సాక్షి, పెద్దపెల్లి జిల్లా: పెద్దపల్లికి చెందిన ఓ మహిళ తన తల్లి మీద ఉన్న ప్రేమతో చంద్రుడిపై స్థల కొనుగోలు చేసి గిఫ్ట్‌గా అందించారు. గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి సుద్దాల రాంచంద్ర, వకుళాదేవి దంపతుల పెద్ద కుమార్తె సాయి విజ్ఞత.. తల్లి వకుళాదేవి పేరిట చంద్రుడిపై 2022లో లూనార్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకుంది.
ఆగస్టు 23న వకుళాదేవి, ఆమె మనువరాలు ఆర్త సుద్దాల పేర్ల మీద చంద్రుడిపై ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అయ్యింది. కాగా సాయి విజ్ఞత అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ వద్ద ప్రాజెక్ట్ మేనేజర్‌గ, ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు.
ఇకచంద్రుడిపై భూమిని కొనుగోలు చేయాలి అనుకునే వారు లూనార్ రిజిస్ట్రీ అనే వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్‌ను సందర్శించి, భూమిని కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ సహా పలు ప్రాంతాలు ఉంటాయి. ముందుగా మీకు నచ్చిన ప్రాంతాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను పొందాలి.
చదవండి: చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ అడుగుపెట్టిన దృశ్యాలు
చంద్రుడిపై ఎకరానికి రూ. 35 లక్షలకుపైనే ధర ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి అక్కడ జీవరాశి బతికే అవకాశం ఉందా? లేదా? అనే విషయంలో ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు. కానీ, చాలా మంది తమ ప్రెస్టేజీ కోసం అక్కడ భూమిని కొనుగోలు చేస్తున్నారు. చంద్రుడి మీద కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారు. బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇప్పటికే అక్కడ భూమిని కొన్నారు.
మరోవైపు చంద్రయాన్–3 మిషన్ విజయవంతం అయిన విషయం తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ బుధవారంచంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టింది. అందులో నుంచి రోవర్ బయటకు వచ్చిది. వాస్తవానికి రోవర్ జీవితకాలం ఒక లూనార్ డే. అంటే 14 రోజులు. 14 రోజులపాటు రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి అటూఇటూ సంచరిస్తూ పరిశోధనలు చేయనుంది. అయితే, రోవర్ జీవితకాలం 14 రోజులు మాత్రమే కాదని, మరింత పెరిగే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. దక్షిణ ధ్రువంపై 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగు ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment