాలకు.. 98493 12629, 040–23395979 -
నీకు నేను.. నాకు నువ్వు!
ఉమ్మడి రాష్ట్రంలో కీలకంగా వ్యవహరించిన ఓ ‘ముఖ్య నేత’ తమ్ముడి కోసం 400 ఎకరాల వివాదాన్ని నయీమ్ సెటిల్ చేశాడు. అందుకు బదులుగా ‘ముఖ్య నేత’ ఇతడికి అనేక విధాలుగా సాయం అందించాడు. నయీమ్‌తో పెనవేసుకున్న పోలీసు బంధం * ఎస్సై స్థాయి నుంచి డీఎస్పీల దాకా డీలింగ్స్ * విలువైన స్థలాలు, ఫ్లాట్లు గిఫ్ట్‌గా ఇచ్చిన గ్యాంగ్‌స్టర్ * డైరీలు, పత్రాలు, పుస్తకాల పరిశీలనలో విస్మయకర అంశాలు సాక్షి, హైదరాబాద్: నయీమ్ కోసం పోలీసులు.. పోలీసుల కోసం నయీమ్.. ఇలా ఒకరి కోసం ఒకరు పనిచేశారు! రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సైతం ఈ కరుడుగట్టిన నేరగాడితో అంటకాగారు. ఏపీలోని సీఆర్డీఏ పరిధిలోనూ నయీమ్ దందాలు జరిపాడని తెలిసింది. ఇతడి నుంచి అనేక విధాలుగా లబ్ధి పొందిన వారిలో ఎస్సై నుంచి అధికారి వరకు వివిధ హోదాలకు చెందిన వారు ఉన్నారు. నార్సింగి ఠాణా పరిధిలోని అల్కాపురి టౌన్‌షిప్‌తోపాటు నయీమ్‌కు చెందిన స్థావరాల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, డైరీలు, పుస్తకాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. ఇందులో విస్మయకర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ లావాదేవీలన్నీ బినామీ పేర్లతోనే జరగడంతో వాటికి సంబంధించిన ఆధారాల సేకరణపై అధికారులు దృష్టి పెట్టారు. అవి లభించిన తర్వాత సదరు పోలీసులు, నేతలు, వ్యాపారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన నయీమ్ దందాలివీ... ≈ కొన్నేళ్ల క్రితం ఎన్నికల ప్రచారం కోసం ప్రయాణిస్తూ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సినీ నటికి నగర శివార్లలో ఆరెకరాల భూమి ఉండేది. దీనిని నయీమ్ ఆక్రమించాడు. దీనికి సహకరించిన ఓ ఎస్సైకి (ప్రస్తుతం ఇన్స్పెక్టర్) మణికొండ పంచవటి కాలనీలో ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చాడు ≈ మెదక్ జిల్లా సంగారెడ్డిలో ఓ ఫంక్షన్ హాల్‌ను నయీమ్ తన అడ్డాగా మార్చుకున్నాడు. దీని యజమానికి చెందిన 15 ఎకరాలు భూ వివాదాన్ని సెటిల్ చేశాడు. ప్రతిఫలంగా అత్యంత ఖరీదైన కారును తీసుకున్నాడు ≈ వికారాబాద్‌లో ఫామ్‌హౌస్, కూకట్పల్లి ప్రాంతంలోని ఓ సొసైటీలో 60 ప్లాట్లు, అత్తాపూర్‌లో ఐదు ఖరీదైన ప్లాట్లు, ఆరె మైసమ్మ వద్ద ఓ వెంచర్ నయీమ్ కబ్జాలో ఉన్నట్లు తేలింది ≈ సిటీ, సైబరాబాద్‌ల్లో ఎస్సై నుంచి వివిధ హోదాల్లో పని చేసిన ఓ అధికారి నయీమ్‌కు అనేక విధాలుగా సహకరించారు. దీంతో ఆయనకు అమీర్‌పేటలో కమర్షియల్ కాంప్లెక్స్, శివరామ్‌పల్లిలో 10 ఎకరాల స్థలం, దానిలో 100 గజాల గెస్ట్‌హౌస్ ముట్టజెప్పాడు ≈ మెదక్ జిల్లాలో రెండెకరాల స్థలానికి సంబంధించి మాట వినని ఓ న్యాయవాదిని హత్య చేయాలని నయీమ్ నిర్ణయించుకున్నాడు. అందుకు అవసరమైన ప్లాన్‌ను ఆ జిల్లాకు చెందిన ఓ ఇన్స్పెక్టర్ వేసినట్లు తెలిసింది ≈ నగర శివార్లలో నార్త్‌జోన్‌లో ఏసీపీగా పని చేసిన ఓ అధికారికి నయీమ్ రూ.70 లక్షల విలువైన రెండు ఫ్లాట్లు గిఫ్ట్‌గా ఇచ్చాడు. సౌత్జోన్లో పని చేసిన ఓ అధికారికి మలక్‌పేటలో రెండు ఫ్లాట్లు ముట్టజెప్పాడు ≈ శివార్లలో నయీమ్‌తోపాటు కొందరు పోలీసు అధికారులూ ఉమ్మడిగా బినామీ పేర్లతో 50 ఎకరాల మామిడి తోటను కబ్జాలో పెట్టుకున్నారు ≈ పలు విభాగాల్లో పని చేసిన/చేస్తున్న నలుగురు డీఎస్పీలను తనకు అనుకూలంగా వాడుకున్న నయీమ్ వారికి మక్తల్‌లో 200 ఎకరాలు ఇచ్చాడు ≈ ఓ ఉన్నతాధికారి కుమార్తె బర్త్‌డే వేడుకలకు వెళ్లిన నయీమ్ జూబ్లీహిల్స్‌లో వెయ్యి గజాల స్థలాన్ని బహుమతిగా ఇచ్చాడు ≈ సంగారెడ్డిలో 40 ఎకరాల భూ వివాదానికి సంబంధించి ఓ సీఏను నయీమ్ హత్య చేశాడు. ఈ కేసులో తనకు సహకరించిన పోలీసు అధికారికి రూ.2.5 కోట్లు ఇచ్చాడు ≈ ఓ అత్యున్నత అధికారికి శివారు జిల్లాల్లో 150 ఎకరాల వరకు కట్టబెట్టిన నయీమ్.. అనేక సందర్భాల్లో ఆయన పరపతిని వినియోగించుకున్నాడు ≈ నల్లగొండ జిల్లాలో పని చేసి, ప్రస్తుతం నగరంలోనే విధులు నిర్వర్తిస్తున్న డీఎస్పీ స్థాయి అధికారికి రూ.35 లక్షల విలువైన 2 లగ్జరీ కార్లను నయీమ్ గిఫ్ట్‌గా ఇచ్చాడు ≈ డీఐజీ స్థాయిలో పని చేసిన ఓ అధికారికి ఫిల్మ్‌సిటీ సమీపంలో 12 ఎకరాలు ఇచ్చాడు. దీనికి సమీపంలోనే నయీమ్ కబ్జాలో మరో 15 ఎకరాలు ఉంది ≈ ఓ ఉన్నతాధికారితో పాటు నలుగురు అధికారులకు కలిపి బినామీ పేర్లతో శివార్లలో 380 ఎకరాలు కట్టబెట్టాడు ≈ నయీమ్‌కు అనేక విధాలుగా సహకారం అందించిన ముగ్గురు ఇన్స్పెక్టర్లకు టెలికాం నగర్లో ఇళ్లు గిఫ్ట్‌గా ఇచ్చాడు ≈ మల్కాజ్గిరి భూ వివాదానికి సంబంధించి నయీమ్ ఓ హత్య చేశాడు. దీన్ని మాఫీ చేసిన అధికారికి రంగారెడ్డి జిల్లాలో ఫామ్‌హౌస్ గిఫ్ట్‌గా ఇచ్చాడు ≈ నగరానికి చెందిన ఓ భూ వివాదాన్ని ఓ మీడియా ఛానల్‌కు చెందిన కీలక వ్యక్తి.. నయీమ్ వద్దకు తీసుకువెళ్లాడు. దీన్ని సెటిల్ చేయించినందుకు సదరు మీడియా వ్యక్తి భూ యజమాని నుంచి రూ.10 కోట్లు తీసుకున్నాడని తెలిసింది ≈ ఏపీలో రాజధాని ప్రకటన తర్వాత సీఆర్డీఏలోని ప్రాంతంలోకి నయీమ్ అడుగుపెట్టాడు. గుంటూరులోని భూ దందాకు సహకరించినందుకు ఓ ఉన్నతాధికారికి రూ.5 కోట్లు సమర్పించినట్లు తెలిసింది ≈ ఏపీ, తెలంగాణకు చెందిన కొందరు పోలీసు అధికారులతో కలిసి దుబాయ్‌లో సూట్‌కేస్ కంపెనీలు స్థాపించాడని సమాచారం. ‘ఎన్-కంపెనీ’ ఏర్పాటు తర్వాత వీటి ఆధారంగా నగదును ఇక్కడకు తరలించాలని పథకం వేశాడు ♦ నయీమ్ నక్సలైట్ నుంచి ‘జనజీవన స్రవంతి’లో కలిసిన తర్వాత మావోయిస్టులకు సంబంధించిన సమాచారం అధికారులకు అందించాడు. ఈ నేపథ్యంలోనే కొందరు అధికారులతో కలిసి ఓ డంప్‌పై దాడి చేశాడు. అక్కడ దొరికిన రూ.1.5 కోట్ల నగదును అంతా పంచుకుని ఆయుధాలు, తూటాలు తదితరాలను మాత్రమే రికవరీ చూపించారు. ♦ సుదీర్ఘకాలంగా నయీమ్‌తో సంబంధాలు కలిగి ఉండి, అనేక అంశాల్లో సాయం అందించిన నగరానికి చెందిన అధికారికి మద్యం వ్యాపారం అప్పగించాడు. నయీమ్ బినామీల పేర్లతో ఉన్న 16 వైన్ షాపులు, 4 బార్లను ఈయనే పర్యవేక్షిస్తున్నారు. ♦ సరూర్‌నగర్ ప్రాంతంలో ఉన్న విలువైన స్థలానికి సంబంధించి ఇద్దరు బడా బిల్డర్ల మధ్య వివాదాన్ని సెటిల్ చేసే బాధ్యతల్ని ఆ ప్రాంతంలో పని చేసిన ఓ డీఎస్పీ స్థాయి అధికారికి నయీమ్ అప్పగించాడు. తర్వాత అతడికి ఎల్బీనగర్ ప్రాంతంలో 2,500 గజాల స్థలాన్ని కబ్జా చేసి, షాపింగ్ కాంప్లెక్స్‌గా మార్చి గిఫ్ట్‌గా ఇచ్చాడు. -
స్నాచర్ చేతిలో గొలుసును తిరిగి లాక్కుంది
చైతన్యపురి (హైదరాబాద్): బైకుపై వచ్చిన దుండగులు మెడలో గొలుసు లాగేందుకు ప్రయత్నించగా ప్రతిఘటించి, తన చైన్‌ను లాక్కుని కాపాడుకుంది ఓ మహిళ. చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్‌పై గురువారం ఈ సంఘటన జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. శారదానగర్‌లో నివసించే దేవమ్మ (43) ఇళ్లలో పనిచేస్తుంటుంది. గురువారం మధ్యాహ్నం కూతురు ఆరోగ్యతో కలిసి సరూర్‌నగర్ కట్టపై వెళ్తుండగా వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు అగంతకుల్లో ఒకడు ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాగాడు. తెగిన గొలుసు అతని చేతుల్లో ఉండగానే వెంటనే దేవమ్మ తేరుకుంది. స్నాచర్‌ను గట్టిగా ప్రతిఘటించి తన గొలుసును తిరిగి లాగేసుకుంది. ఆపై ఆమె గట్టిగా కేకలు వేయటంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. -
తక్కువ మార్కులు వచ్చాయని.. టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య
సరూర్‌నగర్: పదవతరగతి పరీక్ష ఫలితాల్లో తక్కువ మార్కులు రావడంతో మనస్థాపం చెంది ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం సూర్యాపేటకు చెందిన జంగయ్య కుటుంబం మీర్‌పేటలోని ఓల్ట్ విలేజ్‌లో అద్దెకుంటూ కూలి పని చేసుకుంటూ జీవిస్తోంది. జంగయ్య కూతురు త్రివేణి జిల్లెలగూడలోని చల్ల లింగారెడ్డి జిల్లాపరిషత్ పాఠశాలలో టెన్త్ చదివింది. శనివారం వెలువడిన పరీక్షా ఫలితాల్లో తన స్నేహితులకు 9.5, 9.3 జీపీఏ రాగా.. త్రివేణికి 7.3 జీపీఏ వచ్చింది. స్నేహితుల కంటే తాను బాగా చదివేదాన్ని అని, తనకంటే వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని అదే రోజు సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. అది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే మీర్‌పేటలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. -
ముగ్గురిని కాటేసిన కరెంట్
సరూర్‌నగర్ :కరెంట్ ముగ్గురిని బలిగొంది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ ఘటనల వివరాలు.. తల్లిదండ్రులకు ఆర్థిక చేయూత నిద్దామనే ఉద్దేశంతో సెంట్రింగ్ పనికి వెళ్లిన పాలిటెక్నిక్ విద్యార్థి ప్రాణాన్ని కరెంట్ బలిగొంది. మీర్‌పేట పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం ఈ విషాద ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...