సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలూ ఖరారయ్యాయి. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, బహదూర్‌పురా మండలాల్లో ఎకరం రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.24.22 కోట్లకు పెంచారు.
ఆ తర్వాత హైదర్‌నగర్, కూకట్‌పల్లి, బాలానగర్, మూసాపేట్ మండలాల్లో ప్రస్తుతం ఎకరం రూ.18.87 కోట్లు, కర్మన్‌ఘాట్‌లో రూ. 13.55 కోట్లు, మాదాపూర్‌లో రూ. 12.58 కోట్లు ఉండగా.. ఈ విలువను 10 శాతం పెంచారు.
ఆ తర్వాత గచ్చిబౌలి, మియాపూర్, నానక్‌రాంగూడ లో రూ.9.43 కోట్లు, నిజాంపేట, అత్తాపూర్‌లో రూ.6.29 కోట్లు, నాగోల్ బండ్లగూడలో రూ. 5.03 కోట్లుగా ఉన్న విలువను 20 శాతం పెంచారు. కాగా సాగు, సాగేతర భూముల విలువలన్నిటినీ శనివారం జిల్లాల్లో జరిగే కమిటీలు ఆమోదించనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment