goveranament
-
ఎలైట్ వైన్స్.. బార్లు!
సాక్షి, హైదరాబాద్: లాటరీ ప్రక్రియ, పోటీలేకుండా నేరుగా లైసెన్సులు ఇచ్చే ‘ఎలైట్ బార్ల’తరహాలో.. ‘ఎలైట్ వైన్స్’విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న ఏ4 కేటగిరీ వైన్‌షాపులకు అదనంగా.. నగర ప్రాంతాల్లో ఈ ఎలైట్ వైన్స్ ఏర్పాటుకు అనుమతించే దిశగా కసరత్తు ప్రారంభించింది. వీటికి సాధారణ వైన్‌షాపుల కంటే కనీసం రెండింతలు, ఆపైన లైసెన్స్ ఫీజులను నిర్ణయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇలా నేరుగా లైసెన్సు మంజూరు చేసిన ‘టానిక్’ఎలైట్ వైన్‌షాపులు ఉన్నాయి. వాటికి ఇచ్చిన ఐదేళ్ల లైసెన్సుల గడువు ఈ ఏడాది మార్చితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో.. టానిక్ షాపుల తరహాలోనే మరిన్ని ఎలైట్ వైన్‌షాపులు ఏర్పాటు చేసేందుకు.. వీటితోపాటు మరిన్ని వాకిన్ స్టోర్స్ (సూపర్ మార్కెట్ల తరహాలో లోనికి వెళ్లి నచ్చినవి ఎంచుకునే ఉండేవి)ను ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. అంతేగాకుండా హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో బార్ల సంఖ్యను కూడా పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. బార్లకు బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. కొందరు బార్ లైసెన్సులను ఇతరులకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, అలా కాకుండా బార్ల సంఖ్యను పెంచడం ద్వారా డిమాండ్ తీరి, సర్కారుకు అదనపు ఆదాయమూ సమకూరుతుందని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎక్సైజ్ ఆదాయం పెంపుకోసం.. 2023–24లో రూ.19,884.90 కోట్ల మేర ఎక్సైజ్ ఆదాయాన్ని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగినట్టుగా రాబడి ఉంది. కాంగ్రెస్ సర్కారు తాజాగా పెట్టిన బడ్జెట్ (2024–25)లో మరో రూ. 6 వేల కోట్లు అదనంగా.. రూ.25,617.52 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకుంది. అంటే ప్రతి నెలా రూ.500 కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని సమీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం మద్యం ధరలు పెంచాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదన చేసినా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఎలైట్ వైన్స్ ఏర్పాటు, బార్ల సంఖ్య పెంచడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న దానిపై మాత్రం సానుకూలత వచ్చినట్టు ఎక్సైజ్‌శాఖ వర్గాలు చెప్తున్నాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం యథాతథం సర్కారు తాజా బడ్జెట్లో రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయ పద్దులో.. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ అంచనాలను యథాతథంగా కొనసాగించింది. గత బడ్జెట్ (2023–24)లో రూ.18,500 కోట్ల మేర రిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకోగా.. ఈసారి (2024–25) స్వల్పంగా తగ్గించి రూ.18,228 కోట్ల రాబడి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదనలను బట్టి ఈ ఏడాది భూముల విలువల పెంపు ఉండదని తెలుస్తోంది. ► వాహనాల పన్నుల ద్వారా రూ.8,477 కోట్లు, జీఎస్టీ ద్వారా రూ.50,762 కోట్లు వస్తుందని తాజా బడ్జెట్లో పేర్కొంది. జీఎస్టీ ద్వారా 2023–24లో రూ.40వేల కోట్ల రాబడి అంచనా వేయగా.. ఈసారి ఏకంగా రూ.10వేల కోట్లకుపైగా పెంచడం గమనార్హం. ఇక కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ)లో వాటా ద్వారా మరో రూ.7,838 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. ► 2023–24లో వ్యాపార, అమ్మకపు పన్ను ద్వారా రూ.39,500 కోట్లు వస్తాయని అంచనా వేయగా రూ.34,166 కోట్లు సమకూరాయి. దీంతో ఈసారి ఈ పద్దు కింద ఆదాయ అంచనాను గతంకన్నా తక్కువగా రూ.33,449 కోట్లుగా సర్కారు పేర్కొంది. ► పన్నేతర ఆదాయాన్ని కూడా ఈసారి బడ్జెట్లో తగ్గించి చూపెట్టారు. గత బడ్జెట్లో దీనిని రూ.22,801 కోట్లుగా అంచనా వేయగా.. తాజా బడ్జెట్లో రూ.20,658 కోట్లకు తగ్గించారు. అంటే ప్రజలపై నేరుగా భారం వేయకుండా, ఇతర మార్గాల ద్వారా పన్ను ఆదాయం పెంచుకునే దిశలో సర్కారు బడ్జెట్ ప్రతిపాదనలు చేసినట్టు స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. -
‘హిట్ అండ్ రన్’కు ఏ దేశంలో ఎటువంటి శిక్ష?
కేంద్ర ప్రభుత్వం ‘హిట్ అండ్ రన్’ కేసులో కఠినమైన నిబంధనలను రూపొందించింది. పదేళ్ల జైలు శిక్ష, రూ. 7 లక్షల జరిమానా విధించింది. దేశంలో చాలావరకూ రోడ్డు ప్రమాదాలు నిర్లక్ష్యం కారణంగానే చోటుచేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందుతున్నవారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. మనదేశాన్ని మినహాయించి ఇతర దేశాల్లో ‘హిట్ అండ్ రన్’ కేసులలో ఎలాంటి శిక్ష ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. బంగ్లాదేశ్ బంగ్లాదేశ్‌లో వాహన చట్టం, 1927 ప్రకారం ప్రమాదం జరిగిన తర్వాత, పోలీసులు అక్కడికి వచ్చి చర్యలు చేపట్టే వరకు వాహనం డ్రైవర్ తన వాహనంతో పాటు అక్కడే ఉండాలి. బంగ్లాదేశ్‌లో హిట్ అండ్ రన్ లేదా ఏ వాహన సంబంధిత ప్రమాదంలో ఎవరైనా మరణిస్తే అందుకు కారకులైనవారు నేరస్తులవుతారు. ‘హిట్ అండ్ రన్’కేసులో మరణశిక్ష విదించే అవకాశం కూడా ఉంది. ఇటువంటి కేసులో డ్రైవర్‌ను వెంటనే అరెస్టు చేస్తారు. అతనికి బెయిల్ లభించే అవకాశం కూడా ఉండదు. చైనా చైనాలో ‘హిట్ అండ్ రన్’లో పెను ప్రమాదం జరిగితే నేరస్తుని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తారు. జీవితకాల నిషేధం కూడా ఉండవచ్చు. చైనా క్రిమినల్ కోడ్, ఆర్టికల్ 133 కింద హిట్ అండ్ రన్ కేసులో తీవ్రమైన శారీరక హాని లేదా మరణం సంభవించినట్లయితే, నేరస్తునికి 3 నుండి 7 సంవత్సరాల జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. బ్రిటన్ యూకేలో ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే డ్రైవర్ తన పూర్తి పేరు, చిరునామాను పోలీసులకు తెలియజేయాలి. అలాంటి సందర్భాలలో నేరస్తునికి గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష, ఐదు వేల పౌండ్ల జరిమానా కూడా ఉంటుంది. దీనితో పాటు అతను డ్రైవింగ్ చేయకుండా నిషేధం విధిస్తారు. అమెరికా యునైటెడ్ స్టేట్స్లో ‘హిట్ అండ్ రన్’లో విధించే శిక్ష ప్రతీ రాష్ట్రానికీ మారుతూ ఉంటుంది. దీనిని థర్డ్ డిగ్రీ నేరంగా పరిగణిస్తారు. శిక్షాకాలం ఒకటి నుంచి ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. దీంతో పాటు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో హిట్ అండ్ రన్ ఉదంతంలో డ్రైవర్ ప్రమాద స్థలంలో వాహనాన్ని ఆపి, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఆస్ట్రేలియాలో ట్రాఫిక్ నేరాల కోసం ఒక ప్రత్యేక కమిషన్ ఉంది. ఇది ప్రతి రోడ్డు ప్రమాదంలో దాని తీరుతెన్నులను గమనించి డ్రైవర్‌కు ఒక పాయింట్‌ను ఇస్తుంది. దీని ప్రకారం డ్రైవర్‌కు జరిమానా విధించవచ్చు. లేదా అతని లైసెన్స్‌ను సస్పెండ్ లేదా రద్దు చేసే అవకాశం ఉంది. కెనడా కెనడాలో క్రిమినల్ కోడ్ ప్రకారం ‘హిట్ అండ్ రన్’ను నేరంగా పరిగణిస్తారు. ఇటువంటి కేసులో ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రమాదంలో ఎవరైనా మృతి చెందితే అందుకు కారకులపై గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. దక్షిణ కొరియా దక్షిణ కొరియాలో ‘హిట్ అండ్ రన్’ తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. అలాంటి ప్రమాదంలో ఎవరైనా చనిపోయి, డ్రైవర్ పరారైతే అతనికి కనీసం ఐదేళ్ల జైలు లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధిస్తారు. దీనితో పాటు భారీ జరిమానా కూడా ఉంటుంది. హాంకాంగ్ హాంకాంగ్‌లో ప్రమాదం జరిగిన తర్వాత, డ్రైవర్ వెంటనే వాహనం ఆపివేయాలి. అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నేరస్తుడు హిట్ అండ్ రన్ ప్రమాదంలో బాధితులకు సహాయం చేయకపోతే, అతనికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. న్యూజిలాండ్ న్యూజిలాండ్‌లో ప్రమాదానికి కారణమైన డ్రైవర్లు వాహనాన్ని తప్పనిసరిగా ఆపాలి. ఒకవేళ డ్రైవర్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి పారిపోతే, అతనికి మూడు నెలల జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అతని డ్రైవింగ్ లైసెన్స్ కనీసం ఆరు నెలల పాటు సస్పెండ్ చేసేందుకు అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే అందుకు కారకులపై ఐదేళ్ల జైలు శిక్ష లేదా 20 వేల న్యూజిలాండ్ డాలర్లు జరిమానాగా విధించే అవకాశం ఉంది. అలాగే అతని డ్రైవింగ్ లైసెన్స్‌ను ఏడాది పాటు రద్దు చేసేందుకు అవకాశం ఉంది. -
వారికి పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి - అతిక్రమిస్తే రూ. 10 లక్షలు జరిమానా!
ఆధునిక కాలంలో సిమ్ కార్డులతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు మోడీ ప్రభుత్వం సిమ్ డీలర్లకు పోలీసు వెరిఫికేషన్‌ను తప్పనిసరి చేసింది, దీనితో పాటు బల్క్ కనెక్షన్లను కూడా నిలిపివేసింది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రూ. 10 లక్షల జరిమానా.. ఇప్పుడు డీలర్లందరికి పోలీసు వెరిఫికేషన్ అండ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరి అని కేంద్ర టెలికాం మంత్రి 'అశ్విని వైష్ణవ్' తెలిపారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని కూడా ప్రకటించారు. సంచార్ సాథి పోర్టల్‌ను ప్రారంభించినప్పటి నుంచి సుమారు 52 లక్షల మోసపూరిత కనెక్షన్లను ప్రభుత్వం గుర్తించి వాటిని డీయాక్టివేట్ చేసినట్లు వైష్ణవ్ వెల్లడించారు. మొబైల్ సిమ్ కార్డులను విక్రయిస్తున్న 67,000 మంది డీలర్లను ప్రభుత్వం బ్లాక్‌లిస్ట్ చేసిందని.. 2023 మే నుంచి 300 మంది సిమ్ కార్డ్ డీలర్లపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు కూడా మంత్రి తెలిపారు. గతంలో ప్రజలు సిమ్ కార్డులను విరివిగా కొనుగోలు చేశారని, ఆ విధానానికి స్వస్తి పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ.. మేము మోసపూరిత కాల్‌లను ఆపడంలో సహాయపడే సరైన బిజినెస్ కనెక్షన్ నిబంధనను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: అసాధారణ విజయాలు.. రోజుకు రూ. 72 లక్షలు జీతం.. అంతేకాదు.. నివేదికల ప్రకారం.. 10 లక్షల మంది సిమ్ డీలర్లు ఉన్నారని, వారికి పోలీస్ వెరిఫికేషన్ కోసం తగిన సమయం ఇస్తామని వైష్ణవ్ చెప్పారు. టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ కూడా బల్క్ కనెక్షన్ల సదుపాయాన్ని నిలిపివేసిందని, బదులుగా బిజినెస్ కనెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో మోసపూరిత కాల్స్ పూర్తిగా అరికట్టడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. -
‘డబుల్ బెడ్రూం’ దరఖాస్తులపై డబుల్ విచారణ
సాక్షి,హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో డబుల్ బెడ్రూం ఇళ్ల దరఖాస్తులపై క్షేత్రస్థాయి విచారణ శరవేగంగా సాగుతోంది. జీహెచ్ఎంసీ, రెవెన్యూ బృందాలు రంగలోకి దిగి దరఖాస్తుదారుడి డోర్ టు డోర్ విచారణ నిర్వహిస్తున్నారు. కుటుంబాల పూర్తి స్థాయి వివరాలు సేకరిస్తున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం సుమారు ఏడు లక్షలకు పైగా కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇప్పటికే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించేందుకు ప్రత్యేక యాప్ ద్వారా ఓటరు కార్డు, అవసరమైన వివరాలను అప్లోడ్ చేశారు. క్షేత్ర స్థాయి విచారణ విచారణ జరగలేదు. తాజాగా ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో నియోజకవర్గానికి కొంత డబుల్ బెడ్రూం కోటా కేటాయించడం దరఖాస్తులపై కదలిక వచ్చినట్లయింది. శివారులోనే అధికం.. ► జీహెచ్ఎంసీలో నిర్మాణం చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లలో ఎక్కువశాతం నగర శివారులోనే ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో 38,419 ఇళ్లు ఉండగా.. హైదరాబాద్ జిల్లాలో 9,453, రంగారెడ్డి జిల్లాలో 23,908, సంగారెడ్డి జిల్లాలో 28,220 ఇళ్లున్నాయి. వీటిలో పాత ఇళ్లు, గుడిసెలను కూల్చి అక్కడే కొత్తగా నిర్మించిన వాటిని మాత్రం ఇప్పటికే పంపిణీ చేశారు. ► నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణానికి సరిపడా స్థలాలు లేనందున శివారు ప్రాంతాల్లో ఎక్కువగా నిర్మించారు. నగరంలో ఉంటున్న వారికి కూడా ఆయా ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించనున్నారు. ఇప్పటికే కొల్లూరులో సుమారు 15,660 గృహాలు నిర్మించి లాంఛనంగా ప్రారంభించారు. మరికొన్ని ప్రాంతాల్లో నిర్మించిన గృహాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం అన్ని అర్హతలు సాధించిన దరఖాస్తులు నియోజకవర్గాల వారీగా లక్కీడ్రా ద్వారా ఎంపిక చేసి కేటాయించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లను ఇప్పిస్తామంటూ దళారులు దరఖాస్తుదారులకు గాలం వేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 111 ప్రాంతాల్లో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అందులో పాత గృహాలు తొలగించిన (ఇన్ సీటు) 40 ప్రాంతాల్లో 8,898 గృహాలు, 71 ఖాళీ స్థలాల్లో 91,102 గృహాలు నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించి పనులు చేపడుతున్నారు. ఇప్పటికే మొత్తం మీద 71 ప్రాంతాల్లో 68,176 ఇళ్లు నిర్మాణం పూర్తి చేశారు. మిగతా 38 ప్రాంతాల్లో వివిధ ప్రగతి దశలో కలవు. రెండు లొకేషన్లలో 2,026 గహాలు వివిధ కారణాల వల్ల నిర్మాణాలు నిలిచిపోయాయి. 42 ప్రాంతాల్లో చేపట్టిన 62,516 రెండు పడకల గదులు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మారో 29 లొకేషన్ (ఇన్ సీటు)పేదల పాత గృహాలు తొలగించి 5,660 కొత్త ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు. ► జీహెచ్ఎంసీ పరిధిలో 40 ఇన్ సీటు లొకేషన్ 8,898 రెండు పడకల గదులు, 17 వేకెంట్ ప్రదేశంలో 5,775 గృహాలు మొత్తం 57 లొకేషన్లలో 14,673 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ మధ్యలో 32 ఖాళీ ప్రదేశాల్లో 49,991 గృహ నిర్మాణాలు చేపట్టారు. ఓఆర్ఆర్ బయట ఉన్న 22 ఖాళీ ప్రదేశాల్లో 35,336 ఇళ్లు కడుతున్నారు. జిల్లాల వారీగా ఇలా.. హైదరాబాద్ జిల్లాలో మొత్తం ఇన్ సిటు, ఓపెన్ గల 38 లొకేషన్లలో 13 నియోజకవర్గాల పరిధిలో 70.73 ఎకరాల స్థలంలో 9453 గృహాలు. రంగారెడ్డి జిల్లాలో 30 లొకేషన్లలో 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 151.36 ఎకరాల స్థలంలో 23,908 ఇళ్లు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 33 లొకేషన్లలో 3 నియోజకవర్గాల పరిధిలో 38,419, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో 191.79 ఎకరాల్లో 10 లొకేషన్లలో 28,220 గృహ నిర్మాణాలు చేపట్టారు. 111 ప్రాంతాల్లో 668.73 ఎకరాల స్థలంలో లక్ష ఇళ్ల నిర్మాణాలను చేపట్టారు. -
గడప గడపకు మన ప్రభుత్వంపై ముగిసిన సీఎం జగన్ సమీక్ష
-
తెలంగాణలో ఎకరం రూ.24.22 కోట్లు.. ఎక్కడంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువలూ ఖరారయ్యాయి. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్, బహదూర్‌పురా మండలాల్లో ఎకరం రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను రాష్ట్రంలోనే అత్యధికంగా రూ.24.22 కోట్లకు పెంచారు. ఆ తర్వాత హైదర్‌నగర్, కూకట్పల్లి, బాలానగర్, మూసాపేట్ మండలాల్లో ప్రస్తుతం ఎకరం రూ.18.87 కోట్లు, కర్మన్‌ఘాట్‌లో రూ. 13.55 కోట్లు, మాదాపూర్‌లో రూ. 12.58 కోట్లు ఉండగా.. ఈ విలువను 10 శాతం పెంచారు. ఆ తర్వాత గచ్చిబౌలి, మియాపూర్, నానక్‌రాంగూడ లో రూ.9.43 కోట్లు, నిజాంపేట, అత్తాపూర్‌లో రూ.6.29 కోట్లు, నాగోల్ బండ్లగూడలో రూ. 5.03 కోట్లుగా ఉన్న విలువను 20 శాతం పెంచారు. కాగా సాగు, సాగేతర భూముల విలువలన్నిటినీ శనివారం జిల్లాల్లో జరిగే కమిటీలు ఆమోదించనున్నాయి. -
భూముల రిజిస్ట్రేషన్ల పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది
-
ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేదిలేదు
-
నార్త్ అమెరికా ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా రత్నాకర్
-
‘డీఎస్సీ–2018’ నియామకాలు వేగవంతం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ–2018 నియామకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. న్యాయస్థానాల్లో ఉన్న కేసులు సాధ్యమైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూడాలని, డీఎస్సీ నియామకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించడంతో అధికారులు ఆ దిశగా చర్యలు వేగవంతం చేశారు. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి టీచర్ పోస్టుల నియామకాలు చేపడతామని అధికారులు గతంలో సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు. అయితే, హైకోర్టులో ప్రస్తుతం ఉన్న కేసుల నేపథ్యంలో సెప్టెంబర్ 5 నాటికి నియామకాలు పూర్తి కాకపోవచ్చని అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టుకు నివేదించిన గడువులోగా కాకున్నా పది రోజులు అటు ఇటుగా ఈ నియామకాలు పూర్తి చేస్తామని అంటున్నారు. కోర్టుల్లో ఉన్న కేసులను పరిష్కారమయ్యేలా చూసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. టీచర్ పోస్టుల భర్తీపై ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో చర్చ జరిగింది. అన్ని తరగతులకూ టీచర్లుండేలా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. డీఎస్సీ–2018లోని 7,902 పోస్టుల నియామకాలను వేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏడు సబ్జెక్టులపై న్యాయ వివాదాలు.. రాష్ట్రంలో 7,902 టీచర్ పోస్టుల భర్తీ కోసం 2018 అక్టోబర్ 10న ప్రభుత్వం టీఆర్టీ, టెట్ కమ్ టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేసింది. అదే ఏడాది డిసెంబర్ 24 నుంచి 2019 జనవరి 31 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. 6,08,155 మంది దరఖాస్తు చేయగా, 5,89,165 మందికి హాల్‌టికెట్లు జారీ చేశారు. వీరిలో 5,05,547 మంది పరీక్ష రాశారు. అయితే, ఫలితాలు, మెరిట్ జాబితాలు, సెలెక్షన్ జాబితాల విడుదలకు షెడ్యూల్ ప్రకటించినా అవి అనుకున్న తేదీల్లో వెలువడలేదు. చివరకు మెరిట్ జాబితాలను ప్రకటించి జిల్లాల వారీగా అర్హులైన అభ్యర్థుల ఎంపికను ఆన్లైన్ విధానంలో చేపడుతూ సుదీర్ఘ షెడ్యూల్ విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం కూడా ఎంపిక ప్రక్రియ ముందుకు సాగలేదు. మెరిట్ జాబితాల విడుదల ఆలస్యం కావడం ఒకటైతే, మరోవైపు సెలెక్షన్ జాబితాల విడుదలలో కూడా జాప్యం జరగడం నియామకాలకు అడ్డంకిగా మారింది. ఈ తరుణంలో వివిధ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. దీంతో కొన్ని సబ్జెక్టుల్లో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఏడు సబ్జెక్టులపై న్యాయ వివాదాలు కొనసాగుతున్నాయి. -
అన్యమత ప్రచారంపై ప్రభుత్వం సీరియస్
సాక్షి, అమరావతి: తిరుమలలో బస్ టికెట్లపై అన్యమత ప్రచార ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు టిమ్ రోల్స్ సరఫరా చేసిన అధికారులు, కాంట్రాక్టర్లుపై రవాణా శాఖ విచారణ చేపట్టింది. టీడీపీ హయాంలోని కాంట్రాక్టర్లే బస్ టికెట్ల టిమ్ రోల్స్ పంపిణీ చేసినట్లుగా అధికారులు నిర్ధారించారు. నెల్లూరు డిపో నుంచి తిరుమలకు టిమ్ రోల్స్‌ను కాంట్రాక్టర్ సరఫరా చేశారు. నివేదిక రాగానే బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల ఆర్టీసీ డిపో మేనేజర్ వివరణ ఆర్టీసీ ద్వారా అన్యమత యాత్రా ప్రచారం జరగలేదని తిరుమల ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిధర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ టికెట్ల వెనుక ముద్రించి ఉన్నవి గత టీడీపీ ప్రభుత్వ పథకాల వివరాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని డిపోలలోని ఆర్టీసీ టికెట్ల వెనుక ఇవి ముద్రించి ఉన్నాయని, అలా గత ప్రభుత్వ పథకాలతో ముద్రించిన కొన్ని రోల్స్ తిరుమల డిపోకు వచ్చాయని వివరించారు. గత ప్రభుత్వ పథకాల గురించి ముద్రించి ఉన్న టికెట్లను వెనక్కు పంపించి వేశామని తెలిపారు. -
కొరత లేకుండా ఇసుక
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత లేకుండా అవసరమైనంత మేర అందుబాటులో ఉంచే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాధారణంగా వర్షాల సమయంలో నదుల్లో నీరు ప్రవహించడం వల్ల రీచ్‌లలో ఇసుక తవ్వకం సాధ్యం కాదు. దీంతో ఇసుక కొరత ఏర్పడుతోంది. రాష్ట్రంలో కొన్నిచోట్ల నిర్మాణాలకు ఇసుక దొరకడం లేదన్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో పరిస్థితి చక్కదిద్ది, ప్రజలకు సులభంగా ఇసుకను అందుబాటులో ఉంచడానికి ప్రణాళికను రూపొందించింది. విశాఖ, ప్రకాశం జిల్లాల్లో పెద్ద నదులు లేకపోవడం వల్ల స్థానికంగా ఇసుక కొరత తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విశాఖ జిల్లాకు శ్రీకాకుళం జిల్లాలోని పురుషోత్తపురం, తూర్పుగోదావరి జిల్లాలోని కేతవానిలంక డీసిల్టేషన్ పాయింట్‌ను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ రెండు చోట్ల మొత్తం 1,75,000 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాల అవసరాల కోసం నెల్లూరు జిల్లా బుచి్చరెడ్డిపాలెం మండలంలోని మినవాగు ఇసుక రీచ్‌ను కేటాయించింది. ఇక్కడ 28,000 క్యూబిక్ మీటర్ల ఇసుక అందుబాటులో ఉంది. ఇతర రాష్ట్రాల నుంచి ఎంతైనా తెచ్చుకోవచ్చు: ఏపీ నుంచి ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించడానికి వీల్లేదు. పొరుగు రాష్ట్రాల నుంచి ఎంతైనా ఇసుక తెచ్చుకోవచ్చు. ఒడిశాలో ఇసుక భారీగా అందుబాటులో ఉంది. అక్కడి నుంచి ఎవరు ఇసుక తెచ్చుకున్నా చెక్‌పోస్టుల్లో అభ్యంతరం పెట్టరు. ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎవరు ఇసుక తెప్పించుకున్నా అడ్డుకోవద్దని ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ‘‘మన రాష్ట్రంలో భవిష్యత్తులో ఇసుక కొరత ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ఇతర రాష్ట్రాలకు ఇసుకను రవాణా చేయడంపై నిషేధం ఉంది. పొరుగు రాష్ట్రాల నుంచి ఇసుక తెప్పించుకోవడంపై ఎలాంటి ఆంక్షలు లేవు’’’ అని భూగర్భ గనుల శాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. దూరాన్ని బట్టి ధర నిర్ణయం : రాష్ట్రంలో సెప్టెంబర్ 5వ తేదీన కొత్త విధానం అమల్లోకి రానుంది. నిర్మాణాలకు ఇసుక అవసరమైన వారు అధికారులకు దరఖాస్తు చేసి, పరి్మట్లు తీసుకుని తెచ్చుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయినా కొందరు వ్యక్తులు ఇసుక కొరత ఏర్పడిందని ప్రచారం చేసి, అధిక ధరలు వసూలు చేస్తున్నారని ప్రభుత్వం దృష్టికి వచి్చంది. ఈ పరిస్థితి ఎక్కువగా విశాఖ, ప్రకాశం జిల్లాల్లో ఉన్నట్లు గుర్తించింది. అందుకే సమీపంలోని జిల్లాల్లో రీచ్‌లు కేటాయించింది. లారీ ఇసుకకు లోడింగ్, అన్లోడింగ్ చార్జీలు, క్వారీ నుంచి ఎంత దూరం ఉందో లెక్కగట్టి రవాణా వ్యయాన్ని నిర్ణయించి అంతకంటే ఎక్కువ మొత్తం వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించింది. దూరాన్ని ధర ఎంత ఉండాలో నిర్ణయించి, అమలు చేసేలా చూడాలని భూగర్భ గనుల శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. -
6కిపైగా కొత్త పారిశ్రామిక పాలసీలు !
సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా త్వరలో 6కిపైగా నూతన పారిశ్రామిక విధానాలను ప్రకటించనున్నట్లు పరిశ్రమలు, వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. ప్రస్తుత పాలసీల కంటే అధిక ప్రయోజనాలను అందించేలా 3 – 5 నెలల వ్యవధిలో కొత్త విధానాలను అమలులోకి తెస్తామన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన డిప్లొమాటిక్ ఔట్ రీచ్ కార్యక్రమంలో పెట్టుబడులు, పారిశ్రామికాభివృద్ధిపై ఆయన మాట్లాడారు. సమగ్ర పారిశ్రామిక పాలసీతోపాటు, ఆటోమొబైల్, ఐటీ, బయోటెక్నాలజీ, పెట్రో కెమికల్స్, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ లాంటి ఆరుకు పైగా రంగాలకు ప్రత్యేక పాలసీలను తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు సహకారం అందించేందుకు ఢిల్లీలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కార్యాలయాలు ప్రారంభించాలనుకుంటే ఉచితంగా ఆఫీస్ స్పేస్‌ను అందచేస్తామన్నారు. రాష్ట్రానికి 974 కి.మీ సుదీర్ఘ తీర ప్రాంతంతోపాటు నాలుగు పోర్టులు అందుబాటులో ఉన్నాయని, త్వరలోనే మరో నాలుగు పోర్టులు నిర్మించనున్నామని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు అవకాశం ఏపీలో ఇప్పటికే 6 ఎయిర్‌పోర్టులు అందుబాటులో ఉండగా మరో మూడు నిర్మాణ దశలో ఉన్నాయని రజత్ భార్గవ చెప్పారు. విశాఖ సమీపంలో ఏర్పాటు చేస్తున్న కొత్త ఎయిర్‌పోర్టులో పెట్టుబడులు పెట్టడానికి జ్యూరిచ్ ఆసక్తి వ్యక్తం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని కోరారు. కొరియా, చైనా, బ్రిటన్ తదితర దేశాలు ఉక్కు కర్మాగారాల ఏర్పాటుపై ఆసక్తి చూపిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజారవాణా వ్యవస్థలో డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఆటోమొబైల్ రంగంలో భారీ పెట్టుబడులకు ఏపీలో అవకాశాలున్నాయన్నారు. 31 చోట్ల ఎంఎస్ఎంఈ పార్కులను కూడా ఏర్పాటు చేశామన్నారు. కష్టాల్లో ఉన్న 86,000కిపైగా ఎంఎస్ఎంఈలకు నవోదయం పథకం కింద రుణాలను రీ షెడ్యూల్ చేయడం ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. కాకినాడ సెజ్‌లో పెట్రో కెమికల్స్‌లో భారీ పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలున్నాయని, పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఏపీలో అపార అవకాశాలు రాష్ట్రంలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పర్యాటక, సాంస్కృతిక, యువజనాభివృద్ధి ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆధ్యాత్మిక కేంద్రాల నుంచి బీచ్ టూరిజం, ఎకో టూరిజం వరకు అనేక సర్క్యూట్లు ఉన్నాయని, వీటిని వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలోని బౌద్ధ కేంద్రాల్లో ఉన్న అవకాశాలను జపాన్ లాంటి దేశాలు వినియోగించుకోవాలన్నారు. హెల్త్ టూరిజంలో కూడా పెట్టుబడులకు రాష్ట్రం అనువైనదని వివరించారు. అపోలో, కేర్, రెయిన్బో లాంటి ప్రముఖ ఆస్పత్రులు ఇప్పటికే ఏర్పాటయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 86,219 మంది డాక్టర్లు ఉండగా ఏటా 29 వైద్య కళాశాలల నుంచి 5,000 మందికిపైగా గ్రాడ్యుయేట్లు పట్టాలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా పరిపుష్టి సాధించడం కోసం ప్రభుత్వం నవరత్నాలు ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తోందని ముఖ్యమంత్రి సలహాదారు ఎం.శామ్యూల్ తెలిపారు. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, దశలవారీ మధ్యనిషేధం, జలయజ్ఞం, ఫించన్ల పెంపు, ఫీజు రీయింబర్స్మెంట్, అందరికీ ఇల్లు లాంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఏపీలో ఫిషరీస్‌తో పాటు పాడి, పశుసంవర్థక రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలున్నాయని మత్స్య, పశుసంవర్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య వివరించారు. అనూహ్య స్పందన: విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి హరీష్ రాష్ట్రాల్లో పెట్టుబడుల అవకాశాలను గుర్తించేందుకు తొలిసారిగా ఏర్పాటు చేసిన డిప్లొమాటిక్ ఔట్రీచ్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని విదేశాంగ శాఖ అదనపు కార్యదర్శి పి.హరీష్ తెలిపారు. శుక్రవారం విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పలు దేశాల రాయబారులు, ప్రతినిధులు హాజరుకావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఏపీలో అపార అవకాశాలున్నాయని దీన్ని వినియోగించుకోవాల్సిందిగా విదేశీ ప్రతినిధులను కోరారు. -
మద్యంపై ఎన్నికల సుంకం విదించనున్న చంద్రబాబు సర్కార్
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు సర్కార్ దిగిపోయేముందు మద్యంపై ఎన్నికల సుంకం విధించింది. ఎన్నికల వేళ తమ పార్టీ అభ్యర్థుల ఖర్చు కోసం నిధుల సమీకరణకు మద్యం వ్యాపారుల దోపిడీకి అడ్డగోలుగా అనుమతించింది. ఎన్నికల్లో అమ్మకాలు పెరగనున్న నేపథ్యంలో లిక్కర్ బాటిల్‌కు రూ.5 పెంచి విక్రయించుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటిలో రూ.2లు ఎన్నికల్లో పోటీచేసే టీడీపీ అభ్యర్థులకు వ్యాపారులు చెల్లించాలనే నిబంధన పెట్టడం గమనార్హం. ఇన్నాళ్లూ ఎమ్మార్పీపై కొంత పర్సంటేజీ వేసుకుని అమ్ముకోవడానికి వీలు కల్పించేది. రెండేళ్ల క్రితం ఎక్సైజ్ కమిషనర్‌గా లక్ష్మీనరసింహం వచ్చాక దీనికి ఒకింత అడ్డుకట్ట వేశారు. ఇది మింగుడు పడని లిక్కర్ సిండికేట్లు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చి ఆయనను బదిలీ చేయించా యన్న ఆరోపణలొచ్చాయి. లక్ష్మీనరసింహం బదిలీపై వెళ్లిపోయాక మద్యం సిండికేట్ నిర్వాహకులు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని గతంలో మాదిరిగా అధిక ధరలకు విక్రయాలు జరుపుకునేందుకు అనధికార అనుమతులు తెచ్చుకున్నారు. మునుపటిలా ఎమ్మార్పీ ధరలపై ఇష్టానుసారం పెంచుకోవడానికి బదులు బాటిల్‌కు రూ.5 పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించారు. జిల్లాలోను, నగరంలోనూ వెరసి 401 మద్యం దుకాణాలున్నాయి. వీటికి జూలై ఆఖరి వరకు లైసెన్స్‌ల గడువుంది. సాధారణ రోజుల్లో ఈ షాపుల నుంచి రోజుకు సగటున రూ.7 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. రూ.కోట్లలో పెరగనున్న ఆదాయం విశాఖ జిల్లాలో విశాఖపట్నం, గాజువాక, అనకాపల్లిల్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలున్నాయి. వీటి పరిధిలో 17 ఎక్సైజ్ సర్కిల్ ఆఫీసులు ఉన్నాయి. జిల్లా మొత్తమ్మీద నెలకు దాదాపు 3.50 లక్షల కేసుల మద్యం, 2 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతున్నట్టు అంచనా. 90 మి.లీ బాటిల్‌ను శాంపిల్‌గాను, 180 మి.లీను నిప్ (క్వార్టర్), 375 మి.లీను హాఫ్, 750 మి.లీని ఫుల్ బాటిల్‌గా పేర్కొంటారు. ఒక కేసుకు శాంపిల్ బాటిళ్లు 96, క్వార్టర్ బాటిళ్లు 48, హాఫ్ బాటిళ్లు 24, ఫుల్ బాటిళ్లు 12 చొప్పున ఉంటాయి. వీటిలో శాంపిల్, నిప్ సీసాల విక్రయాలే అధికం. అంటే సగటున 2.75 కోట్ల మద్యం బాటిళ్ల మద్యం అమ్మకాలు జరుగుతాయని అంచనా. ఒక్కో బాటిల్‌కు రూ.5 చొప్పున ధర పెంచి విక్రయిస్తే రూ.13.75 కోట్ల ఆదాయం సమకూరుతుందని భావిస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలో ఇబ్బడి ముబ్బడిగా మద్యాన్ని డంప్ చేసేవారు. ఇప్పుడు నిబంధనలు విధించడంతో ఎప్పటిలా ఆ నెలలో సాధారణంగా జరిపే విక్రయాలుకంటే 10 శాతం సరకును అదనంగా కొనుగోలు చేయడానికి మద్యం వ్యాపారులకు అనుమతిస్తారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పెరిగే అమ్మకాల వల్ల ఈ సొమ్ము రూ.20 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. మద్యం బాటిల్‌పై రూ.5ల పెంపు ఈ నెల 9వ తేదీ నుంచి విశాఖలో అమలులోకి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కొన్ని జిల్లాలో మద్యం బాటిల్‌పై రూ.10 వరకు పెంచుకుని అమ్మకాలు సాగిస్తున్నారని, విశాఖలో మాత్రం రూ.5 మాత్రమే పెంచినట్టు లిక్కరు వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఇందులో రూ.2లు ఎన్నికల్లో పోటీ పడుతున్న అభ్యర్థులకు, రూ.2లు ఎౖMð్సజ్ సిబ్బందికి పోగా తమకు కేవలం ఒక్క రూపాయే మిగులుతుందని వీరు పేర్కొంటున్నారు. నగరంలోని 58 మద్యం దుకాణాల్లో 20, జిల్లాలో సగం వరకు నష్టాల్లోనే నడుస్తున్నాయని, తాజాగా పెంచిన ధర వల్ల తమకేమీ ఒరగదని వీరంటున్నారు. -
బాబు పోరాట దీక్షకు పది కోట్లు!!
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నిర్వహించిన ఒక్కరోజు దీక్షకు కేవలం రూ.2.83 కోట్లే ఖర్చయ్యిందంటూ మంత్రులు, అధికార తెలుగుదేశం పార్టీ నేతలు బుకాయిస్తున్నారు. ఈ నెల 11వ తేదీన హస్తినలో జరిగిన ధర్మపోరాట దీక్ష కోసం ఈ నెల 6వ తేదీన అదనపు బడ్జెట్ రూ.10 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర ఆర్టీ నెంబర్ 215 జీవో జారీ చేశారు. ఇంత స్పష్టంగా జీవో ఉన్నప్పటికీ సీఎం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కేబినెట్ సమావేశంలో బుకాయింపులు, అబద్ధాలకు తెరతీశారు. దీక్ష కోసం రూ.10 కోట్లు ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. రూ.10 కోట్లు వ్యయం చేశామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేబినెట్ భేటీలో చర్చించడంతోపాటు వైకుంఠపురం బ్యారేజీ శంకుస్థాపన కార్యక్రమంలోనూ చంద్రబాబు పార్టీ పరంగానే ఖర్చు చేశామని చెప్పారు. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష కోసం రూ.10 కోట్లు వ్యయం చేయలేదని, కేవలం రూ.2.83 కోట్లు ఖర్చు చేశామని, ఈ ఖర్చుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. రూ.10 కోట్లు విడుదల చేశామంటూ ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో గురించి విలేకరులు ప్రశ్నించగా, మంత్రి మౌనం వహించడం గమనార్హం. మరి ఆర్టీ జీవో 215ను ఏ ప్రభుత్వం జారీ చేసిందో ముఖ్యమంత్రి చంద్రబాబే చెప్పాలి. జీవో జారీ చేసి, అదంతా అవాస్తవం అంటూ ముఖ్యమంత్రి చెపుతుండడం చూసి మీడియా ప్రతినిధులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. ఈనెల 6న రూ. 10 కోట్లు అదనపు బడ్జెట్ విడుదల చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన జీవో -
ప్రభుత్వ ఉద్యోగులారా బహుపరాక్
సాక్షి,షట్యాల (నకిరేకల్) : ప్రస్తుతం శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో వివిధ రాజీకయ పార్టీల నాయకులు, ప్రజలు ప్రచారం చేస్తుంటారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు గనుక రాజకీయ పార్టీల అభ్యర్థుల తరఫున బహిరంగంగా ఏ రకమైన ప్రచారం చేసిన మాత్రం ఉద్యోగం ఊడుతుంది. సెక్షన్ 23(ఐ) ఏం చేబుతుందంటే.. 1949 సెప్టెంబర్ 17 నుంచి ఎన్నికల కమిషన్‌లోని సెక్షన్ 23(ఐ)ని ఎన్నికల అధికారులు అమలు చేస్తున్నారు. ఈ సెక్షన్ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, ఇతర రంగాలకు చెందిన ప్రభుత్వ సిబ్బంది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తరఫున ఎలాంటి ప్రచారం నిర్వహించరాదు. అంతేకాదు పలాన అభ్యర్థికి, పార్టీకి ఓటు వేయమని నలుగురిలో చెప్పడం, పార్టీ గుర్తులతో ప్రచారం నిర్వహించడం చేయరాదు. వీటితో పాటు సోషల్ మీడియాలో అనుకూలంగా, ప్రతికూలంగా ప్రచారం నిర్వహించిన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులు తగు జాగ్రత్తల్లో లేకుండా ఉద్యోగాలు ఊడిపోయే అవకాశాలుంటాయి. -
చిట్టివలస జూట్ మిల్‌ను మూసేందుకు ప్రభుత్వం కుట్ర
-
23 ఏళ్లుగా నిరీక్షణ
రెవెన్యూ ఉద్యోగుల చేతి వాటం వల్ల 21 మంది లబ్ధిదారులు 23 ఏళ్ల నుం చి ఇబ్బంది పడుతున్నారు. ఇన్నేళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా బాధితులకు న్యాయం జరగడం లేదు. భూములు మంజూరైన వారిలో కొం దరు లబ్ధిదారులు మరణిం చారు. ఇచ్చిన అనంతరం వారి కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదు. నెల్లూరు(పొగతోట) : రాపూరు మండలం తెగచర్లలో సర్వేనంబర్ 263లో 21 మందికి ఎస్సీ, ఎస్టీ, యాదవులకు ప్రభుత్వం ఒక్కొక్కరి ఎకరం చొప్పున 1995లో భూములు పంపిణీ చేసింది. అనంతరంఅధికారులు వాటికి సం బంధించిన పట్టాలు, పాసుపుస్తకాలు కేటాయించి, లబ్ధిదారులకు భూములు చూపించారు. అప్పట్లో కేటాయించిన భూముల్లో రాళ్ల గుట్టలు, చెట్లు ఉంటే బాధితులు రోజుల తరబడి శ్రమించి చదును చేసుకున్నారు. కాగా అవి రోడ్డుపక్కనే ఉన్న భూములు కావడంతో వా టిపై భూ స్వాముల కన్నుపడింది. దీంతో వారు రెవెన్యూ అధికారులతో కుమ్మకై రికార్డులు మార్చేశారు. పాసుపుస్తకాల నంబర్లు సరి చేసి ఇస్తానని వీఆర్వో లబ్ధిదారుల నుంచి వాటిని తీసుకుని తిరిగి ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకున్నాడు. పాసుపుస్తకాల్లో తెగచర్ల అని చెప్పి, భూములు మాత్రం జోరేపల్లిలో ఉన్నాయని రెవెన్యూ అధి కారులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో బాధితులు కలెక్టరేట్, రాపూరు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ గత 23 ఏళ్ల నుంచి తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సెంటు భూమి తమకు కొంత భూమి వచ్చిందనే పేద ల ఆశ రోజుల వ్యవధిలోనే అడిఆశ అ య్యింది. ప్రస్తుతం ఆ భూముల్లో బడా బాబులు నిమ్మచెట్లు సాగు చేసుకుంటున్నారు. గ్రామ వీఆర్వోను బాధితులు మా భూములు ఎక్కడా? అని ప్రశ్నిస్తే జోరేపల్లిలో ఉన్నాయని సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. కాగా బాధితులు జోరేపల్లి వెళ్లి పరిశీలిస్తే అక్కడి ప్ర జలు మా భూముల జోలికి వస్తారా అ ంటు వాదనకు దిగారు. తెగచర్లలో సర్వేనంబర్ 245–11లో 10 మందికి ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. వీటిలో లబ్ధిదారులు నిమ్మచెట్లు వేసుకున్నా రు. అయితే సంవత్సరం తర్వాత ఆ భూములు నావం టూ గ్రామానికి చెం దిన ఓ భూస్వామి రాత్రికి రాత్రే నిమ్మచెట్లను అక్రమించేశాడు.కాగా తెగచెర్లలో పేదలకు పం పిణీ చేసిన భూములే కాకుండా వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణ కు గురయ్యాయి. కాగా 23 ఏళ్ల నుంచి తాము రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అ ధికారులు పట్టించుకోవడం లేదని బా ధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలñ æక్టర్ స్పందించి తమ గ్రామంలో వి చా రణ చేపడితే అసలు విషయం బయట కు వస్తుందని వారు పేర్కొంటున్నారు. 23 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం మాకు 23 ఏళ్ల క్రితం భూములు పంపిణీ చేశారు. వాటిని చదును చేసుకున్న తర్వాత భూ స్వాములు అక్రమించారు. భూములు సాధించుకునేందుకు 23 ఏళ్ల నుం చి పోరాటం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలే దు. పట్టాలు, పాసుపుస్తకాలు ఇ చ్చి సర్వేనంబర్లు గ్రామంలోవి కా వని ఇబ్బంది పెడుతున్నారు. కలెక్టర్ స్పందించి విచారణ చేపడితే మాకు న్యాయం జరుగుతుంది. – బుజ్జమ్మ, బాధితురాలు తల్లిదండ్రులిద్దరూ మరణించారు నా చిన్న వయస్సులో భూములు కేటాయించారు. మా తల్లి దండ్రులు భూములు చదను చేశారు. భూములు వస్తాయనే ఆశాతో ఎదురు చూసి తల్లిడండ్రులు ఇద్దరు మరణించారు. నాకు నలుగురు ఆడపిల్లలు. భూములు వస్తే పంటలు సాగు చేసుకోవచ్చుననే ఆశాతో ఉన్నాం. జిల్లా అధికారులు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. – కె.మాచర్ల, బాధితుడు రాత్రికి రాత్రే నిమ్మచెట్లు నరికేశారు సర్వేనంబర్ 245–11లో 68 సెంట్ల భూమి కేటాయించారు. దాన్ని చదును చేసుకుని నిమ్మచెట్లు వేశాం. ఏడాది తర్వాత ఓ భూ స్వామి ఆ భూమి నాదంటూ రాత్రికి రాత్రే చెట్లు నరికేశాడు. విషయం అధికారులు చెప్పినా ఎవ్వరు పట్టించుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతునే ఉన్నా ఇంతవరకు న్యాయం జరగలేదు. – శంకరమ్మ బాధితురాలు ఫిర్యాదు అందలేదు భూములకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. తెగచెర్లకు సంబంధించి భూ సమస్యలపై ఒకటి రెండు ఫిర్యాదులు ఉన్నాయి. సర్వేనంబర్ 263పై ఏవైనా ఫిర్యాదులు వస్తే పరిశీలిస్తాం. బాధితులు వారి వద్ద ఉన్న పాసుపుస్తకాలు తీసుకువస్తే పరిశీలించి, న్యాయం జరిగేలా చూస్తాం. – అనురాధ, ఇన్చార్జ్ తహసీల్దార్, రాపూరు -
పల్స్ పోలియోపై అవగాహన
రెబ్బెన : మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల 28న చేపట్టే పల్స్ పోలియో కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని డెప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో సీతారాం ఆరోగ్య సిబ్బందికి సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పీహెచ్సీ, అంగన్వాడీ, ఆశ వర్కర్లకు పల్స్ పోలియోపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో డాక్టర్ కుమార్, హెల్త్ అసిస్టెంట్ సంతోష్, పావని, హెల్త్ అసిస్టెంట్లు కమలాకర్, ప్రవీన్, ఐసీడీఎస్ సూపర్వైజర్, అంగన్వాడీ, అశ వర్కర్లు పాల్గొన్నారు. జైనూర్ మండలంలో.. జైనూర్ : పల్స్ పోలియో కార్యక్రమం 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న సందర్భంగా మంగళవారం జైనూర్ ఆస్పత్రిలో ఆశావర్కర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలకు అవగాహన కల్పించారు. మండలంలో ఐదు సంవత్సరాల లోపు 3543 మంది పిల్లలు ఉన్నారని వైద్యుడు నరేశ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు పాల్గొన్నారు. వాంకిడిలో.. వాంకిడి : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం పల్స్‌పోలీయో నిర్వహణపై అంగన్వాడీలు, ఆయాలు, ఏఎన్ఎంలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 28, 29, 30 మూడు రోజుల పాటు పల్స్ పోలీయో కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ సదస్సులో పీహెచ్ఎన్ తెరిసా, సూపర్వైజర్ సంతోష్ తదితరులు ఉన్నారు. తిర్యాణిలో.. తిర్యాణి : పల్స్‌పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని వైద్యాధికారి శ్యాంకుమార్ అన్నారు. మండలంలోని ఎమ్మార్సి కార్యాలయం సమావేశ మందిరంలో పల్స్‌పోలియో చుక్కల మందు కార్యక్రమంపై వైద్యసిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఈ శ్రీహరి, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు. -
పల్లెకు రాని బస్సు
ఆదిలాబాద్‌రూరల్ : ఆర్టీసీ బస్సు చేరని గ్రామాలు ఈ రోజుల్లో కూడా అనేకం ఉన్నాయి. ప్రతి గ్రామానికి బస్సు నడిపించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. రోడ్డు మార్గం ఉన్న గ్రామాలకు బస్సు నడపడంలో ఆసక్తి కనబర్చడం లేదు. బస్సు నడపాలని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మండలంలోని ఖండాల గ్రామ పరిధిలో సుమారు 18 అనుబంధ గ్రామాలు ఉన్నాయి. రోడ్డు వేసి ఏడాదవుతున్నా ఆ గ్రామాలకు నేటికి బస్సు సౌకర్యం లేదు. కాలినడకనే శరణ్యం... మండంలంలోని పలు మారమూల గిరిజన గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సు ఆ గ్రామాలకు వెళ్లడం లేదు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు పదుల కిలో మీటర్ల చొప్పున కాలినడకన వస్తున్నారు. జిల్లా కేంద్రానికి మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు ప్రతి రోజు రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఆర్టీసీ బస్సు నడవకపోవడంతో ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో రాకపోకలు నిర్వహించడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు వాపోతున్నారు. అత్యవసర సమయాల్లోనైతే నానా అవస్థలు పడావల్సిన పరిస్థితి ఉందని ప్రయాణీకులు వాపోతున్నారు. నేటికీ బస్సు రాని గ్రామాలు... మండలంలోని ఖండాల గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు వెళ్లాలంటే సుమారు ఏడు కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి. పిప్పల్‌ధరి గ్రామ పంచాయతీ నుంచి ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కాలినడకన వెళ్తున్నారు. ఖండాల పంచాయతీ పరిధిలోని సుమారు 14 గ్రామాలకు వెళ్లేందుకు ప్రభుత్వం బీటీ రోడ్డు సౌకర్యం కల్పించింది. బీటీ రోడ్డు మార్గం వేసి సుమారు ఏడాది గడుస్తున్నా రాజుగూడ, పోతగూడ–1, పోతగూడ–2, ఖండాల తండా, ఖండాల గూడ, ధర్లొద్దీ, మొలాలగుట్ట–1, మొలాల గుట్ట–2, లోహర, జాంగూడ, ఎస్సీ గూడ, చిలాటీగూడ, సాలాయిగూడ, శివగూడ గ్రామాలకు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్న బస్సు మాత్రం వెళ్లడం లేదు. ప్రయాణీకులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ గ్రామాల్లన్నీ ఒకే రోడ్డు మార్గంలో ఉన్నాయి. అధికారులు స్పందించి బస్సును నడిపించేలా చూడాలని ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు కోరతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్తున్నాం తమ గ్రామాలకు వెళ్లేందుకు బీటీ రోడ్డు వేసిన్నప్పటికీ ఆర్టీసీ బస్సు రావడం లేదు. దీంతో ప్రైవేట్ వాహనాలు ఆటోలు, జీపుల్లో రాకపోకలను నిర్వహిస్తున్నాం. అత్యవసర సమయాల్లోనైతే ఆ వాహనాలు రాకపోవడంతో కాలినడకన రాకపోకలు నిర్వహిస్తున్నాం. అధికారులు స్పందించి బస్సు నడిపిస్తే బాగుంటుంది. - నైతం శంభు, ఖండాల, ఆదిలాబాద్ ఆఫీసర్లకు చెప్పిండ్రాట తమ గ్రామానికి రాకపోకలు నిర్వహిచేందుకు గవర్నమెంట్ రోడ్డు వేసింది. కానీ బస్సు మాత్రం రావడం లేదు. మా ఊళ్లకు బస్సు నడపాలని మా ఊరోళ్లు ఆఫీసర్లకు చెప్పిండ్రాటా. కానీ ఇంత వరకు బస్సు నడవడం లేదు. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – కనక రమేష్, ఖండాల, ఆదిలాబాద్ -
స్కూళ్లకు కాల్ సెంటర్
