
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు కొత్త సీఎండీని కేంద్రం ఎంపిక చేసింది. సీనియర్ ఐఎఎస్ అధికారి ప్రదీప్ సింగ్ ఖరోలా ఎయిర్ ఇండియా ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జీఎస్‌టీ నేషనల్ యాంటి ప్రాఫటీరింగ్ అథారిటీ చైర్మన్ గా ఐఎఎస్ అధికారి బద్రీ నారాయణ శర్మనుఅధికార వర్గాలు తెలిపాయి.
కేరళ అసెంబ్లీ నియామక కమిటీ (ఎసిసి) ప్రకారం ఖరోలా. కర్ణాటక 1985 ఐఏఎస్ కేడర్‌కు చెందినవారు. ప్రభుత్వంలో కార్యదర్శి హోదా, వేతనాన్ని పొందుతారని ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆయన బెంగళూరులో మెట్రో మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
కాగా ప్రస్తుతం మధ్యంతర సీఎండీగా ఉన్న బన్సల్ పదవీకాలం మూడు నెలలు పొడిగింపు ఇచ్చిన కొద్ది రోజుల తర్వాత ఈ నియామకం చోటు చేసుకుంది. భారీ నష్టాల్లో ఉన్న ఎయిర్ ఇండియాలో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment