తెగచర్లలో లబ్ధిదారులకు కేటాయించిన భూములు
రెవెన్యూ ఉద్యోగుల చేతి వాటం వల్ల 21 మంది లబ్ధిదారులు 23 ఏళ్ల నుం చి ఇబ్బంది పడుతున్నారు. ఇన్నేళ్లుగా అధికారులు చుట్టూ తిరుగుతున్నా బాధితులకు న్యాయం జరగడం లేదు. భూములు మంజూరైన వారిలో కొం దరు లబ్ధిదారులు మరణిం చారు. ఇచ్చిన అనంతరం వారి కుటుంబ సభ్యులు పోరాటం చేస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదు.
నెల్లూరు(పొగతోట) : రాపూరు మండలం తెగచర్లలో సర్వేనంబర్ 263లో 21 మందికి ఎస్సీ, ఎస్టీ, యాదవులకు ప్రభుత్వం ఒక్కొక్కరి ఎకరం చొప్పున 1995లో భూములు పంపిణీ చేసింది. అనంతరంఅధికారులు వాటికి సం బంధించిన పట్టాలు, పాసుపుస్తకాలు కేటాయించి, లబ్ధిదారులకు భూములు చూపించారు. అప్పట్లో కేటాయించిన భూముల్లో రాళ్ల గుట్టలు, చెట్లు ఉంటే బాధితులు రోజుల తరబడి శ్రమించి చదును చేసుకున్నారు. కాగా అవి రోడ్డుపక్కనే ఉన్న భూములు కావడంతో వా టిపై భూ స్వాముల కన్నుపడింది. దీంతో వారు రెవెన్యూ అధికారులతో కుమ్మకై రికార్డులు మార్చేశారు. పాసుపుస్తకాల నంబర్లు సరి చేసి ఇస్తానని వీఆర్వో లబ్ధిదారుల నుంచి వాటిని తీసుకుని తిరిగి ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకున్నాడు.
పాసుపుస్తకాల్లో తెగచర్ల అని చెప్పి, భూములు మాత్రం జోరేపల్లిలో ఉన్నాయని రెవెన్యూ అధి కారులు తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో బాధితులు కలెక్టరేట్, రాపూరు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ గత 23 ఏళ్ల నుంచి తిరుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. సెంటు భూమి తమకు కొంత భూమి వచ్చిందనే పేద ల ఆశ రోజుల వ్యవధిలోనే అడిఆశ అ య్యింది. ప్రస్తుతం ఆ భూముల్లో బడా బాబులు నిమ్మచెట్లు సాగు చేసుకుంటున్నారు. గ్రామ వీఆర్వోను బాధితులు మా భూములు ఎక్కడా? అని ప్రశ్నిస్తే జోరేపల్లిలో ఉన్నాయని సమాధానం చెప్పి తప్పించుకున్నాడు. కాగా బాధితులు జోరేపల్లి వెళ్లి పరిశీలిస్తే అక్కడి ప్ర జలు మా భూముల జోలికి వస్తారా అ ంటు వాదనకు దిగారు.
తెగచర్లలో సర్వేనంబర్ 245–11లో 10 మందికి ప్రభుత్వం భూములు పంపిణీ చేసింది. వీటిలో లబ్ధిదారులు నిమ్మచెట్లు వేసుకున్నా రు. అయితే సంవత్సరం తర్వాత ఆ భూములు నావం టూ గ్రామానికి చెం దిన ఓ భూస్వామి రాత్రికి రాత్రే నిమ్మచెట్లను అక్రమించేశాడు.కాగా తెగచెర్లలో పేదలకు పం పిణీ చేసిన భూములే కాకుండా వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణ కు గురయ్యాయి. కాగా 23 ఏళ్ల నుంచి తాము రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అ ధికారులు పట్టించుకోవడం లేదని బా ధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలñ æక్టర్ స్పందించి తమ గ్రామంలో వి చా రణ చేపడితే అసలు విషయం బయట కు వస్తుందని వారు పేర్కొంటున్నారు.
23 ఏళ్ల నుంచి తిరుగుతున్నాం
మాకు 23 ఏళ్ల క్రితం భూములు పంపిణీ చేశారు. వాటిని చదును చేసుకున్న తర్వాత భూ స్వాములు అక్రమించారు. భూములు సాధించుకునేందుకు 23 ఏళ్ల నుం చి పోరాటం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలే దు. పట్టాలు, పాసుపుస్తకాలు ఇ చ్చి సర్వేనంబర్లు గ్రామంలోవి కా వని ఇబ్బంది పెడుతున్నారు. కలెక్టర్ స్పందించి విచారణ చేపడితే మాకు న్యాయం జరుగుతుంది.
– బుజ్జమ్మ, బాధితురాలు
తల్లిదండ్రులిద్దరూ మరణించారు
నా చిన్న వయస్సులో భూములు కేటాయించారు. మా తల్లి దండ్రులు భూములు చదను చేశారు. భూములు వస్తాయనే ఆశాతో ఎదురు చూసి తల్లిడండ్రులు ఇద్దరు మరణించారు. నాకు నలుగురు ఆడపిల్లలు. భూములు వస్తే పంటలు సాగు చేసుకోవచ్చుననే ఆశాతో ఉన్నాం. జిల్లా అధికారులు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలి.
– కె.మాచర్ల, బాధితుడు
రాత్రికి రాత్రే నిమ్మచెట్లు నరికేశారు
సర్వేనంబర్ 245–11లో 68 సెంట్ల భూమి కేటాయించారు. దాన్ని చదును చేసుకుని నిమ్మచెట్లు వేశాం. ఏడాది తర్వాత ఓ భూ స్వామి ఆ భూమి నాదంటూ రాత్రికి రాత్రే చెట్లు నరికేశాడు. విషయం అధికారులు చెప్పినా ఎవ్వరు పట్టించుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతునే ఉన్నా ఇంతవరకు న్యాయం జరగలేదు.
– శంకరమ్మ బాధితురాలు
ఫిర్యాదు అందలేదు
భూములకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదు. తెగచెర్లకు సంబంధించి భూ సమస్యలపై ఒకటి రెండు ఫిర్యాదులు ఉన్నాయి. సర్వేనంబర్ 263పై ఏవైనా ఫిర్యాదులు వస్తే పరిశీలిస్తాం. బాధితులు వారి వద్ద ఉన్న పాసుపుస్తకాలు తీసుకువస్తే పరిశీలించి, న్యాయం జరిగేలా చూస్తాం.
– అనురాధ, ఇన్‌చార్జ్ తహసీల్దార్, రాపూరు
Comments
Please login to add a commentAdd a comment