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు లేవా..? వాటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక విద్యార్థులు అవస్థలు పడుతున్నారా? ఇకపై వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక్క ఫోన్ చేస్తే చాలు.. సమస్య పరిష్కారం అయ్యే వరకు అధికారులు విద్యార్థులకు అండగా నిలవనున్నారు. ముఖ్యంగా విద్యాశాఖ హాస్టళ్లలో ఉండి చదువుకుంటున్న బాలికలు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలోని బాలికల హాస్టళ్లతోపాటు విద్యాశాఖ గురుకులాల్లోని విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 706 హాస్టల్ వసతిగల విద్యా సంస్థల్లో ప్రత్యేక ఫోన్ సదుపాయాన్ని విద్యాశాఖ త్వరలోనే అందుబాటులోకి తేనుంది. కాల్ సెంటర్‌కు వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించడం ద్వారా విద్యా సంస్థల్లోని దాదాపు లక్ష మంది బాలికలకు భరోసా కల్పించనుంది. వినడమే కాదు.. పరిష్కారంపైనా చర్యలు రాష్ట్రంలోని 485 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), 192 మోడల్ స్కూళ్లు, మరో 29 గురుకుల పాఠశాలల్లో దాదాపు 1.3 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా కేజీబీవీలు, మోడల్ స్కూళ్ల హాస్టళ్లలోనే దాదాపు లక్ష మంది బాలికలు ఉన్నారు. వారంతా తమ హాస్టళ్లు, స్కూళ్లలో ఎదుర్కొనే ఎలాంటి సమస్యలైనా సరే ఫిర్యాదు చేసే అవకాశాన్ని విద్యాశాఖ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్థులు చేసే ప్రతి ఫిర్యాదును రికార్డు చేసి అవి పరిష్కారమయ్యే వరకు నిరంతర సమీక్ష నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఆయా విద్యా సంస్థల్లో ఏర్పాటు చేసే ఫోన్‌ను పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కాల్ సెంటర్‌కు అనుసంధానించనుంది. విద్యార్థి హాస్టల్లోని ఫోన్ రిసీవర్ తీసుకోగానే ఆ ఫోన్ నేరుగా కాల్ సెంటర్‌కు మాత్రమే వెళ్లేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందిస్తోంది. కాల్ సెంటర్ సిబ్బంది కాల్ రిసీవ్ చేసుకోవడమే కాదు.. దాన్ని సంబంధిత సెక్షన్ అధికారి, సంబంధిత విభాగం ఉన్నతాధికారికి, జిల్లా డీఈవోకు, పాఠశాల ప్రిన్సిపాల్‌కు, పాఠశాల విద్యా డైరెక్టర్‌కు మెసేజ్ రూపంలో పంపిస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించనున్నారు. మెసేజ్ రూపంలో వచ్చిన సమస్య పరిష్కారమైందా లేదా అన్నది అందులో అప్డేట్ చేస్తారు. ఆ తరువాత కాల్ సెంటర్ సిబ్బంది సమస్యల పరిష్కారంపై ర్యాండమ్‌గా విద్యార్థులకు ఫోన్ చేసి తెలుసుకొని నివేదికను డైరెక్టర్‌కు అందజేస్తారు. మరోవైపు విద్యార్థులు చేసే ఫిర్యాదులు రికార్డు అయ్యేలా కసరత్తు చేస్తున్నారు. కాల్ సెంటర్, ఎమర్జెన్సీ నంబర్లకే ఫోన్.. పాఠశాలల్లో ఏర్పాటు చేసే ఫోన్ నుంచి కాల్ సెంటర్‌కు, పోలీసు, ఆసుపత్రి, ఫైర్ వంటి ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే ఫోన్ వెళ్లే సదుపాయం అందుబాటులో ఉంచేలా ప్రోగ్రాం రూపొందిస్తున్నారు. దానివల్ల విద్యార్థులు ఫోన్‌ను తమ సమస్యలను తెలియజేసేందుకు మాత్రమే ఉపయోగించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కాల్‌సెంటర్ సదుపాయాన్ని జూన్ నుంచి అమల్లోకి తెచ్చేలా చర్యలు వేగవంతం చేసింది. పాఠశాలల వేళలు మినహా మిగతా సమయాల్లో కాల్ సెంటర్ పని చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కాల్ సెంటర్ వేళలు ఉంటే బాగుంటుందని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. -
ఎయిర్ ఇండియా కొత్త సీఎండీ నియామకం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త సీఎండీని కేంద్రం ఎంపిక చేసింది. సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలా ఎయిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జీఎస్టీ నేషనల్ యాంటి ప్రాఫటీరింగ్ అథారిటీ చైర్మన్ గా ఐఎఎస్ అధికారి బద్రీ నారాయణ శర్మనుఅధికార వర్గాలు తెలిపాయి. కేరళ అసెంబ్లీ నియామక కమిటీ (ఎసిసి) ప్రకారం ఖరోలా. కర్ణాటక 1985 ఐఏఎస్ కేడర్‌కు చెందినవారు. ప్రభుత్వంలో కార్యదర్శి హోదా, వేతనాన్ని పొందుతారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులో మెట్రో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా ప్రస్తుతం మధ్యంతర సీఎండీగా ఉన్న బన్సల్ పదవీకాలం మూడు నెలలు పొడిగింపు ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత ఈ నియామకం చోటు చేసుకుంది. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. -
సర్కారు బడిలో ‘స్మార్ట్’ బోధన..!
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ స్కూళ్లకు ‘డిజిటల్’ హంగులు రానున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాలల రూపు రేఖలు మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే చిన్న ప్రైవేటు స్కూలు నుంచి కార్పొరేట్ స్థాయి విద్యాసంస్థ వరకు అన్నీ ‘స్మార్ట్’గా మారిపోయాయి. ప్రైవేటుకు దీటుగా.. సర్కారు బడులను సైతం బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా హైదరాబాద్ జిల్లాలోని అన్ని సర్కారు ఉన్నత పాఠశాలల్లో ‘స్మార్ట్ క్లాస్’ రూంలు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. అక్టోబర్ 2 నుంచి అన్ని బడుల్లోని విద్యార్థులు డిజిటల్ పాఠం వినేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ప్రైవేటు స్కూళ్లలో బ్లాక్ బోర్డ్, చాక్‌పీస్‌లు, చార్ట్‌లు అవసరం లేకుండా పూర్తిగా ప్రొజెక్టర్‌ని వినియోగిస్తున్నారు. నర్సిరీ నుంచే స్మార్ట్ విధానంలో అక్షర జ్ఞానాన్ని ఒంటబట్టిస్తున్నారు. ఈ క్రమంలో సర్కారు బడులకూ డిజిటల్ విధానాన్ని పరిచయం చేయాలన్న ఉద్దేశంతో చర్యలు ప్రారంభించారు. 182 బడుల్లో అమలు.. జిల్లాలో ఉన్న 182 ఉన్నత పాఠశాలల్లో దాదాపు 60 వేలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ వచ్చే నెల 2వ తేదీ నుంచి డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు బోధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతి స్కూల్‌కు కంప్యూటర్, ప్రొజెక్టర్, గణితం, సైన్స్, సోషల్, ఇంగ్లిష్ సబ్జెక్టులకు సంబంధించిన సీడీలు, పెన్ డ్రైవ్‌లు అందించనున్నారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ. లక్ష వరకు ఖర్చు చేయనున్నారు. దీనికి సంబంధించి డీఈఓ సోమిరెడ్డి చేసిన ప్రతిపాదనలపై కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో గడువులోగా ప్రతి పాఠశాలలో డిజిటల్ విధానంలో బోధించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే డిజిటల్ విధానంపై రాష్ట్రస్థాయిలో రిసోర్స్ పర్సన్లకు శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ పూర్తిచేసుకున్న రిసోర్స్ పర్సన్లు జిల్లాలోని ఉపాధ్యాయులకు కూడా తర్ఫీదు ఇవ్వనున్నారు. డిజిటల్ విధానం ఎందుకు..! సంప్రదాయ బోధనా పద్ధతుల ద్వారా ఆశించిన స్థాయిలో విద్యార్థులు పాఠ్యాంశాలపై పట్టు సాధించలేక పోతున్నారు. మూస పద్ధతిలో చదవడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. చదివిన అంశాలను సైతం గుర్తుపెట్టుకోలేక పోతున్నారు. చార్ట్‌లు, బొమ్మలు, స్పెసిమన్స్ వంటి ఉపకరణాలను ఉపయోగించినా సత్ఫలితాలు అంతగా లేవు. ముఖ్యంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం అమల్లోకి వచ్చాక విద్యార్థులు మరింత సృజనాత్మకంగా మెలగాల్సిన అవసరం ఏర్పడింది. ప్రతి అంశాన్ని విద్యార్థే స్వతహాగా ఆలోచించి అక్షరీకరించాల్సి వచ్చింది. ఈ సందర్భంలో డిజిటల్ పాఠం ఆవశ్యకత రెట్టింపైందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. కళ్లకు కట్టినట్టుగా విద్యార్థులకు చూపిస్తే.. అంత సులువుగా మరచిపోలేరు. దీన్ని గుర్తించిన అధికారులు.. తరగతి బోధనపై ప్రధానంగా దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ప్రధాన సబ్జెక్టుల పాఠ్యాంశాలకు డిజిటల్ రూపమిచ్చి విద్యార్థుల ముంగిటకు తేనున్నారు.