దేవరకొండ మండలం కంబాలపల్లి పక్కనున్న రేకులారం గ్రామానికి చెందిన కూర ముత్తయ్య, ఈదమ్మ దంపతులు బడంగ్‌పేటలో నివాసం ఉంటున్నారు. వీరి మూడో కుమారుడు వెంకటేష్ (19) మీర్‌పేటలోని టీకేఆర్ కాలేజీలో పాలిటెక్నిక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో కుటుంబానికి ఆసరాగా ఉండేదుకు సెంట్రింగ్ పనికి వెళ్తున్నాడు. బడంగ్‌పేటలోని గాయత్రి హిల్స్ కాలనీలో భవన నిర్మాణం కోసం ఓ బిల్డర్ గోతులు తీయించాడు. వాటిలో పిల్లర్లు వేసేందుకు శనివారం ఇనుప చువ్వలను క టింగ్ చేస్తున్నారు. విద్యుత్ తీగలకు నేరుగా కొండీలు తగిలించి కటింగ్ మిషీన్కు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నారు. చువ్వలను కటింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు వాటికి విద్యుత్ సరఫరా కావడంతో వెంకటేష్ విద్యాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి తల్లిదండ్రులు, తమ్ముడు, చెల్లెలు ఘటనా స్థలానికి వచ్చి రోదించిన తీరు స్థానికులను కలచి వేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పలు సంఘాల నాయకులు వెంకటేష్ కుటుంబానికి న్యాయం చేయాలని బిల్డర్‌ను డిమాండ్ చేశారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. బద్యాతండాలో.. పాశ్చ్యానాయక్‌తండ(చివ్వెంల) : విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని పాశ్చ్యానాయక్‌తండా ఆవాసం బద్యాతండాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం...తండాకు చెందిన భానోతు బీల్సింగ్(45) రాత్రి స్నానం చేసి దండెంపై వేసిన దుస్తులు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో రేకుల కింద వేసిన ఇనుప పైపు నుంచి దండానికి కట్టిన వైరుకు విద్యుత్ సరఫరా జరిగి ప్రమాదానికి గురై అక్కడికక్కడే మృతిచె ందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కట్టంగూర్ (ఇస్మాయిల్పల్లి) : విద్యుదాఘతంతో రైతుమృతిచెందిన సంఘటన మండలంలోని పిట్టంపల్లి గ్రామ పంచాయతీ పరిధి ఇస్మాయిల్‌పల్లిలో శనివారం జరిగింది. కుటుంబ సభ్యు లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అదే గ్రామానికి చెందిన రైతు అలుగుబెల్లి లక్ష్మారెడ్డి (40) ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెల్లి మోటార్ ఆన్ చేయడంతో ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అయ్యింది. దీంతో రైతు ట్రాన్స్ఫార్మర్ వద్ద ఫీజ్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఈఘటన చోటు చేసుకుందని రైతులు ఆరోపిస్తూ కట్టంగూర్ సబ్‌స్టేషన్ ఎదురుగా ఉన్న నల్లగొండ రోడ్డుపై మృతదేహంతో రాస్తారోకోకు దిగారు. దీంతో పోలీసులు అడ్డుకోవటంతో సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. విద్యుత్ అధికారులు ఎవరు స్పందించలేదు. దీంతో పోలీసుల ట్రాన్స్‌కో సిబ్బ ం ది తో మాట్లాడి మృతుడి కుటుంబానికి న్యా యం చేసే విధంగా చర్యలు తీసుకుంటామ ని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని కేసు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ పర్వతాలు తెలిపారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు కలరు.