నెల్లూరు : నకిలీ పత్రాలు సృష్టించి రూ.25 లక్షల విలువైన భూమిని మరొకరికి విక్రయించేందుకు చేసిన యత్నం సబ్‌రిజిస్ట్రార్ అప్రమత్తం కావటంతో విఫలమైంది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం సమీపంలోని బుజిబుజి నెల్లూరులో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. బుజిబుజి నెల్లూరుకు చెందిన మద్దాల శమంతకమణి(80)కి పట్టణ పరిధిలో 33 అంకణాల(ఒక అంకణం: 72 చదరపు అడుగులు) భూమి ఉంది. ఆ భూమిపై కన్నేసిన మల్లేశ్వరి నకిలీ డాక్యుమెంట్లు తయారు చేయించింది. వాటి సాయంతో ఆ భూమిని వేరొకరికి విక్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.
శనివారం ఇద్దరు సాక్షులతోపాటు కొనుగోలు దారును తీసుకుని స్థానిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లింది. కాగా సబ్‌రిజిస్ట్రార్ ఆర్.రోహిణి ఆమె అందజేసిన పత్రాలను నిశితంగా పరిశీలించారు. సదరు భూమికి సంబంధించిన వివరాలపై మల్లేశ్వరిని ఆరా తీశారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి తడబడటంతో ఆమెకు అనుమానం వచ్చింది. దాంతో మరింత లోతుగా ప్రశ్నలు వేయటంతో నిజం వెలుగులోకి వచ్చింది. ఈలోగా కొనుగోదారుతోపాటు అక్కడికి వచ్చిన సాక్షులు అక్కడి నుంచి జారుకున్నారు. విషయం తెలిసిన శమంతకమణి, కుటుంబసభ్యులు రిజిస్ట్రార్‌ను కలుసుకుని, తమ భూమి పత్రాలను చూపించారు.
నకిలీ పత్రాలతో భూ విక్రయానికి యత్నం
Published Sat, Aug 22 2015 3:59 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement